అనకాపల్లి ఎస్బిఐ ఏటీఎం చోరీని ఛేదించిన పోలీసులు
అనకాపల్లి ముచ్చట్లు:
గత మే నెల 27న అనకాపల్లి పూడిమడక రోడ్డు లో ఉన్న ఎస్బిఐ ఏటీఎం ను గ్యాస్ కట్టర్ తో కట్ చేసి ఏటీఎంలో ఉన్న 15 లక్షల 17,300నగదును దొంగతనం చేసిన హర్యానాకు చెందిన ఎనిమిది మంది నిందితులలో ఐదుగురు నిందితులను అనకాపల్లి పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖచ్చితమైన ముందస్తు సమాచారంతో కొత్తూరు జంక్షన్ వద్ద ఎలమంచిలి వైపు నుంచి అనకాపల్లి వైపు వస్తున్న లారీను ఆపి అందులో ఉన్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా ఏటీఎం దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నారు. నిందితులనుంచి ఒక ఆక్సిజన్ సిలిండర్, గ్యాస్ సిలిండర్, గ్యాస్ కట్టర్, పిస్టల్ ఆకారంతో ఉన్న లైటర్ తో పాటు దొంగతనానికి ఉపయోగించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీరు ప్రయాణం చేస్తున్న లారీని సైతం స్వాధీనం చేసుకుని 26 వేల రూపాయల నగదును వారి వద్ద నుంచి రికవరీ చేశారు.

Tags: Anakapalli SBI ATM heist foiled by police
