ఈస్ట్ ప్లాన్ మారింది.. (తూర్పుగోదావరి)

Date:07/06/2018
కాకినాడ ముచ్చట్లు:
సార్వత్రిక ఎన్నికలకు ఏడాది సమయం ఉండగానే అధికార టీడీపీ బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలని ప్లాన్‌ చేస్తోంది. ఇందులో భాగంగా 19 అసెంబ్లీ సెగ్మెంట్లకుగానూ, తొలి దశలో ఆరుగురు ఎమ్మెల్యేలను తప్పించి కొత్త వారికి ఛాన్స్‌ ఇవ్వాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఎన్డీయేతో కటీఫ్‌ చెప్పి బయటకొచ్చిన తర్వాత రాష్ట్రంలోనూ, జిల్లాలోనూ టీడీపీ గ్రాఫ్‌ బాగా పెరిగిందని సర్వేలు చెబుతున్నాయి. ఇదే సమయంలో కొందరు ఎమ్మెల్యేల పరిస్థితిలో మాత్రం మార్పు కన్పించడంలేదు. పార్టీకి సానుకూలంగా ఉండి ఎమ్మెల్యేలే మైన్‌సగా ఉన్న చోట మార్పు చేయాలని ఇదివరకే డిసైడయ్యారు. ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో ఎదురీదుతున్న ఎమ్మెల్యేలను పక్కనపెట్టి కొత్తవారిని బరిలోకి దింపాలని టీడీపీ అధిష్ఠానం ప్రణాళిక వేసుకుంటోంది. జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలలో టీడీపీ అభ్యర్థులను మార్చాల్సిన పరిస్థితులు ఉన్నా.. తొలి విడతగా ఆరు చోట్ల మార్పుపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ రెండు, మూడు నెలల్లో పరిస్థితి మార్పురాకపోతే మిగిలిన ఆరు స్థానాలలోనూ కొత్త కేండెట్లను తెరపైకి తేవాలన్నది పార్టీ పెద్దల యోచనగా ఉంది.
ఏజెన్సీ రంపచోడవరం అసెంబ్లీ సెగ్మెంట్‌లో వచ్చే ఎన్నికలలో బలమైన అభ్యర్థి కోసం ఇప్పటి నుంచీ దృష్టిసారించాలని పార్టీ అధిష్ఠానానికి కేడర్‌ నుంచి విజ్ఞాపనలు వెళుతున్నాయి. తనతోపాటు వైసీపీ నుంచి వచ్చిన కేడర్‌కే ఎమ్మెల్యే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, టీడీపీ సీనియర్లను కలుపుకుపోలేకోతున్నారన్న అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సమర్థవంతంగా పార్టీని నడిపించగల అభ్యర్థిని బరిలో నిలపాల్సిన అవసరంపై రంపచోడవరం పార్టీ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాలో పలుచోట్ల ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జి, ఎమ్మెల్సీలు ఇసుక దందాలు మితిమీరాయి. ప్రభుత్వం ఉచిత ఇసుక పథకం పెట్టినా.. జనానికి ఉచితంగా ఇసుక దొరకడంలేదు. రవాణా, కూలీ ఖర్చుల పేరుతో భారీగా వసూలు చేస్తున్నారు. రేవులలో ఎమ్మెల్యేల అనుచరులే హల్‌చల్‌ చేస్తున్నారు. కొన్నిచోట్ల ఇసుక మాఫియాలో వైసీపీ నేతల్నీ భాగస్వాములు చేసుకుంటున్నారు. ఇలాంటి వ్యవహారాలపై స్థానిక టీడీపీ కేడర్‌లో తీవ్ర అసమ్మతి వ్యక్తమవుతోంది.
కొత్తపేటలాంటి చోట పార్టీలతో సంబంధంలేకుండా నాలుగేళ్లపాటు ఇసుక దందా సాగింది. ఇటీవల జెడ్పీలో ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, వైసీపీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి వివాదంతో ఆ ఇసుక బండారం జిల్లా మొత్తం బహిర్గమైంది. ఇసుక ఒక్కటే కాదు.. లాభసాటి దందాలలో మెట్ట, కోనసీమ అనే తేడా లేకుండా వైసీపీ వాళ్లతో టీడీపీ ప్రజాప్రతినిధులు దోస్తీ కట్టడం పార్టీ కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు పంపుతోంది. ఈ అక్రమ లావాదేవీలకు చెక్‌ చెప్పకపోతే ముందు నుంచీ పార్టీలోనే కొనసాగుతున్న అసలు సిసలు టీడీపీ కార్యకర్తలు వచ్చే ఎన్నికల నాటికి దూరమయ్యే ప్రమాదం ఉంది. దీనిపై పార్టీ అధిష్ఠానం ఇప్పటి నుంచీ దిద్దుబాటు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. మహానాడు తర్వాత పార్టీలో వచ్చిన జోష్‌ కొనసాగాలంటే ప్రత్యర్థి పార్టీ నేతలతో చేతులు కలుపుతున్న టీడీపీ ప్రజాప్రతినిదులను కట్టడి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కాకినాడ లోక్‌సభ పరిధిలో ని మెట్ట ప్రాంతంలో ఒక ఎమ్మె ల్యే ప్రజల, పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడంలేదన్న విమర్శలు ఉన్నాయి. సదరు ఎమ్మెల్యేకి వయసు రీత్యా కూడా ఈసారి తప్పించాలన్నది పార్టీ నేతల యోచన. ఆ స్థానంలో ఆయన సమీప బంధువుకే టిక్కెట్టు ఇస్తారన్న ప్రచారం ఉంది. కాకినాడ పరిధిలో ఒక ఎమ్మెల్యే మార్పుపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. అభివృద్ధి పనులు చెప్పుకోదగ్గరీతిలో చేసినా వారి కుటుంబ సభ్యుల ఆగడాలు, ల్యాండ్‌ సెటిల్‌మెంట్లతో ప్రజల్లో భయాందోళనలు రేకెత్తుతున్నాయి. ఈ స్థానంలోనూ కొత్త అభ్యర్థిని వెతుకుతున్నట్టు తెలుస్తోంది. రాజమహేంద్రవరం లోక్‌సభ పరిధిలో గత ఎన్నికలలో స్వల్ప తేడాతో గట్టెక్కిన ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థికి వ్యక్తిగత సానుభూతి క్రమంగా పెరుగుతోంది. ఇక్కడ బలమైన అభ్యర్థిని పోటీకి దించాలని కీలక ప్రజాప్రతినిధులు కూడా ప్రతిపాదనలు పెడుతున్నారు.
Tags :  East Plan Marin .. (East Godavari)

బిజెపితో దోస్తి చేస్తున్న వైఎస్సాఆర్సీపికి ఓట్లు వేయకండి – సిఎం చంద్రబాబు పిలుపు

Date:07/06/2018

పుంగనూరు ముచ్చట్లు:

ఆంధ్రరాష్టానికి ప్రత్యేకహొదా కల్పించకుండ 5 కోట్ల ఆంధ్రులను మోసగించిన బిజెపి పార్టీతో దోస్తి చేసిన వైఎస్సాఆర్సీపి అధినేత జగన్మోహన్‌రెడ్డికి ఓట్లు వేయరాదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. పుంగనూరు మండలంలోని చండ్రమాకులపల్లెలో వివిధ కార్యక్రమాలలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలనుద్ధేశించి మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వాధినేత ప్రధాని నరేంద్రమోదీ రాష్టానికి తీరని ద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలను మోసగించి, ప్రత్యేకహొదాతో పాటు ప్యాకెజి- ఇస్తామని మాయమాటలతో కాలయాపన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి బిజెపితో వైఎస్సాఆర్సీపి రాజీ చేసుకుని, కేసులను మాఫి చేసుకునేందుకు కుట్రలు పన్ని , ప్రజలను మోసగిస్తున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సాఆర్సీపి, బిజెపికి తగిన గుణపాఠం నేర్పాలని , ప్రజలందరు ఈ విషయంలో ఐకమత్యంతో ఉండాలని కోరారు.

 

Tags; Do not vote for YSRCP, who is defeated by BJP – CM Chandrababu’s call

 కాలుష్య కోరల్లో..

Date:07/06/2018
చిత్తూరు ముచ్చట్లు:
జనాభాకు తగ్గట్లుగా వాహనాల సంఖ్యా పెరిగిపోయింది. దీంతో వాయు కాలుష్యం తీవ్రస్థాయిలో నమోదవుతోంది. ఫలితంగా ప్రజా ఆరోగ్యం ప్రభావితమవుతోంది. చిత్తూరు జిల్లాలోనూ ఈ తరహా పొల్యూషన్ అధికంగా ఉన్నట్లు నిపుణులు అంటున్నారు. వాహనాల రద్దీ తీవ్రమవడం వల్లే ఈ దుస్థితి నెలకొందని స్పష్టం చేస్తున్నారు. ప్రజలు ఇప్పట్నుంచే తగిన చర్యలు తీసుకోకపోతే.. ఆరోగ్యం ప్రభావితమవుతుందని హెచ్చరిస్తున్నారు. వెహికిల్స్ పెరిగిపోవడంతో ఇటీవలిగా వాతావరణంలో ధూళికణాలు భారీగా పేరుకుపోతున్నట్లు తేలింది. ట్రాఫిక్‌లో కళ్లకు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా వెళ్ళేవాహణదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సర్వేల్లో స్పష్టమైంది. అంతేకాకుండా పలువురు ఊపిరితిత్తుల వ్యాధులకు గురవుతున్నట్లు గుర్తించారు. వాహనాల నుంచి వెలువడుతున్న పొగ, కాలుష్యంతో పలువురిలో చిరాకు పెరిగిపోతుండడమే కాక డ్రైవింగ్ సమయంలో ఏకాగ్రత కోల్పోతున్నట్లు తేల్చారు. వాహనాలు నడిపేటప్పుడు సహనం కోల్పోయినా, చిరాకుగా ఉన్నా.. ప్రమాదాలు సంభవించడం ఖాయం. అందుకే నగరంలో కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవడంతో పాటూ ప్రజలూ తగు జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో ప్రధాన పట్టణాలైన తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, పుంగనూరు, కుప్పం, పలమనేరు, పీలేరు, పుత్తూరు, సత్యవేడు ప్రాంతాలు ఎక్కువగా కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాయి. ఇదిలాఉంటే కొన్నిరోజుల క్రితం ఓ ప్రయివేట్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో మొత్తం 28 శాతం పాల్గొన్నారు. వీరిలో అధికులకు కంటి దురద, నీరు కారడం, ఎర్రబడటం వంటి లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి కారణం వాతావరణం కాలుష్యమేనని వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. బైక్‌లపై తిరిగేవారు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని అంటున్నారు. ట్రాఫిక్‌లోకి వెళ్లినప్పుడు కళ్లద్దాలు ధరించాలని చెప్పారు. ఏసీ గదుల్లో, కంప్యూటర్లు, టీవీల ముందు ఎక్కువ సమయం గడపడకూడదని తెలిపారు. వాతావరణంలో కాలుష్యం పెరిగిపోవడం వల్ల దుమ్మూ, ధూళి చేరి శ్వాసకోస వ్యాధులు, ముక్కుకు సంబంధించిన జబ్బులు వస్తున్నాయి. సాధ్యమైనంత వరకు బైక్‌లు, కార్లు వాడటం తగ్గించాలి. రెండు, రెండు కిలోమీటర్ల దూరంలో ఆఫీస్‌, ఇతరపనులకు వెళ్లాల్సినపుడు సైకిల్‌ను ఉపయోగించవచ్చు. నడక కూడా మంచిదే. వాకింగ్ తో ఆరోగ్యంగానూ ఉండవచ్చు.

సమస్యలతోనే సావాసం!

Date:07/06/2018
కృష్ణా ముచ్చట్లు:
కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పరిధిలో పలువురు కిడ్నీ సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రధానంగా బాధితుల్లో పేదలైన గిరిజనులు, దళితులే అధికంగా ఉన్నట్లు సమాచారం. ఏళ్లుగా తాము మూత్రపిండాల సమస్యలతో సతమతమవుతున్నామని.. వైద్యానికి వేలాది రూపాయలు ఖర్చు చేయడం తమ స్థోమతకు మించిన విషయమని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. తండాల్లో నివసించే వారంతా నిరుపేదలే. ఇక్కడ అభివృద్ధి చాయలు తక్కువగానే ఉన్నాయి. ఇక సురక్షిత తాగునీరు ఇక్కడి వారికి అందడం గగనమే. నెలల తరబడి తాగునీటి సరఫరా నిలిచిపోయిన సందర్భాలూ ఉన్నాయి. మరోవైపు వివిధ తండాలకు కేటాయించిన నిధులను పెత్తందారులు హస్తగతం చేసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇక ఇక్కడివారు పనికెళితేగానీ పూట గవడవని పరిస్థితి. అంతా రెక్కాడితే గాని డొక్కాడాని నిరుపేదలే. వీరిలో 10 మంది వరకు కిడ్నీ బాధితులు ఉన్నట్లు స్థానికులు అంటున్నారు. కొంతమంది నెలకు రూ.4000 నుంచి రూ.10 వేల వరకు, మరికొంత మంది రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు డయాలసిస్ కోసం ఖర్చు పెడుతున్నారు. ఇందులో నలుగురు నిత్యం డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. ఇంకొందరు ఆర్ధిక స్తోమత లేకపోవటంతో స్థానిక వైద్యులనే ఆశ్రయిస్తున్నారు. డయాలసిస్‌ చేయించుకుంటే ప్రాణాపాయం ఉంటుందన్న భయంతో మరికొందరు మంచాలపైనే మూలుగుతూ బతుకీడుస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బాధితులకు అండగా ఉండాలని, సమర్ధవంతమైన వైద్యం బాధితులకు అందించేలా చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు.
Tags: The problem with problems!

పుంగనూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన

Date:07/06/2018

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణ దీక్షలో భాగంగా పుంగనూరు , మదనపల్లె నియోజకవర్గాలలో పర్యటించారు. పుంగనూరు మండలం చండ్రమాకులపల్లెను స్మార్ట్ విలేజ్‌గా ప్రకటించారు. బీసీ, ఎస్టీ, ఎస్టీ కాలనీలో పర్యటించారు. మహాత్మగాంధి ఉపాధిహామి పథకం క్రింద ఏర్పాటు చేసిన వర్మీకంపోస్ట్ యార్డ్ను పరిశీలించి, •రైతులతో చర్చించారు. ఎస్టీఆర్‌ గృహ నిర్మాణం, పెన్షన్లు, రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. సీఎం వెంట రాష్ట్ర మంత్రి అమరనాథరెడ్డి, జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న , జెడ్పి చైర్మన్‌ గిర్వాణి చందప్రకాష్‌, దేశం ఇన్‌చార్జ్ వెంకటరమణరాజు, దేశం పార్టీ కన్వీనర్‌ శ్రీనాథరెడ్డి, టీటీడీ బోర్డు మెంబర్‌ చల్లా ప్రభాకర్‌రెడ్డి, ఎంపీడీవో లక్ష్మిపతినాయుడు, ఉప్యాధి ఏపీవో సుట్లూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Tags: Chief Minister Chandrababu Naidu tour in Punganoor

సింగరేణి కార్మిక వాడలకు గోదావరి జలాలు

Date:07/06/2018
మంచిర్యాల ముచ్చట్లు:
మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్‌, మందమర్రి, రామకృష్ణాపూర్‌, బెల్లంపల్లి సింగరేణి కార్మికవాడలకు గోదావరి నీరు సరఫరా అవుతోంది. సింగరేణి యాజమాన్యం తాగునీటిగా గోదావరి జలాలను సరఫరా చేస్తోంది. దీంతో వేలాది కార్మిక కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. స్థానికంగా ఉన్న బొగ్గు గనుల సమీపంలో కాలనీలు ఏర్పడ్డాయి. దీంతో కార్మిక కుటుంబాల తాగునీటి అవసరాలను తీర్చేందుకు సింగరేణి యాజమాన్యం మొదట్లో గనుల నుంచి తాగునీరు సరఫరా చేసేది. ఈ నీటిని స్థానికంగా ఏర్పాటు చేసిన ఫిల్టర్‌బెడ్‌ల్లో శుద్ధి చేసి కాలనీలకు అందించేది. గనుల నుంచి వచ్చే నీరు ఉప్పగా ఉండేది. దీంతో కార్మికులు, వారి కుటుంబాలు గోదావరినది నీళ్లు సరఫరా చేయాలని యాజమాన్యాన్ని కోరాయి. ఒత్తిడి కూడా తీసుకొచ్చాయి. దీంతో యాజమాన్యం గోదావరినది నుంచి తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంది. సీతారాంపల్లి వద్ద గల గోదావరినది ఒడ్డున ఇన్‌టెక్‌వెల్‌ను నిర్మించి నీటిని ప్రత్యేక పైపులైన్ల ద్వారా కార్మికుల కాలనీలకు చేర్చే ఏర్పాట్లు చేసింది. దీంతో దాదాపు 30 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న సింగరేణి కార్మిక క్షేత్రాల్లోని సింగరేణి కార్మిక, కార్మికేతర కుటుంబాలకు గోదావరి నీరు సరఫరా అవుతోంది.
గోదావరి నుంచి నీటిని ఒడిసిపట్టడమే కాక ఆ నీటిని పరిశుభ్రపరచేందుకు సింగరేణి యాజమాన్యం ప్రాధాన్యనిస్తోంది. వివిధ పద్ధతుల ద్వారా నీటిని శుభ్రపరిచి, క్లోరినేషన్‌ జరుపుతోంది. ఈ ప్రక్రియలు పూర్తైన తర్వాతే సరఫరా చేస్తోంది. బెల్లంపల్లి రీజియన్‌లోని మందమర్రి, రామకృష్ణాపూర్‌, శ్రీరాంపూర్‌, బెల్లంపల్లిలోని సింగరేణి కార్మికకాలనీలకు నిత్యం 5.5 మిలియన్‌ గ్యాలన్ల గోదావరినది నీటిని తాగునీరుగా మారుస్తున్నారు. రెండు వేర్వేరుగా  పథకాల ద్వారా కార్మికవాడలకు నీటిని సరఫరా చేస్తున్నారు. మందమర్రి, రామకృష్ణాపూర్‌, బెల్లంపల్లి కార్మికవాడల కోసం శ్రీరాంపూర్‌ సమీపంలోని సీతారాంపల్లె పక్కనే నిర్మించిన ఇన్‌టెక్‌వెల్‌ ద్వారా, శ్రీరాంపూర్‌ కార్మికవాడలకు అక్కడే ఏర్పాటు చేసిన పాత పథకం సాయంతో నీటిని అందిస్తున్నారు. కార్మికవాడలకు సురక్షిత తాగునీరు అందించేందుకు సింగరేణి యాజమాన్యం తీసుకుంటున్న చర్యలపై అంతా హర్షం వ్యక్తంచేస్తున్నారు. యాజమాన్యం చొరవ, కృషి ఫలితంగా తమకు తాగునీటికి ఎలాంటి సమస్యలు లేవని సింగరేణి కార్మికులు ఆనందంగా చెప్తున్నారు.
Tags: Godavari waters for the Singareni labor

వానొస్తే.. భయమే..

Date:07/06/2018
కరీంనగర్‌ ముచ్చట్లు:
ప్రజారోగ్యానికి తెలంగాణ సర్కార్ ప్రాధాన్యతనిస్తోంది. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ప్రజలకు సమర్ధవంతమైన వైద్య సేవలు లభించేలా చర్యలు తీసుకుంటోంది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. భవనాలపైనా కాస్త దృష్టి పెట్టాలన్న విజ్ఞప్తులు కరీంనగర్ లో వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే జిల్లా ఆసుపత్రి ఇబ్బందులకు నిలయంగా మారిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రధానంగా పైకప్పు పరిస్థితి బాగాలేదని, వానాకాలం వస్తే దారుణంగా మారుతోందని పలువురు అంటున్నారు. వర్షాకాలంలో జిల్లా ఆసుపత్రిలోని పలు వార్డుల భవన పై కప్పు పెచ్చులూడి పడటం సాధారణంగా మారింది. గతంలో అనేకమంది త్రుటిలో ప్రమాదాలు తప్పించుకున్న సంఘటనలు సైతం ఉన్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేసే అధికారులు.. ఆపై ఆ మాటే మరచిపోతుంటారని అంతా విమర్శిస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం సమీపిస్తుండడంతో జనాల్లో మళ్లీ ఆందోళనలు నెలకొన్నాయి. హాస్పిటల్ లో పెచ్చులూడుతున్న ఐడీ, సర్జికల్‌, పే రూంలల్లో మరమ్మతు చర్యలు చేపట్టకపోవడంతో చికిత్స పొందుతున్న రోగులు, వారికి సాయంగా వచ్చిన వారు భయాందోళనల్లో గడుపుతున్న దుస్థితి నెలకొంది. వాస్తవానికి హాస్పిటల్ ను పటిష్ట పరచేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. గతేడాది మార్చిలో జిల్లా ఆసుపత్రిని సందర్శించిన పాలనాధికారి ఆసుపత్రిలో మరమ్మతు పనుల నిమిత్తం రూ.80 లక్షలు మంజూరు చేశారు. త్వరితగితిన మరమ్మతు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు చేజిక్కించుకున్న కాంట్రాక్టర్ జాప్యం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గడువు ముగిసి నెలలు గడుస్తున్నా.. సదరు గుత్తేదారు క్యాజువాలిటీ పనులు మినహా, మిగిలిన మరమ్మతు పనులు ప్రారంభించలేదన్న ఆరోపణలూ ఉన్నాయి. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో వర్షాలు మరింత ఉధృతంగా ఉండే అవకాశాలే ఎక్కువ. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా సంబంధిత అధికారులు మరమ్మతుల పనులు వేగవంతమయ్యేలా చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు. పై కప్పు లీకేజీ మరమ్మతు పనులు త్వతిగతిన చేపడితే వర్షాలు జోరయ్యే నాటికి పెద్దగా సమస్య ఉండదని చెప్తున్నారు. మరోవైపు చిన్నపాటి వర్షానికే ఐడీ, సర్జికల్‌, పే రూంల్లో పెచ్చులూడుతున్నట్లు అంతా అంటున్నారు. ఈ గదుల్లోనూ పై కప్పు మరమ్మతు చేపట్టాలని రోగులు, సిబ్బంది కోరుతున్నారు.
Tags: Wait .. fear ..

షెల్టర్లు లేక సమస్యలు

Date:07/06/2018
మెదక్ ముచ్చట్లు:
మెదక్ జిల్లా నార్సింగి బస్ స్టాప్ సమస్యలకు నిలయంగా మారిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బస్సులు నిలిచే చోట సరైన షెల్టర్ ఉండడం లేదని వాపోతున్నారు. దీంతో ఎండకు ఎండుతూ..వానలకు తడుస్తూ బస్సుల కోసం వేచి ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందని అంటున్నారు. నార్సింగిలోనే కాదు.. 44వ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న పలు ప్రాంతాల్లో తగిన బస్ట్ స్టాప్ లో లేవని స్థానికులు అంటున్నారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న అతి పెద్ద జాతీయ రహదారి ఇది. అయితే  అవసరం ఉన్న చోట బస్‌షెల్లర్లు మాత్రం లేవని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.  నార్సింగితో పాటు వల్లభాపూర్‌, నర్సంపల్లి, సేరిపల్లి, కాస్లాపూర్‌, మీర్జాపల్లి నుంచి ప్రతి రోజు చాల మంది పలు ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రయాణికుల సంఖ్య ఎక్కువే. కాని ఇక్కడ కనీసం సరైన బస్‌షెల్టర్‌ను జాతీయ రహదారి అధికారులు ఏర్పాటు చేయలేదని అంతా అంటున్నారు. సర్వీస్‌ రోడ్డులో దూరంగా రహదారికి ఇరువైపులా బస్‌షెల్టర్‌లను నిర్మించారు. అవి ఏమాత్రం ఉపయోగపడడంలేదని అంటున్నారు. ఆర్టీసీ ఆర్డీనరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సులు జాతీయ రహదారిపై నుంచి వెళుతాయి. రోడ్డుపైనే ఆగి ప్రయాణికులను ఎక్కించుకుంటాయి. సర్వీసు రోడ్డులో ఉన్న ఈ బస్‌షెల్టర్లను బస్సులు ఆగే కూడళ్ల వద్ద ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రయాణికులు అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి బస్ షెల్టర్లను ఏర్పాటు చేసి ప్రయాణికుల ఇక్కట్లు తొలగించాలని అంతా విజ్ఞప్తి చేస్తున్నారు.
Tags; Shelters or problems