చెల్లిని చూడటానికి వచ్చి అక్కతో జంప్

Date:01/06/2018
చెన్నై ముచ్చట్లు:
ఓ వెరైటీ ప్రేమ్ కహానీ ఇప్పుడు వైరల్ అవుతోంది. చెల్లిని పెళ్లి చూపుల్లో చూసేందుకు వచ్చి.. పెళ్లై ఓ బిడ్డకు తల్లైన ఆమె అక్కతో జంపైపోవడం షాకింగ్‌గా మారింది. చెన్నైలో జరిగిన ఈ ఘటన స్థానికంగా హాట్‌టాపిక్‌ అయ్యింది. నగరంలోని మైలాపూర్‌ ఏకాంబరం పిళ్లై వీధికి చెందిన వ్యక్తికి ఇద్దరు కూతుర్లు. పెద్ద కుమార్తెకు పెళ్లై మూడేళ్ల బాబు కూడా ఉన్నాడు. ఇక రెండో అమ్మాయికి పెళ్లి చేయాలని భావించి.. సంబంధాలు వెతికాడు. ఐదు నెలల క్రితం అన్నాదురై అనే యువకుడితో పెళ్లి చూపులు ఏర్పాటు చేశాడు. యువకుడు అమ్మాయిని చూడటానికి వచ్చి వెళ్లాడు. ఆ తర్వాత అతడి నుంచి ఎలాంటి కబురు రాలేదు. అయితే ఉన్నట్టుండి రెండు రోజుల క్రితం.. పెద్ద కూతురు కనిపించకుండా పోయింది. ఆమె ఎటు వెళ్లిందా అని గాలించిన తండ్రి.. అనుమానంతో కూతురు గురించి ఆరా తీస్తేగాని తెలియలేదు.. ఆమె అన్నాదురైతో వెళ్లిపోయిందని. పెళ్లి చూపులకు వచ్చిన సమయంలో యువతి అక్కతో అతడికి పరిచయం ఏర్పడింది. ఐదు నెలలుగా ఇద్దరి మధ్య మాటలు కూడా నడుస్తుండగా.. ప్రేమలో కూడా పడ్డారట. ఈ స్టోరీ మొత్తం తెలుసుకున్న తండ్రి షాకయ్యాడట. దీంతో ఆయన మైలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె పోతూ పోతూ ఇంట్లో ఉన్న ఐదు సవర్ల బంగారం, రూ.2లక్షల డబ్బుతో పాటూ మూడేళ్ల కొడుకుని కూడా తీసుకెళ్లిందని చెప్పాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారైన జంట కోసం గాలిస్తున్నారు.
Tags: Come to see and jump with sister

మాటల తూటాలు పెంచిన జనసేనాని

Date:01/06/2018
విజయనగరంముచ్చట్లు:
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటల తూటాలతో దూకుడు పెంచారు. జనసేన పోరాట యాత్రలో భాగంగా టీడీపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మే 20 న ఉత్తరాంధ్రలో చేపట్టిన పోరాట యాత్ర.. ప్రస్తుతం విజయనగరానికి చేరుకుంది. గురువారం నాడు కురుపాంలో జరిగిన నిరసన కవాతులో ప్రభుత్వంతో విమర్శలు గుప్పించారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. బహిరంగ సభలో మాట్లాడుతూ.. చంద్రబాబు ముందే మేల్కొని ఉంటే.. ఎప్పుడో హోదా వ చ్చేది .. ఆయన వ్యక్తిగత లాభం కోసం హోదాని పక్కనపెట్టి.. బీజేపీ నాయకులకు అమరావతిలో సన్మానాలు చేశారు. ఇప్పుడేమో ఏమీ ఎరగనట్టు దీక్షలు చేస్తున్నారు. ఒప్పందాలు చేసుకునేదీ మీరే దీక్షలు చేసేదీ మీరే.. ఎన్నాళ్లీ ఈ మోసం. ప్రజలు గమనిస్తున్నారు బాబుగారూ.. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటమి ఖాయం అంటూ ప్రభుత్వానికి హెచ్చరించారు పవన్ కళ్యాణ్. కురుపాం గిరిజన గ్రామాల్లో వైద్య సౌకర్యం లేదు. ఇక్కడ నుండి 70 కి.మి వెళితేనే కాని వైద్య సౌకర్యాలు లేకపోవడం దారుణం. తెలుగుదేశం పార్టీకి ఓటు బ్యాంక్‌గా గిరిజన ప్రజలు గుర్తుకు వస్తారు కాని.. వాళ్ల సమస్యలు మాత్రం పట్టవు. చంద్రబాబుని అడుగుతున్నా.. లక్షల కోట్లు అమరావతిలో పెడుతున్నారు. ఇక్కడ రూ. 10 కోట్లతో బ్రిడ్జి నిర్మించలేకపోతున్నారు. కురుపాం వాళ్లకి ఎంత మందికి తెలుసు అమరావతి రాజధాని అని.. ఇక్కడ చదువుకున్న యువత ఉన్నారు కాని ఉద్యోగాలు లేవు. ఎంతోమంది వలసలు వెలిపోతున్నారు. ఉత్తరాంధ్రను కావాలనే నిర్లక్ష్యం చేశారు. మీరు పదే పదే.. అమరావతి అంటూ అక్కడే అభివృద్ది అంటుంటే మిగతా గిరిజన ప్రాంతాల సంగతి ఏంటి? మీరు ఇదే తరహాతో ఈ ఇష్టం వచ్చినట్లు చేస్తే.. మళ్లీ కళింగాంధ్ర ఉద్యమం వస్తుంది. తెలంగాణ ఉద్యమం జరిగింది నీళ్లు, నిధులు కోసం. ఈ ఉద్యమం చదువు కోసం, కనీస అవసరాల కోసం. సింగపూర్ కాదు ముందు వెనుకబడ్డ ప్రాంతాలను అభివృద్ది చేయండి. మీ అబ్బాయి లోకేశం.. మాట్లాడితే మేమే రోడ్లు వేశాం.. మా నాన్నే రోడ్లు వేశారు అంటున్నారు. ఒక్కసారి కురపాం రండి మీరు మీ అబ్బాయి. ఇక్కడ రోడ్లు ఉన్నాయో లేదో చూడండి. విజయనగరం జిల్లాలో కనీస బస్సు కూడా తిరగలేని పరిస్థితి ఉంది. మీరు మీ అబ్బాయి తిరిగే చోట్ల రోడ్లు వేసుకోవడం కాదు. ప్రజల సొమ్ముతో ప్రజలు ఉండే చోట రోడ్లు వేయాలి. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేశారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటమి తప్పదంటూ హెచ్చరించారు జనసేనాని.
Tags: Gossiping of words

పాదయాత్ర నుంచే చంద్రన్న భీమా పధకం పుట్టింది

Date:01/06/2018
విజయవాడ ముచ్చట్లు:
మూడోదశ చంద్రన్నబీమా కార్యక్రమం ప్రారంభమైంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన… చంద్రన్న బీమా పథకాన్ని సీఎం చంద్రబాబుయ ప్రారంభించారచంద్రన్న బీమా నాకు ఎంతో సంతృప్తిని కలిగించింది. బీమా మిత్రలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. ప్రభుత్వ పథకాల్లో దళారుల జోక్యం లేకుండా చేశాం. ప్రభుత్వ పథకాల విషయంలో డ్వాక్రా సంఘాలు గొప్పగా పనిచేస్తున్నాయి.ఇంటి పెద్ద హఠాత్తుగా మరణిస్తే ఆ కుటుంబ దుర్భర పరిస్థితి ఎదుర్కొంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. చంద్రన్న బీమా మూడో ఏడాది కార్యక్రమాన్ని అమరావతిలో ఈరోజు ఆయన ప్రారంభించారు. 2016లో 2.13కోట్ల మందితో ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రస్తుతం 2.5కోట్ల మందితో దేశంలోనే అతిపెద్ద బీమా పథకంగా గుర్తింపు పొందింది. రెండేళ్లలో 1.50 లక్షల కుటుంబాలకు రూ.2వేల కోట్ల బీమా చెల్లించారు. పాదయాత్రలో తాను చూసిన సంఘటనల నుంచే చంద్రన్న బీమా ఆలోచన పుట్టిందని తెలిపారు. ‘లారీ డ్రైవర్లు దూర ప్రాంతాలకు వెళ్లి వారం పది రోజుల వరకు తిరిగిరారు. అలాంటి వారు ప్రమాదానికి గురైతే ఆ కుటుంబం కుప్పకూలిపోతుంది. అందుకే చంద్రన్న బీమా పథకాన్ని వారికీ వర్తింపచేయాలని అనుకున్నాం. దీన్ని మొదట్లో చాలామంది వ్యతిరేకించారు. వాటిని పట్టించుకోకుండా డ్రైవర్లకు బీమాను వర్తింపచేస్తున్నాం. ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత 11వ రోజే పరిహారాన్ని కుటుంబసభ్యులకు అందజేస్తున్నాం. రాష్ట్రంలోని ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. అందుకే సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నాం’ అని చంద్రబాబు తెలిపారు. ఉపాధి హామీ పథకం సక్రమంగా పనిచేస్తోంది’’ అని చంద్రబాబు కితాబిచ్చారు.రోడ్డుప్రమాదాల్లో డ్రైవర్లు చనిపోవడం బాధాకరమని, డ్రైవర్‌ చనిపోతే ఆ కుటుంబం కుప్పకూలిపోయే పరిస్థితి వస్తుందని, డ్రైవర్లను ఆదుకోవాలని బీమా పథకాన్ని ప్రారంభించామని బాబు చెప్పారు. బీమా మిత్ర టీడీపీ మానస పుత్రిక అని ఆయన అభివర్ణించారు. పెద్దకర్మ రోజే బాధితులకు బీమా సొమ్ము అందేలా చర్యలు తీసుకుంటామని, వృద్ధులను ఆదుకోవాలనే పెన్షన్లను ప్రారంభించామన్నారు. సకాలంలో అందితేనే సహాయానికి సార్థకత వస్తుందని చంద్రబాబు అన్నారు.
Tags: Chandranna insurance scheme is derived from the padra

గుర్తించిన ప్రాంతాల్లో మాన్సూన్ ఎమ‌ర్జెన్సీ బృందాలు సిద్దం

Date:01/06/2018
హైదరాబాద్  ముచ్చట్లు:
రుతుప‌వ‌నాలు ముంద‌స్తుగా వ‌స్తున్నందున జూన్ 1వ తేదీ నుండి మాన్సూన్ ఎమ‌ర్జెన్సీ బృందాల‌ను నియ‌మిస్తున్న‌ట్లు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి తెలిపారు. నేడు జీహెచ్ఎంసీ కార్యాల‌యంలో ఇంజ‌నీరింగ్ అధికారుల‌తో ప్ర‌త్యేక స‌మావేశం నిర్వ‌హించారు. ప్ర‌స్తుత సీజ‌న్‌లో వారం రోజుల ముందుగానే రుతుప‌వ‌నాలు ప్ర‌వేశించినందున న‌గ‌రంలో గుర్తించిన ప్రాంతాల్లో నేటి నుండే మాన్సూన్ ఎమ‌ర్జెన్సీ బృందాల‌ను ఏర్పాటుచేసి అప్‌తమ‌త్తంగా ఉండాల‌ని ఆదేశించారు. నిర్వ‌హ‌ణ విభాగం చీఫ్ ఇంజ‌నీర్ జియాఉద్దీన్‌ల‌తో పాటు సూప‌రింటెండెంట్, ఎగ్జిక్యూటీవ్, డిప్యూటి ఇంజ‌నీర్లు పాల్గొన్న ఈ స‌మావేశంలో డా.బి.జనార్థ‌న్‌రెడ్డి మాట్లాడుతూ ఇంజనీరింగ్ విభాగం ద్వారా చేట్టే ప్ర‌తి ప‌నిలో సోష‌ల్ ఆడిట్ త‌ప్ప‌నిస‌రిగా ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. గ‌తంలో త‌రుచుగా ఏర్పడే పాట్‌హోల్స్ (రోడ్ల‌పై గుంత‌ల‌) ప‌ట్ల ప్ర‌త్యేక దృష్టి సాధించాల‌ని అన్నారు. ఈ సారి రోడ్లకు సంబంధించిన ఏ విధ‌మైన విమ‌ర్శ‌లు ఎదుర్కొకుండా ఉండేందుకు న‌గ‌రంలో పీరియాడిక‌ల్ ప్రివెంటీవ్‌ మెయింట‌నెన్స్ (పి.పి.ఎం) రోడ్ల‌ను నిర్మిస్తున్నామ‌ని వివ‌రించారు. ఈ పి.పి.ఎం రోడ్ల నిర్మాణం సంద‌ర్భంగా కొన్ని ప్రాంతాల్లో త‌క్క‌వ డ్యామేజి అయిన రోడ్ల‌ను కూడా తిరిగి వేయాల్సి వ‌స్తుంద‌ని ఈ విష‌యంలో న‌గ‌ర‌వాసుల‌కు తెలియ‌చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. తాము చేప‌ట్టే ప్ర‌తి ప‌నుల వివ‌రాల‌ను సోష‌ల్ మాధ్య‌మాల ద్వారా ప్ర‌జ‌ల‌కు తెలియ చేయాల‌ని కోరారు. భారీ వ‌ర్షాల వ‌ల్ల నీటి ముంపు ప్రాంతాల్లో స‌రిప‌డా పంపింగ్ మిష‌న్లు సిద్దంగా ఉంచుకోవాల‌ని సూచించారు. ప్ర‌తి ఒక్క ఇంజ‌నీరు త‌ప్ప‌నిస‌రిగా 2016కు చెందిన వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ‌, భ‌వ‌న నిర్మాణ వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ నిబంధ‌న‌లు, ప్లాస్టిక్ నిర్వ‌హ‌ణ నిబంధ‌న‌లు త‌ప్ప‌నిస‌రిగా అధ్య‌య‌నం చేయాల‌ని ఆదేశించారు.
Tags: Monsoon Emergency Clubs are ready in areas identified

ఆర్థిక నగరాలతో యువతకు ఉపాధి

– రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్
Date:01/06/2018
అమరావతి ముచ్చట్లు:
రాష్ట్రంలో ఏర్పాటుకానున్న ఆర్థిక నగరాలతో యువతకు భారీ ఎత్తున ఉపాధి లభిస్తుందని  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ అన్నారు. సచివాలయంలోని తన కార్యాలయంలో ఆర్థిక నగరాల ప్రగతిపై సమీక్షా సమావేశం శుక్రవారం నిర్వహించారు. ముందుగా రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే ఆర్థిక నగరాలపై ఏపీ టిడ్కో ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ రామనాథ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సీఎస్ కు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 ఆర్థిక నగరాలు ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. వాటిలో 33 ప్రాజెక్టులకు నెలకొల్పేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జక్కంపూడి ఎకానమిక్ సహా మరో 6 నగరాల్లో పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడిదారులు ముందుకొచ్చారన్నారు. ఏయే జిల్లాల్లో ఏయే పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారో సీఎస్ దినేష్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. జక్కంపూడి ఆర్థిక నగరం కోసం అవసరమైన భూముల సేకరణకు సంబంధిత జిల్లా కలెక్టర్ తో చర్చించాలన్నారు. జక్కంపూడి తరహాలో ఆరు నగరాల్లో ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఆర్థిక నగరాల ఏర్పాటుతో యువతకు భారీఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అయితే, పరిశ్రమల ఏర్పాటులో ప్రజాభీష్టాన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. కాలుష్య రహిత పరిశ్రమలను ఆర్థిక నగరాల్లో ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహామందించాలన్నారు. ఆయా ప్రాంతాల అవసరాలకనుగుణంగా పరిశ్రమలను ఏర్పాటు చేయాలని సీఎస్ ఆదేశించారు. ఉద్యోగాల కల్పన ఎంత ముఖ్యమో ప్రజారోగ్యం అంతకంటే ఎక్కువని స్పష్టం చేశారు. ఆర్థిక నగరాల్లో పరిశ్రమల ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ ఎకానమిక్ సిటీస్ ప్రమోషన్ కంపెనీ లిమిటెడ్ పేరుతో సంస్థను ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ, మౌలిక సదుపాయలు, పెట్టుబడుల ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ ను సీఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. ఈ సంస్థ ద్వారా ఆర్థిక నగరాల్లో పరిశ్రమల ఏర్పాటుకు విస్తృతమైన ప్రచారం చేపట్టాలన్నారు. అదే సమయంలో ప్రతినెలా పారిశ్రామిక ప్రగతిపై సమీక్షలు నిర్వహించాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో పలుశాఖల ముఖ్యకార్యదర్శులు అజయ్ జైన్, సాల్మన్  ఆరోఖ్య రాజ్ తో పాటు ఆర్.టి.జి సీఈవో బాబు.ఎ తదితరులు పాల్గొన్నారు.
Tags: Employment for young people with financial cities

సీఎస్ తో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ

Date:01/06/2018
అమరావతి ముచ్చట్లు:
అమరావతి రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయల కల్పనకు ప్రపంచ బ్యాంకు రుణం మంజూరు చేయాలని ఆ బ్యాంకు ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ అన్నారు. సచివాలయంలోని తన కార్యాలయంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు శుక్రవారం ఆయనను కలిశారు. రాజధాని ప్రాంతం సీఆర్డీఏ పరిధిలో తమ బ్యాంకు ఆధ్వర్యంలో చేపట్టబోయే మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన రుణంపై వారు సీఎస్ తో చర్చించారు. రాజధాని నిర్మాణంలో మౌలిక సదుపాయల కల్పన ముఖ్యమని సీఎస్ తెలిపారు. దీనికి ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చి, మౌలిక సదుపాయల కల్పనకు రుణమివ్వడానికి అంగీకరించడం ఆనందకర విషయమన్నారు. సాధ్యమైనంత త్వరగా డాక్యుమెంటేషన్ పూర్తి చేసి రుణం మంజూరు చేయాలని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులను సీఎస్ కోరారు. రాజధాని నిర్మాణంలో పనిచేస్తున్న కూలీలకు కల్పిస్తున్న సదుపాయాలపై ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సంతృప్తి వ్యక్తంచేశారు. రాజదాని ప్రాంతంలోని వెంకయ్యపాలెం, కృష్ణయ్యపాలెం రాయపూడి గ్రామాల్లో భూముల్లేని నిరుపేదలతోనూ మాట్లాడినట్లు వారు తెలిపారు.  ఈ సమావేశంలో రాష్ట్ర విద్యుత్ శాఖ, మౌలిక సదుపాయలు, పెట్టుబడుల ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Tags: Meet World Bank Representatives with CS

మరో నాలుగు జిల్లాలో ‘నవోదయం’: మంత్రి జవహర్

– గంజాయి అక్రమ రవాణా అడ్డుకట్టుకు 10 చెక్ పోస్ట్ లు
Date:01/06/2018
అమరావతి  ముచ్చట్లు:
సారా రహిత గ్రామాల కోసం చేపట్టిన నవోదయ కార్యక్రమం 9 జిల్లాలో విజయవంతమైందని, ఇప్పుడు మరో 4 జిల్లాలో అమలు చేయనున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కె.ఎస్.జవహర్ తెలిపారు. రాష్ట్రం సారా రహితంగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సారా ఆధారిత వృత్తిగా చేసుకున్న కుటుంబాలను గుర్తించి  వాటిని నుంచి దూరం చేయడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించామన్నారు.  దీంతో పాటు సారా తాగడం కలిగే నష్టాలపై చైతన్యం తీసుకొస్తున్నామన్నారు., సారా రవాణా చేసే వారిపైనా, తాగేవారిపైనా ప్రత్యేక దృష్టి పెడుతున్నామన్నారు. విశాఖ జిల్లా కళ్యాణలోవ వద్ద 38,875 కిలోల గంజాయిని ధ్వంసం చేశామన్నారు. ఈ గంజాయి 14 పోలీస్ స్టేషన్ ల ద్వారా పట్టుకున్నదన్నారు. గంజాయి రవాణ లో గిరిజన యువత ఎక్కువగా ఉంటోందన్నారు. గంజాయి రవాణా చేసినా, సాగుచేసినా జైల్ కు పంపిస్తున్నామన్నారు. శిక్ష కాలం పూర్తి అయిన తరవాత వారికి వివిధ వృత్తులలో నైపుణ్యం ఇచ్చి,  ప్రత్నామాయ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామన్నారు. పట్టుబడినవారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలుంటే, ఆయా కార్పొరేషన్ల  ద్వారా వారికి ఉపాధి అవకాశాలను కల్పిస్తామన్నారు. గంజాయి వల్ల నష్టాలపై కౌన్సెలింగ్ నిర్వహించి, చైతన్యంతీసుకొస్తున్నామన్నారు. గత ఏడాది కోటీ 69 లక్షల గంజాయి మొక్కలను ధ్వంసం చేశామన్నారు. సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఏజెన్సీ ప్రాంతాల్లో సాగు దశల్లో ఉన్నమొక్కలను, విత్తనాలను ధ్వంసం చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.  విజయనగరం, విశాఖపట్నం ,తూర్పు గోదావరి జిల్లాలో 10 ఎక్సైజ్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి జవహర్ తెలిపారు. దీని ద్వారా గంజాయి రవాణా ను అరికడతామన్నారు. బెల్ట్ షాపులకు సంబంధించి నేటివరకూ రాష్ర్ట వ్యాప్తంగా 7,321 కేసులు నమోదు చేశామని, 7,526 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు.  గంజాయి వ్యాపారం చేసే వారిపై పీడీ  యాక్టు పెడతామన్నారు. ఇప్పటికే నలుగురిపై పీడీయాక్డు నమోదు చేశామన్నారు. గంజాయి, సారా, బెల్ట్ షాపుల రహిత రాష్ట్రాన్ని నెలకొల్పుతామన్నారు. మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా చూడడం లేదని మంత్రి జవహర్ స్పష్టంచేశారు.
Tags: Navodayam in four other districts: Minister Jawahar

ముస్లింల‌కు రంజాన్ తోఫా

Date:01/06/2018
మేడ్చల్  ముచ్చట్లు:
కాప్రా స‌ర్కిల్ చిలుకన‌గ‌ర్‌లోని మున‌వ్వార్ మ‌జీద్‌లో రంజాన్ సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌భుత్వం అందించే గిఫ్టు ప్యాకెట్ల‌ను పేద ముస్లింల‌కు పంపిణీ చేసిన మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల అభివృద్దికి కేసీఆర్ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని అన్నారు. రంజాన్ సందర్భంగా ఈ సంవ‌త్స‌రం న‌గ‌రంలో 400 మ‌జీద్‌ల వ‌ద్ద పేద ముస్లింల‌కు బ‌ట్ట‌ల పంపిణీ చేప‌డుతున్నామ‌ని అన్నారు. 400మ‌జీద్‌ల వ‌ద్ద ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయ‌నున్నామ‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటి క‌మిష‌న‌ర్ యాద‌గిరిరావు, కార్పొరేట‌ర్ గోపు స‌ర‌స్వ‌తి త‌దిత‌రులు పాల్గొన్నారు.
Tags: Ramzan Tufa for Muslims