తెలుగుముచ్చట్లు రంజాన్‌ శుభాకాంక్షలు

Date:04/06/2019

పుంగనూరు ముచ్చట్లు:

రంజాన్‌ పండుగను పురస్కరించుకుని ముస్లింలకు తెలుగుముచ్చట్లు వెబ్‌సైట్‌ యాజమాన్యం , సిబ్బంది శుబాకాంక్షలు తెలిపారు. ముస్లింలు సుఖసంతోషాలతో రంజాన్‌ పండుగను కుటుంబ సభ్యులతో కలసి నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.

ఇట్లు…

తెలుగుముచ్చట్లు వెబ్‌సైట్‌ , పుంగనూరు .

9న బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం కార్యవర్గం ఎన్నిక

Tags: Congratulations to Ramzan

ఈ సారైనా ప్రసన్నకు కలిసొస్తుందా……?

Date:19/03/2019
నెల్లూరు ముచ్చట్లు:
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ నెల్లూరు జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ఆధిక్యత చూపినా కోవూరులో మాత్రం ఆ పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఓటమిపాలయ్యారు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరి టిక్కెట్ తెచ్చుకున్న పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈసారి వైసీపీ నుంచి మళ్లీ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి బరిలో ఉండనుండగా తెలుగుదేశం పార్టీ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే పోలంరెడ్డికే టిక్కెట్ ఖాయం చేసింది. దీంతో మళ్లీ పాత ప్రత్యర్థులే తలపడనున్నారు. ఇద్దరూ బలమైన నేతలుగా ఉండటంతో కోవూరు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.నెల్లూరు జిల్లాలో తిరుగులేని నేతగా ఎదిగిన నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి రాజకీయ వారసునిడి తెలుగుదేశం పార్టీతో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు ప్రసన్నకుమార్ రెడ్డి. కోవూరులో ఉపఎన్నికలతో కలిపి ఏడుసార్లు పోటీ చేసి ఐదు సార్లు విజయం సాధించారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో కొంతకాలం మంత్రిగా కూడా పనిచేశారు. 2012లో టీడీపీని వీడి వైసీపీలో చేరిన ఆయన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీ విజయం సాధించారు. కానీ రెండేళ్లకే వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో ఈసారి కచ్చితంగా విజయం సాధించాలని ఆయన పట్టుదలతో ఉన్నారు.
తండ్రికి ఉన్న పేరు, ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి నియోయోజకవర్గంలో తనదైన ముద్ర వేయడం, ప్రజల్లో ఉంటారనే పేరుండటం ఆయన ప్లస్ పాయింట్స్ కానున్నాయి. ఇక, నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటంతో తన విజయం ఖాయమని ఆయన ధీమాగా ఉన్నారు.తెలుగుదేశం పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పోలంరెడ్డికి టిక్కెట్ ఖారారు చేశారు. చంద్రబాబు ఇక్కడ అనేక ఏళ్లుగా టీడీపీలోనే ఉంటూ ఈసారి టిక్కెట్ ఆశించిన పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డికి భంగపాటు ఎదురయ్యింది. దీంతో ఆయన తెలుగుదేశం పార్టీని వీడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ పరిణామం టీడీపీకి కొంత ఇబ్బందికరంగా మారనుంది. ఈ ఐదేళ్లు నియోజకవర్గంలో కొంత అభివృద్ధి చేయగలగడం, తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు పోలంరెడ్డికి అనుకూలంగా మారనున్నాయి. అయితే, గత ఎన్నికల్లో ఓడిపోయారని సానుభూతి ప్రసన్నకుమార్ రెడ్డిపై ఎక్కువగానే కనపడుతోంది. దీంతో పోలంరెడ్డికి ఈసారి గెలుపు అంత సులువు కాదనే విశ్లేషణలు ఉన్నాయి.
Tags:Will this be a part of it?

పదోతరగతి విద్యార్థులు అర్ధాకలితో అల్లాడుతున్నారు

Date:06/02/2019
నెల్లూరు ముచ్చట్లు :
 పదోతరగతి విద్యార్థులు అర్ధాకలితో అల్లాడుతున్నారు. పబ్లిక్ పరీక్షలు దగ్గర పడుతుండటంతో జిల్లావ్యాప్తంగా పాఠశాలల్లో  ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం బడికి బయల్దేరే పిల్లలు స్కూలులో మధ్యాహ్నం భోజనం మాత్రమే చేస్తున్నారు. సాయంత్రం వదలగానే అర్ధాకలితో ప్రత్యేక తరగతుల్లో కూర్చుంటున్నారు.మళ్లీ ఇంటికి వెళితేనే ఏదైనా తినేది వారికి ఆహార విషయమై విద్యాశాఖ నుంచి నేటి వరకు ఎలాంటి ఆదేశాలు జారీ కాలేదు. ఏటా జిల్లా పరిషత్ నుంచి కేటాయింపులు చేసేవారు. ప్రస్తుతం అంతా ఎన్నికల హడావుడిలో పట్టించుకోక పోవడంతో జిల్లాలోని టెన్త్ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లావ్యాప్తంగా 59 వేల మంది టెన్త్ విద్యార్థులు ఉంటే వీరిలో సగం మంది జిల్లా పరిషత్ పాఠశాలలకు చెందిన వారే.ప్రభుత్వ పాఠశాలలో చదివే పదో తరగతి విద్యార్థులు మంచి గ్రేడ్లతో ఉత్తీర్ణత సాధించాలనే ఉద్దేశంతో విద్యా శాఖ ఉదయం, సాయంత్రం వేళల్లో గత 45 రోజులుగా  గంట చొప్పున ప్రత్యేక తరగతులను నిర్వహిస్తోంది.  విద్యార్థుల సందేహాలను ఉపాధ్యాయులు నివృత్తి చేస్తూ పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. సాయం త్రం వేళ అల్పాహారం లేక చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు.అధికారులు కూడా ఏర్పాట్లు చేయడం లేదు. ఆయా మండలాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించే దాతలు ఎంతో మంది ఉన్నారు.
వీరితో పాటు ప్రతి గ్రామంలో గ్రామాభివృద్ధి, ఎస్‌ఎంసీ, జన్మభూమి కమిటీలు ఉన్నాయి. విద్యార్థుల సమస్యలపై వారంతా స్పందించాల్సిన అవసరం ఉందని ఉపాధ్యాయులు కోరుతున్నారుమార్చి 18 నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి ఉపాధ్యాయుల సహకారం,  విద్యాశాఖ ప్రణాళికలు బాగానే ఉన్నా, అల్పాహార విషయంలో మాత్రం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన  దూర ప్రాం తాల విద్యార్థుల్లో  కొందరు ఉదయం భోజనం చేయకుండానే తరగతులకు హాజరవు తున్నారు. దీనివల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు అభిప్రాయ పడుతున్నారు.
Tags:The students of the classroom are humbled

 జీశాట్- 31 ప్రయోగం విజయవంతం 

Date:06/02/2019
నెల్లూరు ముచ్చట్లు :
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగిలోకి ప్రయోగించింది.  ఫ్రెంచ్ గయానాలోని కౌరు నుంచి అంతరిక్ష కేంద్రం నుంచి బుధవారం తెల్లవారుజామున 2.31 గంటలకు ప్రయోగించిన , జీశాట్ 31 ప్రయోగం జరుగగా, ఏరియన్ స్పేస్ సంస్థకు చెందిన ఏరియన్ 5 రాకెట్ ద్వారా ఈ శాటిలైట్ అంతరిక్షానికి చేరింది.  కమ్యూనికేషన్ సేవలను అందించే ఈ శాటిలైట్ 15 సంవత్సరాల పాటు పనిచేయనుంది.  జీశాట్ 31తో పాటే సౌదీకి చెందిన 1 హెల్లాస్ శాట్ 4 ఉపగ్రహాన్ని కూడా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు.
జీశాట్ 31 బరువు 2,535 కిలోలకాగా, అత్యంత సమర్థమంతమైన కేయూ బ్యాండ్ ప్రసార వ్యవస్థను ఇది కలిగివుంటుంది. భారత భూమి, ద్వీపాలు, అరేబియా సముద్రం, బంగాళాఖాతం పరిసరాల సమాచారాన్ని ఇది అందించనుంది.  ఇదే సమయంలో వీశాట్ నెట్ వర్క్స్, టెలివిజన్ అప్ లింక్స్, డిజిటల్ శాటిలైట్, డీటీహెచ్, సెల్యులార్ బ్యాకప్ తదితరాలకు అనుకూలమైన సాంకేతికత ఇందులో ఉందని ఇస్రో తెలిపింది
Tags:GSAT-31 experiment succeeded