Natyam ad

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ఆంధ్ర ప్రదేశ్ ముస్లిం ప్రజా సంఘాలు ధన్యవాదములు

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణం లో ఆంధ్ర ప్రదేశ్ ముస్లిం ఇంటెలెక్టుల్ ఫోరమ్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఆధునిక భారత తొలి మహిళ ఫాతిమా. షేక్ జీవితానికి సంభందించిన పాఠ్యపుస్తకాల రూపంలో పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టటం హర్షణీయం అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2022 సంవత్సరంలో ఎనిమిదవ తరగతి విద్యార్థులకు నిర్దేశించిన తెలుగు పాఠ్య గ్రంధంలో ఆధునిక భారత తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ కు స్థానం కల్పించింది. ఈ పాఠ్య గ్రంథంలోని ఉపవాచకంలో చైతన్యమూర్తులు” శీర్షికతో ఆరుగురి గురించి పేర్కొనగా, ఈ జాబితాలో ఫాతిమా షేక్ నాల్గవ స్థానం పొందారు. ఈమె చరిత్రను తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు” శీర్షికన పాఠ్యగ్రంధంలో పొందుపరచటం విశేషం. ఆధునిక భారత తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ శీర్షికను చరిత్రకారులు సయ్యద్ నశీర్ అహమ్మద్ దేశంలోనే మొట్టమొదటిసారిగా 2021లో ప్రచురించిన తెలుగు పుస్తకం ఆధారంగా ప్రస్తుత 8వ తరగతి పాఠ్యగ్రంథం లోని పాఠం రూపుదిద్దుకుంది. సుమారు 170 ఏండ్ల క్రితమే బడుగు బలహీన వర్గాలకు, ప్రత్యేకంగా బాలికలకు విద్య చాలా అత్యవసరమని భావించి ఆ దిశగా ఉద్యమించి, జీవితపర్యంతం కృషి చేసిన మహత్మా జ్యోతిబా పూలే,  సావిత్రిబాయి పూలే దంపతులతో కలసి సామాజిక సేవకు నడుంగట్టిన మహనీయరాలు ఫాతిమా షేక్. ఫూలే దంపతులకు తమ ఇంట ఆశ్రయం ఇచ్చి ఆదుకోవడమే కాకుండా, తాను కూడా లౌకిక విద్యను నేర్చుకుని శ్రీమతి సావిత్రిబాయి తో కలసి మహాత్మా ఫూలే స్థాపించిన పాటశాలల్లో విద్యబోధన చేసిన తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్. ఈ మహా సంస్కర్త గురించి గత 150 ఏండ్లలో ఎటువంటి జీవిత చరిత్ర గ్రంథం వెలువడ లేదు. ఆ కారణంగా 2020లో ఫాతిమా షేక్ గురించి సమాచారం సేకరించడం ఆరంభించి 2021 ఆరంభంలో ఆధునిక భారత తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ శీర్షికను సయ్యద్ నశీర్ అహమ్మద్ పుస్తకం రచించి ప్రచురించాను. ఆ పుస్తకం ఆధారంగా ప్రస్తుత పాఠ్యగ్రంధం లోని పాఠం రూపుదిద్దుకుంది.

 

 

Post Midle

భాషల్లో కూడా వెలువడనుంది.మహారాష్ట్ర తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్షల్లో ఉన్న ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ఉద్దేశించబడిన తెలుగు ఉపవాచకంలో ఫాతిమా షేక్ పాఠ్యంశం చేర్చడం మెచ్చదగిన అంశం. అలనాటి విద్యావేత్తతొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ మహారాష్ట్ర కు చెందిన చదువుల తల్లి కనుక ఆమె గురించి ఆ రాష్ట్రంలోని ఉర్దూ పాఠ్యగ్రంధం లో ఈమె చరిత్రను ఇచ్చారు. మన ఆధునిక భారత తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు : ఫాతిమా షేక్ తెలుగులోకి రావడం, ఆ తరువాత దానిని ఆంగ్లంలోకి అనువదింపజేసి 2011 జూన్ లో ప్రచురించడం జరిగింది. ఆ కారణంగా ప్రస్తుతం ఈ గ్రంధం ఉర్దూ, కన్నడం, గుజరాతీ భాషల్లో కూడా అనువాదమై వెలువడింది. ఈ కార్యక్రమంలో పలమనేరు కు చెందిన మహబూబ్ బాషా గారు మైనార్టీ నాయకులు డైమెండ్ బాబా. టిప్పు సుల్తాన్ మానవతా రక్తదాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ షబ్బీర్. మైనారిటీ నాయకులు అబ్దుస్సలామ్. టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ నాయకులు బిలాల్ ఆమీన్ తదితరులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.

 

Tags: Andhra Pradesh Muslim Praja Sanghas thank the Chief Minister Jaganmohan Reddy

Post Midle