ఇక 2 వేల నోట్లు మాయం

ముంబై ముచ్చట్లు :
రూ.2 వేల నోట్లు కనుమరుగు కానున్నాయా? పరిస్థితులను చూస్తుంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల్లో నగదు వినియోగం పెరిగింది. అయినా కూడా రూ.2000 నోట్ల చెలామణి మాత్రం తగ్గిపోయింది. ఆర్బీఐ తాజా గణాంకాలను గమనిస్తే.. ఈ విషయం అర్థమౌతుంది.2019-20తో పోలిస్తే 2020-21లో కరెన్సీ నోట్ల వినియోగం పెరిగింది. కరెన్సీ విలువ 16.8 శాతం, పరిమాణం 7.2 శాతం చొప్పున పెరిగాయి. అయితే రూ.2 వేల కరెన్సీ నోట్లు మాత్రం 2019 నుంచి తగ్గుతూ వస్తున్నాయి. అదేసమయంలో రూ.500 నోట్ల వినియోగం మాత్రం పెరిగింది.2019లో 329.10 కోట్ల రూ.2 వేల నోట్లు చెలామణిలో ఉండేవి. అయితే ఇప్పుడు ఈ నోట్లు 245.1 కోట్లకు తగ్గాయి. విలువ పరంగా చూస్తే.. 2019లో రూ.2 వేల నోట్ల మొత్తం విలువ రూ.6.58 లక్షల కోట్లుగా (మొత్తం నోట్లలో 31.2 శాతం వాటా) ఉండేది. 2021లో రూ. 2 వేల నోట్ల వాటా 17 శాతానికి దిగొచ్చింది.రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2 వేల నోట్ల ముద్రణను ఆపివేసినట్లు గతంలోనే ప్రకటించింది. ఇప్పుడు క్రమక్రమంగా చెలామణిలో నుంచి రూ.2000 నోట్లను తగ్గిస్తూ వస్తోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే.. రానున్న కాలంలో రూ.2 వేలు నోట్లు కంటికి కనిపించకపోవచ్చు.

 

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

 

Tags:And ate 2 thousand notes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *