డీసీసీబీ చైర్మన్ గా ఆనం విజయకుమార్ రెడ్డి

Anam Vijayakumar Reddy as DCCB chairman

Anam Vijayakumar Reddy as DCCB chairman

Date:05/12/2019

నెల్లూరు ముచ్చట్లు:

జిల్లాలో నామినేటెడ్ పదవుల సందడి మొదలైంది. తొలుత జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలకవర్గం మరియు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ల పూర్తి పాలక వర్గాలను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. జిల్లాలోని మార్కెట్ యార్డ్ ల పాలకవర్గాలను కూడా భర్తీ చేయడానికి వీలుగా ఇటీవలే రిజర్వేషన్ ఖరారు చేసి ప్రకటించారు. ఈ క్రమంలో కొద్దిరోజులు మార్కెట్ కమిటీ పాలకవర్గాలు కూడా భర్తీ అయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇ ఇ బుధవారం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్గా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయ్ కుమార్ రెడ్డిని ప్రకటించారు. చైర్మన్ నియామకాల తో పాటు మరో ఆరుగురు సభ్యుల పాలక వర్గాన్ని కూడా ప్రకటించారు. సభ్యుల జాబితాలో వెంకటగిరికి చెందిన బాలకృష్ణారెడ్డి, సూళ్లూరుపేట కు చెందిన మద్దాలి సోమశేఖర్ రెడ్డి, గూడూరు కు చెందిన మే రిగల మధుసూదన్, ఉదయగిరి ప్రాంతానికి చెందిన చింతం తిరుమల రాణి, పొదలకూరు ప్రాంతానికి చెందిన డక్కిలి రామయ్య తదితరులు ఉన్నారు.

 

ముఖ్యమంత్రికి ఘన స్వాగతం

 

Tags:Anam Vijayakumar Reddy as DCCB chairman

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *