పుంగనూరులో వృద్దుడిని ఢీకొట్టి పరారైన లారీ-వృద్ధుడు మృతి

– పట్టుకున్న ప్రయాణికులు

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

అతివేగంగా లారీ వెళ్తు ఎదురుగా వస్తున్న వృద్ధుడి ద్విచక్రవాహన్ని ఢీకొని వాహనాన్ని నిలపకుండ వెళ్లిపోతుండటంతో ప్రయాణికులే లారీని వెంబడించి పట్టుకున్న సంఘటన గురువారం ఉదయం పుంగనూరు పట్టణ సమీపంలోని టోల్‌ప్లాజ్‌ వద్ద జరిగింది. ఎస్‌ఐ మోహన్‌కుమార్‌ కథనం మేరకు వివరాలా ఉన్నాయి. చౌడేపల్లె మండలం లద్ధిగం గ్రామానికి చెందిన భాస్కర్‌రెడ్డి టమోటా మండి నిర్వహిస్తున్నాడు. ఇలా ఉండగా ఉదయం బట్టందొడ్డి గ్రామానికి వ్యాపార పనుల నిమిత్తం వెళ్లి తిరిగి వస్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో భాస్కర్‌రెడ్డి అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. ప్రమాదానికి గురిచేసిన లారీ వెళ్లిపొవడంతో ఆ సమయంలో కారులో వస్తున్న ప్రయాణికులు ప్రమాదాన్ని గమనించి , లారీని వెంబడించి, పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఎస్‌ఐ మోహన్‌కుమార్‌ కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

 

Tags: An old man was killed when his truck collided with an old man in Punganur

Post Midle
Natyam ad