Natyam ad

సొంత తమ్ముడి చెవి కొరికి కర కర నమిలిన అన్న

-ఆస్తి కోసం మరీ ఇంత కఠినంగా వ్యవహరిస్తారా…

 

మచిలీపట్నం ముచ్చట్లు:

Post Midle

మచిలీపట్నం సత్రపాలెం కు చెందిన కర్రే సీతారామయ్య అలియాస్ ఒకే ఒక్కడు ఆస్తి కోసం సొంత తమ్ముడు కర్రే నరసింహ స్వామీ పై పైశాచికంగా దాడికి పాల్పడ్డాడు.ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.గ్రామ ప్రజలు అందరు చూస్తూ ఉండగా చెవిని కొరికి రక్తం కారుతున్నా కర కర నములుతూ రోడ్ల మీద తిరుగుతూ గ్రామస్థులను భయాందోళనకు గురి చేశాడు.బాధితుడిని ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా అన్న కొరికి చేవి నవలడం తో ఏమి చేయలేం అని చేతులు ఎత్తేసిన డాక్టర్లు…ఉన్మాది ఆలోచనతో ఉన్న సీతారామయ్య అలియాస్ ఒకే ఒక్కడు తన పైశాచిక ప్రవర్తనతో ఒకసారిగా ఊరిలో ప్రజలలో దడ పుట్టించాడు.కాగా నిందితుడి పై కేసు నమోదు చేసిన పోలీసులు చేవి కేసు పెద్దది కాకపోవడం తో స్టేషన్ బెయిల్ ఇచ్చారని వినికిడి.ఏది ఏమైనా సైకో , ఉన్మాది చేష్టలు గల వ్యక్తుల పై అరకొర చర్యలు తీసుకుంటే ఇతనిని చూసి ఇంకో సైకో పుట్టుకొస్తారు అని ఆలోచనలో గ్రామ ప్రజలు ఉన్నట్టు సమాచారం.

 

Tags:An older brother who bit off his own younger brother’s ear and chewed it

Post Midle