Natyam ad

అనంతపురం రేంజ్ డి.ఐ.జి ఆకస్మిక తనిఖీ.

తిరుపతి  ముచ్చట్లు:

తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన అనంతపురం రేంజ్ డి.ఐ.జి ఎం.రవిప్రకాష్ ఐపిఎస్. తిరుపతి జిల్లా ఎస్పీ  .పి.పరమేశ్వర రెడ్డి ఐపీఎస్.,రితో కలసి తిరుపతి వెస్ట్ పోలీసుల పనితీరుపై ఆరా తీశారు. రికార్డులను పరిశీలించారు. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో తరుచూ నమోదవుతున్న సైబర్ మోసాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. సైబర్ నేరాలపై కేసులు నమోదు చేసి తక్షణమే దర్యాప్తునకు దిగాలి. సైబర్ నేరాల ఛేదింపుపై దృష్టి పెట్టాలి మహిళా పోలీసులు, వాలంటీర్లను సమన్వయం చేసుకునీ ఓటిపి ఫ్రాడ్స్ , బహుమతుల పేరున జరిగే ఆన్లైన్ మోసాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి. ప్రజల్ని చైతన్యం చేసేందుకు తోడ్పడే కరపత్రాల పంపిణీ మరియు అవగాహన సదస్సులు నిర్వహించాలి ఈ పోలీసు స్టేషన్ పరిధిలో గతంలో రౌడీ కార్యకలాపాలు అధికంగా ఉండేవి. ప్రస్తుతం కట్టడిలో ఉన్నప్పటికీ ప్రత్యేక నిఘా కొనసాగించాలి. రౌడీల ఆగడాలపై ఉక్కుపాదం మోపాలి. సివిల్ కేసుల జోలికి వెళ్లకుండా పోలీసులు దూరంగా ఉండాలి. కబ్జాల విషయంలో మాత్రం చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. పైసా పైసా పోగు చేసుకుని కొన్న విలువైన ఆస్తులను స్వార్థశక్తులు దౌర్జన్యంగా కబ్జాలు చేస్తే ఉరుకోవద్దు. అనంతరం గ్రామ/వార్డు సచివాలయాల మహిళా పోలీసులు మరియు పోలీసు అధికారులతో ముఖాముఖి మాట్లాడారు. వారి పని తీరుపై ఆరా తీశారు.

 

 

 

Post Midle

ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుగా గుర్తొచ్చేది పోలీసులు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు సహాయం చేయాలి. హత్యలు, హత్యాయత్నాలు, తదితర తీవ్ర బాడిలీ అఫెన్సెస్ జరుగక ముందే మొగ్గ దశలోనే తుంచేయాలి. గ్రామ సచివాలయాల మహిళా పోలీసులను సమన్వయం చేసుకుని ఇంటింటా సర్వే చేయించి సమాచారం సేకరించాలి. గ్రామ సచివాలయాల మహిళా పోలీసులు ఇచ్చిన నివేదికపై రిజిష్టర్ మెయింటేన్ చేయాలి. తరుచూ సమీక్షిస్తూ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకుని తీవ్ర నేరాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తిరుపతి నగరంలో రెసిడెన్సియల్ ఏరియా అధికంగా ఉండటం తగ్గట్టుగానే ప్రజలకు భద్రత కల్పించాలి. నైట్ బీట్లు ముమ్మరం చేయాలి. బ్లూకోల్ట్ , రక్షక్ లు బాగా తిప్పాలి. ఈశాన్య రుతు పవనాల ప్రభావం తిరుపతి, చిత్తూరు జిల్లాలపై అధికంగా ఉంటుంది. ఎస్డీఆర్ ఎఫ్ , రోప్ పార్టీలు సిద్ధంగా ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా సహాయక చర్యలు చేపట్టాలి.ఈ కార్యక్రమంలో వెస్ట్ డీఎస్పీ నరసప్ప, వెస్ట్ సి.ఐ శివప్రసాద్, యస్.ఐ ఓబయ్య, రత్నమాల, సిబ్బంది మరియు మహిళా పోలీసులు పాల్గొన్నారు.

Tags: Anantapur Range DIG surprise inspection.

Post Midle

Leave A Reply

Your email address will not be published.