తెలుగుముచ్చట్లు రంజాన్‌ శుభాకాంక్షలు

Date:04/06/2019

పుంగనూరు ముచ్చట్లు:

రంజాన్‌ పండుగను పురస్కరించుకుని ముస్లింలకు తెలుగుముచ్చట్లు వెబ్‌సైట్‌ యాజమాన్యం , సిబ్బంది శుబాకాంక్షలు తెలిపారు. ముస్లింలు సుఖసంతోషాలతో రంజాన్‌ పండుగను కుటుంబ సభ్యులతో కలసి నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.

ఇట్లు…

తెలుగుముచ్చట్లు వెబ్‌సైట్‌ , పుంగనూరు .

9న బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం కార్యవర్గం ఎన్నిక

Tags: Congratulations to Ramzan

ఏపీ లో రహస్య పొత్తులు

Date:03/04/2019
గుంటూరు ముచ్చట్లు:
రాష్ట్రంలో ఎన్నిక‌ల వేడి పెరుగుతోంది. గెలుపుగుర్రం రేసులో ఉన్న రెండు ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీలు దూసుకుపో తున్నాయి. ఎన్నిక‌లు కీల‌కం కావ‌డంతో ఏ పార్టీకి ఆపార్టీ దూకుడు ప్రద‌ర్శిస్తోంది. గెలుపు అవ‌కాశాల‌ను ప్రభావితం చేస్తా య‌ని భావిస్తున్న ప్రతి అంశాన్ని కూడా త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ఈ విష‌యంలోఈ రెండు పార్టీల వ్యవ‌హారానికి తోడు .. మ‌రో పార్టీ జ‌న‌సేన కూడా క‌లిసి వ‌స్తోంది. ఈ పార్టీ కూడా ఎన్నిక‌ల‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామనే చెబుతోంది. ఈ మూడు పార్టీలు రాష్ట్రంలో ఒంట‌రిగా పోటీ చేస్తున్నామ‌ని అంటున్నాయి. నిజానికి గ‌త ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే.. వైసీపీ ఒక్కటే ఒంట‌రిగా పోటీ చేసింది.అదేస‌మ‌యంలో టీడీపీ మాత్రం బీజేపీ, జ‌న‌సేన‌ల‌తో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్లింది. క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఏపీలో ఏ పార్టీకి ఆ పార్టీ(ఒక్క క‌మ్యూనిస్టులు మిన‌హా..) ఒంట‌రిగానే పోటీ చేస్తున్నట్టు ప్రక‌టిస్తున్నాయి. అదేవిధంగా కామెంట్లు కూడా కుమ్మరిస్తున్నాయి. ఇక‌, టీడీపీతో జ‌న‌సేన లోపాయికారీ పొత్తు పెట్టుకుంద‌ని వైసీపీ ఆరోపిస్తోంది. అదే స‌మ‌యంలో వైసీపీ బీజేపీ, కేసీఆర్ క‌నుస‌న్నల్లో న‌డుస్తున్నార‌ని జ‌న‌సేన స‌హా చంద్రబాబు వ్యాఖ్యలు కుమ్మరిస్తున్నారు. ఇక‌, వీరి వ్యాఖ్యల ను ఎవ‌రికి వారు ఖండిస్తున్నారు.
జ‌గ‌న్‌తో పాటు నేను చంద్రబాబు ను కూడా దుమ్మెత్తి పోస్తున్నాను క‌దా? అంటున్నారు ప‌వ‌న్‌. ఇక‌, జ‌గ‌నేమో.. మీరు మీరు 2014లో పొత్తులు పెట్టుకుని, ఇప్పుడు నాపై రుద్దుతున్నారు ఎందుకు? అని ఆయన ప్రశ్నిస్తున్నారు.ఈ ర‌హ‌స్య పొత్తుల విష‌యం రాష్ట్ర వ్యాప్తంగా గంద‌ర‌గోళానికి గురి చేస్తున్న స‌మ‌యంలోనే చిత్రమైన విష‌యాలు తెర‌మీదికి వ‌చ్చాయి. గాజువాక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి నామినేష‌న్ వేసేందుకు జ‌న‌సేనాని ప‌వ‌న్ బ‌య‌ల్దేరి న‌ప్పుడు.. ఆయ‌నకు మ‌ద్దతుగా భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు క‌ద‌ల‌డం, భారీ సంఖ్యలో టీడీపీ జెండాలు ఎగ‌రడం తెలిసిందే. ఈ ప‌రిణామం.. ఈ రెండు పార్టీల మ‌ధ్య పొత్తును బ‌హిర్గతం చేసింద‌నే వాద‌న వినిపిస్తోంది., ఇక‌, ఇప్పుడు తాజాగా కర్నూలు జిల్లాలో జరిగిన బీజేపీ బహిరంగ సభకు వైసీపీ కార్యకర్తలూ వచ్చారు. కట్టుదిట్టమైన భద్రత నేపథ్యంలో అందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి పోలీసు సిబ్బంది సభలోకి అనుమతిచ్చారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన కొందరు కార్యకర్తల జేబుల్లో వైసీపీ జెండాలు కనిపించాయి. వాటిని పక్కనపెట్టి లోపలికి అనుమతించారు. మరికొందరు ఏకంగా బ్యారికేడ్లకు వైసీపీ జెండాలు తగిలించడం కొసమెరుపు. మొత్తానికి ఈ తెర‌చాటు పొత్తులు, దోస్తుల‌పై ప్రజ‌లు విస్మయం వ్యక్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.
Tags:Secret alliances in AP

కాల్పులకు గుంటూరు వాసి మృతి

Date:07/09/2018
గుంటూరు ముచ్చట్లు:
అమెరికాలో కాల్పులు మరోసారి కలకలం సృష్టించాయి. ఓ దుండగుడు  విచక్షణారహితంగా  కాల్పులు జరపడంతో నలుగురు ఆక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరణించిన వారిలో ఒకరు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పృథ్విరాజ్‌(25)గా గుర్తించారు.
ఈ ఘటన సిన్సినాటిలోని వాల్‌నట్‌ స్ట్రీట్‌లోని బ్యాంక్‌లో చోటుచేసుకుంది. మృతి చెందిన పృథ్వీరాజ్‌ బ్యాంక్‌ ఉద్యోగిగా తెలిసింది.గ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్ధరిల్లింది. ఓహియో రాష్ట్రంలోని సిన్సినాటీ నగరంలో ఉన్న ఫిఫ్త్ థర్డ్ సెంటర్ లో ప్రవేశించిన ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
ఈ ఘటనలో ఓ తెలుగు యువకుడు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీస్ అధికారులు జరిపిన ఎదురుకాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు. స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం 9 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఫౌంటైన్ స్వ్కేర్ లోని ఫిఫ్త్ థర్డ్ సెంటర్ భవనం లాబీలో జరిగిన ఈ కాల్పులు జరిపిన వ్యక్తిని ఒమర్ ఎన్రిక్ శాంటా(29)గా అధికారులు గుర్తించారు. ఇతని వద్ద 200 రౌండ్లకు సరిపడా బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పృథ్వీరాజ్ భౌతికకాయాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు అమెరికా అధికారులతో కుటుంబ సభ్యులు చర్చిస్తున్నారు. కాగా, ఒక్కగానొక్క కుమారుడు చనిపోవడంతో పృథ్వీరాజ్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
కాల్పులుకు పాల్పడిన ఒమర్‌ పెరాజ్‌ను పోలీసులు మట్టుపెట్టారు. అమెరికాలో జరిగిన కాల్పుల్లో మృతి చెందిన వారిలో గుంటూరుకు చెందిన పృథ్వీరాజ్‌ అని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.
ఇప్పటికే న్యూయార్క్‌ పోలీసులను సంప్రదించామని, పృథ్వీరాజ్‌ మృతదేహాన్ని భారత్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని అక్కడి అధికారులు తెలిపారు.
Tags: Guntur killed by gunfire

గుంటూరులో జరిగిన ఏపిబిఎస్‌ఎస్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు.

Date:22/07/2018

 

గుంటూరులో జరిగిన ఏపిబిఎస్‌ఎస్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు.https://www.telugumuchatlu.com/brahmin-social-representatives-participated-at-the-state-executive-meeting-of-the-apbssss-at-guntur/

Tags; Brahmin Social representatives participated at the state executive meeting of the APBSSSS at Guntur.