తెలుగుముచ్చట్లు రంజాన్‌ శుభాకాంక్షలు

Date:04/06/2019

పుంగనూరు ముచ్చట్లు:

రంజాన్‌ పండుగను పురస్కరించుకుని ముస్లింలకు తెలుగుముచ్చట్లు వెబ్‌సైట్‌ యాజమాన్యం , సిబ్బంది శుబాకాంక్షలు తెలిపారు. ముస్లింలు సుఖసంతోషాలతో రంజాన్‌ పండుగను కుటుంబ సభ్యులతో కలసి నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.

ఇట్లు…

తెలుగుముచ్చట్లు వెబ్‌సైట్‌ , పుంగనూరు .

9న బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం కార్యవర్గం ఎన్నిక

Tags: Congratulations to Ramzan

జగన్ ఎప్పుడూ మా వాడే

Date:03/06/2019

అనంతపురం ముచ్చట్లు:

జేసీ దివాకర్ రెడ్డి.. అనంతపురం జిల్లాలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని నేత. సుధీర్ఘ కాలం కాంగ్రెస్‌లో కొనసాగిన జేసీ.. రాష్ట్ర విభజన తర్వాత సైకిలెక్కారు. 2014లో అనంతపురం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిన ఆయన.. 2019లో మాత్రం కుమారుడికి టికెట్ తెచ్చుకున్నారు. కానీ ఫ్యాన్ స్పీడుకు పవన్ కుమార్ రెడ్డి తట్టుకోలేక ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత మీడియాకు దూరంగా ఉంటున్న జేసీ.. తాజాగా జగన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్‌ అంటే ఒంటి కాలుపై లేచి విమర్శలు చేసే దివాకర్ రెడ్డి.. తన విమర్శల్లో వేడిని కాస్త తగ్గించారు. సోమవారం ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడిన జేసీ.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. తాను జగన్‌పై రాజకీయ విమర్శలు చేశానే తప్ప.. ఎప్పుడూ ద్వేషించలేదన్నారు. ‘జగన్ మావాడే ’అంటూనే.. పార్టీ మారానుకోవడం లేదంటున్నారు. ప్రధాని మోదీ జగన్ వ్యవహరిస్తున్న తీరు శుభపరిణామమని అభిప్రాయపడ్డారు. టీడీపీ నేత, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో తెరపైకి వచ్చారు. సీఎం అయినందుకు జగన్ కు అభినందనలు తెలిపారు.

 

 

 

 

 

 

గతంలో జగన్ పై రాజకీయపరమైన విమర్శలు చేశానే తప్ప ఏనాడూ ద్వేషించలేదని స్పష్టం చేశారు. అయితే జగన్ ను ఓ విషయంలో మెచ్చుకోవాలని, ప్రత్యేక హోదా అంశంలో మొదటి నుంచి ఒకే పంథాకు కట్టుబడి ఉన్నాడని, ఈ విషయంలో తొలినుంచి జగన్ నిజాయతీగా వ్యవహరిస్తున్నాడని కితాబిచ్చారు. ఢిల్లీలో మోదీతో జగన్ మాట్లాడిన విధానం చూస్తే కచ్చితంగా ప్రత్యేక హోదా సాధిస్తాడనిపిస్తోందని అన్నారు. ఢిల్లీలో జగన్ మాట్లాడిన తీరుతెన్నులు అద్భుతమని జేసీ కొనియాడారు.ఎప్పుడూ జగన్‌పై నిప్పులు చెరిగే జేసీ దివాకర్ రెడ్డి.. ఈసారి మాత్రం జగన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి మళ్లీ వార్తల్లో నిలిచారు. రాజకీయ విమర్శలు చేశానే తప్ప.. ద్వేషించడం లేదంటూ ట్విస్ట్ ఇచ్చారు. మరోవైపు జేసీ బ్రదర్స్ పార్టీ మారబోతున్నారంటూ రెండు రోజులుగా సోషల్ మీడియాలోనూ ప్రచారం జరుగుతోంది. వైసీపీ, బీజేపీవైపు ఈ ఇద్దరి సోదరుల కన్నుపడిందని చర్చ జరుగుతోంది. మొత్తానికి జేసీ పార్టీ మారేది లేదని తేల్చి చెప్పారు.

 

8 గంటల నుంచి ఎంపీపీ,జెడ్పీల కౌంటింగ్

Tags:Jagan has always used us

ఖరీఫ్ కు సిద్ధమౌతున్న రైతన్న

Date:03/06/2019

అనంతపురం ముచ్చట్లు:

జూన్‌ మొదటి వారం నుంచి ఖరీఫ్‌ ఆరంభం అవుతుంది. ఈ ఏడాది ముందస్తుగా రుతుపవనాలు వస్తున్నాయని వాతావరణ శాఖ చెప్పడంతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. ఖరీఫ్‌ ముందే ప్రతి రైతు తమ భూమిలో భూసార పరీక్ష చేయించుకుంటే బాగుంటుందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. భూ సారాన్ని బట్టి అనుకూలమైన పంటలను మాత్రమే వేసుకోవాలి రానున్న ఖరీఫ్‌లో ఏ భూముల్లో ఎలాంటి పంటలు వేయాలి. ఎరువులు, పంటల యాజమాన్యం, దుక్కులు దున్నడం తదితర అంశాలు రైతులకు ఎంతో మేలు చేస్తాయని వ్యవసాయాధికారులు చెపుతున్నారు.ఎరువుల యాజమాన్య పద్ధతులను రైతులు సరిగ్గా పాటించాలి. భాస్వరం, ఎరువులను దుక్కిలో వేసుకోవాలి. నత్రజని, ఎరువులను విడతల వారీగా వేసుకోవాలి. పంటకు వేయాల్సిన పొటాషియాన్ని సగం దుక్కితో వేయాలి. సగం పంటకు వేయాలి. యూరియాను నేరుగా కాకుండా వేప పిండితో గానీ, బంక మట్టితో గానీ కలిపి వేయాలి. ఇలా చల్లుకున్నట్లయితే యూరియా ఆవిరికాకుండా ఉండడంతో పాటు 100 శాతం పంటకు ఉపయోగపడుతుంది. వరికి, పత్తికి రెండో విడతగా భాస్వారాన్ని అసలు వాడకూడదు.జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్‌ పథకం ద్వారా భూసార పరీక్షలు నిర్వహిస్తే భూమిలో సేంద్రియ పదార్థాం తక్కువగా ఉందని తెలిసింది. ఇది ప్రమాదకర పరిస్థితులకు సంకేతం. ఇప్పటికైనా ప్రతి రైతు సేంద్రియ వ్యవసాయాన్ని అలవాటు చేసుకోవాల్సిందే.

 

 

 

 

 

 

 

 

ఎక్కువగా రసాయన ఎరువులు వాడటం వల్ల పంటల దిగుబడిలో పలు సమస్యలు ఎదురవుతాయి. పశువుల ఎరువులు, వర్మీకంపోస్టు ఎరువుల ద్వారా భూసారం పెరగడంతో పాటు నాణ్యమైన దిగుబడిని కూడా సాధించవచ్చు. రైతుకు సరిపడ విత్తనాలు సబ్సిడీ పంపిణీ చేసేందుకు సిద్ధం చేశాం. రైతులకు పెట్టుబడి తగ్గి, దిగుబడి పెరుగుతోంది. భూసారానికి అనుగుణంగా ఎరువుల యాజమాన్య పద్ధతులను పాటించాలి. దీంతో భూసారం పాడవుకుండా ఉంటుంది. భూసార పరీక్ష ద్వారా భూమిలో ఉన్న పోషక స్థాయిని తెలుసుకోవచ్చు. భూమిలో ఏ పంటలు వేస్తే అధిక దిగుబడి వస్తుందో తెలుస్తుంది. చౌడు నేలల్లో ఉన్న ఆమ్ల, క్షార నేలలను తెలుసుకుని భూమిని సరిదిద్దుకోవచ్చు. పత్తి సాగు చేసే రైతు తన భూమిలో పంట మార్పిడి చేయాలి. నాలుగు ఎకరాల్లో పత్తి వేస్తారనుకుంటే ఎకరంలో పత్తివేసి మిగత మూడు ఎకరాల్లో ఇతర పంటలు వేసుకోవడం మంచిది. ఆశించిన స్థాయిలో పంటలు పండాలని రైతులు వ్యవసాయ పనుల్లో బిజీబిజీగా గడిపేస్తున్నారు. గుమ్మఘట్ట మండల వ్యాప్తంగా 14 వేల హెక్టార్లలో వేరుశనగ సాగయ్యే అవకాశం ఉంది.

కనీసం 40 వేల కోట్లు కావాలి

Tags:Karif is preparing the trainer

గైనిక్‌ సేవలు మృగ్యంగా మారాయి

Date:09/05/2019
అనంతపురం  ముచ్చట్లు:
అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి  గైనిక్‌ సేవలు మృగ్యంగా మారాయి. గైనిక్‌ విభాగానికి కొన్నేళ్లుగా మెటర్నిటీ అసిస్టెంట్ల కొరత పట్టిపీడిస్తోంది. దీంతో గర్భిణులు, వైద్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసిస్టెంట్ల పని సైతం తామే చేయాల్సి వస్తోందని పలువురు వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వైద్య ఆరోగ్యశాఖలో 828 మంది ఏఎన్‌ఎంలు ఉన్నారు. 498 మంది రెగ్యులర్‌ పోస్టులుండగా అందులో 140 ఖాళీలున్నాయి. అలాగే 586 కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలలో 110 మంది ఖాళీలున్నాయి. పీహెచ్‌సీ, మదర్‌ పీహెచ్‌సీల్లో ప్రసవాలు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. అక్కడి మెటర్నిటీ అసిస్టెంట్లను మూడు నెలలకోసారి డెప్యూట్‌ చేస్తే బాగుంటుందని గైనిక్‌ వైద్యులు కోరుతున్నారు. ఆరోగ్యశాఖ మాత్రం సిబ్బంది కొరతను చూపి పట్టించుకోవడం లేదు. అందరి సమన్వయంతోనే మాతాశిశు మరణాల నియంత్రణ సాధ్యపడుతుందని సీనియర్‌ వైద్యులు చెబుతున్నారు..కాన్పుల వార్డులో ముగ్గురు మెటర్నిటీ అసిస్టెంట్లు సేవలందిస్తున్నారు. 2000 సంవత్సరంలో 11 మంది మెటర్నిటీ అసిస్టెంట్లను తీసుకున్నారు. అందులో ముగ్గురు మినహా మిగతా వారంతా ఉద్యోగ విరమణ చేశారు. ఇంత వరకు మెటర్నిటీ అసిస్టెంట్ల పోస్టులు భర్తీ చేయలేదు. లేబర్‌వార్డులో రోజూ 30 ప్రసవాలు జరుగుతాయి. అందులో 7 సిజేరియన్లు, 20 నుంచి 23 సాధారణ ప్రసవాలు జరుగుతాయి. సాధారణ ప్రసవాలు జరిగే సమయంలో మెటర్నిటీ అసిస్టెంట్లు తప్పనిసరి. వైద్యులకు సహాయకులుగా వారుండాలి. కానీ ఇక్కడ అటువంటి పరిస్థితి కన్పించడం లేదు. ఆస్పత్రిలోని గైనిక్‌ విభాగంలో పతి ఒత్తిడితో పాటు మెటర్నిటీ అసిస్టెంట్ల కొరత పెద్ద సమస్యగా మారింది.
Tags:Gaynn services have become gorgeous

 ఉరవకొండ రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

Date:08/05/2019
అనంతపురం ముచ్చట్లు:
ఆంధ్రా సరిహద్దు ప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. అనంతపురం జిల్లా ఉరవకొండ లో కర్ణాటక చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి
చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పట్టణంలోని ఎస్‌ఎల్‌ఎన్‌ కాలనీకి చెందిన ఓబుళేసు, సోమప్ప అనే భవన నిర్మాణ కార్మికులు పాత ప్రయాణ ప్రాంగణం నుంచి తమ కాలనీకి ద్విచక్ర
వాహనంలో వెళ్తున్నారు.అక్కడ ద్విచక్ర వాహనం, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం మీద వెళ్తున్న ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. గుర్తించిన స్థానికులు చికిత్స కోసం
పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలిస్తుండగా సోమప్ప మార్గమధ్యంలో మృతి చెందాడు.
Tags:One died in Urobendoda road accident

తాడిపత్రిలో సీఐ నారాయణరెడ్డి వ్యవహారం వివాదస్పదమయిం

Date:16/04/2019
అనంతపురం ముచ్చట్లు :
 తాడిపత్రిలో సీఐ నారాయణరెడ్డి వ్యవహారం వివాదస్పదమయింది.  టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి కనుసన్నల్లో  సీఐ నారాయణరెడ్డి పనిచేస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఈసీ నారాయణరెడ్డిని బదిలీ చేసింది. దీంతో నారాయణరెడ్డి వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపుకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీకి చెందిన ఖాదర్, హుస్సేన్, రఘులపై లాఠీలతో తాడిపత్రి పోలీస్ స్టేషన్లో థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ముగ్గురు కార్యకర్తలను ఆస్పత్రికి తరలించారు. జేసీకి వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బదిలీ అయిన సీఐ వైఎస్సార్సీపీ శ్రేణులపై ఈ విధంగా దాడి చేయడంపై పోలీసు వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. జేసీ బ్రదర్స్ అండతో నారాయణరెడ్డి రెచ్చిపోతున్న ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడాన్ని వైఎస్సార్సీపీ తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దారెడ్డి తప్పుబట్టారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించే అధికారం నారాయణరెడ్డికి ఎవరిచ్చారని నిలదీశారు. బదిలీ అయిన సీఐకి తాడిపత్రిలో ఏం పని అని సూటిగా ప్రశ్నించారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని కోరారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడికి పాల్పడ్డ సీఐని సస్పెండ్ చేసి.. క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Tags:Is the CM KCR really a Ulta Palta?

అనంతలో అడగుంటున్న భూగర్భ జలాలు

Date:16/04/2019
 అనంతపురం ముచ్చట్లు :
సాగు నీరు లేక వర్షాధార వ్యవసాయంతోనే  బతుకుతున్న రైతన్నలకు ఈ ప్రాజెక్టు.. కొండంత ఆశలు రేకెత్తించింది. దశాబ్దాల కల రైతుల కళ్లెదుట కనిపించేలా చేసి.. ప్రాజెక్టు కుడి కాలువ నుంచి నీరు బయటకు వదలడంతో గాలివీడు, లక్కిరెడ్డిపల్లె మండలాల పరిధిలోని రైతులలో ఆనందం నెలకొంది. ప్రాజెక్టులోకి నీరు సమృద్ధిగా చేరితే రాయచోటి నియోజకవర్గ పరిధిలోని గాలివీడు, లక్కిరెడ్డిపల్లె, రామాపురం మండలాల్లో 24 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందడంతోపాటు వేలాది ఎకరాల సాగుకు అనువుగా భూగర్భ జలాలు పెంపొందే అవకాశాలు ఉన్నాయి. ప్రాజెక్టు పూర్తయితే వర్షం ఎప్పుడు కురిసి నీరు వచ్చినా పంటలను సాగు చేసుకోవచ్చన్న సంతోషం రైతుల్లో కనిపించింది. ప్రాజెక్టు కింద కుడి, ఎడమ కాల్వల కింద 24 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు 60 కిలోమీటర్ల మేర కాలువలను తవ్వారు.4.8 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన నాటి నుంచి నేటి వరకు నీటితో కళకళలాడకపోయినా.. అడుగు భాగంలో ఉన్న 0.7 టీఎంసీల నీరు ఆ ప్రాంతంలో భూగర్భజలాల పెంపుదలకు దోహదం చేస్తోంది. కడప–అనంతపురం–చిత్తూరు జిల్లాల సరిహద్దులో వెలిగల్లు వద్ద పాపాఘ్ని నదిపై ప్రాజెక్టును నిర్మించాలని బ్రిటీష్‌ ఇంజినీర్లు నిర్ణయించారు. నాటి నుంచి అదిగో, ఇదిగో ప్రాజెక్టు అంటూ హామీల మీద హామీలు గుప్పిస్తూ వచ్చారు. ప్రాజెక్టు నిర్మాణంలో నడుస్తున్న పనులను చూసి మరెన్ని దశాబ్దాలకు ప్రాజెక్టు పూర్తవుతుందోనన్న అనుమానాలు.. అసలు ప్రాజెక్టు పూర్తవుతుందా అన్న బెంగ నెలకొని ఉండేది. కారణం కొన్ని దశాబ్దాల క్రితం వెలిగల్లు ప్రాజెక్టు నిర్మించాలని తలచినా.. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడం, వ్యవసాయం దండగ అన్న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలు ఈ ప్రాంత రైతులు ఆశలను వదులుకునేలా చేసింది. 2003లో ప్రతిపక్ష నాయకుని హోదాలో వైఎస్సార్‌ శిలాఫలకం వద్ద మొక్కలు కూడా నాటారు. ఇలాంటి తరుణంలో 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌ సీఎం అయ్యారు. ఆయన హయాంలో నిధులు వరదలా పారడంతో 2008లోనే పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి  ప్రభుత్వం 350 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. మహానేత హయాంలో జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టులలో పూర్తయిన మొదటి ప్రాజెక్టుగా రికార్డులకెక్కింది.తాగునీటి కోసం పరితపించే రాయచోటి పట్టణ ప్రజలకు వెలిగల్లు ప్రాజెక్టు ఓ వరంలా మారింది. దశాబ్దాల కాలం నుంచి తాగునీటితో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు.. వైఎస్సార్‌ హయాంలో 48 కోట్ల రూపాయలను మంజూరు చేసి 30 కిలోమీటర్ల మేర పైపులైన్‌ ఏర్పాటు చేశారు. దీంతో రాయచోటి పట్టణ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్లయింది.
Tags:The underground waters that are being asked in Anantha

 కళ్యాణ దుర్గంలో మారుతున్న పరిస్థితులు

 Date:26/03/2019
అనంతపురం  ముచ్చట్లు:
2019 ఎలెక్షన్స్ నామినేషన్లు పర్వము కూడా పూర్తి అవ్వుతుంది,ఇక ప్రచారానికి మాత్రం రెండు వారలే సుమయం ఉంది,ఇరు పార్టీ నేతలు ఓటర్లును ప్రసన్నం చేసుకునే పనిలో బిజి బిజీగా ఉన్నారు. క‌ళ్యాణ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ‌ వేడి మొద‌లైంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉమామహేశ్వర నాయుడు ప్రచారంలో దూసుకుపోతున్నారు. మ‌రి  వ‌చ్చే ఎన్నిక‌ల్లో   ఏ పార్టీ అభ్యర్థికి  ఇక్క‌డ ప్రజలు పట్టం కట్టబోతున్నారు, కళ్యాణదుర్గం గ్రౌండ్ రిపోర్ట్..క‌ళ్యాణ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గం 1952 సంవత్సరం లో  ఏర్ప‌డింది.  క‌ళ్యాణ‌దుర్గం మున్సిపాలిటీతో పాటు కంబ‌దూరు, కుందుర్పి, శెట్టూరు, బ్ర‌హ్మ‌స‌ముద్రం మండ‌లాలు ఈ నియోజ‌కవ‌ర్గ ప‌రిధిలో ఉన్నాయి.  ఈ నియోజ‌క‌వ‌ర్గం చుట్టు మూడు వైపుల  రాయ‌దుర్గం , ఉర‌వ‌కొండ‌, రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గాలు  ఉండ‌గా .. ఓ వైపు మాత్రం క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దు ప్రాంతం ఉంది. మూఢ న‌మ్మ‌కాలు, సామాజిక వెనుబాటు త‌నం, పేద‌రికం, వ‌ల‌స‌లు ఈ ప్రాంతంలో స‌ర్వ‌సాధార‌ణమే. ఎక్కువ శాతం వ్య‌వ‌సాయ భూమి వ‌ర్షాధార‌మే.ఒక‌ప్పుడు బీడు భూములుగా ఉన్న ఈ ప్రాంతంలో  ఇటీవ‌ల పండ్ల తోట‌ల సాగు బాగా విస్త‌రించింది. అధిక శాతం ప్ర‌జ‌లు వ్య‌వ‌సాయం, కంబ‌ళ్ల  త‌యారీతో  ఉపాధి పొందుతున్నారు.
క‌రువు కాట‌కాల‌తో ప్ర‌తి ఏటా  ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి క‌ర్ణాట‌క ప్రాంతానికి  వ‌ల‌స వెళ్లే వారి శాతం కూడా ఎక్కువే.  ప‌క్క‌నే ఉన్న రాయ‌దుర్గం నియోజ‌వ‌ర్గంలోని గుమ్మ‌గ‌ట్ట వ‌ద్ద ఉన్న బైర‌వానితిప్ప ప్రాజెక్టు మూడు ద‌శాబ్దాలుగా ఎండిపోవ‌డంతో  వేలాది ఎక‌రాలు బీడుగా మారింది. ఈ ప్రాంత ప్ర‌జ‌ల‌పై క‌న్న‌డ భాష,  సంప్ర‌దాయాల ప్ర‌భావం ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. నాలుగున్న‌రేళ్ల‌లో నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా ప‌లు అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేపట్టిందని నియోజకవర్గంలో మరిన్ని సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందిస్తామని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉమామహేశ్వర నాయుడు అంటున్నారు. క‌ళ్యాణ‌దుర్గంలో  రైతుల సౌక‌ర్యార్థం మార్కెట్ యార్డు నిర్మించి అన్ని వ‌స‌తులు క‌ల్పించామ‌ని, రోడ్లు, ప్ర‌భుత్వ భ‌వ‌నాల నిర్మాణంతో పాటు  సంక్షేమ ప‌థ‌కాల‌ను అర్హులంద‌రికి అందచేస్తామని అంటున్నారు.
రైతుల‌ను ఆదుకునేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నామ‌ని, డ్రిప్ స‌దుపాయాన్ని ఎక్కువ మందికి క‌ల్పించేలా చ‌ర్య‌లు చేపడతామని చెబుతున్నారు.గ‌త పాల‌న‌తో  పోలిస్తే 2014లో తెలుగుదేశం పార్టీ  నాలుగున్న‌రేళ్ల‌లో నియోజ‌క‌వ‌ర్గాన్ని చాలా వ‌ర‌కు  అభివృద్ది చేశార‌ని ఇక్క‌డి ప్ర‌జ‌లు చెబుతున్నారు.  ముఖ్యంగా ఎన్టీఆర్ గృహాలు, పింఛ‌న్లు  త‌దిత‌ర సంక్షేమ కార్య‌క్ర‌మాలు పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హిస్తున్నార‌ని ప్ర‌జ‌లు సంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.
Tags:Changing conditions in Kalyanadu