ఘనంగా  కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం 

Date:11/09/2018
తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో  13వ తేదీన ప్రారంభం అయ్యే సాలకట్ల బ్రహ్మోత్సవాల పురస్కరించుకుని  మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహించింది. సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
 ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రపరిచారు. ఈ యావత్ కార్యక్రమాన్ని ఆలయ సిబ్బంది ఒక మహాయజ్ఞంలా నిర్వహించారని ఇఓ సింఘాల్ అన్నారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేసి,శుద్ధి పూర్తి అయిన అనంతరం నామకోపు.
శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని  ఆలయం అంతటా ప్రోక్షణం చేసామన్నారు ఇఓ. స్వామివారి మూలవిరాట్టుకు కప్పబడి ఉన్న వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు ఇఓ అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. అనంతరం భక్తులను మ. 12.00 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతించారు.
Tags:Cooil Alvar Thirumananganam

బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

Date:11/09/2018
తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది అక్కడి దేవస్థానం. ఈ బ్రహ్మూత్సవాల్లో ఉదయం వాహనసేవ 9 నుండి 11 గంటల వరకు, రాత్రి వాహనసేవ 8 నుండి 10 గంటల వరకు జరుగుతుంది. గరుడవాహన సేవ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. భక్తుల రద్దీ ద ష్ట్యా తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేశారు. భక్తుల అవసరాలను ద ష్టిలో ఉంచుకుని రోజుకు 7 లక్షల లడ్డూలను నిల్వ ఉంచారు.
వయోవ ద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, దాతలు తదితర ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు. బ్రేక్ దర్శనం ప్రోటోకాల్  ప్రముకుఖులకు మాత్రమే పరిమితం. గరుడ సేవ రోజులైన సెప్టెంబరు 17, అక్టోబరు 14న బ్రేక్దర్శనాలు పూర్తిగా రద్దు చేశారు. అంగప్రదక్షిణ టోకెన్లు కూడా ఇవ్వరు. బ్రహ్మూత్సవాల్లో శ్రీవారి ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టిటిడి నిఘా మరియు భద్రతా విభాగం, పోలీసు విభాగం సంయుక్తంగా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాయి.
ఇందులో భాగంగా ముఖ్య కూడళ్లలో సిసిటీవీలు ఏర్పాటు చేశారు. పిఏసి-4లోని సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్లో నూతనంగా వీడియోవాల్ ఏర్పాటు చేశారు. దీనిద్వారా పలు ప్రాంతాల్లో భద్రతను పర్యవేక్షిస్తారు. హోంగార్డులు, ఎన్సిసి విద్యార్థులు, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. భక్తులు భద్రతాపరమైన సమస్యలు ఎదుర్కొన్నప్పుడు టోల్ఫ్రీ నంబర్లు : 18004254141, 1800425333333కు ఫిర్యాదు చేయవచ్చు.
బ్రహ్మూత్సవాలకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక టోల్ఫ్రీ నంబరు 18004254242ను అందుబాటులో ఉంచారు. 98 కోట్ల వ్యయంతో మహిళలకు, పురుషులకు వేరువేరుగా నిర్మించిన శ్రీవారి సేవా సదన్ నూతన భవనాలను బ్రహ్మూత్సవాల్లో ప్రారంభిస్తారు. శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగించే సరుకులు నిల్వ ఉంచు కునేందుకు 1.10 కోట్లతో నిర్మించిన నూతన ఉగ్రాణం భవనాన్ని ఈ బ్రహ్మూత్సవాల్లో ప్రారంభిస్తారు. వృద్ధులు, దివ్యాంగులు వేచి ఉండేందుకు 60 లక్షలతో షెడ్డు నిర్మించారు.
భక్తుల సౌకర్యార్థం 26 కోట్లతో అదనపు మరుగుదొడ్ల నిర్మాణం చేశారు. అత్యవసర సమయాల్లో భక్తుల సౌకర్యార్థం ఉత్తర మాడ వీధిలోని అర్చక భవనం నుండి మేదరమిట్ట వరకు ఫుట్ ఓవర్బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకొచ్చారు. లక్షలాది భక్తులు వాహన సేవలు వీక్షించేందుకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో గ్యాలరీలు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. వాహనసేవలను తిలకిం చేందుకు మాడ వీధుల్లో 19, భక్తుల రద్దీ ఉన్న ఇతర ప్రాంతాల్లో 12 కలిపి మొత్తం 31 పెద్ద డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.
Tags:Complete arrangements for Brahmotsavas

చంద్రన్న పసుపు కుంకమతో కుటుంబాల్లో సంతోషం

 Date:11/09/2018
విజయవాడ ముచ్చట్లు:
డ్వాక్రా సంఘాల్లోని ఆడపడుచులకు ఒక్కొక్కరికీ ‘చంద్రన్న పసుపు కుంకుమ’ కింద పదివేల రూపాయల చొప్పున ఇస్తున్నామని ఏపీ మంత్రి పరిటాల సునీత అన్నారు. ఏపీ అసెంబ్లీలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు.
‘చంద్రన్న పసుపు కుంకుమ’ కింద ఇప్పటి వరకూ మూడు విడతల్లో రూ.6,883 కోట్లు విడుదల చేయడం జరిగిందని, వడ్డీ లేని రుణాలిస్తున్నామని, అలాగే, వృద్ధులకు వికలాంగులకు రూ.200గా ఉన్న నెల వారీ పెన్షన్ ని తమ ప్రభుత్వం వచ్చాక వెయ్యి రూపాయలకు పెంచిన విషయాన్ని ప్రస్తావించారు.
అలాగే, ఎనభై శాతం కంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్నవారికి పెన్షన్ ను రూ.500 నుంచి రూ.1500కు పెంచామని, చేనేత, గీత కార్మికులకు, ఎయిడ్స్ వ్యాధి బాధితులకు రూ.1500 ఇస్తున్నట్లు చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలెవ్వరూ ఇబ్బందులు పడకూడదన్న ఆలోచనతో సీఎం చంద్రబాబు అందరికీ న్యాయం చేస్తున్నారని సునీత అన్నారు.
Tags:The happiness of families with Chandranna yellow silk

ఆలేరు నియోజకవర్గంలో తెరాస ప్రచారం ప్రారంభం

Date:11/09/2018
ఆలేరు ముచ్చట్లు:
తనపై రెండోసారి విశ్వాసం ఉంచి ఆలేరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా ఖరారు చేసిన తెరాస అధినేత కేసీఆర్ కు తాజా మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ సునీత మహేందర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.అలాగే యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామివారి ఆశీస్సులు కూడా తీసుకున్నన్నారు.తెరాస ప్రచార కార్యక్రమానికి ముందుగా వారి స్వగ్రామమైన వంగపల్లి దుర్గమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేసి అమ్మ వారి ఆశీస్సులు పొంది ఆత్మకూరు మండలం నుండి తెరాస ప్రచారని కొనసాగిస్తామన్నారు.
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పార్టీల నాయకులు కు అధిష్టానం ఢిల్లీ గాని ఆంద్రా నుంచి వచ్చిన నిర్ణయాలతో ముందుకు సాగుతారు అన్నారు. ఇతర పార్టీల నాయకులకు నా అభిప్రాయం ఒక్కటే గొప్పగా ఆలోచించండి మన ప్రాంతం అభివృద్ధి జరగాలని  మీరు కోరుకుంటే బానిసత్వం  వీడి స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే పార్టీలో ఉంటే అది సాధ్యం అవుతుందన్నారు అలాగే మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం తప్పకుండా మీకు కూడా తగిన గుర్తింపు ఉంటుంది కలిసి రండి అన్నారు గతంలో పార్టీల పాలన ఏ విధంగా ఉందో ఇప్పటి తెరాస పాలన ఏ విధంగావుందో ఆలోచించలన్నారు.
తెరాస అభివృద్ధి సంక్షేమ పథకాలను కెసిఆర్ గారు సూచించిన మార్గంలోనే నాలుగున్నరేళ్ల పాలనలో అభివృద్ధికి పాటుపడ్డాం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరి చేరేలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగేలా కృషి చేశామన్నారు ఇవన్నీ ఆలేరు నియోజకవర్గ ప్రజలకు తెలిసినవే అన్నారు వీటన్నింటిని చూసి మళ్లీ దీవించాలని కోరుతున్నాం రెండోసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న ఏవిధంగానైతే ప్రజాసేవే పరమావధిగా పని చేశాను మళ్లీ మరింత ఉత్సాహంగా పని చేసే బాటలో నడిచి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
Tags:Teresa campaign begins in Auraru constituency

అది ఎన్నికల భృతి : బీజేపీ

Date:11/09/2018
అమరావతి ముచ్చట్లు:
శాసన మండలి లో అధికార పక్షం తప్ప వేరే వారు మాట్లాడే అవకాశం లేకుండా చేస్తున్నారు. అందుకే వాకవుట్ చేస్తున్నామని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. మంగళవరం నాడు అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడారు.  నిరుద్యోగ భృతి ని హామీ గా ఇవ్వడం జరిగింది. దీనిని అక్టోబర్ 2 న ప్రారంభిస్తున్నాం అన్నారు.
కేవలం ఆరు నెలలు మాత్రమే ఇచ్చి ఎన్నికలలో లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిరుద్యోగ భృతి కాదు. ఎన్నికల భృతి.అని అన్నారు  నిరుద్యోగ భృతి 4 సంవత్స రాలుగా పెండింగ్ లో ఉంది. సీపీఎస్ ని రద్దు చేసి తీరాలి.. సీపీఎస్ అనేది కేంద్రానికి సంభంధించినది కాదు. అసెంబ్లీ లో తీర్మానం చేసి సీపీఎస్ విధానాన్ని అమలు పరచాలని అయన అన్నారు.
Tags:It is the election burden: BJP

తెలుగు యువత ఆధ్వర్యంలో

Date:11/09/2018

పలమనేరు ముచ్చట్లు:

*కలల సాకారానికి కృషి చేయాలి
*దాతృత్వం గొప్ప గుణం
*పలమనేరు పట్టణ సీఐ వెంకటేశ్వర్లు

కొలమాసనపల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు రూ.10వేలు విలువ జేసే అవసరమైన ప్లేట్లు, ఫ్యాన్లను పట్టణ తెలుగు యువత ఆధ్వర్యంలో పట్టణ సీఐ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా వితరణగా అందజేయడం జరిగింది.ఉన్నత ఆశయంతో రాణించాలి

 

విద్యార్థులు ఉన్నత ఆశయంతో చదివి జీవితంలో రాణించాలని పలమనేరు పట్టణ సీఐ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పలమనేరు మండలంలోని కొలమాసనపల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పట్టణ తెలుగు యువత నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు అవసరమైన సుమారు రూ.10 వేలు విలువజేసే ఫ్యాన్లు, ప్లేట్లను పంపిణి చేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఐ విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు…..విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకునేందుకు కృషి చేయాలని కలలు కనని జీవితం వృథా అని గుర్తించుకోవాలన్నారు. మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు.

 

సమాజంలో ఆదర్శంగా నిలిచిన మహనీయులు గొప్ప వ్యక్తులు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలోనే చదివి పైకి దిగారని విషయాన్ని విద్యార్థులు గుర్తించాలని అలాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పలువురు మహనీయులు గొప్ప వ్యక్తుల విషయాల గురించి ఆయన వివరించారు. అదే విధంగా దాతృత్వం ఓ గొప్ప గుణమని విద్యార్థులు ఇప్పటి నుంచే దాతృత్వ గుణానికి అలవాటు పడాలని సూచించారు. అనంతరం పట్టణ తెలుగు యువత అధ్యక్షులు కిరణ్ కుమార్ మాట్లాడుతూ…ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ప్రభుత్వ బడులలోనే ఉంటారనే విషయాన్ని విద్యార్థులు గ్రహించాలన్నారు.

 

ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యతోపాటు క్రీడలు మరియు ఆహ్లాదకర వాతావరణం ఉంటుందని కాబట్టి ఒత్తిడి లేని చదువులతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించాలని కోరారు. ఇక ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చేస్తున్న కృషిని వివరించారు. సామాజిక సేవలో తెలుగు యువత సభ్యులు ఎప్పుడూ ముందుంటారని సమాజ సేవ కోసం తమ వంతు సహాయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పలమనేరు మండల జడ్పీటిసి శమంతకమణి , ఎంపీటీసీ మంజుల రెడ్డి, ఆసుపత్రి కమిటీ చైర్మన్ సాంబ , పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ బాబు, తెలుగు యువత అధ్యక్షుడు కిరణ్, ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆచారి,అస్లాం మురళీ, కృష్ణమూర్తి, రెడ్డి ప్రసాద్, బార్గవ్, కిరణ్ రాధాకృష్ణ మొదలగు వారు పాల్గొన్నారు.

కేరాఫ్ రోగాలు.. 

Tags:Under the leadership of Telugu youth

కేరాఫ్ రోగాలు.. 

Date:11/09/2018
కాకినాడ ముచ్చట్లు:
జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో ఖాళీ స్థలాలు వ్యాధులకు నిలయాలుగా మారాయి. ఇళ్ల మధ్య ఖాళీగా వదిలేస్తున్న స్థలాల్లో వర్షపు నీరు, మురుగునీరు నిలిచిపోతుండడంతో దోమల బెడద అధికమవుతోంది. ఖాళీ స్థలాలను అలాగే వదిలేయకుండా మెరక చేయించాలన్న నిబంధనలు ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీనిపై సంబంధిత అధికారులు కూడా దృష్టి నిలపడం లేదు. వర్షా కాలంలో ఇలాంటి స్థలాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టడంతో పాటు లార్వా నిర్మూలనకు మందులు పిచికారీ చేయాల్సి ఉన్నా ఇదీ మొక్కుబడిగా సాగుతోంది.
జిల్లాలో నగరాలతో పాటు అన్ని పట్టణాల్లో ఖాళీ స్థలాల సమస్య ఎక్కువగా ఉంది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని విస్తరిస్తున్న తరుణంలో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఎక్కువ శాతం మంది ముందు చూపుతో ఖాళీ స్థలాలను కొనుగోలు చేస్తున్నారు. ఉద్యోగ, వ్యాపార రీత్యా పట్టణాల్లో ఉండేవారు, నగర జీవన విధానానికి అలవాటుపడిన     వారు సైతం ఇక్కడ ఎంతో కొంత స్థలం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. నగరాల్లోని శివారు ప్రాంతాల్లో కూడా భూములు కొనుగోలు చేసి ప్లాట్లుగా మార్చి వదిలేస్తున్నారు. ఆయా స్థలాల యజమానులను గుర్తించడం నగరపాలక అధికారులకు తలనొప్పిగా మారింది.
జిల్లాలోని రెండు కాల్పొరేషన్లు,  అన్ని మున్సిపాలిటీల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దోమ కాటు వల్ల వచ్చే మలేరియా, డెంగీ వంటి ప్రాణాంతక జ్వరాల బారిన పడుతున్నారు. వాస్తవానికి సీజన్‌లో గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ కేసులు నమోదవుతాయి. పట్టణాల్లో పారిశుద్ధ్యానికి ఎక్కువ నిధులు ఖర్చు చేస్తున్నారు. రాజమండ్రి కార్పొరేషన్లో కార్మికుల జీతాలు, ఇతర ఖర్చులు మినహాయిస్తే ఏడాదికి రూ.10 కోట్ల వరకూ కేవలం పారిశుద్ధ్య పనులకు వెచ్చిస్తున్నారు.
జిల్లాలో రూ.వంద కోట్ల మేరకు వెచ్చిస్తున్నారు. ఇక వర్షాకాలంలో ప్రత్యేకించి రెండు నెలల్లో ఒక్కో మున్సిపాలిటీలో దోమల నివారణకు రూ.10 నుంచి రూ.15 లక్షలు వెచ్చిస్తున్నారు.
Tags:Karif sickness ..

ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు ముగ్గురు మృతి

Date:11/09/2018

నల్లచెరువు ముచ్చట్లు:

అతివేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందిన సంఘటన కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండలంలో జాతీయ రహదారిపై జరిగింది.

ఆకట్టుకుంటున్న గణేశుడి విగ్రహాలు

Tags:Three passengers killed in road accident