అనసూయకు ఎంత అసూయ 

Date:23/07/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

యాంకర్ అనసూయ.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. ‘నాగ’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ‘జబర్దస్త్’ కామెడీ షోతో యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ఇద్దరు పిల్లల తల్లి ఆ తరవాత సినిమాల్లోనూ మంచి అవకాశాలను అందిపుచ్చుకున్నారు. ‘సోగ్గాడే చిన్నినాయన’లో నాగార్జునకు మరదలుగా నటించి ఆయనతో స్టెప్పులేశారు. ‘రంగస్థలం’లో అద్భుతమైన పాత్రలో నటించి ప్రేక్షకులతో రంగమ్మత్త అని పిలుపించుకున్నారు. ఆ తరవాత కూడా అడపదడపా సినిమాలు చేస్తూనే ఉన్నారు. టీవీ షోలు, సినిమాలతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు.

 

 

 

ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు బోలెడంత మంది ఫాలోవర్లు ఉన్నారు. వీళ్లందరికీ సోమవారం అనసూయ ఒక సందేశాన్ని పంపారు. అది ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. పెళ్లి, పిల్లలు ప్రస్తావనను తన వద్ద తీసుకొచ్చే వారికి అనసూయ ఈ మెసేజ్ ద్వారా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. భర్త సుశాంక్ భరద్వాజ్, ఇద్దరు పిల్లలతో కలిసి తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన అనసూయ.. వ్యక్తిగత జీవితం గురించి అభిమానులకు కొన్ని విషయాలు చెప్పారు. ‘‘అనసూయ.. చాలా తొందరగా పెళ్లి చేసుకున్నావ్. లేకపోతే టాప్ హీరోయిన్‌వి అయిపోయేదానివి’’ అని.. ‘‘ఎందుకు ఊరికే ఫ్యామిలీ పిక్స్ పెడతావ్. నీకు డిమాండ్ తగ్గిపోతుంది’’

 

 

 

 

అని చాలా మంది అనసూయతో అంటుంటారట. ఈ కామెంట్లకు అనసూయ ఇప్పుడు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. తాను ఇప్పటి వరకు సాధించిన దాని గురించి అస్సలు సిగ్గుపడటంలేదని ఆమె అన్నారు. తన జీవితంలో ఎప్పటికీ అతిపెద్ద విజయం తన కుటుంబమేనని చెప్పారు. ‘‘నిజాన్ని నేను ఎప్పటికీ మరిచిపోను. పక్కన పెట్టను. రోజంతా కష్టపడి ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ మనల్ని ప్రేమించే, మనం ప్రేమించే వాళ్లుంటారు.

 

 

 

ఇది అందరి ఇళ్లలో జరిగేదే. మీ ప్రాధాన్యతలను మీరు తెలుసుకోండి. నేను పెళ్లిచేసుకోవడం, తల్లిని కావడం వంటి అంశాలు నా వృత్తిమీద ప్రభావం చూపకూడదు. ఈ విషయంలో మగవాళ్లకు లేని ఇబ్బందులు మా ఆడవాళ్లకు ఎందుకు???’’ అని అనసూయ ప్రశ్నించారు. అదృష్టవశాత్తు తనతో సమాన ప్రతిభగల వారితో పనిచేశానని, పనిచేస్తున్నానని.. వారు తన రిలేషన్‌షిప్ స్టేటస్‌పై మాట్లాడరని అనసూయ అన్నారు. మొత్తానికి పెళ్లి, భర్త, పిల్లలు విషయాలను అస్తమాను ప్రస్తావించే వారికి అనసూయ గట్టిగానే సమాధానం ఇచ్చారు.

 

కవిత సైలెన్స్ కు రీజనేంటో

Tags: How jealous of Anasuya

కవిత సైలెన్స్ కు రీజనేంటో

Date:23/07/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

టీఆర్ఎస్‌లో జనాకర్షణ ఉన్న నాయకుల్లో కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత ఒకరు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయినా…పార్టీ శ్రేణుల్లో మాత్రం కవితకు ప్రత్యేక గుర్తింపు ఉందన్న విషయాన్ని ఎవరూ కాదనలేరు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అన్నీ తానై వ్యవహరించిన కవిత… లోక్ సభ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆమె జిల్లాకు రావడం లేదు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కూడా ఆమె దూరంగా ఉంటున్నారు.

 

 

 

 

 

ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి కూడా కవిత దూరంగా ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికలకు కవిత దూరంగా ఉంటే… జిల్లాలో పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపించేదెవరు అనే అంశంలో ఆ పార్టీ నేతలకు కూడా క్లారిటీ రావడం లేదని తెలుస్తోంది. జిల్లా నుంచి వేములు ప్రశాంత్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పటికీ… ఆయన జిల్లా వ్యాప్తంగా తన ప్రభావాన్ని చూపించలేకపోతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఆయన సొంత నియోజకవర్గంలోనూ బీజేపీకి మెజార్టీ రావడం ఆయనకు పెద్ద మైనస్.

 

 

 

 

దీనికి తోడు కవిత తరహాలో రాజకీయ వ్యవహారాలను చక్కబెట్టడం, వ్యూహరచన చేయడంలోనూ ప్రశాంత్ రెడ్డి అంతగా సక్సెస్ కాలేకపోయారనే అపవాదు ఉంది. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో… కవిత రంగంలోకి దిగితేనే జిల్లా టీఆర్ఎస్‌లో మళ్లీ మునుపటి జోష్ వస్తుందని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి.

 

 

 

అయితే ఆమె తీరు చూస్తుంటే… ఇప్పుడప్పుడే జిల్లాకు వచ్చి క్రియాశీల రాజకీయాల్లో పాల్గొనే అవకాశాలు కనిపించడం లేదని పలువురు చర్చించుకుంటున్నారు. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి కవిత దూరంగా… ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆమె పాత్ర పోషించేది ఎవరనే అంశం ఆసక్తికరంగా మారింది.

 

ఎవరి లెక్కలు వారివే

Tags: Reasonant to Poetic Silence

ఎవరి లెక్కలు వారివే

-మూడు పార్టీల ఆశలు

Date:23/07/2019

వరంగల్ ముచ్చట్లు:

తెలంగాణ‌లో గ‌త ఏడాది ముంద‌స్తు అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో మొదలైన ఎన్నిక‌ల వేడి.. ఇంకా కొన‌సాగుతూనే ఉంది. వ‌రుసగా ఏదో ఒక ఎన్నిక‌ల హడావుడితో ఇక్క‌డి పార్టీల‌న్నీ త‌ల‌మున‌క‌లై ఉంటున్నాయి. త్వ‌రలో మున్సిప‌ల్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్‌, కాంగ్రెస్, కొత్త ఉత్సాహంతో బీజేపీ మూడు పార్టీలూ ఈ ఎన్నిక‌ల్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగానే తీసుకున్నాయి. ఎవ‌రి పాయింటాఫ్ వ్యూలో వారికి ఈ ఎన్నిక‌లు కీల‌కం కాబోతున్నాయి. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఈ మూడు ప్ర‌ధాన పార్టీల‌కు ఓర‌కంగా దిశానిర్దేశం చేస్తాయ‌ని చెప్పొచ్చు. రాబోయే నాలుగేళ్ల‌పాటు వారి రాజ‌కీయం ఎలా ఉండబోతోందో తేల్చేవిగా ఉంటాయ‌నీ చెప్పొచ్చు.

 

 

 

తెరాస మీద వ్య‌తిరేకత మొద‌లైంద‌ని ఇప్ప‌టికే కాంగ్రెస్, భాజ‌పా పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నాయి. దానికి త‌గ్గ‌ట్టుగానే పార్ల‌మెంటు ఎన్నిక‌ల ఫ‌లితాల్లో సారూ కారూ ప‌ద‌హారు లక్ష్యాన్ని తెరాస చేరుకోలేక‌పోయింది. ఆ త‌రువాత‌, జెడ్పీలు కైవ‌సం చేసుకున్నా… ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో కేసీఆర్ పాల‌న మీద వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మౌతోంద‌నే అభిప్రాయం బ‌లంగానే ఉంది. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఆ అభిప్రాయంపై స్ప‌ష్ట‌త వ‌చ్చేస్తుంద‌ని చెప్పొచ్చు. అర్బ‌న్ ప్ర‌జ‌లు నిజంగాన టీఆర్ ఎస్ కొంత విముఖ‌త ఉంటే.. రాబోయే మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో తెరాస‌కు వ్య‌తిరేకంగా ఓటేస్తారు. లేదంటే, అనుకూలంగా ఓటేస్తారు. సో..

 

 

 

ఈ ఫ‌లితాన్ని బ‌ట్టీ తెరాస భ‌విష్య‌త్తు రాజ‌కీయ వ్యూహంలో కొన్ని మార్పులూ చేర్పుల‌కు క‌చ్చితంగా అవ‌కాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ విష‌యానికొస్తే… వ‌రుస ఫిరాయింపులు కొన‌సాగుతున్నా మూడు చోట్ల ఎంపీ స్థానాల‌ను గెలుచుకుంది. మ‌రో రెండు స్థానాల్లో గ‌ట్టి పోటీని ఇచ్చింది. ఒక‌వేళ‌, పార్టీ నాయ‌కులు కాస్త ఐక‌మ‌త్యంతో ప్ర‌య‌త్నించి ఉంటే మ‌రిన్ని ఎంపీ స్థానాలు ఆ పార్టీకి ద‌క్కేవ‌నేది వాస్త‌వం. సీఎల్పీని గులాబీ పార్టీలో విలీనం చేసుకోవ‌డం, ఫిరాయింపుల్ని య‌థేచ్ఛ‌గా ప్రోత్స‌హిస్తూ ఉండ‌టం… ఇవ‌న్నీ తెరాస మీద ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌ను పెంచి, త‌మ‌కు అనుకూలంగా మారుతున్న అంశాలుగా కాంగ్రెస్ చెబుతోంది. అయితే, మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఆ మేర‌కు కాంగ్రెస్ మంచి ఫ‌లితాలు సాధిస్తే… ఇప్ప‌టికే డీలా ప‌డ్డ కేడర్లో కొంత కొత్త ఉత్సాహం రావ‌డం ఖాయం.

 

 

 

భ‌విష్య‌త్తుపై కొత్త ఆశ‌లు రేకెక్క‌త‌డం ఖాయం. ఇక‌, భీజేపీ… ఈ పార్టీకి నాలుగు ఎంపీ స్థానాలు రావ‌డంతో రాష్ట్రంలో తామే తెరాస‌కు ప్ర‌త్యామ్నాయం అంటోంది. పెద్ద ఎత్తున స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం ఇప్పుడు చేస్తోంది. ప్ర‌తిప‌క్ష పార్టీ రాష్ట్రంలో వీక్ గా ఉంది కాబ‌ట్టి, ఆ స్థానాన్ని తామే భ‌ర్తీ చేస్తామ‌ని నేత‌లు అంటున్నారు. తెలంగాణ‌లో త‌మ‌నే ప్ర‌జ‌లు ప్ర‌త్యామ్నాయంగా కోరుకుంటున్నార‌ని ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు.

 

 

 

ఒక‌వేళ ప్ర‌జ‌లు నిజంగానే ఆ త‌ర‌హా మార్పు బ‌లంగా కోరుకుంటే… మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో భాజ‌పాకి కొంత సానుకూల ఫ‌లితాలు రావాలి. ఈ ఫ‌లితాల ఆధారంగానే భాజ‌పా వ్యూహాలూ ఉంటాయి. మొత్తానికి, తెలంగాణ‌లో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే మున్సిప‌ల్ ఎన్నిక‌లు.. మూడు ప్ర‌ధాన పార్టీల భ‌విష్య‌త్ వ్యూహాల‌ను నిర్దేశించేవిగా క‌నిపిస్తున్నాయి.

జగన్ కు షాకిచ్చిన కేంద్ర సంస్థలు

Tags: Whose calculations are theirs

జగన్ కు షాకిచ్చిన కేంద్ర సంస్థలు

Date:23/07/2019

విజయవాడ ముచ్చట్లు:

వైసీపీ అధినేత, ఏపీ నూతన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు ఏం చేయాలో కూడా పాలుపోని పరిస్థతి వచ్చిందని చెప్పక తప్పదు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై సమీక్షలకు రమ్మంటే… ముందు బాకీలు చెల్లించండి అంటూ కేంద్ర ప్రభుత్వ రంగ విద్యుదుత్పత్తి సంస్థలు షాకివ్వడంతో నిజంగానే జగన్ కు ఇప్పుడు ఏం చేయాలో కూడా పాలుపోని పరిస్థితేనని చెప్పాలి. గత ప్రభుత్వ హయాంలో కుదిరిన ఈ ఒప్పందాల వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పెద్ద ఎత్తున నష్టం వస్తోందని, ఆ నష్టాలను ఇకపైనా భరించడానికి సిద్ధంగా లేమని చెబుతున్న జగన్ విద్యుత్ కొనుగోలు ఒప్పందా(పీపీఏ) లను పున:సమీక్షిస్తానంటూ బరిలోకి దిగారు.

 

 

 

 

అయితే ఈ చర్య ద్వారా ఏపీకి లాభం మాటేమో గానీ, దేశవ్యాప్తంగా పెద్ద ఇబ్బందే వస్తుందని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మసలుకోవాలని ఇప్పటికే కేంద్రం జగన్ సర్కారుకు సూచించింది.అయినా కూడా వినకుండా పీపీఏల పున:సమీక్షకే మొగ్గు చూపారు. అంతేకాకుండా మరింత స్పీడు పెంచేసిన జగన్… ఏకంగా సోమవారం పీపీఏల పున:సమీక్ష కోసం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం భేటీని కూడా నిర్వహించారు. ఈ భేటీకి కేబినెట్ సబ్ కమిటీకి చెందిన మంత్రులు బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతంరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, బాలినేని శ్రీనివాసరెడ్డిలతో పాటు ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం హాజరయ్యారు.

 

 

 

 

ఈ భేటీకి రమ్మంటూ కేంద్ర ప్రభుత్వ రంగంలోని విద్యుదుత్పత్తి సంస్థలు ఎన్టీపీసీ, ఎస్ఈసీఐలకు వర్తమానం పంపితే… ఆ రెండు సంస్థలు ఈ భేటీకి రాకపోగా జగన్ సర్కారుకు దిమ్మతిరిగే షాకిచ్చాయితాము ఈ సమావేశాలకు హాజరు కాబోమని తేల్చేసిన ఆ రెండు సంస్థలు… ఇప్పటిదాకా తమకు కట్టాల్సిన బకాయిలను క్లియర్ చేయాలంటూ ఏకంగా నోటీసులే జారీ చేశాయి. ఈ రెండు సంస్థలు జగన్ సర్కారుకు నోటీసులు జారీ చేసిన వైనాన్ని ఈజీగా తీసుకోవడానికి లేదు.

 

 

ఎందుకంటే… ఈ రెండు సంస్థలు ఇచ్చిన నోటీసులు వాటికవే ఇచ్చినవి కాదు. కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే ఇచ్చినవిగా పరిగణించక తప్పదు. అంటే… జగన్ రివ్వూలకు రమ్మంటే… ఆ సంస్థలు అప్పులు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశాయంటే… జగన్ తీరుపై కేంద్రం ఏ స్థాయిలో ఆగ్రహంతో ఉందో ఇట్టే అర్థం కాక మానదు. మరి రివ్యూలకు రమ్మన్న ఆ సంస్థలు అప్పు కట్టాలంటూ పంపిన నోటీసులకు జగన్ ఏమంటారో చూడాలి

నిధులు ల్లేవు 

Tags: Central institutions that gave pics a shake

నిధులు ల్లేవు 

-కలెక్టర్లకు అదనపు బాధ్యతలు

Date:23/07/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

అసెంబ్లీలో ఆమోదించిన తెలంగాణ రాష్ట్ర మున్సిపల్‌ చట్టం-2019పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ పార్టీలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. సరైన అధ్యయనం చేయకుండానే, శాసనసభ, మండలిలో సమగ్ర చర్చ జరగకుండానే చట్టం చేయడం సరికాదనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఈ చట్టం ప్రతిపక్షాలను టార్గెట్‌ చేయడానికి మాత్రమే పనికొస్తుందని చెబుతున్నాయి. భారత రాజ్యాంగంలోని 73, 74 సవరణల ద్వారా స్థానిక సంస్థలకు ప్రతి ఐదేండ్లకోసారి ఎన్నికలను కచ్చితంగా నిర్వహించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఏర్పాటైంది. టీఆర్‌ఎస్‌ సర్కారు తెచ్చిన చట్టంతో ఎన్నికల నిర్వహణను ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుందని, ఇది సరికాదని అంటున్నాయి. ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

 

 

 

హడావుడిగా చట్టం చేయడం ద్వారా కేసీఆర్‌ ప్రభుత్వం తన స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నదని అభిప్రాయపడుతున్నాయి. 299 సెక్షన్లు, 181 పేజీలు ఉన్న మున్సిపల్‌ చట్టంపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చ జరగకుండానే, ప్రతిపక్షాల అభిప్రాయాలు, సూచనలు పరిగణనలోకి తీసుకోకుండానే బిల్లును ఆమోదించడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే 100 శాఖలకు చెందిన బాధ్యతలు చూస్తున్న కలెక్టర్ల నెత్తినే మళ్లీ మున్సిపాల్టీల పనులు పెట్టడం మంచిది కాదని, అలా చేయడం మూలానా నష్టం జరుగుతుందని గుర్తు చేస్తున్నారు.

 

 

 

కొత్త చట్టంలోని సెక్షన్‌ 195(2) ప్రకారం మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ, చైర్మెన్‌, వైస్‌చైర్మెన్‌, వార్డుల సభ్యుల విధులు, రికార్డుల తనిఖీలు, మున్సిపాల్టీల్లో ప్రభుత్వ కార్యక్రమాల అమలు తదితర అంశాల్లో కలెక్టర్లకే అధికారాలిస్తూ చట్టం చేసిన సంగతి తెలిసిందే. సెక్షన్‌ 24 ప్రకారం మున్సిపాల్టీలు, కార్పొరేషన్లల్లో నాటిన మొక్కల్లో 85 శాతం కంటే తక్కువగా బతికితే ప్రత్యేకాధికారి, ఆ వార్డు సభ్యుడిని విధుల నుంచి తొలగించే అధికారాన్ని కలెక్టర్‌కు కట్టబెట్టడాన్ని ప్రతిపక్ష నేతలు నిరసిస్తున్నారు.

 

 

 

ప్రజలచేత ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకునే అధికారాన్ని కలెక్టర్‌కు అప్పగించడం మంచి పరిణామం కాదని అంటున్నారు. అలాగే ఈ చట్టం ద్వారా మంత్రుల అధికారాలను తగ్గించడంపై కూడా ఆందోళన వ్యక్తమవుతున్నది. మొక్కల పెంపకానికి కావాల్సిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయకుండా, నిధులు మంజూరు చేయకుండా పెంచడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు.

 

 

 

అంతేగాక ఇప్పటికే అమల్లోకి వచ్చిన పంచాయతీరాజ్‌ చట్టం ద్వారా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం 22 శాతానికి తగ్గించిన విషయం విదితమే. తాజాగా అమల్లోకి వచ్చే మున్సిపల్‌ చట్టంలో ప్రభుత్వం చెబుతున్నట్టుగా ఒక నిబంధనను కూడా ప్రభుత్వం అమలు చేయలేదని, బీసీ రిజర్వేషన్ల తగ్గింపు మాత్రమే అమల్లోకి వస్తుందనే విమర్శలు సైతం వస్తున్నాయి.

 

 

 

రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ఇదే జరుగుతుందని అభిప్రాయపడుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పును అడ్డంపెట్టుకుని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నదని చెబుతున్నాయి. ఈమేరకు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఖరీని తప్పుబడుతున్నాయి.

 

ఏపీలో కొత్త రేషన్ కార్డులు

Tags: No funds available

ఏపీలో కొత్త రేషన్ కార్డులు

Date:23/07/2019

విజయవాడ ముచ్చట్లు:

ఏపీ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు ప్రకటించారు పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని. ఈ ప్రక్రియ త్వరలో ప్రారంభం అవుతుందన్నారు. 2019, సెప్టెంబర్ నుంచి కొత్త కార్డులు ఇంటింటికీ చేరవేయనున్నట్లు వెల్లడించారు. గ్రామ వాలంటీర్లు వీటిని అందజేస్తారని అన్నారు. అప్పటి వరకు పాత రేషన్ కార్డులు చెల్లుతాయని.. ప్రజలు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు.

 

 

 

 

కొత్త రేషన్ కార్డుల జారీ పారదర్శకంగా ఉంటుందన్నారు. అన్ని వివరాలు అందులో ఉంటాయని.. రేషన్, పెన్షన్, ఆరోగ్యశ్రీ వంటి అన్ని వివరాలతో లబ్ధిదారునికి అవగాహన కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. రేషన్ పంపిణీ కూడా ప్యాకేజింగ్ రూపంలో ఉంటుందన్నారు. దీని వల్ల కల్తీకి అవకాశం ఉండదన్నారు. తూకాల్లో మోసాలను అరికట్టవచ్చన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి పనులు మొదలు పెట్టామని.. గ్రామ వాలంటీర్ల నియామకం పూర్తయిన తర్వాత..

 

 

 

 

లబ్దిదారులకు ఇంటింటికీ వచ్చి ఇస్తారన్నారు. అప్పటివరకు పాత విధానమే కొనసాగుతుందని వివరించారు ఏపీ సివిల్ సప్లయ్స్ మినిస్టర్ కొడాలి నాని.ప్రస్తుతం ఉన్న పాత రేషన్ కార్టుల్లో మార్పులు చేర్పులు చేసి కొత్త కార్డులను జారీ చేస్తామని తెలిపారు. సివిల్ సప్లై శాఖలో అవకతవకల్ని సరిదిద్ది పటిష్టంగా అమలు చేస్తామన్నారు.  టీడీపీ ప్రభుత్వం నిధులను దారి మళ్లించిందని ఆయన ఆరోపించారు.

 

 

 

పౌరసరఫరాల శాఖలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం, అశ్రద్ధను అసెంబ్లీలో ప్రస్తావించారు మంత్రి. రూ.4 వేల 800 కోట్ల నిధులను మళ్లించారన్నారు. దీని వల్లే రైస్ మిల్లర్లకు ప్రభుత్వం బకాయి పడిందన్నారు. 2018 లో వెయ్యి కోట్ల రూపాయలు సివిల్ సప్లయ్స్ శాఖ చెల్లించ లేదని.. ఆ బాకీ ఈ ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుందని అన్నారు.

తెలుగు రాష్ట్రాలు 

Tags: New ration cards in AP

తెలుగు రాష్ట్రాలు 

-రెడ్లతో కమలం అడుగులు

Date:23/07/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

రాజకీయ పరమపధ సోపానాన్ని అధిరోహించాలన్నది తెలుగు రాష్ట్రాల బీజేపీ కల. అది నెరెవేరే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఇపుడు బీజేపీ నేతలు భావిస్తున్నారు. తెలంగాణాలో తాజా ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీకి సరికొత్త ఆశలు మొదలయ్యాయి. రేపటి రోజున తెలంగాణల్లో కమలవికాసం ఖాయమని ఆ పార్టీ గట్టిగా నమ్ముతోంది. తెలంగాణాలో డైనమిక్ లీడర్ కిషన్ రెడ్డిని కేంద్రంలో తన శాఖానే సగమిచ్చి మంత్రిగా తీసుకుని అమిత్ షా రాజకీయ పాఠాలు బోధిస్తున్నారు. టీఆర్ఎస్ ని ఎలా కొట్టాలో కూడా మెలకువలు చెబుతున్నారు. తెలంగాణాలో వెలమ పాలన సాగుతోంది. అందువల్ల బలమైన సామాజికవర్గంగా ఉన్న రెడ్లు రాజకీయ వాటా దొరక్క సతమతమవుతున్నారు. వారిని తమ వైపునకు తిప్పుకోవడానికే బీజేపీ తెలివిగా కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రిని చేసింది.

 

 

 

 

కిషన్ రెడ్డి కూడా మంచి మాటకారి. అనేక ఉద్యమాలను చేసిన వాడు. ఆయన చురుకుదనం, కులబలం పెట్టుబడిగా పెట్టి రేపటి రోజున తెలంగాణా గెలవాలని బీజేపీ ఆలోచనగా ఉంది.ఇక ఏపీలో చూసుకుంటే జగన్ రెడ్డి సామాజికవర్గంలో ఏకైక నాయకునిగా ఉన్నారు. ఆ వర్గాన్ని ఆకట్టుకుంటేనే తప్ప బీజేపీకి విజయం సాధ్యం కాదు. కమ్మ సామాజికవర్గం ఎటూ బీజేపీకి కొంత బలంగా ఉంది. టీడీపీ ఎంత బలహీన పడితే అంతలా ఆ వర్గం బీజేపీ చెంతన చేరడం ఖాయం. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు అధికారంలో ఉన్న జగన్ ని దెబ్బతీయాలంటే ఆయన ఆయువు పట్టుగా ఉన్న రెడ్లను చేరదీయాలి. అందుకే ఆ వర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని చేర్చుకుని తురుపు ముక్కలా ప్రయోగించాలనుకుంటోంది.

 

 

 

 

కిరణ్ కూడా వైఎస్సార్ శిష్యుడే. కాంగ్రెస్ లో సీమకు చెందిన కీలక నేత. అయితే సొంత బలం లేకపోవడం వల్ల వెనక్కివెళ్లిపోయారు. ఆయన పాలన పట్ల జనంలో కొంత మంచి అభిప్రాయం కూడా ఉంది. దాంతో ఆయనికి పార్టీ బలం ఇవ్వడం ద్వారా గట్టిగా ఫోకస్ చేస్తే జగన్ కి ప్రత్యామ్న్యాయ నేత అవుతారని బీజేపీ ఆశ పెట్టుకుంటోంది.రెండు తెలుగు రాష్ట్రాల్లో రెడ్డి సామాజికవర్గాన్ని దువ్వడం ద్వారానే అధికార పీఠాన్ని అందుకోగలమని బీజేపీ గట్టి అంచనాలే వేసుకుంది.

 

 

 

కాంగ్రెస్ జమానాలో ఉమ్మడి ఏపీలో రెండ్లు దశాబ్దాల పాటు రాజకీయాలను శాసించారు. ఇపుడు కాంగ్రెస్ ఓటమి పాలు కావడంతో వారు సరైన రాజకీయ వేదిక కోసం చూస్తున్నారు. అందువల్ల వారిని చేరదీసి ఆదరిస్తే కాంగ్రెస్ తరహాలోనే తెలుగు రాష్ట్రాలల్లో అధికారం చెలాయించవచ్చునని బీజేపీ అనుకుంటోంది. ఇక తెలంగాణాలో, ఏపీలో బీజేపీ వేస్తున్న ఈ ఎత్తులు ఎంత మేరకు ఫలిస్తాయో చూడాలంటున్నారు. జగన్, కేసీఆర్ ను మరో వైపు చంద్రబాబుని ఎదుర్కొనే దమ్మున్న అభ్యర్ధులుగా వీరు ఎంతవరకు నిరూపించుకుంటారో కూడా చూడాలి.

ఇసుక వ్యవహారం

Tags: Telugu states

ఇసుక వ్యవహారం

-ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే

 

Date:23/07/2019

గుంటూరు ముచ్చట్లు:

అధికారంలోకి వచ్చి పట్టుమని పదినెలలు కాలేదు. అపుడే ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహారాల్లో ఓ ఎంపీ, ఎమ్మెల్యే మధ్య వివాదం మొదలైంది. ఇసుక తవ్వకాల్లో ఇద్దరు నేతల మధ్య వివాదం హద్దు మీరింది. వైసీపీ శ్రేణులు రెండు వర్గాలుగా విడిపోయి రచ్చరచ్చ చేస్తోంది. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు పోటీపడ్డారు. ఇసుక పంచాయతీ కాస్త సీఎం జగన్‌ వద్దకు చేరింది. ఇద్దరికీ జగన్‌ క్లాస్‌ తీసుకున్నారు. మిగతా మ్యాటర్ సెటిల్‌ చేయాలని సజ్జలను ఆదేశించారు. అక్కడితో కథ సుఖాంతమైంది. ఇద్దరు నేతలు జాయింట్ ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ ఖండించారు. అయితే కథ కంచికి చేరడం వెనక, చాలా కథ జరిగింది.

 

 

 

 

ఇంతకీ వీరిమధ్య శాండ్ ఇష్యూ నిజంగానే బుసలుకొట్టిందా…లేదంటే వీరే చెబుతున్నట్టు విపక్షాల కట్టుకథనా?  నందిగాం సురేష్…బాపట్ల వైసీపీ ఎంపీ. జగన్‌ వెంట నడిస్తే చాలు, తనకేమీ అవసరంలేదని ఆశించిన నందిగాం సురేష్ సురేష్‌‌, పార్టీ అధినేత మనసును గెలిచి, ఏకంగా ఎంపీగా పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తూనే, సెన్సేషన్‌ అయ్యారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. ఈమె కూడా తొలిసారి చట్టసభల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇద్దరూ గుంటూరు జిల్లా నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

 

 

 

 

అయితే ఈమధ్య వీరిద్దరి మధ్య ఇసుక వివాదం, రచ్చరచ్చ చేస్తుండటం సంచలనం సృష్టిస్తోంది.  గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో ఎప్పటి నుంచో ఇసుక అక్రమ రవాణా సాగుతోందన్నది వినిపిస్తున్న మాట. శ్రీదేవి సొంత నియోజకవర్గమైన తాడికొండ పరిధిలోని ఉద్దండరాయునిపాలెంలో, నందిగాం సురేష్‌ అనుచరులు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే శ్రీదేవివర్గం, కొన్నాళ్ల నుంచి ఆరోపిస్తోంది. అందుకే అక్రమ రవాణా చేస్తున్న కొందర్ని అడ్డుకున్నామని, వీరంతా నందిగాం సురేష్‌ అనుచరులేనని శ్రీదేవి వర్గీయులు గట్టిగా చెబుతున్నారు. దీంతో ఈ ఇద్దరి మధ్య ఇసుక రగడ మొదలైంది.

 

 

 

ఎన్నికల ఫలితాల నుంచి నందిగాం సురేష్‌, శ్రీదేవిల మధ్య విభేదాలు భగ్గమంటూనే ఉన్నాయని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఇటీవలే తాడికొండ నియోజకవర్గంలో నందిగాం సురేష్ ఫోటోను, శ్రీదేవి వర్గీయులు ప్లెక్సీలో చిన్న ఫోటో వేశారంటూ, ఎంపీ అనుచరులు గొడవపడ్డారు. నియోజకవర్గంలో రెండువర్గాలుగా విడిపోయిన ఎంపీ, ఎమ్మెల్యే అనుచరులు, అనేక ఇష్యూల మీద రగడ చేస్తున్నారని వైసీపీ కార్యకర్తలే మండిపడుతున్నారు. గుంటూరు జిల్లా బాపట్ల పార్లమెంటు ఎంపీగా గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన సురేష్ జన్మస్థలం, తాడికొండ నియోజకవర్గం.

 

 

 

దీంతో అనుచరులు, సామాజికవర్గం బలం చూసుకుని, నందిగాం సురేష్ వర్గీయులు, ఇక్కడ అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని శ్రీదేవి వర్గీయులు ఆరోపిస్తున్నారు. అయితే నియోజకవర్గంలో తనకు తెలియకుండా ఇసుక రవాణా ఎలా చేస్తారని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిసింది. దీంతో పోలీసులు ఇసుక రీచ్‌లో ఉన్న జేసీబీ, ఇసుక ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్‌కు తరలించి, ఇసుక వాహనాలను సీజ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎంపీ నందిగాం సురేష్ తక్షణమే వాహనాలు విడుదల చేయాలని పోలీసులను కోరినట్టు తెలుస్తోంది.

 

 

 

 

దీంతో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, తన నియోజకవర్గంలో ఎక్కడైనా ఇసుక అక్రమ రవాణా జరిగితే సహించేదిలేదని, పోలీసుల ఎదుటే సీరియస్‌ అయ్యారట. వివాదం మరింత ముదరడంతో, ఎంపీ, ఎమ్మెల్యేల ఇసుక రచ్చ భగ్గుమంది. ఇక ఎంపీ నందిగాం సురేష్, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మధ్య గతంలోనే చిన్నచిన్న ఘర్షణలు చోటు చేసుకున్నాయి. నాలుగు రోజుల క్రితం ఫ్లెక్సీ వివాదంలో నడిరోడ్డుపై దాడి చేసుకున్నారు ఎంపీ, ఎమ్మెల్యేల అనుచరులు. వీరి గొడవలను ఒక కంట కనిపెడుతున్న వైసీీపీ అధిష్టానం, టైమ్‌ వచ్చినప్పుడు స్పందించాలని ఓపిక పట్టిందని తెలుస్తోంది. శాండ్‌ ఇష్యూతో ఆ టైమ్ రానే వచ్చింది.

 

 

 

 

రాజధాని వైసీపీ నేతల పంచాయతీ, చివరకు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి దగ్గరకు చేరింది. ఎంపీ నందిగాం సురేష్ ఇసుక అక్రమ తవ్వకాలను ప్రోత్సహిస్తున్నారని, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సీఎంని కలిసి నివేదించినట్టు తెలిసింది. బాపట్ల ఎంపీగా ఉండి తన నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటున్నారని సీఎంకు కంప్లైయింట్ ఇచ్చారన్న వార్త సంచలనం సృష్టించింది. దీంతో రాజధాని వైసీపీ నేతల పంచాయతీ మీడియాలో ఒక్కసారిగా ఫ్లాష్‌ అయ్యింది.

 

 

 

ఈ వ్యవహారంలో వెంటనే స్పందించిన సీఎం జగన్, ఇద్దర్నీ పిలిపించి మాట్లాడారు. మీడియాలో రచ్చకావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. ఈ విషయంలో నందిగాం సురేష్‌ను మందలించినట్టు తెలిసింది. మొన్ననే అధికారంలోకి వచ్చాం, టీడీపీ ప్రభుత్వ ఇసుక అక్రమాలపై ఆందోళనలు చేశాం, అప్పుడు వైసీపీ సర్కారు మీద ఇసుక అక్రమ రవాణా ఆరోపణలేంటని ఆరా తీసినట్టు తెలిసింది. మొదటిసారి ఎన్నికైన ఇద్దరూ, జాగ్రత్తగా పని చేయాలని సీరియస్‌గా వార్నింగ్‌ ఇచ్చినట్టు సమాచారం. విభేదాలు మరిచి, నియోజకవర్గ అభివృద్దికి అంకితం కావాలని చెప్పారని తెలిసింది.

 

 

 

జగన్‌ జోక్యంతో చల్లబడిన ఇద్దరు ప్రజాప్రతినిధులు, సంయుక్తంగా మీడియా సమావేశం పెట్టి, తమ మధ్య విభేదాల్లేవని, కావాలనే కొందరు సృష్టిస్తున్నారని చెప్పారు. మొత్తానికి ఇద్దరూ కలిసి, విభేదాల్లేవని చెప్పడంతో ఇసుక తుపాను చల్లారినట్టయ్యిందని, రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే నిజంగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోందా లేదంటే కేవలం ఆరోపణలా అన్నదానిపై సమగ్ర విచారణ జరపాలని పర్యావరణ వేత్తలు డిమాండ్ చేస్తున్నారు.

 

కమలం గూటికి తోట ఫ్యామిలీ 

Tags: The affair of sand