హైకోర్టును ఆశ్రయించిన ఆనందయ్య

నెల్లూరుముచ్చట్లు :
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆయుర్వేద మందు పంపిణీతో వెలుగులోకి వచ్చిన ఆనందయ్య, శుక్రవారం హైకోర్టును ఆశ్రయించారు.ఆనందయ్య మందు నాటు మందు అంటూ, ఈ నెల 17 నుంచి తయారీ,పంపిణీని ప్రభుత్వం నిలిపి వేసింది.ఆనందయ్య కరోనాకు పంపిణీ చేస్తున్న మందులో ఎలాంటి ప్రమాదకర పదార్థాలు లేవని, ఆయుష్ డైరెక్టర్ రాములు ప్రకటించినా ఏపీ ప్రభుత్వం మాత్రం ఇంకా మీన మీషాలు లెక్కిస్తోంది.దీనిపై ఇవాళ ఆనందయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.తాను 30 సంవత్సరాలుగా కృష్ణపట్నంలో సాంప్రదాయ ఆయుర్వేద ప్రాక్టీషనర్‌గా ఉన్నానని,తాను కరోనాకు తయారు చేసిన మందులో ఎలాంటి ప్రమాదకర పదార్థాలు లేవని కూడా తేలిందని ఆయన పిటీషన్లో పేర్కొన్నారు.కరోనా మందు తయారీ,పంపిణీలో ప్రభుత్వ జోక్యం లేకుండా చూడాలని ఆనందయ్య పిటీషనల్లో కోరారు. ధర్మాసనం పరిశీలించి త్వరలో విచారణ చేపట్టనుంది.
పోలీసుల అదుపులోనే ఆనందయ్య కరోనాకు ఆయుర్వేద మందు తయారు చేస్తున్నట్లు, ఆనందయ్య ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నట్టు తెలుస్తోంది. కొందరు వైకాపా నేతలు ఆనందయ్యతో అనధికారికంగా కరోనా మందును పెద్ద ఎత్తున తయారు చేయించుకుని , తీసుకుని, వెళుతున్నారనే వార్తలు సంచలనంగా మారాయి.ఆనందయ్య బీసీ వ్యక్తి కావడం వల్లే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని వేధిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు.వెంటనే ఆనందయ్యను విడుదల చేసి, వేలాది మందికి ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ జరిగేలా, ప్రభుత్వమే తగిన ఏర్పాట్లు చేయాలని చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.

 

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

Tags:Anandayya approached the High Court

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *