30 ఏళ్లుగా పీలేరు కోసం టీడీపీ ఎదురు చూపులు

Date:27/04/2018
తిరుపతి ముచ్చట్లు:
చంద్ర‌బాబు సొంత జిల్లా.. చిత్తూరులో పార్టీ ప‌రిస్థితి ఏంటి? టీడీపీ హ‌వా ఎలా న‌డుస్తోంది ? వ‌ంటి అనేక విష‌యాలను చ‌ర్చించిన‌ప్పుడు ఆస‌క్తిక‌ర అంశం వెలుగు చూస్తుంది. ఇక్క‌డ‌, పార్టీల బ‌లాలు క‌న్నా.. వ్య‌క్తుల‌కే ప్ర‌జ‌లు ప‌ట్టం క‌డుతున్నారు. శ్రీకాళ‌హ‌స్తి నుంచి కుప్పం వ‌ర‌కు కూడా వ్య‌క్తుల హ‌వానే ప‌నిచేస్తోంది. దీంతో ఇక్క‌డ టీడీపీ ఆశించిన రీతిలో సీట్ల‌ను కైవసం చేసుకోలేక పోతోంది. జిల్లాలో మొత్తం 14 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. వీటిలో కుప్పం, శ్రీకాళహ‌స్తి, తంబ‌ళ్ల‌ప‌ల్లి, చిత్తూరు, తిరుప‌తి వంటి మొత్తం 6 చోట్ల నుంచి మాత్ర‌మే టీడీపీ విజ‌యం సాధించింది. ఇంకా చెప్పాలంటే 2004, 2009 ఎన్నిక‌ల్లోనూ ఇక్క‌డ అప్పుడు కాంగ్రెస్ దూకుడు ముందు టీడీపీ తేలిపోయింది.30 ఏళ్లుగా పీలేరులో పట్టు కోసం టీడీపీ నానా తంటాలు పడుతో్ంది న‌గ‌రిలో కాక‌లు తీరిన రాజ‌కీయ నేత, ఇటీవ‌ల మృతి చెందిన గాలి ముద్దుకృష్ణ‌మ నాయుడిపై వైసీపీ అభ్య‌ర్థి రోజా విజ‌య దుందుభి మోగించారు. ఇక‌, జిల్లాలోని పీలేరు నియోజ‌క‌వ‌ర్గంలో 30 సంవ‌త్స‌రాలుగా టీడీపీ జెండా ఎగ‌ర‌డం లేదంటే ఆశ్చ‌ర్యం అనిపిం చకపోదు. ఇక్క‌డ కాంగ్రెస్ అభ్య‌ర్థిగా 2009లో మాజీ సీఎం న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి విజ‌యం సాధించారు. అప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ఎమ్మెల్యేగా ఉన్న వాయ‌ల్పాడు ర‌ద్దు కావ‌డంతో కిర‌ణ్ ఈ నియోజ‌క‌వ‌ర్గానికి మారారు. అప్ప‌టి వ‌ర‌కు ఇక్క‌డ వ‌రుస‌గా గెలుస్తోన్న పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి పుంగ‌నూరుకు మారారు. టీడీపీ విజ‌యం ఇప్ప‌టికీ సాధ్యం కావ‌డం లేదు. అంతేకాదు, పీలేరు నియోజ‌క‌వ‌ర్గాన్ని దాదాపు వ‌దిలేసుకున్న ఖాతాలోనే టీడీపీ వేసుకోవ‌డం గ‌మ‌నార్హం. గ‌త ఎన్నిక‌ల్లోనూ ఇక్క‌డ నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్య‌ర్థి చింత‌ల రామ‌చంద్రారెడ్డి ఘ‌న విజ‌యం సాధించారు. దీంతో ఇక్క‌డ టీడీపీ గెలుపు గుర్రం ఎక్క‌డ అంత వీజీకాద‌నే విష‌యం నిశ్చ‌యం అయిపోయింది. అయితే, టీడీపీ అధినేత చంద్ర‌బాబు మాత్రం ఇక్క‌డ ఎలాగైనా వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ జెండా ఎగ‌రేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే పీలేరు నియోజ‌క‌వ‌ర్గంలో బ‌లంగా ఉన్న మాజీ సీఎం న‌ల్లారి కిర‌ణ్ సోద‌రుడు న‌ల్లారి కిశోర్ కుమార్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకున్నారు.పార్టీని బ‌లోపేతం చేసుకోవ‌డంతోపాటు.. పార్టీని గెలిపించుకోవాల‌ని కూడా బాబు ఆశ‌లు పెట్టుకున్నారు. కిశోర్‌కు మ‌రో కీల‌క ప‌ద‌వికి ప్ర‌మోష‌న్ కూడా ఇస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో ఆయ‌న ఈ రెండు వ‌ర్గాల‌ను ఒకే తాటిపైకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అదేవిధంగా పార్టీకి దూరంగా వెళ్లిపోయిన వారిని కూడా ద‌గ్గ‌ర‌కు చేసేందుకు ఇప్ప‌టికే కార్యాచ‌ర‌ణ ప్రారంభించారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి టీడీపీ బ‌లోపేతం అవుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే, ఇక్క‌డ టీడీపీ అభ్య‌ర్థి గెలుపు ఓట‌ములు మాత్రం ఇప్ప‌టికిప్పుడు నిర్ణ‌యించ‌లేమ‌ని కూడా వారు పేర్కొంటుండ‌డం గ‌మ‌నార్హం. అయితే ఇక్క‌డ న‌ల్లారి ఫ్యామిలీకి వ్య‌క్తిగ‌తంగా ఉన్న ఓటు బ్యాంకుకు టీడీపీ ఓటు బ్యాంకును స‌మ‌న్వ‌యం చేస్తే ఇక్క‌డ మూడు ద‌శాబ్దాల త‌ర్వాత ప‌సుపు జెండా ఎగిరే ఛాన్సులు ఉన్నాయి.ఇటీవ‌ల ఆయ‌న‌కు నామినేటెడ్ ప‌ద‌విని కూడా క‌ట్ట‌బెట్టారు. నిజానికి ఈ నియోజ కవ‌ర్గంలో టీడీపీకి నాయ‌క‌త్వ కొర‌త వెంటాడుతోంది. అంతేకాదు, పార్టీలో నేత‌లు ఇక్క‌డ రెండు వ‌ర్గాలుగా ఏర్ప‌డి పార్టీని బ‌లోపేతం కాకుండా చేశార‌నే వాద‌నా ఉంది. ఇక్క‌డ పార్టీని బ‌లోపేతం చేయ‌డం కోసం చంద్ర‌బాబు న‌ల్లారి కిశోర్‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు.
Tags:TDP’s wait for Pierre for 30 years

చిత్తూరులో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేసిన జేసీ గిరీశా..

Date:26/04/2018

JC Giri, who released the MLM election notification in Chittoor
JC Giri, who released the MLM election notification in Chittoor

Tags:JC Giri, who released the MLM election notification in Chittoor

తిరుమలలో మాజీ ముఖ్యమంత్రి షిండే

Date;26/04/2018

తిరుమల ముచ్చట్లు :

రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ త్వరలో దేశాని పరిపాలిస్తుందని మాజీ కేంద్రమంత్రి సుశీల్ కుమార్ షిండ్ ఆశాభావం వ్యక్తం చేసారు…శ్రీవారి దర్శనార్థం కుటుంబంతో కలసి తిరుమలకు వచ్చిన ఆయన, ఉదయం ఆలయంలోకి వెళ్లి సుప్రభాతం, తోమాల, అర్చన సేవల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు..అనంతరం హుండీలో ‌కానుకలు సమర్పించి మ్రొక్కులు చెల్లించిన షిండేకు ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసారు..‌…కర్ణాటక ఆసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయం సాధిస్తుందని షిండే మీడియా ముందు ధీమా వ్యక్తం చేసారు..‌.నాడు యూపిఏ హాయంలో ఆంధ్రప్రదేశ్ ను విభజించినప్పుడు ఏపికి స్పెషల్ కేటాగిరీ స్టేటస్ ఇవ్వాలని చట్టం చేయడం జరిగిందని, అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న ఏన్డీయే పార్లమెంటు చట్టాలను కూడా చేయకుండా పరిపాలన చేస్తుండడం గమనార్హమన్నారు…హోదా కోసం ముఖ్యమంత్రి స్థాయి నుండి అన్ని రాజకీయ పార్టీలు పోరాడుతుండడాని షిండే అభినందించారు.

Tags:Former chief minister Shinde in Tirumala

 

పిలేరులో లారీ భీభత్సం

Date:26/04/2018
చిత్తూరు ముచ్చట్లు:
చిత్తూరు జిల్లా పిలేరు మండలం తానా వడ్డిపల్లి వద్ద గురువారం ఒక లారీ భీభత్సం సృష్టించింది. అదుపు తప్పి జనం పైకి దూసుకుపోయింది. గ్రామంలో జరుగుతున్న  జాతర కోసం వచ్చిన వారు రోడ్డు పై నిలుచుకొని ఉండగా ఈ ప్రమాదం జరిగింది.  ఒక ఇన్నోవా కారు తో పాటు అక్కడ నిలబడిన జనం పైకి సిమెంట్ లారీ. దూసుకొచ్చింది. కడప నుంచి పీలేరుకు సిమెంట్ లోడుతో వస్తున్న లారీ అతివేగంగా అదుపు తప్పడంతో  ప్రమాదం జరిగింది.  ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురికి తీవ్రగాయాలు. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. మృతులు నిమ్మనపల్లి మండలం కొండసానివారిపల్లి కి చెందినవారుగా గుర్తించారు. లారీ డ్రైవర్ పరారీలో వున్నాడు .
Tags:Larry terror in Pilley

సెల్ ఫోన్ కోసం….. ప్రాణాలను వదిలిన ఇంజనీరింగ్ విద్యార్థిని

Date:25/04/2018

పుంగనూరు ముచ్చట్లు;

సెల్ చాటింగ్ వద్దన్నందుకు …..ప్రాణాలు తీసుకున్న ఇంజనీరింగ్ విద్యార్థి ఉదంతం పట్టణ ప్రజలను కలిచివేసింది … బాలిక గూర్చి వివరాలు ఇలా వున్నాయి .పుంగనూరు పట్టణం బజారు వీధిలో నివాసంవున్న శివలింగయ్య కుమార్తె భవాని మదనపల్లి మిట్స్ కళాశాలలో మూడవ సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతుంది. ఇదిలా ఉండగా రాత్రి భవాని సెల్ల్ఫోన్ చాటింగ్ చేస్తుండగా తల్లి మందలించింది .నిద్రపోకుండా సెల్ ఫోన్ చాటింగ్ చేయవద్దని సూచించింది .దీనిపై మనస్థాపానికి గురైన భవాని పుంగనూరు సమీపంలోని సుబ్బమ్మ చెరువులో పడి ఆత్మహత్య చేసుకుంది .ఉదయం గ్రామస్థులు శవాన్ని కనుగొని పోలీసులకు ఫిర్యాదు చేసారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం కి తరలించారు .ఈ సంఘటనతో పుంగనూరులో విషాద ఛాయలు అలముకున్నాయి .

For a cell phone ..... engineering student
For a cell phone ….. engineering student

Tags:For a cell phone ….. engineering student who left lives

 అన్నమయ్య కోసం పోస్టు క్రియేట్ చేశారు

Date:25/04/2018
తిరుమల  ముచ్చట్లు:
రెండు వారాల కిందట దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గడ్డం తీశారు. శ్రీనివాసుడికి సమర్పించుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలని మొక్కుకున్నట్లు రాఘవేంద్రరావు చెప్పారు. అసలు సంగతి వేరే ఉందనే ప్రచారం వచ్చింది. టీటీడీ ఛైర్మన్ పదవి ఆయన దక్కనుందనే కథనాలు వచ్చాయి.ఎస్వీబీసీకి చైర్మన్‌ పోస్టు లేదు. కానీ ఆయన కోసమే క్రియేట్ చేశారు చంద్రబాబు. కొత్త నిర్ణయాలు తీసుకోవడం, కార్యక్రమాల రూపకల్పన, పర్వదినాల్లో విశిష్ట కార్యక్రమాలు ప్రసారం చేయడం వంటి పనులను ఇప్పుడు చేయనున్నారు రాఘవేంద్రరావు. ‘అన్నమయ్య పాటకు పట్టాభిషేకం’ జరిగింది. అమెరికా వంటి దేశాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. అన్నమయ్య రచించిన వేల సంకీర్తనల్లో కొన్నే ప్రాచుర్యంలోకి వచ్చాయి. మరికొన్ని పాటలను వెలుగులోకి తీసుకురానున్నారు. అభిషేకం, తోమాల, అర్చన, సుప్రభాతం, సహస్రకళాశాభిషేకం, అష్టదళ పాద పద్మారాధన వంటి సేవలను దగ్గరుంచి చూసే భాగ్యం అందరికీ అందేలా చేయనుంది టీటీడీ. అందుకే అలాంటి సమయంలో తాను అక్కడకు వెళ్లడం తన పూర్వ జన్మ సుకృతం అంటున్నారు రాఘవేంద్రరావు. ఆర్జిత సేవలను నమూనా ఆలయాల్లో చిత్రీకరించి ప్రసారం చేయడం ద్వారా అనేక రకాలుగా ప్రశంసులు దక్కనున్నాయి. పదవి కోసం ఎదురు చూడకుండా పని చేసుకుంటూ పోతే కచ్చితంగా పాలకులు గుర్తిస్తారు. అదే ఇప్పుడు రాఘవేంద్రరావుకు వరమైంది.  తీరా ఆయనకు బదులు సుధాకర్ యాదవ్ కు ఇచ్చారు. అయినా సరే రాఘవేంద్రరావు తాను అనుకుంది సాధిస్తేనే సాధారణంగా గడ్డం తీస్తారు. అలా తీశారంటే బలమైన కారణం ఉంటుందని అంతా అనుకున్నారు. చివరకు అదే నిజమైంది. రాఘవేంద్రరావు కోసం ప్రత్యేకంగా ఒక పోస్ట్ ను క్రియేట్ చేశారు. అదే టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ఎస్వీబీసీ చైర్మన్‌ పదవి. అంతే ఇక చానల్ అనేక రకాలుగా పురోగతి చెందడం ఖాయమంటున్నారు. డబ్బులకు లోటు లేదు. అదే సమయంలో ఉద్యోగుల సమస్యలను ఆయన పరిష్కరిస్తారనే ప్రచారం సాగుతోంది. కాయలు, పండ్లతో రాఘవేంద్రరావుకు ఉన్న అనుబందం వేరు. తన పాటల్లో ఆయన చూపించినట్లు మరో దర్శకుడు చూపించలేరు. తెలుగు సినిమాల్లో అద్భుతాలు సృష్టించారు దర్శకేంద్రుడు. ఆధ్యాత్మికత ఉప్పొంగేలా భక్తి సినిమాలనూ రూపొందించారు. అందుకే ఆయన సేవలకు మెచ్చి సిఎం చంద్రబాబు నాయుడు బరువైన కిరీటం బహుకరించారు. భక్తికి బహుళ ప్రజాదరణ కల్పించిన దర్శకేంద్రుడి ప్రతిభకు తాజా గుర్తింపు లభించింది. కొత్త బాధ్యతలతో శ్రీవేంకటేశ్వరుని వైభవాన్ని ప్రపంచం నలుచెరగులా చాటుతానంటున్నారు. అన్నమయ్య సినిమా తీసిన తర్వాత రాఘవేంద్రరావు ఖ్యాతి ఆద్యాత్మికత వైపు మళ్లింది. గతంలో టీటీడీ ధర్మకర్తల మండలిలో సభ్యుడిగా సేవలందించిన ఆయన ఇప్పుడు ఒక ప్రధాన పదవిని నిర్వరించనున్నారు. ఎస్వీబీసీ  చైర్మన్‌గా సేవచేసే అవకాశం కల్పించడం మాములు విషయం కాదు.
Tags:Post created for Annamayya

తిప్పిరెడ్డిపల్లి గ్రామంలో పిడుగుపడి 50 మేకలు మృతి

Date:24/04/2018

పెద్దపంజాణి ముచ్చట్లు:

గాలివాన భీభత్సం కారణంగా పెద్దపంజాణి మండలం తిప్పిరెడ్డిపల్లి గ్రామంలో పిడుగు పడి ఓ రైతు వీధినపడటంతో పాటు సుమారు రూ. 7 లక్షలు నష్టం వాటిల్లింది.

Tags:50 goats killed in Thippiradipally village

పుంగనూరు మండలం గుడిసెబండలో చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీడీవో లక్ష్మిపతినాయుడు, ఎంపీటీసీ యశ్వంత్‌ , ఏఈ జగదీష్‌.

Date:24/04/2018

Tags: Emperor Lakshmipatanayudu, MPTT Yashwant and AJ Jagdish, who started the cooling in the Punganur Mandal hut.