మధ్యంషాపుల అద్దె భవనాలకు టెండర్లు ఆహ్వానం

Date:18/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వం నిర్వహించే మధ్యంషాపులకు అద్దె భవనాలను సేకరించేందుకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు ఎక్సెజ్‌ సీఐ శ్రీనివాసులురెడ్డి ఆదివారం విలేకరులకు తెలిపారు. ప్రభుత్వాదేశాల మేరకు పుంగనూరు, రామసముద్రం, పెద్దపంజాణి , చౌడేపల్లె, సోమల, సదుం మండలాల్లో గల మధ్యం దుకాణాలను బాడుగులకు తీసుకునేందుకు టెండర్లను కోరుతున్నట్లు తెలిపారు. భవన యజమానులు ఈనెల 21 సాయంత్రం 4 గంటలలోపు టెండర్లను పుంగనూరు ఎక్సెజ్‌ కార్యాలయం బాక్సులో వేయాలన్నారు. వివరాలకు స్టేషన్‌లో సంప్రదించాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు షాపుల సంఖ్య, వివరాలను నిర్ణయించడం జరుగుతుందన్నారు.

ప్రతి నీటిబొట్టును వృధా చేయరాదు

Tags: Invitation of tenders to mid-sized rental buildings

ప్రతి నీటిబొట్టును వృధా చేయరాదు

– కమిషనర్‌ వర్మ

Date:18/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలో ప్రతి వర్షపు నీటిని వృధా కానీవ్వకుండ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి, భూగర్భజలాలను పెంపొందించుకోవాలని కమిషనర్‌ కెఎల్‌.వర్మ కోరారు. ఆదివారం ఆయన మున్సిపాలిటి, పట్టణంలోని పలు ప్రాంతాలలో పర్యటించారు. ఇంటి యజమానులకు ఇంకుడు గుంతలు ఏర్పాటుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్తా సూచనల మేరకు మున్సిపాలిటిలో ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేసే సమయంలో ఇంకుడు గుంతల ఏర్పాటును ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. వర్షపునీటిని వృధాకానీవ్వకుండ ఎక్కడ నీరు అక్కడే ఇంకిపోయేలా చర్యలు చేపట్టామన్నారు. ముఖ్యంగా మంచినీటి బోర్లు ఉన్న ప్రాంతాల్లో గల నీటిని బోర్ల వద్దకు తరలించి, అక్కడ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే పట్టణంలోని గృహ యజమానులందరు తప్పకుండ ఇంటి వద్ద ఒకొక్క మొక్కను నాటుకోవాలని నిబంధన పెట్టామన్నారు. అలాగే నాటిన ప్రతి మొక్కకు వారి కుటుంబ సభ్యుల పేర్లు ఏర్పాటు చేసుకునేలా చేసుకోవాలన్నారు. కుటుంబ సభ్యులను సంరక్షించుకునే రీతీలో మొక్కలను కూడ పెంచుకోవాలని ఆయన ప్రజలను కోరారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా పర్యావరణ కాలుష్యాని నివారించేందుకు వీలుంటుందన్నారు. ఇప్పటికే పట్టణంలో 70 శాతం వెహోక్కలు నాటి సంరక్షించడం జరుగుతోందన్నారు. మిగిలిన ప్రాంతాల్లో కూడ మొక్కలు నాటే కార్యక్రమాన్ని త్వరితగ తిన పూర్తి చేసి గ్రీనరీ అవార్డును సాధించుకునేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సఫ్ధర్‌, కార్మికులు పాల్గొన్నారు.

19న స్పందన

Tags: Not every waterproof should be wasted

19న స్పందన

Date:18/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మున్సిపాలిటిలో స్పందన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. గత వారం రద్దుకాబడిన స్పందన కొనసాగుతుందని తెలిపారు. అలాగే ఎంపీడీవో లక్ష్మిపతినాయుడు ఎంపీడీవో కార్యాలయంలో స్పందన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తమ సమస్యలను వినతిపత్రం రూపంలో తీసుకొచ్చి , రశీదులు పొందాలని కోరారు.

పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం

Tags: Response on the 19th

పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం

Date:18/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకే కార్పోరేట్‌ డాక్టర్లచే వైద్యసేవలు చేపట్టినట్లు కౌసర్‌ నర్శింగ్‌హ్గమ్‌ అధినేత డాక్టర్‌ సబిహాకౌసర్‌ తెలిపారు. ఆదివారం కౌసర్‌ ఆసుపత్రిలో బెంగళూరుకు చెందిన షిఫా హాస్పిటల్‌ వారి చే సంయుక్తంగా మెగా వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక వైద్యబృందంచే అన్ని రకాల జబ్బులకు చికిత్సలు చేశారు. అధిక సంఖ్యలో హాజరైన రోగులకు చికిత్సలు చేసి, మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు చికిత్సలు చేసి, వైద్యసేవలు అందించేందుకు అందరి సహకారంతో శిబిరాలు ఏర్పాటి చేశామన్నారు. ఈ ప్రాంత ప్రజల్లో ఉన్న జబ్బులను గుర్తించి, ప్రత్యేక వైద్యులచే చికిత్సలు చేసి, అవసరమైన వారికి ఉచిత ఆపరేషన్లు నిర్వహించి, మందులు పంపిణీ చేస్తామన్నారు. ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంజుమన్‌ కమిటి కార్యదర్శి అమ్ము, ముస్లిం నేతలు బిటి అతావుల్లా, అర్షద్‌అలి, రషీద తదితరులు పాల్గొన్నారు .

బజారువీధికి మునస్వామిశెట్టివీధిగా మార్పు

Tags: The aim is to provide better healing to the poor

బజారువీధికి మునస్వామిశెట్టివీధిగా మార్పు

Date:18/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

ఆర్యవైశ్య శిరోమణి అవార్డు గ్రహీత దివంగత ఎస్‌పి.మునస్వామిశెట్టి పేరుతో బజారువీధిని మార్పు చేస్తున్నట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆదివారం విలేకరులకు తెలిపారు. రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు మునస్వామిశెట్టి పేరుతో బజారువీధిని మార్పు చేస్తూ చైర్‌పర్శన్‌ షమీమ్‌షరీఫ్‌తో కలసి పాలకవర్గం ఆమోదించిన మేరకు ఉత్తర్వులను ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం, గౌరవ అధ్యక్షుడు ముల్లంగి విజయకుమార్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘ నాయకులు ముల్లంగి విజయకుమార్‌ మాట్లాడుతూ పట్టణాభివృద్ధికి ఎనలేని సేవలు అందించిన మునస్వామిశెట్టి పేరును బజారువీధికి పెట్టడం ఆమోదయోగ్యమన్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నవీన్‌కుమార్‌, పి.శ్రీధర్‌, మోహన్‌, ప్రవీన్‌కుమార్‌, రాజేందప్రసాద్‌, ఇట్టాబానుప్రకాష్‌, దొంతివెంకటేష్‌ , బాను, మురళి, రవికుమార్‌, నాగరాజ, రవీంద్రనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ అత్తి వరదరాజ స్వామి దర్శన భాగ్యం

Tags: The transformation of the bazaarvidhi into a munaswamishettidi

జనగణమన శత వేడుకలు

– పుంగనూరులో భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు
-మరో చరిత్రకు కమిటి సన్నహాలు

Date:17/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

నిత్య జాతీయ గీతాలాపనతో దేశంలోనే తొలిసారిగా ఘన చరిత్ర నమోదు చేసుకున్న పుంగనూరు పట్టణం మరో చరిత్రకు శ్రీకారం చుట్టింది. మనం ఆలపించే జాతీయ గీతం జనగణమన ఇం•ష్‌ అనువాదానికి వందేళ్లు పూరైయిన సందర్భంగా శత వేడుకలు భారీగా నిర్వహించేందుకు జనగణమన కమిటి సన్నహాలు ప్రారంభించింది. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ మదనపల్లెలో 1919 ఫిబ్రవరి 28న జనగణమన గీతాన్ని ఇం•ష్‌లో అనువధించారు. వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పట్టణ జనగణమన కమిటి సభ్యులు పి.ఎన్‌.ఎస్‌.ప్రకాష్‌, పి.అయూబ్‌ఖాన్‌, వి.దీపక్‌, ఎన్‌.ముత్యాలు, సివి.శ్యామ్‌ప్రసాద్‌ కలసి శత జయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఈనెలాఖరులోపు ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టామన్నారు. ఈ శతజయంతి వేడుకలకు పట్టణ ప్రముఖులను, ప్రజాప్రతినిధులు భాగస్వామ్యులు చేసి , దేశభక్తిని పెంపొందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

లక్ష్యం ఘనం… వ్యవసాయ రుణాలు భారం

Tags: Centennial celebrations

వెంకటేశ్వరుని అవతారంలో శనేశ్వరస్వామి

Date:17/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

శ్రావణ మాస పూజలు సందర్భంగా శనేశ్వరస్వామిని శ్రీ కలియుగ వెంకటేశ్వరస్వామి అవతారంలో అలంకరించి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణ సమీపంలోని యాబై రాళ్ల వెహోరవలో గల శనేశ్వరస్వామిని అలంకరించి పూజలు నిర్వహించారు. అలాగే శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రావణ శనివార పూజలు ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హ్గమాలు నిర్వహించి, అభిషేకాలు చేసి, స్వామివార్లను ప్రత్యేక పూలతో అలంకరించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భక్తులతో ఆలయాల్లో రద్ది ఏర్పడింది. మహిళలు వేకువజాము నుంచి ఉపవాస దీక్షలతో పూజలు నిర్వహించి, వెహోక్కులు చెల్లించుకున్నారు. శ్రావణమాసంలో ప్రతి ఒక్కరు మాంసాహారాలను పూర్తిగా మానివేసి ప్రతిరోజు ఆలయాలను దర్శించుకోవడం ఆనవాయితీ.

ప్లాస్టిక్‌ వస్తువులు విక్రయిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం

Tags: Saneeswaraswamy in the incarnation of Venkateswara

ప్లాస్టిక్‌ వస్తువులు విక్రయిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం

– కమిషనర్‌ వర్మ హెచ్చరిక

Date:17/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

ప్రజల ఆరోగ్యానికి , పర్యావరణానికి భంగం కలిగించి ప్లాస్టిక్‌ వస్తువులను విక్రయించినా, వినియోగించినా వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ హెచ్చరించారు. శనివారం పట్టణంలో పండ్ల , పూల వ్యాపారులు , హ్గటళ్లలో ఆయన దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా హ్గటళ్లలో ఇడ్లీలు తయారు చేసేందుకు ప్లాస్టిక్‌ కవర్లను వినియోగిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పూల వ్యాపారులు ఎక్కువుగా కవర్లు వినియోగిస్తున్నారని ఫిర్యాదులు అందుతోందన్నారు. ఈ విషయంపై ఇప్పటికే పట్టణంలోని అన్ని వర్గాల వారికి ముందుగా సమాచారం అందించడం జరిగిందన్నారు. కానీ కొంత మంది వ్యాపారులు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. జిల్లా కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్తా ఆదేశాల మేరక వి చిత్తూరు జిల్లాను ప్లాస్టిక్‌ రహిత జిల్లాగా ప్రకటించారని తెలిపారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. లేకపోతే విక్రయదారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. అలాగే దుకాణాలకు, హ్గటళ్లకు లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు పట్టణంలో పలు షాపులకు జరిమానాలు విధించారు. ఈ దాడుల్లో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సురేంద్రబాబు, సఫ్ధర్‌ , మున్సిపల్‌ కార్మికులు పాల్గొన్నారు.

దళిత మైనర్‌ బాలికపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

Tags: If we sell plastic goods, we will file criminal cases