తెలుగుముచ్చట్లు రంజాన్‌ శుభాకాంక్షలు

Date:04/06/2019

పుంగనూరు ముచ్చట్లు:

రంజాన్‌ పండుగను పురస్కరించుకుని ముస్లింలకు తెలుగుముచ్చట్లు వెబ్‌సైట్‌ యాజమాన్యం , సిబ్బంది శుబాకాంక్షలు తెలిపారు. ముస్లింలు సుఖసంతోషాలతో రంజాన్‌ పండుగను కుటుంబ సభ్యులతో కలసి నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.

ఇట్లు…

తెలుగుముచ్చట్లు వెబ్‌సైట్‌ , పుంగనూరు .

9న బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం కార్యవర్గం ఎన్నిక

Tags: Congratulations to Ramzan

శ్రీ నరపుర వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

Date:23/04/2019

కడప ముచ్చట్లు:

మే 16 నుండి 24వ తేదీ వరకు

జమ్మలమడుగు శ్రీ నరపుర వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

కడప జిల్లా జమ్మలమడుగులోని శ్రీ నరపుర వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 16 నుండి 24వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. మే 15వ తేదీన అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

తేదీ                     ఉదయం                               సాయంత్రం

16-05-2019(గురువారం) ధ్వజారోహణం       పెద్దశేష వాహనం

17-05-2019(శుక్ర‌వారం)         చిన్నశేష వాహనం హంస వాహనం

18-05-2019(శ‌నివారం)         ముత్యపుపందిరి వాహనం   సింహ వాహనం

19-05-2019(ఆదివారం) కల్పవృక్ష వాహనం       హనుమంత వాహనం

20-05-2019(సోమ‌వారం) పల్లకీ ఉత్సవం            గరుడ వాహనం

21-05-2019(మంగ‌ళ‌వారం) సర్వభూపాల వాహనం               కల్యాణోత్సవం / గజ వాహనం

22-05-2019(బుధ‌వారం) రథోత్సవం    అశ్వవాహనం

23-05-2019(గురువారం) సూర్యప్రభ వాహనం     చంద్రప్రభ వాహనం

24-05-2019(శుక్ర‌వారం) చక్రస్నానం       ధ్వజావరోహణం

ఉత్సవాల్లో భాగంగా మే 21వ తేదీ సాయంత్రం 5.00 నుండి 6.00 గంట‌ల వ‌ర‌కు శ్రీవారి కళ్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం, అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు. మే 25వ తేదీన సాయంత్రం 5.00 నుండి రాత్రి 8.00 గంట‌ల వ‌ర‌కు ష్పయాగం జరుగనుంది.

ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంగీత కార్యక్రమం, హరికథాగానం, కోలాటాలు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

వైభవంగా చంద్ర‌గిరి శ్రీ కోదండరాముడి చక్రస్నానం

Tags:Anniversary Brahmotsavas of Sri Narapura Venkateswara Swamy

వైభవంగా శ్రీ కోదండరాముడి చక్రస్నానం

Date:21/04/2019
కడప ముచ్చట్లు:

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో  ఆల‌య ప్రాంగ‌ణంలో నూత‌నంగా నిర్మించిన పుష్క‌రిణిలో చక్రస్నానం (అవభృథోత్సవం) నేత్రపర్వంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు.

 

 

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా ఉదయం 4.00 గంటలకు సుప్రభాతంతో స్వామివారి మేల్కొలిపి ఆలయ శుద్ధి, ఆరాధన నిర్వహించారు. ఉదయం 9.30 గంటలకు శ్రీ లక్ష్మణ సమేత సీతారాములవారు తిరుచ్చిలో, సుదర్శన చక్రత్తాళ్వార్‌ పల్లకిలో ఊరేగింపుగా పుష్క‌రిణి వ‌ద్ద‌కు వేంచేశారు.

 

 

 

 

అనంతరం ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో సీతారామ లక్ష్మణ సరసన చక్రత్తాళ్వార్లు పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో అభిషేకాలు అందుకుని ప్రసన్నులయ్యారు. అనంత‌రం అర్చకులు వేదమంత్రోచ్ఛారణ నడుమ శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.

 

 

 

 

 

కాగా రాత్రి 7.00 గంటలకు ధ్వజావరోహణంతో శ్రీకోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో  న‌టేష్ బాబు, ఏఈవో  రామరాజు, ఇతర అధికారులు, విశేష‌ భక్తులు పాల్గొన్నారు.

పుష్పయాగం 

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో సోమ‌వారం సాయంత్రం 5.30 నుండి రాత్రి 9.00 గంటల వరకు పుష్పయాగం వైభవంగా నిర్వహిస్తారు.

కాళీయమర్దనాలంకారములో శ్రీకోదండరామస్వామి కటాక్షం

Tags:Sri Kodandaramudy Chakrasanam is the exposition

కాళీయమర్దనాలంకారములో శ్రీకోదండరామస్వామి కటాక్షం

 Date:20/04/2019
ఒంటిమిట్ట ముచ్చట్లు:

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవరోజు  కాళీయమర్దనాలంకాములో స్వామివారు భక్తులను కటాక్షించారు. ఉదయం 8.00 నుండి 10.00 గంటల వరకు స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భజన బృందాలు భజనలు, కోలాటాలు ఆడుతుండగా స్వామివారు పురవీధుల్లో విహరించారు.

 

 

 

 

వాహనసేవ అనంతరం ఉదయం 11.00 నుండి 12.00 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేశారు.  సాయంత్రం 5.00 గంటల నుండి 6.00 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది.

 

 

 

 

 

 

అశ్వ‌వాహ‌నం  :

 

శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు శ‌నివారం రాత్రి 8 నుండి 9.30 గంటల వరకు అశ్వ‌ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.

 

ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనాది రూఢుడై భక్తులకు దర్శనమిచ్చి తద్వారా తన కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండమని నామ సంకీర్తనాద్యుపాయాలను ఆశ్రయించి, తరించమని ప్రబోధిస్తున్నాడు.

 

 

 

 

 

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో న‌టేష్ బాబు, ఏఈవో  రామరాజు, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

ఏప్రిల్ 21న చక్రస్నానం

శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా  ఆదివారం  ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు చక్రస్నానం వైభవంగా జరుగనుంది. రాత్రి 7.00 గంటలకు ధ్వజావరోహణముతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయ.

ఏప్రిల్ 22న పుష్పయాగం

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో సోమ‌వారం సాయంత్రం  5.30 నుండి రాత్రి 9.00 గంటల వరకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు.

 

దేవుడి మాన్యాలపై కన్నుపడితే కటకటాలే

 

Tags:In the Kaliyammadanallamalakkaram Srikadasamasam Kavuksham

శివధనుర్భంగాలంకారంలో రాములవారి రాజసం

Date:18/04/2019
కడప  ముచ్చట్లు:
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు గురువారం ఉదయం శివధనుర్భంగాలంకారంలో రాములవారి రాజసం భక్తులకు కనువిందు చేసింది. ఉదయం 8 నుండి 10 గంటల వరకు స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.   స్వయంవరం సమయంలో శ్రీరాముడు శివుని విల్లును విరిచి సీతమ్మవారిని వివాహమాడే ఘట్టాన్ని గుర్తుచేసేది శివధనుర్భంగాలంకారం. సీతారాముల కల్యాణం రోజున ఉదయం ఈ అలంకారంలో స్వామివారు భక్తులను కటాక్షించారు.
అనంతరం ఉదయం 11 నుండి 12 గంటల వరకు ఆలయంలో స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో స్వామి, అమ్మవారికి వేడుకగా అభిషేకం చేశారు.
గజ వాహనం :
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు గురువారం రాత్రి శ్రీ సీతారాముల కల్యాణం తరువాత గజవాహనంపై శ్రీ సీతారాములు భక్తులకు అభయమిచ్చారు. సీతారాములు మాత్రమే కలిసి విహరించే ఈ వాహనానికి ఎంతో విశిష్టత ఉంది. రాజసానికి ప్రతీక మదగజం. రణరంగంలో కానీ, రాజదర్బారులలో కానీ, ఉత్సవాల్లో కానీ గజానిదే అగ్రస్థానం. అటువంటి వాహనసేవలో గజేంద్రుడు రాములవారిని వహించునట్లు భక్తులు సదా కోదండరాముని హృదయ పీఠికపై వహించి స్వామికృపకు పాత్రులుకాగలరు.
Tags:Rama’s kingdom in the form of Shiva

మోహినీ అలంకారంలో జగన్మోహనుడు

Date:17/04/2019
ఒంటిమిట్ట ముచ్చట్లు :

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు బుధ‌వారం ఉదయం మోహినీ అలంకారంలో రాములవారు జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

Jaganmohan in Mohini decoration
 

మోహినీ అవతార వృత్తాంతం భాగవతంలో రమణీయంగా వర్ణింపబడింది. దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథిస్తారు. చివరికి వారు కోరుకున్న అమృతం లభిస్తుంది. దానిని పంచుకోవడంలో కలహం ఏర్పడుతుంది. ఆ కలహాన్ని నివారించి, దేవతలకు అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహినీ రూపంతో సాక్షాత్కరిస్తాడు. తనకు భక్తులు కానివారు ఆ మాయాధీసులు కాక తప్పదనీ, తనకు ప్రసన్నులైనవారు మాయను సులభంగా దాటగలరనీ ఈ మోహినీ రూపంలో రాములవారు ప్రకటిస్తున్నాడు.

 

 

 

 

 

 

అనంతరం ఉదయం 11 నుండి 12 గంటల వరకు ఆలయంలో స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో స్వామి, అమ్మవారికి వేడుకగా అభిషేకం చేశారు. సాయంత్రం 5.00 గంటల నుండి 6.00 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది.

గరుడసేవ :

శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు బుధ‌వారం రాత్రి 8 నుండి 9.30 గంటల వరకు గరుడ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. గరుత్మంతుడు శ్రీమహావిష్ణువుకు నిత్యవాహనం. దాసుడుగా, సఖుడుగా, విసనకఱ్ఱగా, చాందినిగా, ఆసనంగా, ఆవాసంగా, వాహనంగా ధ్వజంగా అనేక విధాల సేవలందిస్తున్న నిత్యసూరులలో అగ్రగణ్యుడైన వైనతేయుడు కోదండరామస్వామిని వహించి కదిలే తీరు సందర్శనీయమైనది. 108 దివ్య దేశాలలోనూ గరుడ సేవ విశిష్టమైనది.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో  నటేష్‌బాబు, ఏఈవో రామరాజు, ఇతర అధికార ప్రముఖులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

భక్తిభావాన్ని పంచిన ధార్మిక కార్యక్రమాలు

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన బుధ‌వారం టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ధార్మిక, సంగీత కార్యక్రమాలు భక్తిభావాన్ని పంచాయి.

 

 

 

 

 

 

 

ఉదయం 7 నుంచి 8 గంటల వరకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో మంగళధ్వని, ఉదయం 10 నుంచి 11 గంటల వరకు శ్రీ స్వామి విర‌జానంద రూపుదిద్దుకున్న‌ ధ‌ర్మ‌మే రాముడు అనే అంశంపై ధార్మికోపన్యాసం చేశారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఊంజల్‌సేవలో క‌డ‌ప‌కు చెందిన ఎల్‌.వాణిశ్రీ‌  బృందం భక్తి సంకీర్తనలు ఆలపించనున్నారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు  వ‌ర‌ల‌క్ష్మీ భాగవతార్‌ హరికథ వినిపిస్తారు.

శ్రీవారి అలిపిరి టోల్ గేట్ వివరాలు

Tags:Jaganmohan in Mohini decoration

శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

 Date:13/04/2019

కడప ముచ్చట్లు :
టిటిడికి అనుబంధంగా ఉన్న ఒంటిమిట్టలోని పురాతన చారిత్రకప్రాశస్త్యం గల శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శనివారం ఉదయం ధ్వజారోహణంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు వృషభలగ్నంలో పాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా గరుడపటాన్ని ప్రతిష్టించి శాస్త్రోక్తంగా ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించారు. ధ్వజస్తంభానికి నవకలశపంచామృతాభిషేకం చేసి సకలదేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. ఆలయ ప్రధాన కంకణబట్టర్ శ్రీరాజేష్ కుమార్ భట్టార్ ఆధ్వర్యంలో ధ్వజారోహణం కార్యక్రమం జరిగింది.
తలంబ్రాల తయారీ :
శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 18న జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణం కోసం ఆలయంలో తలంబ్రాల తయారీని ప్రారంభించారు. ఇందులో భాగంగా బియ్యం, పసుపు, నెయ్యి కలిపి తలంబ్రాలు తయారు చేస్తున్నారు. తలంబ్రాలతో పాటు ముత్యం, కంకణం ఉంచి ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నారు. దాదాపు 500 మంది శ్రీవారి సేవకులు 2 లక్షల తలంబ్రాల ప్యాకెట్లను తయారు చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో  నటేష్బాబు, ఏఈవోశ్రీ రామరాజు, ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి  మునిరత్నంరెడ్డి, డెప్యూటీ ఈవో  దేవేంద్రబాబు, ఇతర అధికార ప్రముఖులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
కవి సమ్మేళనం :
 పోతన జయంతిని పురస్కరించుకుని టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సాయంత్రం 4 గంటలకు కవి సమ్మేళనం జరుగనుంది. ఈ సందర్భంగా పోతన వ్యక్తిత్వం, భాగవత విశిష్టత, పోతన భక్తిత్వం, జనప్రియ రామాయణం, రాయామణ కల్పవృక్షం తదితర అంశాలపై ప్రముఖ కవులు సమ్మేళనం నిర్వహిస్తారు.
Tags:Sri Ramanavami Brahmotsavas begin

వేగంగా కొనసాగుతున్న సిట్ దర్యాప్తు

Date:010/04/2019
కడప ముచ్చట్లు:
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నిందితులుగా భావిస్తోన్న వివేకా పీఏ కృష్ణారెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, ప్రకాశ్‌లను కోర్టు అనుమతితో ఐదు రోజుల కస్టడీకి తీసుకుని పోలీసులు విచారించారు. ఏప్రిల్ 4 నుంచి 8 వరకు పోలీసుల కస్టడీలో ఉన్న వీరు కీలక విషయాలను వెల్లడించారు. వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయి ఉండవచ్చని తొలుత చెప్పింది ఎర్ర గంగిరెడ్డేనని, అతడి ఆదేశాల ప్రకారమే లక్ష్మి, రాజశేఖర్‌‌లు బెడ్‌ రూమ్‌లో రక్తపు మరకల్ని తుడిచారని పీఏ కృష్ణారెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. పులివెందుల కోర్టుకు సమర్పించిన నివేదికలో పోలీసులు ఈ విషయాన్ని పేర్కొన్నారు. అంతేకాదు, బాత్‌రూమ్‌లో పడి ఉన్న వివేకానందరెడ్డి మృతదేహాన్ని ఇనాయతుల్లా, ట్యాంకర్‌ బాషా, రాజశేఖర్‌‌లు బెడ్ రూమ్‌లోకి తెచ్చారని కృష్ణారెడ్డి తన వాంగ్మూలంలో పేర్కొన్నట్టు పోలీసులు వివరించారు. మార్చి 15 తన నివాసంలో వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురికాగా, ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారనే అభియోగంతో గంగిరెడ్డి, ప్రకాశ్‌లతోపాటు పీఏను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పులివెందుల కోర్టు రిమాండ్‌కు ఆదేశించింది. అనంతరం కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని నిందితులను పోలీసులు విచారించారు.
కోర్టు విధించిన కస్టడీ గడువు ముగియడంతో సోమవారం నిందితులను కోర్టులో హాజరు పరిచారు. వీరికి ఏప్రిల్ 22 వరకూ న్యాయస్థానం జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. కాగా, తమను పులివెందుల న్యాయస్థానం పోలీస్ కస్టడీకి అప్పగించడాన్ని సవాల్ చేస్తూ పీఏ కృష్ణారెడ్డి, ప్రకాశ్ అనే మరో నిందితుడు హైకోర్టులో శనివారం హౌజ్‌ మోషన్‌ వ్యాజ్యం దాఖలు చేశారు. కస్టడీకి అప్పగించడమంటే తమ హక్కులకు భంగం కలిగించడమేనని పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేయడానికి నిరాకరించారు. అయితే ఇకపై చేపట్టే విచారణ వీడియో తీసి సీడీ రూపంలో దిగువ కోర్టులో దాఖలు చేయాలని సిట్ అధికారులను ఆదేశించారు. ఈ సమయంలో పోలీసుల తరఫున వాదనలు వినిపించిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ హత్య గురించి ఫిర్యాదు చేసింది పిటిషనర్లేనని, అసలు నిందితులు ఎవరనేది వారికి తెలుసనని అన్నారు. విచారణకు సహకరించకుండా మౌనంగా ఉండటం తగదని, నిజాలను వెలుగులోకి తేవాలంటే పోలీసు కస్టడీ అవసరమని స్పష్టం చేశారు. ఈ వాదలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయడానికి నిరాకరించి, దీని అనుబంధ పిటిషన్‌ కొట్టేశారు.
Tags:Sit investigating the fastest