తెలుగుముచ్చట్లు రంజాన్‌ శుభాకాంక్షలు

Date:04/06/2019

పుంగనూరు ముచ్చట్లు:

రంజాన్‌ పండుగను పురస్కరించుకుని ముస్లింలకు తెలుగుముచ్చట్లు వెబ్‌సైట్‌ యాజమాన్యం , సిబ్బంది శుబాకాంక్షలు తెలిపారు. ముస్లింలు సుఖసంతోషాలతో రంజాన్‌ పండుగను కుటుంబ సభ్యులతో కలసి నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.

ఇట్లు…

తెలుగుముచ్చట్లు వెబ్‌సైట్‌ , పుంగనూరు .

9న బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం కార్యవర్గం ఎన్నిక

Tags: Congratulations to Ramzan

పోలింగ్ ఏర్పాట్లలో పార్టీలు తలమునకలు

Date:010/04/2019
నెల్లూరు ముచ్చట్లు:
ఎన్నికలు ఎన్నికలు అంటూ అనుకున్న అంత సమయం లేదు. నామినేషన్లు ఘట్టం ఇలా ముగిసిందో లేదో రెండు వారాల్లో ప్రచార పర్వం ముగిసిపోయింది. నిన్నమొన్నటివరకు హోరెత్తిన మైకులు ఆగడంతో పోలింగ్ ఏర్పాట్లలో పార్టీలు తలమునకలు అయ్యాయి. పోలింగ్ కి ఒకే రోజు సమయం ఉండటంతో ఓటర్లకు వివిధ రూపాల్లో ప్రలోభాలకు ప్రధాన పార్టీలు తెరతీశాయి. ఓటుకు వెయ్యి రూపాయల నుంచి మూడు వేలరూపాయల వరకు ప్రాంతాన్ని, అభ్యర్థి ధనబలాన్ని బట్టి పంపిణి మొదలైంది. ఎన్నికల సంఘం నిఘా, పోలీసుల తనిఖీలు సైతం పంపకాలకు పెద్దగా బ్రేక్ వేయలేక పోతున్నాయి. మరో పక్క డబ్బులు ఇంకా తమకు అందడం లేదంటూ ప్రధాన రాజకీయ పక్షాల కార్యాలయాలకు ఓటర్లు క్యూ కడుతున్నారు. మరో పక్క డబ్బు పంపిణి బాధ్యతలు చేపట్టిన వారు అభ్యర్థి ఇచ్చిన సొమ్ము లో కొంత కోత పెడుతుంటే మరికొందరు మొత్తం గుటకాయస్వాహా చేస్తున్నారు. ఈ వ్యవహారాలపై కూడా పార్టీ కార్యాలయాలకు ఫిర్యాదులు అందుతున్నాయి.మరోపక్క అధికార తెలుగుదేశం, వైసిపి లు పోటాపోటీగా డబ్బులు పంపిణీ చేస్తుంటే జనసేన మాత్రం ఈ రేసులో పూర్తిగా వెనుకబడింది. ఒక్క టీ గ్లాస్ ను మాత్రం అన్ని నియోజకవర్గాల్లో పంపిణీ చేసినట్లు సమాచారం. నువ్వా నేనా అన్నట్లు గా సాగిన ప్రచారం ఆ తరువాత పంపిణీల తో ఓటరు ఉక్కిరి బిక్కిరి అయినా ఏ పార్టీకి తమ ఓటు వేయాలో ముందే డిసైడ్ అయ్యి సైలెంట్ కావడం విశేషం. ప్రచార యుద్ధం ముగిసి పోగా ఇక పోలింగ్ యుద్ధం ఎలా సాగనుందో చూడాలి.
Tags:Parties in polling arrangements

28 నానో ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది

Date:01/04/2019
నెల్లూరు ముచ్చట్లు :
డీఆర్డీఓకి చెందిన ఇంటెలిజెన్స్ శాటిలైట్ ఇమిశాట్‌తోపాటు విదేశాలకు చెందిన 28 నానో ఉపగ్రహాలను సోమవారం ఇస్రో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రంలోని రెండో లాంచింగ్ ప్యాడ్ నుంచి సోమవారం ఉదయం 9.27 గంటలకు ప్రారంభమై పీఎస్ఎల్వీ సీ45 రాకెట్ మూడున్నర గంటల తర్వాత నిర్దేశిత కక్ష్యలోకి ఉపగ్రహాలను చేర్చింది. ఇందులోని 436 కిలోల బరువున్న ఇమిశాట్ శత్రువుల రాడార్లను గుర్తించడానికి తోడ్పడుతుంది. ప్రయోగం కేంద్రం నుంచి మొదలైన పీఎస్ఎల్వీ రాకెట్ 17 నిమిషాల అనంతరం 753.6 కిలోమీటర్ల ఎత్తు కక్ష్యలో ఇమిశాట్‌ను నిలిపింది. అక్కడ నుంచి 1.50 నిమిషాల్లో నాలుగు దశలను పూర్తిచేసిన పీఎస్ఎల్వీ లిథువేనియా, స్పేయిన్‌, స్విట్జర్లాండ్‌, అమెరికాకు చెందిన 28 నానో ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది. కాగా, ఇప్పటి వరకు ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ రకం వాహక నౌక ప్రయోగం 47వది కాగా, ఎక్కువ సమయం ప్రయాణించిన రాకెట్ ప్రయోగాల్లో ఇది కూడా ఒకటి. గతేడాది జనవరిలో పీఎస్ఎల్వీ సీ40 ప్రయోగానికి 2 గంటల 21 నిమిషాల సమయం పట్టింది. ఇక, తాజా ప్రయోగం అనేక ప్రత్యేకతలను సంతరించుకుంది. పీఎస్ఎల్వీలో ఇంధనాన్ని మండించడానికి అధునాత బూస్టర్లను వినియోగించారు. మొత్తం నాలుగు దశల్లో ఒక్కో దశలో 12.2 టన్నుల బరువును మోసుకుపోయే సామర్థ్యంతో రూపొందించి, మూడు వేర్వేరు కక్ష్యల్లోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టారు.
మొదటి పేలోడ్‌లోని ఆటోమెటిక్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్‌ సముద్ర జలాల్లోని నౌకల గురించి సమాచారాన్ని సేకరిస్తుంది. అలాగే రెండో పేలోడ్‌ ఆటోమేటిక్‌ ప్యాకెట్‌ రిపీటింగ్‌ సిస్టమ్‌లోని రేడియో అమెచ్యూర్‌ శాటిలైట్‌ కార్పొరేషన్‌ ప్రయోగాత్మకంగా అధునాతన సాంకేతికతకు సంబంధించి పరిశోధనలు నిర్వహించనుంది. ఇక మూడో పేలోడ్‌‌లో అమర్చిన అడ్వాన్స్‌డ్‌ రిటార్డింగ్‌ పొటెన్షియల్‌ అన్‌లైజర్‌ ఫర్‌ ఐనోస్పిరిక్‌ స్టడీస్‌ ద్వారా రాబోయే ఆరు నెలల్లో వాతావరణంలోని ఐనోస్పియర్‌పై పరిశోధనలు చేపడతారు. ప్రయోగం విజయవంతం చేసినందుకు ఇందులో భాగస్వామైన వారందరికీ ఇస్రో చైర్మన్ కే శివన్ శుభకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి రిశాట్, కార్టోశాట్ 3, చంద్రయాన్-2 సహా మరో 30 ప్రయోగాలను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం నింగిలోకి పంపిన ఉపగ్రహాలు తమ కక్ష్యలో చేరడంతో తమ ప్రాథమిక లక్ష్యాన్ని చేరుకున్నామని శివన్ సంతోషం వ్యక్తం చేశారు.మూడో దశలో 508 కిలోమీటర్ల ఎత్తున దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి రాకెట్ ప్రవేశించిన తర్వాత నాలుగో దశకు వెళ్ల సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. నాలుగో దశలో 485 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి చేర్చే సమయంలో ఇంజిన్ రెండుసార్లు మొరాయించింది. దీంతో ఇంజిన్ రీ-స్టార్ట్ చేసి తక్షణమే లోపాన్ని సరిదిద్ది పేలోడ్‌ను విజయవంతంగా నాలుగు దశకు చేర్చారు.
Tags:ISRO successfully succeeded on 28 nano satellites