హార్టీకల్చర్‌ హబ్‌గా ఆంధ్ర ప్రదేశ్ :సిఎంచంద్రబాబు

Andhra Pradesh as Horticulture Hub: Ceyhanandra Babu

Andhra Pradesh as Horticulture Hub: Ceyhanandra Babu

Date:14/09/2018
కర్నూల్ ముచ్చట్లు :
నదుల అనుసంధానంతో రాష్ట్రంలో నీటి కొరత లేకుండా చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. వర్షపు నీటిని భూగర్భజలాలుగా మార్చాలని, రాష్ట్రంలోని 57 ప్రాజెక్టులు పూర్తి చేయాలని పూనుకున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర జలసిరికి ముఖ్యమంత్రి హారతిచ్చారు. అనంతరం అయన అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో హంద్రీనీవాకు ప్రాధాన్యమిచ్చామన్నారు.
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం జాతికి అంకితం చేశామన్నారు. కడప, అనంతపురం, చిత్తూరుకు కూడా నీళ్లు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, వంశధార ద్వారా పోలవరం గ్యాలరీ వాక్‌ చేశామన్నారు.రాష్ట్రంలో చిన్నా పెద్దా కలిపి 35 నదులు ఉన్నాయి. కృష్ణా నదిపై నాగార్జున సాగర్‌ తర్వాత శ్రీశైలం జలాశయం నిర్మితమైంది.
రాయలసీమలో నీళ్ల కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. ఈ ప్రాంతానికి నీళ్లివ్వాలని మొదట నిర్ణయించింది ఎన్టీఆరే. సమైక్యాంధ్రప్రదేశ్‌లో నేను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కర్నూలు జిల్లాకు ఎక్కువ నిధులు కేటాయించా.
ఆంధ్రప్రదేశ్‌ రైతు రాష్ట్రంగా మారేందుకు అనేక చర్యలు చేపట్టాం. ప్రతి ఒక్క రైతుకూ నీరిచ్చేంత వరకు నేను జలదీక్ష విరమించను. రాష్ట్రంలో 57 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. వీటన్నింటినీ వీలైనంత త్వరగా పూర్తిచేసి పంట భూములకు నీరిచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అందరికీ నీటి భద్రత కల్పించి.. ఏపీ ధనిక రాష్ట్రంగా మారేందుకు కృషి చేస్తున్నాం’ అని అన్నారు.పోలవరం జాతీయ ప్రాజెక్టుకు కేంద్రం డబ్బులు ఇవ్వకపోయినా పనులు ఆపకుండా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని చంద్రబాబు అన్నారు.
2500 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వెళ్లాయని, ఆ నీళ్లు ఇక్కడికి వస్తే శ్రీశైలం నిండిపోతుందని, నదుల అనుసంధానం ద్వారా అన్ని ప్రాంతాలకు నీటి ఎద్దడి లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. పట్టిసీమ ఫలితాలు ఈ ప్రాంతానికి కూడా వచ్చాయన్నారు.
గేట్లు ఎత్తకపోతే కృష్ణా డెల్టా ఎండిపోతుందని పోరాటాలు చేశారని, రాయలసీమ నాలుగు జిల్లాలు, కర్నూలు జిల్లాలకు నీళ్లు అందించే పరిస్థితి వస్తుందని, జనవరి కల్లా వెలుగొండ పూర్తి చేస్తామన్నారు. గుండ్లకమ్మ పూర్తి చేసి గ్రామాలకు నీరిస్తామని, గండికోటలో 24 టీఎంసీలు పెట్టుకునే పరిస్థితి ఉందని సీఎం అన్నారు.
బ్రహ్మసాగర్‌ నుంచి కర్నూలు జిల్లాకు నీళ్లు ఇస్తామన్నారు. రాయలసీమలో ఏ ప్రాంతంలో నీటి ఎద్దడి లేకుండా హార్టీకల్చర్‌ హబ్‌గా తీర్చిదిద్దడానికి ముందుకెళ్తున్నామని, ఈనెలలో12,అక్టోబర్‌లో 3,డిశంబర్‌లో 8 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.
Tags:Andhra Pradesh as Horticulture Hub: Ceyhanandra Babu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *