చంద్రగిరి కోటలో పురాతన విగ్రహం చోరీ.
చంద్రగిరి ముచ్చట్లు:
వినాయక చవితి పండుగ సందర్భంగా బారీ అపచారం.తిరుపతి జిల్లా చంద్రగిరి కోట ఆవరణలో పురాతన వినాయకుని విగ్రహం చోరీకి గురి అయింది.దొంగలించిన విగ్రహ స్థానంలో మరొక వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేసిన ఘనులు.ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం చోటు చేసుకుంది.తిరుపతి బెంగళూరు జాతీయ రహదారి ఆనుకొని చంద్రగిరి కోటకూ వెళ్లే మార్గంలో ఉన్న మండపం వద్ద ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది.చోరికి గురైన విగ్రహం కేవలం అర అడుగు మాత్రమే ఉన్నదని స్థానికుల కథనం.ఈ వినాయక స్వామి విగ్రహం 11 శతాబ్దం కాలం నాటిది కావడం విశేషం.ఈ ప్రాంతంలో విగ్రహం చోరీ కావడానికి ముఖ్య కారణం స్థానికంగా ఏర్పాటు చేసిన సోలార్ వీధిలైట్లు పనిచేయకపోవడం అని స్తానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.

Tags:Ancient idol stolen from Chandragiri fort.
