అనందయ్య మందు పంపిణీ

పలమనేరు ముచ్చట్లు:

 

ప్రజలు  ప్రాణాలు కాపాడడమే ముఖ్య ధ్యేయం అని బిల్డర్ గణేష్ యాదవ్ పేర్కొన్నారు . నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేదం మందు పంపిణీలో భాగంగా గురువారంపలమనేరు నియోజకవర్గంలోని  పెద్దపంజాణి మండలం నేలపల్లి గ్రామములో పదిమంది పాజిటివ్ కేసులకు ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవసేవయే మాధవసేవ ఇటువంటి కరోనా సంక్షోభంలో ప్రజలు అల్లాడుతుంటే తన ప్రాణం చలించిపోయి కష్టమైనా సరే ప్రజలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగిందని వివరించారు . అదేవిధంగా నేలపల్లి గ్రామానికి పాజిటివ్ కేసుల పరిశీలనకు వచ్చిన వైద్య సిబ్బందికి ఆశా వర్కర్లకు 15 ప్యాకెట్లు ఆయుర్వేద మందు పంపిణీ చేశామని  మిగిలిన 15 ప్యాకేట్లను  శుక్రవారం ఇక్కడికి వచ్చి అందిస్తామని తెలిపారు. కృష్ణ పట్నం ఆనందయ్య తన విన్నపాన్ని మన్నించి తొలివిడతగా 5000 ప్యాకెట్లు ఇచ్చారని వీటితో పదహైదు వేల మందినిి పాజిటివ్  కేసులనుండి విముక్తి చేయవచ్చని తెలిపారు . నియోజకవర్గంలో ఏ కుటుంబంలో  ఏ వ్యక్తికైనా కరోనా పాజిటివ్ వచ్చిన వెంటనే  తన నెంబర్ కు ఫోన్ చేసిన వెంటనే వారి ఇంటి వద్దకే మందు పంపిణీ చేయడం జరుగుతుందని ,ఎటువంటి ఆపద అయినా ఆదుకోవడానికి తన వంతు కృషి చేస్తానన్నారు. పాజిటివ్ కేసులు  ఉన్నట్లు ,సమాచారం ఇచ్చిన వైద్య సిబ్బందికి ,దగ్గరుండి సహకరించిన పంచాయతీ సర్పంచ్ ,ఆశా వర్కర్లు ,గ్రామ వాలెంటర్ల్లు సచివాలయ సిబ్బందికి గణేష్ యాదవ్ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Anandayya drug distribution

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *