ఆనంద అంధ్రప్రదేశ్ గా రాష్ట్రం

Chief Minister Chandrababu Naidu said, "We have achieved double digit growth in four years.

Chief Minister Chandrababu Naidu said, "We have achieved double digit growth in four years.

-శ్రీకాకుళం స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు
Date:15/08/2018
శ్రీకాకుళం ముచ్చట్లు:
నాలుగేళ్లలో రెండంకెల అభివృద్ధి సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం  శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగిన స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో సీఎం పాల్గొని జాతీయజెండాను ఎగురవేశారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ వీరులకు జన్మనిచ్చిన భూమి ఇదని…ఎందరో రాజకీయ, సాహిత్య రంగాల ప్రముఖులు శ్రీకాకుం జిల్లా బిడ్డలే అని అన్నారు.  ఎన్ని అవరోధాలు వచ్చినా నిరంతర శ్రమతో పోరాడామన్నారు.
విభజనలో అన్యాయం జరిగినా అభివృద్ధిలో ఎక్కడా ఆగలేదన్నారు. రూ.24,500 కోట్లతో రైతులకు రుణ విముక్తి కల్పించామని అన్నారు.  డ్వాక్రా సంఘాలకు రూ.10వేల కోట్లు ఆర్థిక సహకారం అందించామని, అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అన్నారు. అమరావతి నిర్మాణానికి సహాయం చేస్తామని చెప్పి కేంద్రం మోసం చేసిందని మండిపడ్డారు.
ఏదేమైనా రాష్ట్ర  అభివృద్ధి విషయంలో వెనక్కు తగ్గబోనని బాబు స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణమైతే కేంద్రానికే లాభమనీ, దానివల్ల పన్నులు, ఇతర ఆదాయం కేంద్రానికే వెళతాయని సీఎం అన్నారు. అయినా కేంద్రం రాజధాని నిర్మాణం విషయంలో సహాయ నిరాకరణ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వ్యవసాయంపై శ్రద్ధ పెట్టామని తెలిపారు. మహిళా సాధికారిత కోసం డ్వాక్రా సంఘాలు పెట్టామని చెప్పుకొచ్చారు. విద్యా, వైద్య రంగాల్లో సంస్కరణలు తెచ్చామని సీఎం అన్నారు. ముందుచూపుతో రాష్ట్రానికి ఒక విజన్ తయారు చేశామని తెలిపారు
విద్య, వైద్య సదుపాయాలను బాగా అభివృద్ధి చేశామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా సంక్షేమ పథకాలకు కేటాయింపులు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక స్థితిని మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అందువల్లే గత నాలుగేళ్లలో రెండంకెల వృద్ధి రేటును సాధించగలిగామని చంద్రబాబు చెప్పారు.
ఉచిత డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక ఉపప్రణాళిక తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఆదరణ పథకం ద్వారా కులవృత్తులను అండగా నిలుస్తున్నామని, రూ.750 కోట్లతో ఐదు లక్షల మందికి పని ముట్లు అందించామన్నారు. చేనేత కార్మికులకు రూ.11 కోట్లు రుణమాఫీ చేశామన్నారు. వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. కాపు కార్పొరేషన్ ఏర్పాటుకు ఏటా రూ.1000 కోట్లు వెచ్చిస్తున్నామని వెల్లడించారు.  బీసీల కోసం బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసాం.
ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదలకు రూ.200 కోట్లు కేటాయించామని సీఎం తెలిపారు. చేనేత కార్మికులకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని, రాబోయే రోజుల్లో వడ్డెరలు, మత్స్యకారులను ఎస్టీల్లో చేర్చుతామని అన్నఅరు.  రజకులను ఎస్సీల్లో చేర్చేందుకు చర్యలు తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు.ఉపాధి కూలీని రూ. 140 నుంచి రూ. 205కు పెంచామన్నారు. నిరుద్యోగ యువతకు వెయ్యి చొప్పున భృతి ఇస్తున్నామని, చంద్రన్న బీమా, ఎన్టీఆర్ వైద్య సేవ పథకాలతో పేదలకు ఆసరా కల్పించామన్నారు.
కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు చంద్రన్న పెళ్లికానుక అందుబాటులోకి తెచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్‌గా తయారు చేస్తాం. ఆనంద ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని వ్యాఖ్యానించారు.
Tags: Ananda is the state of Andhra Pradesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *