Natyam ad

బాధితుల భరోసా వారికి అండాదండా-బద్వేల్ ఆర్డిఓ ఆకుల వెంకటరమణ

బద్వేలు ముచ్చట్లు:

బాధితులకు భరోసా వారికి అన్ని విధాల అండగా బద్వేల్ ఆర్డిఓ ఆకుల వెంకటరమణ నిలిచారు బాధితులకు ఏ చిన్నపాటి కష్టం వచ్చినా భూ సమస్యలు వచ్చిన తక్షణమే వారు ఆర్ డి ఓ ను కలిసి సమస్యను చెప్పుకుంటున్నారు సమస్య పరిష్కార దిశగా ఆర్ డి ఓ చేస్తున్నారు దీంతో బాధితుల సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కారం అవుతున్నాయి బాధితుల పక్షాన ఆర్ డి ఓ ఉండడం ఎంతో సంతోషించా తగ్గ విషయం గతములో ఎప్పుడూ కూడా ఇలా జరిగి ఉండేది కాదు బద్వేలు రెవెన్యూ డివిజన్ పరిధిలో 12 మండలాలు ఉన్నాయి బద్వేల్ నియోజకవర్గంలో 7 మండలాలు మైదుకూరు నియోజకవర్గంలో నాలుగు మండలాలు తో పాటు కాజీపేట మండలం కూడా ఉంది ఈ 12 మండలాల్లో భూముల సమస్యలు భూముల ఆక్రమణ ఎక్కువ శాతం ఉన్నాయి ముఖ్యంగా బద్వేల్  నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ప్రభుత్వ భూములు వేల ఎకరాల్లో ఉన్నాయి చాలా కాలంగా భూముల ఆక్రమణ లో ప్రభుత్వ భూముల కబ్జాలు నకిలీ ఇంటి పట్టాలు రెవెన్యూ సంబంధించిన పలు అంశాలు నకిలీ లాగా తయారవుతూ అధికారులకే సవాలు విసురుతున్నాయి .

 

 

నకిలీల బారిన ఎంతోమంది బాధితులు పడ్డారు వారిని ఎదుర్కోలేక పోలీస్ స్టేషన్లు రెవెన్యూ కార్యాలయాలు బాధితులు తిరిగి తిరిగి గతంలో విసుగుచెంది పోయారు ఆర్డీవో దృష్టికి సమస్య తీసుకు వస్తాను అంటే రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఆరు నెలల క్రితం వరకు రాజంపేటలో ఉండేది బద్వేల్ నియోజకవర్గంలోని 7 మండలాలు మైదుకూరు నియోజకవర్గం లోని బ్రహ్మంగారి మఠం మండలం రాజంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉండేది బద్వేలు నియోజకవర్గ ప్రజలు రాజంపేట కు వెళ్లాలంటే దాదాపు రెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి వచ్చేది ప్రజలకు గత కొన్ని దశాబ్దాలుగా ఇలాంటి పరిస్థితులు ఉండేవి బద్వేల్ లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని దాదాపు 40 సంవత్సరాలుగా రాజకీయాలకు అతీతంగా నాయకులు ప్రజాసంఘాల నాయకులు వివిధ పార్టీల కార్యకర్తలు పోరాటాలు చేశారు అయినా మొదట్లో తగిన ఫలితం రాలేదు ఇక బద్వేల్ కు రెవెన్యూ డివిజన్ రాదని నాయకులు కార్యకర్తలు ప్రజాసంఘాలు నిర్ణయించుకున్న సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఈ సమస్య రావడం జరిగింది ఆయన వెంటనే బద్వేల్ కు రెవిన్యూ డివిజన్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు ఈ ఏడాది మార్చి 3వ తేదీ బద్వేలుకు రెవిన్యూ డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేయడం మొదటి ఆర్డివోగా ఆకుల వెంకటరమణ బాధ్యతలు స్వీకరించడం చక చక జరిగిపోయాయి ఆర్ డి ఓ ఆకుల వెంకటరమణ ను మొదట్లో అందరూ ఒక ప్రభుత్వ అధికారి గానే భావించారు కానీ ఆయన రామబాణం

 

 

 

 

Post Midle

లాంటి వ్యక్తి అని ప్రజలు గుర్తించే సరికి వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి రామబాణానికి తిరిగి ఉండదు అనే నిష్ఠసత్యం అందరికి తెలిసిన విషయమే ముఖ్యంగా బద్వేలు గోపవరం పోరుమామిళ్ల బి.కోడూరు కలసపాడు అట్లూరు కాశీనాయన మండలాల్లో భూముల కబ్జాలకు భూములు ఆక్రమణకు నకిలీ పట్టాలకు కొదవలేదు బద్వేలు పోరుమామిళ్ల కేంద్రంగా చేసుకొని నకిలీ ఇంటి పట్టాల తయారీ గ్యాంగ్ చెలరేగిపోయింది ఇది కూడా అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే ఈ గ్యాంగుల బారిన పడి ఎంతోమంది బాధితులుగా మారారు మరి కొంతమంది ఆర్థికంగా మానసికంగా నష్టపోయారు వారిని ఎదుర్కొనే ధైర్యం లేక కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్న వారు ఎంతో మంది ఉన్నారు వీరి విషయంలో సంబంధిత అధికారులు కూడా అంటి అంటున్నట్లు ఉండేవారు ముఖ్యంగా గత మూడు సంవత్సరాల కాలంలో నకిలీ ఇంటి పట్టాల గ్యాంగులు కబ్జాదారులు మరింతగా రెచ్చిపోయి పేదవారిపై తమ ప్రతాపాన్ని చూపించారు వారి కారణంగా ఎంతోమంది బాధితులు కట్టుబట్టలతో ఉండిపోవాల్సివచ్చింది ప్రభుత్వ భూములు కబ్జాలు భూముల ఆక్రమణలు నకిలీ పట్టాలు, చెనరేగిపోతున్న సమయంలో ఆర్డిఓ గా ఆకుల వెంకటరమణ బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఆయన బాధ్యతలు స్వీకరించిన వెంటనే నకిలీ ఇంటి పట్టాలు భూముల కబ్జాలపై పూర్తిగా దృష్టిపెట్టారు బద్వేలు కేంద్రంగా నడుస్తున్న నకిలీ పట్టాల గ్యాంగ్ పై ఉక్కు పిడికిలి బిగించారు.

 

Tags:Andadanda-Badvel RDO Akula Venkataramana to assure the victims

Post Midle

Leave A Reply

Your email address will not be published.