కరోనా మందు పంపిణీకి ఆనందయ్యకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అనుమతి

అమరావతి ముచ్చట్లు :

 

నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన నాటు వైద్యుడు ఆనందయ్య కరోనా నివారణకు తయారు చేసిన మందుల్లో ఒకటైన ‘కే’ మందు పంపిణీకి సైతం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. కరోనా బాధితులకు తక్షణమే ఈ మందు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కంటి చుక్కల మందుకు సంబంధించి 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని సూచించింది. మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆనందయ్య వేసిన పిటిషన్‌పై ఇవాళ హైకోర్టు విచారణ జరిపింది. ఈ మేరకు ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు కే మందు పంపిణీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. గ‌తంలో ఆనంద‌య్య ఇత‌ర మందుల‌కు హైకోర్టు ఆదేశాలతో అనుమ‌తిచ్చిన ఏపీ ప్రభుత్వం కంట్లో వేసే చుక్కల మందుకు మాత్రం అనుమ‌తి ఇవ్వలేదు. ఆయూష్ నివేదికకు సంబంధించి పూర్తి వివ‌రాలు రాని నేప‌థ్యలో అనుమ‌తి నిరాకరించిన విషయం తెలిసిందే.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Andhra Pradesh High Court allows Anandayya to distribute corona drug

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *