Natyam ad

గుర్రంకొండ బస్టాండులో గుర్తుతెలియని వృద్ధుడు గుండెపోటుతో మృతి

గుర్రంకొండ ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం లోని గుర్రంకొండ ఆర్టిసి బస్టాండ్ వద్ద శుక్రవారం ఉదయం ఓ గుర్తు తెలియని వృద్ధుడు గుండెపోటుతో మృతి చెందాడు. స్థానికులు గుర్తించి వెంటనే గుర్రంకొండ పోలీసులకు సమాచారం అందించడంతో వారు వెంటనే బస్టాండ్ వద్దకు చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. విచారణ చేపట్టి అతని ఆచూకీ లభించకపోవడంతో పంచనామా అనంతరం పోస్ట్ మార్టం కోసం, వాల్మీకిపురం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చరీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

 

Post Midle

Tags:An unidentified old man died of heart attack at Gurramkonda bus stand

Post Midle