జగన్‌కు జై కొట్టిన ఆంధ్రప్రదేశ్

అమరావతి ముచ్చట్లు:

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించబోతున్నారు. భారత ఎన్నికల చరిత్రను తిరగ రాయబోతున్నారు. దేశ రాజకీయాల్లో బలమైన ముద్ర వేయబోతున్నారు. ‘జగన్‌ జనాలను ఎంత బలంగా నమ్మారో.. జనం కూడా జగన్‌ను అంతే బలంగా నమ్మారు’ ఇరువురికి ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకమే 81.6 శాతం పోలింగ్. ఇప్పటి వరకు 4 దశల్లో దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి. ఏ రాష్ట్రంలోనూ ఆ స్థాయి పోలింగ్ నమోదు కాలేదు. 2014లో 78.41 శాతం, 2019లో 79.77 శాతం పోలింగ్ నమోదైంది. ఇప్పుడు అంతకు మించి పోలింగ్ నమోదైంది. 81.6 శాతం పోలింగ్ నమోదు కావడానికి చాలా కారణాలున్నాయి. పాజిటివ్ ఓటు, నెగిటివ్ ఓటు పోలింగ్ బూతుల్లో పోటీ పడ్డప్పటికీ పాజిటివ్ ఓటు ప్రభావం అధికంగా ఉన్నట్లు పోలింగ్ సరళిని బట్టి అర్థం చేసుకోవచ్చు. మే 13న ఏపీలో పోలింగ్ జరిగింది. సోమవారం పోలింగ్ జరిగింది. హైదరాబాద్ నుంచే కాక బెంగళూరు, చెన్నై, ఇతర రాష్ట్రాల నుంచి ఓటర్లు శుక్రవారం నుంచే ఆంధ్రప్రదేశ్‌కు రావడం మొదలు పెట్టారు. హైదరాబాద్ నుంచి వచ్చిన వారిలో 25 శాతం మంది కార్లలో వస్తే 75 శాతం మంది బస్సులు, రైళ్లలో స్వగ్రామాలకు చేరుకుని ఓట్లు వేశారు. వీరిలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, ఉద్యోగులు, మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి, బీపీఎల్ ప్రజలున్నారు. హైదరాబాద్‌లో వాచ్‌మెన్‌లుగా పని చేసేవారు, తాపీ పని చేసేవారు కూడా ఆదివారానికే ఆంధ్రప్రదేశ్ చేరుకున్నారు. వీరు అత్యధింగా వైఎస్ఆర్‌ సీపీ వైపు మొగ్గు చూపారనే అంచనాలు వెలువడుతున్నాయి. సోమవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది.

 

 

 

ఉదయం 6 గంటల నుంచి వందలాది పోలింగ్ బూతుల దగ్గర క్యూ కట్టారు. వీరిలో మహిళలు, వృద్దులు అధికంగా కనిపించారు. ఏపీలో 66 లక్షల మంది పింఛన్ తీసుకునేవారు ఉన్నారు. వీరికి ప్రతి నెల రూ.2 వేల కోట్లు పింఛన్‌ల రూపంలో అందుతున్నాయి. ప్రతి నెలా ఫస్ట్ తారీఖునే వాలంటీర్ వచ్చి తలుపు కొట్టి చేతిలో పింఛన్ డబ్బులు పెట్టి పోయేవాడు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి వాలంటీర్లపై నిషేధం వృద్దులు గ్రామ సచివాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరగలేక 76 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఎఫెక్ట్ మే13న చాలా స్ఫష్టంగా కనిపించింది. అత్యధికంగా మంది పింఛన్ దారులు జగన్ మళ్లీ సీఎం కావాలనే ఓట్లు వేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మహిళలైతే గ్రామీణ ప్రాంతాల్లో ఓటెత్తారు. డీబీటీ ద్వారా సీఎం జగన్ రూ.2.76 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. నాన్ డీబీటీ ద్వారా మరో రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేశారు. ఈ ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో చాలా బాగా కనిపించింది. ఈ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి రుణం తీర్చుకున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు అనే కసితో ఓటేసినట్లు పోలింగ్ సరళి తెలియజేస్తోంది. అంతేకాదు… అగ్రకులాల్లోని పేదల ఓట్లు కూడా వైఎస్‌ఆర్‌ సీపీకి పడినట్లు అంచనాలు వెలువడుతున్నాయి.

 

 

 

వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనలో ఏపీలోని గ్రామాల స్వరూపం మారిపోయింది. గ్రామ స్వరాజ్యం సీఎం జగన్ తీసుకొచ్చారు. గాంధీ జీ కలలు కన్నా స్వరాజ్యాన్ని సీఎం జగన్ అత్యంత వేగంగా అమల్లోకి తీసుకురాగలిగారు. అభివృద్ది అంటే హైటెక్ సిటీ లాంటి బిల్డింగ్‌లు కాదని, అభివృద్ది అంటే గ్రామాల అభివృద్ధి అని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంలో సీఎం జగన్ సక్సెస్ అయ్యారు. గ్రామ సచివాలయాలు, 50 నుంచి 70 కుటుంబాలకు ఒక వాలంటీర్‌, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్‌లు, డిజిటల్ లైబ్రరీలు ఈ రోజున ఏపీలోని గ్రామాల్లో దర్శనమిస్తున్నాయి. 57 నెలల్లో సీఎంగా జగన్ ఇవన్నీ చేస్తే…14 ఏళ్లు పాలించిన చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు అనేది సామాన్యుడు వేసుకున్న ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానమే 81. 6 శాతం ఓటింగ్. ఏపీలోని గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా ఉన్నాయి. నాడు నేడు కింద 46 వేల ప్రభుత్వ పాఠశాలలను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు సీఎం జగన్. దీని కోసం రూ.15 వేల కోట్లు ఖర్చు చేశారు. 8వ తరగతి నుంచి ట్యాబ్‌లు ఇస్తున్నారు. ఒక్క విద్యా రంగానికే రూ.72 వేల కోట్లు సీఎం జగన్ ఖర్చు చేశారు. 2014-19 మధ్య చంద్రబాబు 7 వేల ప్రభుత్వ పాఠశాలలు మూసేస్తే.. సీఎం జగన్ ప్రతి ఒక్కరిని చదివించడం తన బాధ్యత అని ప్రకటించి ఫస్ట్ క్లాస్ నుంచే నాణ్యమైన చదవు అందిస్తున్నారు. ఈ ఎఫెక్ట్ పోలింగ్ సరళిలో కచ్చితంగా కనిపించింది. పేద, దిగువ మధ్య తరగతి తల్లిదండ్రులు సీఎంగా మళ్లీ జగనే రావాలంటూ ఓటు వేసినట్లు కనిపించింది.

 

 

 

కూటమిని ప్రజలు నమ్మలేదు. చంద్రబాబును అస్సలు నమ్మలేదు. పవన్‌ కల్యాణ్‌ను ప్రజలు ఛీదరించుకునే పరిస్థితి ఏర్పడింది. 2014లో ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చాయి. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు మేనిఫెస్టోలో 10 శాతం హామీలు కూడా అమలు చేయలేదు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణ మాఫీ చేయలేదు. ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చి మోదీపై చంద్రబాబు చేసిన విమర్శలు ప్రజలు మరిచిపోలేదు. 2014 ఎన్నికల్లో బాబు హామీలు తన బాధ్యతన్న పవన్ తరువాత పట్టించుకోలేదు. ఇవన్నీ ప్రజలు మరిచిపోయారని కూటమి నేతలు అనుకుంటే పొరపాటు. 2024లో ఏర్పడిన కూటమిని ప్రజలు నమ్మకపోవడానికి ఇవే కారణాలు. బాబు మేనిఫెస్టోను పట్టుకోవడానికి కూడా ఏపీ బీజేపీ ఇంచార్జి సిద్దార్త్ ఇష్టంపడలేదంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
అంతేకాదు.. బాబు సూపర్ సిక్స్ హామీల గురించి ఏపీలో చర్చే జరగలేదు. కానీ.. జగన్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంటే మాత్రం IPL మ్యాచ్‌లు చూసినట్లు గ్రామీణ ప్రాంతాల్లో జనం టీవీల ముందు కూర్చొని చూశారు. ఇది జగన్ మీద ప్రజలకున్న నమ్మకాన్ని తెలియజేస్తోంది. రైతు భరోసా, అమ్మ ఒడి పథకాలకు డబ్బులు పెంచిన జగన్.. మిగతా పథకాలకు పెంచకుండానే కొనసాగిస్తానన్నారు. అయినా.. ప్రజలు జగన్ వెంటే నిలబడినట్లు కనిపిస్తోంది. చంద్రబాబు “సంపద సృష్టి” హామీలను ప్రజలు పట్టించుకోను కూడా పట్టించుకోలేదు.

 

 

 

చంద్రబాబు కూటమి కట్టింది తమ కోసం కాదని వ్యవస్థలను మేనేజ్ చేసుకోవడానికే అని ప్రజలు బలంగా విశ్వసించారు. పోలింగ్ రోజున, పోలింగ్ జరిగిన తరువాత జరిగిన దాడులు, అల్లర్లు ప్రజల విశ్వసాన్ని బలపర్చేలా ఉన్నాయి. ఈసీ, పోలీసులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు కూటమికి అనుకూలంగా పని చేశారనే టాక్‌ బలంగా వినబడుతుంది. కూటమి చెప్పినట్లు ఈసీ ఆడిందని ఇప్పటికే వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్టా రెడ్డి విమర్శించారు. ఎక్కడైతే ఎస్పీలను మార్చారో అక్కడే అల్లర్లు జరిగాయాని వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు విమర్శిస్తున్నారు. గొడవలు జరుగుతుంటే.. ఫోన్‌లు చేసినా పల్నాడు జిల్లా ఎస్పీ స్పందించలేదని వైఎస్ఆర్‌ సీపీ నేతల ప్రధాన ఆరోపణ. వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధులను హౌజ్ అరెస్ట్ చేసి.. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధులను ఫ్రీగా వదిలేయడం వల్లనే అల్లర్లు జరిగాయని వైఎస్ఆర్‌ సీపీ నేత గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి చెప్పారు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో జరిగిన అల్లర్లకు ఈసీ, పోలీసులు బాధ్యత వహించాలి. టీడీపీ అల్లరి మూకలకు ఈసీ, పోలీసులు సహకరించినట్లు ఉంది. పోలింగ్ జరిగిన తరువాతి రోజు కూడా టీడీపీ అల్లరి మూకలు బీసీల ఇళ్లపై దాడులు చేయడం కచ్చితంగా పోలీసుల వైఫల్యమే. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాచవరం మండలం కొత్త గణేషుని పాడులో బీసీల ఇళ్లపై పడి దోపిడీ, దాడులు చేయడం ప్రజాస్వామ్యవాదులకు బాధ కలిగించే పరిణామం. కేవలం వైఎస్ఆర్‌ సీపీకి ఓటేశారనే కారణంతో బీసీల ఇళ్లపై పడి మహిళలు, పిల్లలు అని కూడా చూడకుండా టీడీపీ అల్లరి మూకలు దాడులు చేస్తుంటే పోలీసులు, ఈసీ ఏం చేస్తున్నట్లు..?. ఇది వారి వైఫల్యం కాదా..? దీనికి సమాధానం జిల్లా ఎస్పీ చెబుతారా..? డీజీపీ చెబుతారా..? ఈసీ చెబుతుందా..? అర్థరాత్రి వేళ భయపడి మహిళలు గంగమ్మ గుడిలో తలదాచుకున్నారంటే మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా..? ఆటవిక రాజ్యంలో ఉన్నామా..? దీనికి సమాధానం ఈసీ చెప్పగలదా..?

 

 

 

టీడీపీ అల్లరి మూకలు ఎంత రెచ్చగొట్టినా.. పోలీసులు కూటమికి సహకరించినా.. ప్రభుత్వ ఉపాధ్యాయులు కూటమికి జై కొట్టినా శ్రీకాకుళం నుంచి కుప్పం దాకా ఫ్యాన్‌ గాలి బలంగా వీచినట్లు కనిపించింది. అత్యధికంగా దర్శిలో 90 శాతం పోలింగ్ నమోదైంది. కుప్పంలో 89 శాతం నమోదైంది. ఈ పోలింగ్ శాతాన్ని విశ్లేషిస్తే కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నాడని చెప్పొచ్చు. పిఠాపురంలో కూడా 85 శాతం పోలింగ్ నమోదైంది. అంటే .. జగన్‌ పాలనలో పథకాల లబ్ధిదారులు బయటకొచ్చి ఓటేశారు. పథకాల లబ్ధిదారులు ఓటేయ్యడం వల్లనే ఈ స్థాయిలో పోలింగ్ శాతం నమోదైంది. అంటే… పిఠాపురంలో కూడా పవన్ ఓడిపోయే అవకాశాలు చాలా ఎక్కువుగా ఉన్నాయి. ఇక.. మంగళగిరి, హిందూపూర్‌ల్లో మామ, అల్లుళ్లు గెలిస్తారా..? లేదా..? అనే దానిపై సర్వేలు రకరకాలుగా చెబుతున్నాయి.
మంగళగిరిలో ఎవరు బయటపడ్డ 2 , 3 వేల ఓట్ల తేడా ఉంటుందంటున్నారు. ఇక… ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కూటమి అనుకున్నట్లు ఓటు ట్రాన్సఫర్ కాలేదు. జనసేన ఓటర్లు టీడీపీకి వేయలేదు. టీడీపీ ఓటర్లు జనసేనకు వేయలేదు. బీజేపీ ఓటర్లు ఈ రెండు పార్టీలకు వేయలేదు. కొందరు ఎంపీ స్థానాలకు వేయలేదు. బీజేపీ – జనసేన పోటీ చేసిన 30 స్థానాల్లో వైసీపీ 25 స్థానాలు తక్కువ గాకుండా గెల్చుకుంటుందని చెబుతున్నారు.

 

 

 

 

సీఎం జగన్ పాజిటివ్ ప్రచారం ముందు.. చంద్రబాబు నెగిటివ్ ప్రచారం నిలవలేకపోయింది. సిద్ధం సభల నుంచి ప్రచారంలో సీఎం జగన్‌ తన సత్తా చాటితే.. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్ వ్యక్తి గత విమర్శలతో ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొన్నారు. వివేకా హత్య గురించి ఒకసారి, దీని కోసం షర్మిల, సునీతలను తీసుకొచ్చినా అనుకున్న ఫలితం చంద్రబాబుకు కనిపించలేదు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా చంద్రబాబును రాజకీయంగా బతికించ లేకపోయింది. సీఎం జగన్ ఎదురుదాడితో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై బాబు బ్యాచ్‌ సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. సీఎం జగన్‌ టీవీకి ఇచ్చిన 2 గంటల 20 నిమిషాల ఇంటర్వ్యూ చాలా మంది మేధావులు, న్యూట్రల్స్‌ను ఫ్యాన్‌కు ఓటు పడేలా చేసింది. జగన్ ఇచ్చిన క్లారిటీ మేధావులను, న్యూట్రల్ పీపుల్‌ను ఆకట్టుకుంది. సంక్షేమం, అభివృద్ధిని సీఎం జగన్ బ్యాలెన్స్ చేసే విధానం, ఆర్ధిక వ్యవస్థపై ఆయనకున్న పట్టు, ప్రతి అంశంపై ఆయన మాట్లాడిన తీరు హైదరాబాద్ నుంచి చాలా మంది ఏపీకి వచ్చి ఓటేసేలా చేసింది. అదే సమయంలో ఏబీఎన్‌కు చంద్రబాబు ఇచ్చిన ఇంటర్వ్యూ ఏదో యథాలాపంగా జరిగిందని టీడీపీ నేతలే చెప్పుకున్నారు. జగన్ సంక్షేమ పథకాలకు ఏడాదికి రూ.70 వేల కోట్లు ఇస్తుంటేనే వామ్మో వాయ్యే అని గుండెలు బాదుకున్న టీడీపీ నేతలు, ఎల్లో మీడియా అంతకంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తానన్న బాబును ప్రశ్నించకపోవడంపై సామాన్యులు పెదవి విరిచారు. చంద్రబాబు చెప్పిన సంక్షేమ పథకాలు అమలు కావాలంటే ఏడాదికి రూ.1.67 లక్షల కోట్లు కావాలి. ఈ డబ్బులు ఎక్కడ నుంచి తెస్తారన్న సీఎం జగన్‌ ప్రశ్నకు చంద్రబాబు నుంచి సరైన సమాధానం ఇప్పటికీ లేదు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇది పోలింగ్ సరళిలో కనిపించింది. ఇక.. కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయనుకున్న చోట పోలింగ్ శాతం తక్కువుగా నమోదైంది. దీనిని ఎలా అర్ధం చేసుకోవాలి..? కచ్చితంగా ఆ ఏరియాల్లో కూడా ఫ్యాన్‌ గాలి బలంగా వీచిందని చెప్పుకోవాలి.

 

 

 

 

57 నెలల తన పాలనలో సీఎం జగన్ చేసిన అభివృద్ది కళ్ల ముందు కనిపిస్తుంది. సంక్షేమం ప్రతి గడప తొక్కింది. జగన్‌ను ప్రజలు తమ బిడ్డ అనుకున్నారు. జగన్‌తోనే రాష్ట్ర అభివృద్ది సాధ్యమని బలంగా నమ్మారు. మహిళలైతే జగన్‌తోనే తమ పిల్లలు బంగారు భవిష్యత్తు సాధ్యమని బలంగా విశ్వసించారు.
కొత్తగా వచ్చిన ఓటర్లు కూడా జగన్‌ వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. విద్యా సంస్కరణలు, గ్రామీణ సచివాలయాలు, ఆంధ్రప్రదేశ్‌ ఆర్ధిక వ్యవస్థను సరిదిద్దడం, కరోనా కాలంలో రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పలా చూసుకోవడం యువతను ఆకట్టుకున్న అంశాలుగా తెలుస్తుంది. అలానే.. జాబ్ మేళాలు కూడా యువతలో బలమైన ముద్ర వేశాయి.అన్ని వర్గాల ప్రజలు ఓటు వేయడానికి కదిలి రావడం వల్లనే పోలింగ్ 80 శాతం దాటింది. పోలింగ్ సరళిని బట్టి పాజిటివ్ ఓటుగా సెఫాలజిస్ట్‌లు పరిగణిస్తున్నారు.
పోలింగ్ తరువాత వెలువడిన సర్వేలు కూడా వైఎస్‌ఆర్‌ సీపీదే గెలుపని చెబుతున్నాయి.

 

Tags:Andhra Pradesh defeated Jagan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *