తెలుగుముచ్చట్లు రంజాన్‌ శుభాకాంక్షలు

Date:04/06/2019

పుంగనూరు ముచ్చట్లు:

రంజాన్‌ పండుగను పురస్కరించుకుని ముస్లింలకు తెలుగుముచ్చట్లు వెబ్‌సైట్‌ యాజమాన్యం , సిబ్బంది శుబాకాంక్షలు తెలిపారు. ముస్లింలు సుఖసంతోషాలతో రంజాన్‌ పండుగను కుటుంబ సభ్యులతో కలసి నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.

ఇట్లు…

తెలుగుముచ్చట్లు వెబ్‌సైట్‌ , పుంగనూరు .

9న బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం కార్యవర్గం ఎన్నిక

Tags: Congratulations to Ramzan

దుర్గాభాయ్ దేశ్ ముఖ్ ,గోపాలకృష్ణ గోఖలే లకు ఘణ నివాళ్ళు

Date:09/05/2019
డోన్  ముచ్చట్లు:

మే 9 న స్వాతంత్ర్య సమరయోధురాలు  దుర్గా భాయ్ దేశ్ ముఖ్  వర్థంతి,
సంఘ సంస్కర్త శ్రీ గోపాలకృష్ణ గోఖలే గారి జయంతి సందర్బంగా  ఘణ నివాళ్ళు.

 

ఈరోజు స్థానిక  డోన్ లో ఫోటాన్ ఇన్యుస్టూట్ నందు సామాజిక కార్యకర్త పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో  ఇన్స్టిట్యూట్ ఇంచార్జ్ కిరణ్ అద్యక్షతన స్వాతంత్య్ర సమరయోధురాలు  దుర్గా భాయ్ దేశ్ ముఖ్   వర్థంతి మరియు సంఘ సంస్కర్త  గోపాలకృష్ణ గోఖలే గారి జయంతి సందర్బంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి  ఘణంగా నివాళులు అర్పించి,వారిని స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో లాజిస్టిక్ అసిసర్ జంషిద్ పాల్గొన్నారు .ఈ సందర్బంగా  సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ,ఇన్యుస్టూట్ ఇంచార్జి కిరణ ,మనోజ్ కూమార్ లు మాట్లాడుతూ  దుర్గాబాయి దేశ్‌ముఖ్ జూలై 15, 1909 -జన్మించారు.పేరు పొందిన స్వాతంత్య్ర సమర యోధురాలు, సంఘ సంస్కర్త మరియు రచయిత్రి. 1909వ సంవత్సరం జూలై 15వ తేదీన రాజమండ్రిలో కృష్ణవేణమ్మ, రామారావు దంపతులకు దుర్గాబాయి జన్మించారు.

 

 

 

 

 

 

 

 

ఈమె బాల్యం నుండీ ప్రతిభాపాఠవాలను కనబరుస్తూ పది సంవత్సరాల వయస్సులోనే హిందీలో పాండిత్యాన్ని సంపాదించి, హిందీ పాఠశాలను నెలకొల్పి అన్ని వయసులవారికీ విద్యాబోధన అందించేవారు.బెనారస్‌ విశ్వవిద్యాలయం నుండి మెట్రి క్యులేషన్‌, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ ,ఎల్‌. ఎల్‌.బి పూర్తిచేసింది.దుర్గాబాయి చిన్ననాటి నుండే స్వాతంత్ర పోరాటంలో పాలుపంచుకుంది. తెలుగుగడ్డ పై మహాత్మా గాంధీ రాకను పురస్కరించుకుని 12 ఏళ్ళ వయసులోనే ఈమె విరాళాలను సేకరించి ఆయనకు అందజేసింది. మహాత్ముని సూచన మేరకు మారు ఆలోచించకుండా తన చేతులకు ఉన్న బంగారు గాజులను కూడా విరాళంగా అందించింది.
స్త్రీలఅభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేసిన దుర్గాభాయి కి ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది.మరియు పద్మ విభూషణ్ ,నెహ్రూ లిటరసీ అవార్డు,
యునెస్కో నుండి పాల్ జి. హాఫ్‌మన్ అవార్డు పోందిన మహోన్నతమైన స్త్రీ మూర్తి .ఈమె మే 9 1981 న స్వర్గస్తులైనారు.

 

 

 

 

 

శ్రీ గోపాలక్రిష్ణ గోఖలే మే 9, 1866 న జన్మించారు .
భారత స్వాతంత్య్ర సమర యోధుడు. గొప్ప సామాజిక సేవకుడు.కళాశాలవిద్యనభ్యసించిన మొదటి తరం భారతీయుల్లో గోఖలే ప్రముఖుడు.ఇతను సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ ని స్థాపించాడు.ఈయన ఫిబ్రవరి19, 1915 స్వర్గస్తులైనారు.ఇలాంటి మహనీయులైన స్వాతంత్ర సమరయోధులను ఎల్లవేళల స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి కోరారు.ఈ కార్యక్రమంలో  ఇన్స్టిట్యూట్ ఉపాధ్యాయులు ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

 

పెద్ద చెరువు ప్రక్షాళనకు శ్రీకారం

Tags:Durgabhai Desh Mukh, Gopalakrishna Gokhale are the residents of the village

మనసారా నవ్వుకుందాం.. ఆరోగ్యంగా జీవిద్దాం..!

Date:05/05/2019
డోన్ ముచ్చట్లు :

 

మనసారా నవ్వుకుందాం – ఆనందంగా ఆరోగ్యంగా జీవిద్దాం
సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి.

 

ప్రతి సంవత్సరం మే నెల తొలి ఆదివారం నాడు ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని …జరుపుకుంటారు.
మే 05 న ప్రపంచ   నవ్వుల దినోత్సవం సందర్బంగా ….!

 

నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం.. ఆరోగ్యానికి నవ్వు ఒక టానిక్‌. నవ్వు వల్ల ఎండోర్ఫిన్‌ హార్మోన్స్ శరీరంలో ఉత్పత్తి అవుతాయి. ఇవి మానసిక వత్తిడిని  సైతం తగ్గించడానికి తోడ్పడుతాయి. తద్వారా శరీరంలో రోగాలను దరిచేరకుండా చూసుకోవచ్చని వైద్యనిపుణులు తెలియజేస్తున్నారని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి తెలిపారు.

 

 

 

 

 

 

 

 

ఓ చిన్న చిరునవ్వు నీ చింతలను తీర్చుతుంది. కొత్త ఆశయాలను  చిగురింపజేస్తుంది. నవ్వు నవ్వించు ఆరోగ్యంగా హాయిగా జీవించు. నవ్వు ముఖం లోని కండరాలను కదిలించి మానసిక ఒత్తిళ్ళను  తగ్గిస్తుంది.  ఒక్కోసారి ఎదుటి వ్యక్తి కోపంగా ఉన్న మీ చిరునవ్వు వాళ్ళల్లో ఉత్తేజాన్నిఇస్తుంది.మానవ సంబంధాలను అర్ధంచేసుకోవడంలో చిరునవ్వు కు మించిన ఆయుధం మరొక్కటి లేదు. చిరునవ్వు వ్యక్తిత్వానికి ప్రతిబింబం, సంస్కారానికి సజీవ చిత్రం , ఆత్మీయంగా చిరునవ్వు చిందిస్తే సౌందర్యపు వెల్లువ ఇతరుల  మనుసుల్లో ప్రవహిస్తుంది. కావున ఎల్లవేళల చిరునవ్వుతో ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సామాజిక కార్యకర్త డోన్ పి మహమ్మద్ రఫి తెలిపారు.

 

 

 

 

 

 

ఒక వ్యక్తి దైనందిన జీవితంలో ఎన్నో కష్టసుఖాలు ఎదురవుతుంటాయి. ఇవి పలురకాలుగా కూడా ఉంటాయి. ఇలాంటివి ఎన్ని ఉన్నప్పటికీ మనస్సులో దాచుకుని ఎదుటివారితో మాట్లాడేటపుడు.. పెద్దగా మాట్లాడకపోయినా సరే.. ఓ చిరునవ్వు చిందిస్తూ విష్ చేస్తే చాలు. ఆ అనుభూతి, కలయిక వేరేగా ఉంటుంది.
ఎంత సందడిగా తిరుగుతూ ఎన్ని పనులు చేసినా ముఖం మాడ్చుకుని ఉంటే చూసేవారికి ఇబ్బందిగానే ఉంటుంది. సో.. మీ చిరునవ్వు.. మీతో పాటు.. ఎదుటివారిలోను సంతోషాన్ని నింపుతుందని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి తెలిపారు.

 

 

 

 

 

 

 

నవ్వడం వల్ల హాయిగా ఉండడమే కాకుండా ఏపని అయినా చురుగ్గా చేసుకోగలుగుతాం. నవ్వు అనేది ఆరోగ్యకరమైన వ్యాయామం అని గమనించాలి. బ్లడ్ ఫ్రెషర్ ను తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. నవ్వు వల్ల స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆఫీసులో తోటి ఉద్యోగులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. మనస్పూర్తిగా నవ్వే నవ్వు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. అక్కడ ఆనందం వెల్లివిరిస్తుంది. మనుషుల మధ్య నమ్మకం  పెంపొందించ
బడుతుంది. నవ్వు వల్ల మనస్పర్థలు తొలగిపోతాయి. స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి తెలిపారు.

 

 

 

 

అందుకే నవ్వు నాలుగు విధాల మేలు. నవ్వడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారు నవ్వని వారికంటే  ఎక్కువ కాలం జీవిస్తారని కొన్ని సర్వేల ద్వార తెలుస్తుందని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి తెలిపారు.

శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ

Tags:lets-laugh-and-we-will-be-happy-and-healthy

శ్రీమఠం పీఠాధిపతుల ప్రత్యేక పూజలు

Date:15/04/2019

మంత్రాలయం ముచ్చట్లు :
క్షేత్రంలో కవీంద్ర తీర్థుల ఉత్తరారాధన
 శ్రీమఠం పీఠాధిపతుల ప్రత్యేక పూజలు
 ఆరాధన ఉత్సవాలలో పాల్గొన్న భక్తి జనవాహిని
కర్ణాటక రాష్ట్రం హంపి క్షేత్ర పరిధిలోని నవ బృందావన గడ్డ శ్రీ క్షేత్రంలో కవీంద్ర తీర్థులఆరాధన మహోత్సవకార్యక్రమాన్ని మంత్రాలయం శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుబుదేంధ్రతీర్థులు  అశేష భక్త జనవాహిని మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు. మూడు రోజులుగా జరుగుతున్న ఈ ఆరాధనోత్సవాలు సోమవారంతో అత్యంత వైభవంగా ముగిశాయి. శ్రీ క్షేత్రం బృందావన గడ్డ లోని కవీంద్ర తీర్థుల బృందావనానికి పీఠాధిపతులు ఆరాధన ఉత్సవాలలో భాగంగా నిర్మాల్యము, పంచామృతాభిషేకము, విశేష పుష్పాలంకరణ గావించి మహామంగళహారతి నిర్వహించారు.శ్రీబ్రహ్మ ఖరచిత మూలరామదేవరు, జయ, దిగ్విజయ, మూర్తులకు  క్షీరాభిషేకము, పంచామృతాభిషేకము వంటి విశేష పూజలు నిర్వహించారు. సమర్పించారు .ఈ ఆరాధన ఉత్సవాలను తిలకించడానికి శ్రీక్షేత్రం పరిధిలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బృందావనాన్ని దర్శించుకున్నారు. పీఠాధిపతులు  సుబూదేంధ్ర తీర్థులు భక్తులకు ఫల మంత్ర అక్షతలు ఇచ్చి ఆశీర్వదించారు.
Tags:Special prayers of the Srimadam Priests

ఘనంగా ముగిసిన సీతారాముల రథోత్సవం 

Date:15/04/2019

మంత్రాలయం ముచ్చట్లు :
మంత్రాలయం మండల పరిధిలోని సూగూరు గ్రామంలో  సోమవారం ఉదయం శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా యువకులు చిన్నపిల్లల ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని ఆనందంగా  వసంతోత్సవం జరుపుకున్నారు.  ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా పాత ఊరిలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో అర్చకులు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో  విశేష పూజలు నిర్వహించారు . సాయంత్రం  సీతారాముల వారి  చిత్రపటాన్ని  పల్లకిలో ఉంచి  దేవాలయం చుట్టూ ఊరేగించారు . అనంతరం   మేళతాళాలతో మంగళవాయిద్యాల మధ్య  మహిళలు కళసములతో  సీతా రాముల వారి చిత్రపటాన్ని రథోత్సవం ఉంచి పూజలుగావించి  మాడ వీధులలో  ఆనందోత్సవాల మధ్య ఊరేగింపు గావించారు. ఈ రథోత్సవానికి చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా  అనేక మంది భక్తులు హాజరయి రథోత్సవంలో పాల్గొన్నారు.
Tags:Satyagraha chariot celebration

 రెండు ప్రమాదాలు..పది మంది మృతి

Date:12/04/2019
కర్నూలు ముచ్చట్లు :
ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం ఉదయం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో పది మంది ప్రాణాలు కోల్పోగా, మరో తొమ్మిది మంది గాయపడ్డారు. అనంతరపురం జిల్లాలో మినీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. ఎమ్మిగనూరుకు చెందిన ఖాజా (40) తన కుటుంబ సభ్యులతో కర్ణాటకలో రాయచూరు జిల్లా ఏరిగేరి బడెసబ్ దర్గాకు వెళ్లారు. అక్కడ నుంచి తిరిగి వస్తుండగా వీరు ప్రయాణిస్తోన్న వాహనం ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. నందవరం మండలం అలహర్వి గ్రామం బస్టాండ్ దగ్గర ఆయిల్ ట్యాంకర్‌ను డీకొట్టడంతో ఖాజా, ఏడాది వయసున్న ఆయన కుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన సోదరుడు షఫీని చికిత్స కోసం కర్నూలు తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశాడు.
ఆగి ఉన్న వాహానాన్ని గుర్తించకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్టు నిర్ధరించారు. మృతుడు ఖాజా వాహనం నడుపుతుండగా, సోదరుడు ముందు సీట్లలో, కుమార్తె, భార్య, మరదలు వెనుక భాగంలో కూర్చున్నారు. నిద్రమత్తులో వాహనం గమనించకపోవడంతో వేగంగా వచ్చి ఢీకొట్టారు. ప్రమాదంలో మహిళలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. భర్తలను కోల్పోయిన వారి బాధ వర్ణనాతీతం. ఏడాది పాప కూడా దుర్మరణం చెందడం అందరి హృదయాలను కలచివేస్తోంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి, మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ కోసం తరలించారు. పోస్ట్‌మార్టమ్ అనంతరం మృతదేహాలను వారి బంధువులకు  అప్పగించారు.
Tags:Two accidents were killed

ఎస్వీ, బుట్టా కూని రాగాలు 

 Date:26/03/2019
అనంతపురం  ముచ్చట్లు:
ఇప్పుడు వీరిద్దరి పరిస్థితి అయోమయంగా తయారైంది. గత ఎన్నికల్లో ఓట్లు తమకు వేయమని అర్థించిన వీరు ఈసారి అనూహ్యంగా అభ్యర్థులకు ప్రచారకర్తలుగా మారారు. విధి వైచిత్రమంటే ఇదేనేమో. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున కర్నూలు పార్లమెంటు సభ్యురాలిగా పోటీ చేసిన బుట్టా రేణుక, కర్నూలు అసెంబ్లీ నుంచి వైసీపీ అభ్యర్థిగా నెగ్గిన ఎస్వీ మోహన్ రెడ్డిలు ఇప్పుడు కర్నూలు జిల్లాల్లో ఆ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు. గత ఎన్నికల్లో పోటీలో ఉన్న వీరిద్దరికీ ఇప్పుడు టిక్కెట్లు దక్కలేదు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తుండటం విశేషం.బుట్టా రేణుక. తొలిసారి అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి ఏకంగా ఎంపీ అయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో బలంగా ఉండటంతో బుట్టా రేణుక ఈజీగా గెలిచారు. తర్వాత పార్టీ అధికారంలోకి రాకపోవడంతో రేణుక భర్త టీడీపీలోకి జంప్ చేశారు. బుట్టా రేణుకు మాత్రం మూడేళ్లు వెయిట్ చేసి మరీ అధికార పార్టీలోకి వెళ్లిపోయారు. అయితే తెలుగుదేశం పార్టీ బుట్టా రేణుకకు టిక్కెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పార్టీలో చేరడంతో ఆయనకే కన్ఫర్మ్ చేసింది. దీంతో బుట్టా రేణుక కనీసం ఆదోని టిక్కెట్ ఇవ్వమని అభ్యర్థించారు. అందుకు కూడా టీడీపీ అధిష్టానం అంగీకరించకపోవడంతో తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ గూటికి చేరారు.
వైసీపీ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సంజీవ్ కుమార్ ను ఎంపిక చేసింది. సంజీవ్ కుమార్ ఆయుష్మాన్ ఆసుపత్రి అధినేతగా జిల్లా ప్రజలకు సుపరిచితులు. ఇప్పుడు సంజీవ్ కుమార్ కు మద్దతుగా బుట్టా రేణుక ప్రచారాన్ని ప్రారంభించారు. సంజీవ్ కుమార్ ను గెలిపించుకోవడమే తన లక్ష్యమని బుట్టా చెబుతున్నారు. తన పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ఆమె సంజీవ్ కుమార్ కు మద్దతుగా పర్యటిస్తున్నారు. సంజీవ్ కుమార్ కూడా తమ సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో బుట్టా రేణుక ఇప్పుడు కోట్లను ఓడించడమే టార్గెట్ గా పెట్టుకున్నారు.ఇక ఎస్వీ మోహన్ రెడ్డి సయితం నిన్నటి వరకూ కర్నూలు ఎమ్మెల్యే. ఇప్పుడు ఎక్కడా టిక్కెట్ దొరకలేదు. బుట్టా చేసిన తప్పునే ఎస్వీ మోహన్ రెడ్డి కూడా చేశారు.పార్టీ మారి వచ్చినా టీడీపీలో టిక్కెట్ దక్కకపోవడంతో ఆయన తనకు టిక్కెట్ రాకుండా చేసిన టీజీ కుటుంబంపై కసి తీర్చుకోవడానికి రెడీ అయిపోయారు. వైసీపీలో చేరిన ఎస్వీ మోహన్ రెడ్డి అక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి హఫీజ్ ఖాన్ కు మద్దతుగా ప్రచారానికి దిగారు. తన మద్దతుదారులందరినీ కలుపుకుని ఆయన కర్నూలు నగరంలో పర్యటస్తూ వైసీపీని గెలిపించాలని కోరుతున్నారు. ఐదేళ్లలో ఒక నిర్ణయం వీరిద్దరి రాజకీయ జీవితాలనే మార్చివేసిందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.
Tags: sv mohan reddy butta renuka

ఈ సారి ట‌ఫ్ ఫైట్‌గా సాగ‌నున్న ఎన్నిక‌లు

Date:19/03/2019
కర్నూలు ముచ్చట్లు:
రెండో ముంబయిగా ఖ్యాతి గడించిన అదోని నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌లు ఈ సారి ట‌ఫ్ ఫైట్‌గా సాగ‌నున్నాయి. ఇప్ప‌టికే మూడు సార్లు అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచిన మీనాక్షినాయుడు మ‌ళ్లీ టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగుతుండ‌గా..2004లో, 2014లో ఇక్క‌డ అదే మీనాక్షినాయుడిపై గెలిచిన సాయి ప్ర‌సాద్‌రెడ్డి వైసీపీ నుంచి పోటీకి సిద్ధ‌మ‌య్యాడు. ఇక కొత్త‌గా జ‌న‌సేన నుంచి మ‌ల్లికార్జునరావు కూడా బ్యాలెట్ పోరుకు కాలు దువ్వుతున్నాడు. మొత్తంగా ఇద్ద‌రు పాత కాపుల మధ్యే పోరు ప్ర‌ధానంగా కొన‌సాగుతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. జ‌న‌సేన గెలుపోట‌ముల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల స్థాయిలో ఉంటుంద‌ని చెప్పుకొస్తున్నారు.1952లో ఏర్ప‌డిన ఈ నియోజ‌క‌వ‌ర్గం మొద‌ట ద్విస‌భ్య విధానంలో కొన‌సాగ‌డం గ‌మ‌నార్హం. కాల‌క్ర‌మంలో అది ర‌ద్దు కాబ‌డింది. ఇక ఈ నియోజ‌క‌వ‌ర్గానికి 13సార్లు ఎన్నిక‌లు జ‌ర‌గ‌గా అత్య‌ధికంగా 7సార్లు కాంగ్రెస్ విజ‌యం న‌మోదు చేసింది. ఇక ఆ త‌ర్వాత 4సార్లు టీడీపీ, 2సార్లు స్వ‌తంత్రులు, ఒక‌సారి పీఎస్‌పీ విజ‌యం సాధించాయి. ఇక ప్ర‌స్తుత అభ్య‌ర్థుల విష‌యానికి వ‌స్తే 1994, 1999, 2009లో మీనాక్షినాయుడు అదోని నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా గెలిచారు. ఇప్పుడు మ‌ళ్లీ ఆయ‌న‌కే టికెట్ ఖాయ‌మైంది. ఇక గ‌తంలో కాంగ్రెస్ నుంచి 2004లో, 2014లో వైసీపీ నుంచి సాయి ప్ర‌సాద్‌రెడ్డి విజ‌యం సాధించారు. మీనాక్షినాయుడుకు పార్టీలో తిరుగులేకుండా పోయింది. దాదాపు మూడు ద‌శాబ్దాలుగా ఆయ‌న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి అన్నీ తానై న‌డిపిస్తున్నారు.
నియోజ‌క‌వ‌ర్గ టీడీపీలో మీనాక్షినాయుడు తిరుగులేని శ‌క్తిగా మార‌డంతో అస‌మ్మ‌తి తోక ముడుస్తోంది. గెలుపోట‌ముల‌తో సంబంధం లేకుండా నాయ‌కుడిగా నిత్యం ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటాడ‌ని ఆయ‌న‌పై ప్ర‌జ‌ల్లో స‌దాభిప్రాయం ఉండ‌టం ఆయ‌న‌కు క‌ల‌సి వ‌చ్చే అంశం. ఇక ఎన్నిక‌ల‌కు ఆయ‌న ఎప్ప‌టినుంచో సిద్ధ‌మ‌వుతూ వ‌స్తున్నారు. పార్టీ నుంచి టికెట్ చింత ఆయ‌న‌కు లేక‌పోవ‌డమే అందుకు కార‌ణం. ఇక వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా సాయిప్ర‌సాద్‌రెడ్డి గెలుపుపై ధీమాతో ఉన్నార‌ట‌. వైసీపీ అధికారంలో లేక‌పోవ‌డంతో కొంత నిధుల మంజూరులో ఇబ్బందులు త‌లెత్తి అనుకున్న స్థాయిలో అభివృద్ధి జ‌ర‌గ‌క‌పోవ‌డంపై ఆయ‌న‌లో కొంత ఆందోళ‌న అయితే క‌న‌బ‌డుతున్నా, వ‌చ్చేది వైసీపీ ప్ర‌భుత్వ‌మే గెలిపిస్తే మంత్రిన‌వుతా అంటూ శ్రేణుల వ‌ద్ద చెప్పుకొస్తున్నార‌ట‌.త‌న శాయ‌శ‌క్తులా నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు ప్ర‌య‌త్నించాన‌ని ప్ర‌సాద్‌రెడ్డి చెప్పుకొస్తున్నారు. ఆదోని ఒక‌ప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట‌గా వ‌ర్ధిల్లింది. ప్ర‌స్తుత‌మైతే ఆ పార్టీకి పెద్ద‌గా ఆద‌ర‌ణ క‌నిపించ‌క‌పోవడం గ‌మ‌నార్హం. ఇక ఆ పార్టీ నుంచి ఉమ్మిసాలెం పేరు విన‌బ‌డుతోంది. నియోజ‌క‌వ‌ర్గంలో 2ల‌క్ష‌ల 24వేల పైచిలుకు ఓటర్లు ఉండ‌గా ఇక్క‌డ మైనార్టీ, వాల్మీకులు ఆ త‌ర్వాత స్వ‌కుల ప‌ద్మ‌శాలి, ఆర్య‌వైశ్య సామాజికవ‌ర్గ ఓట‌ర్లు ప్రాధాన్య‌క్ర‌మంలో బ‌లంగా క‌నిపిస్తున్నారు. వీరిలో మైనార్టీ, వాల్మీకుల ఓట్లు అత్యంత కీల‌కమ‌ని చెప్పాలి. అందుకే ఇక్క‌డ అభ్య‌ర్థులు మొద‌ట వారి మ‌ద్దుతును కూడ‌గ‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.
Tags:Show everyone … on the side of Adoni