ఆనం… కఠిన నిర్ణయం

నెల్లూరు ముచ్చట్లు :

 

ఆనం రామనారాయణ రెడ్డి రాజకీయ నిర్ణయం మరో ఆరు నెలల్లో తేలిపోతుంది. ఆయనకు త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోతే కీలక నిర్ణయం ఉంటుందని ఆనం అనుచరులు చెబుతున్నారు. అందుకే గత కొద్ది రోజులుగా ఆనం రామనారాయణరెడ్డి హడావిడి పెద్దగా కన్పించడం లేదు. ప్రభుత్వానికి అనుకూలంగా కూడా ఆయన మాట్లాడటం లేదు. విపక్షాలకు వ్యతిరేకంగా కూడా ఆనం స్పందించడం లేదు.ఆనం రామనారాయణరెడ్డి సీనియర్ నేత. నెల్లూరు జిల్లాల్లో పట్టున్న నేత. కాంగ్రెస్ హయాంలో ఆయన పదేళ్ల పాటు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఆనం రామనారాయణరెడ్డి టీడీపీలోకి వెళ్లిపోయారు. అక్కడ విజయం దక్కక పోవడం, కనీసం ఎమ్మెల్సీగా కూడా ఇవ్వకపోవడంతో 2019 ఎన్నికలకు ముందు ఆనం రామనారాయణరెడ్డి వైసీపీ లో చేరారు. ఆయనకు పట్టున్న ఆత్మకూరు కాకుండా జగన్ ఆనంకు వెంకటగిరి నియోజకవర్గాన్ని కేటాయించారు.అయితే తొలివిడతలోనే తనకు మంత్రిపదవి వస్తుందని ఆనం రామనారాయణరెడ్డి భావించారు. కానీ ఆశ నెరవేరలేదు.

 

 

 

అప్పుడప్పుడు కొంత అసంతృప్తులు వెళ్లగక్కారు. ప్రభుత్వంపైన కాకపోయినా జిల్లా నేతలు, మంత్రులు, అధికారులపై ఆయన వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఒక దశలో ఆనం రామనారాయణరెడ్డికి షోకాజ్ నోటీసు కూడా ఇవ్వాలని అధిష్టానం భావించింది. కానీ ఆనం నేరుగా జగన్ ను కలవడంతో షోకాజ్ నోటీసు జారీ చేయలేదు.ఇక ఇప్పుడు తనకు మంత్రి పదవి కావాలని ఆనం రామనారాయణరెడ్డి గట్టిగా పట్టుబడుతున్నారు. నాలుగు నియోజకవర్గాల్లో పట్టున్న తమ ఫ్యామిలీని రాజకీయంగా దెబ్బతీసే కుట్ర జరుగుతుందని ఆయన అనుమానిస్తున్నారు. ఈసారి మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకుంటే ఆనం రామనారాయణరెడ్డి అసంతృప్తి మరింత పెరిగే అవకాశముంది. ఎన్నికలకు ముందు కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. జగన్ కు 2024 ఎన్నికలకు ముందు ఝలక్ ఇచ్చే తొలి నేతగా ఆనం రామనారాయణరెడ్డి ఉంటారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Anam … tough decision

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *