పురుగుల మందు సేవించి రిటైర్డ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి మృతి

Date:25/09/2020

విశాఖపట్నం  ముచ్చట్లు:

పురుగుల మందు సేవించి రిటైర్డ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి పుక్కెళ్ళ జగదీష్ (63) అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దేశపాత్రునిపాలెం ఎస్సీ కాలనీలో నివాసముంటున్న పుక్కెళ్ల జగదీష్ యన్. టి.పి. సి రైల్వే ట్రాక్ స్నేహపురి కాలనీ కి వెళ్లే రహదారికి సమీపంలో పురుగులమందు సేవించి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈయనక భార్య గంగాభవాని తో పాటు ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నట్లు పోలీసులు  తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ కి తరలించారు.ఈ కేసును పరవాడ సిఐ ఉదయ్ కుమార్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అనకాపల్లి మాజీ ఎమ్మేల్యే పీలా త్వరగా కోలుకోవాలనీ పూజలు 

Tags:Anakapalli ex-MLA Pillai worships for speedy recovery

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *