అనంతలో రోడ్డు ప్రమాదం…ముగ్గురు మృతి

Road accident in Sangar Reddy .. woman killed

Road accident in Sangar Reddy .. woman killed

Date:12/06/2019

అనంతపురం ముచ్చట్లు:

అనంతపురం జిల్లా నార్పల మండలం మద్దలపల్లి గ్రామం వద్ద నల్లబొగ్గు పొడి లారీ టైరు పగిలి ఒక స్కూటీ మీద పడటంతో  స్కూటీ మీద ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు లారీ కింద పడి

నుజ్జునుజ్జయి మరణించారు. లారీ క్లీనర్ కూడా మరణించారు .డ్రైవర్ అపస్మారక స్థితిలో ఉండగా ఆస్పత్రికి తరలించారు. మృతులు తాడిమరి మండలం చిన్న కొండపల్లి గ్రామ వాసులు గా గుర్తించారు.

లారీ,  స్కూటీ   రెండు వాహనాలు తాడిపత్రి వైపు నుండి అనంతపూర్ దిశగా ఒకదాని తర్వాత ఒకటి ముందుగా స్కూటీ తర్వాత లారీ వస్తుండగా లారీ టైరు పగిలి ప్రమాదం జరిగిందని స్థానికులు

తెలియజేశారు. స్కూటీ ప్రయాణిస్తున్న వారు పెద్దపప్పూరు యందు వివాహ వేడుకలు చూసుకొని వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్,  క్లీనర్ లు  హర్యానా రాష్ట్రం కు చెందిన వారు అని

గుర్తించారు. చిన్న కొండపల్లి గ్రామ వాసులు మృతులు శివారెడ్డి(50), చంద్రగుప్త శెట్టి(42).

ఎస్‌సి, ఎస్‌టి ఉద్యోగార్థులకు ఉచిత కోర్సులు

Tags:Anantha road accident … Three killed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *