ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఘన విజయం
అమరావతి ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో జర్నలిస్టులకు వృత్తి పన్ను కట్టమని కమర్షియల్ టాక్స్ విభాగము నుండి నోటీసులు అందినాయి. చాలీచాలని జీవితాలతో జర్నలిస్టులుగా జీవనం గడుపుతున్న వారికి వృత్తి పన్ను కట్టమని నోటీసులు అందడంతో జర్నలిస్టులు ఆందోళనలో ఉన్నారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి పీ ఢిల్లీ బాబు రెడ్డి బుధవారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె ఎస్ జవహర్ రెడ్డి గారితో ఆయన ఛాంబర్ లో కలిసి జర్నలిస్టులకు వేసిన వృత్తి పన్నును తొలగించమని అభ్యర్థించారు.వెంటనే స్పందించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కమర్షియల్ టాక్స్ శాఖ ప్రధాన కార్యదర్శి గిరిజా శంకర్ తో వెంటనే చరవాణి ద్వారా మాట్లాడి జర్నలిస్టులకు వేసిన వృత్తి పన్ను విషయమై వివరాలు తెలుసుకొనినారు. ఈ విషయమై కమర్షియల్ టాక్స్ ప్రత్యేక కార్యదర్శి గిరిజా శంకర్ అమలాపురంలో సంబంధిత కమర్షియల్ టాక్స్ అధికారులు అవగాహన లేక జారీ చేసిన వృత్తి పన్ను నోటీసులను వెంటనే ఉపసంహరించుకొని సంబంధిత

అధికారిని తక్షణం బదిలీ చేయమని ఆదేశించినట్లు ప్రధాన కార్యదర్శికి తెలిపారు. ఇది రాష్ట్రంలోని జర్నలిస్టులకు వృత్తి పన్ను విషయంలో ఏపీఎంఎఫ్ చూపిన చొరవను తక్షణం ప్రధాన కార్యదర్శి తీసుకున్న ఆదేశాలను ఏపీఎంఎఫ్ విజయం . ఈ విషయమై వెను వెంటనే చొరవ తీసుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఏపీఎంఎఫ్ కృషితో జర్నలిస్టులకు వృత్తి పన్ను నిలుపుదల చేశామని ఏపీ ఎమ్ ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి ఢిల్లీ బాబు రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇందుకూరి వెంకటరామరాజు, ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు వల్లూరు ప్రసాద్, పీతల అప్పాజీ ,భవాని శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Tags: Andhra Pradesh Media Federation is a great success
