మార్కెట్‌ కమిటిలో పాత పద్దతిని కొనసాగించాలంటు రైతులు ధర్నా

– ఎంపి మిధున్‌రెడ్డితో ఫోన్‌లో చర్చలు
– ధర్నా విరమించిన రైతులు

Date:22/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

మార్కెట్‌ కమిటిలో టమోటా వ్యాపారంలో ఏజెంట్ల ద్వారానే వ్యాపారాలు కొనసాగించాలని రైతులు సోమవారం ధర్నా , రాస్తారోకో చేశారు. ఈ విషయం తెలుసుకున్న రాజంపేట పార్లమెంట్‌ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డి రైతులతో చర్చలు జరిపారు. రైతు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామి ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. వివరాలిలా ఉన్నాయి. పట్టణ మార్కెట్‌ కమిటిలో కమీషన్‌ ఏజెంట్ల వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై మార్కెట్‌ కమిటి అధికారులు ఏజెంట్లకు తెలియజేశారు. దీంతో రైతులు ఏజెంట్లను రద్దు చేస్తే టమోటాలు ఎవరికి అమ్మాలి..? డబ్బులు ఇచ్చేదెవ్వరు..? టమోటాలు తరలించేందుకు బాక్సులు ఇచ్చేదె వ్వరు..? ఈ వసతులను ప్రభుత్వం చేపట్టకుండ ఒక్కసారిగా ఏజెంట్లను రద్దు చేస్తే లక్షలాది రూపాయలు నష్టాలు వస్తుందని ఆందోళన చేశారు. అధికారులు వినకపోవడంతో మార్కెట్‌ కమిటి ముందు రహదారిపై బైఠాయించి, రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న మాజీ జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌, మాజి ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి మార్కెట్‌ కమిటి వద్దకు చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. రైతు సమస్యలను మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంపై రైతులు ఆందోళన చెందకుండ పాత పద్దతినే కొనసాగించాలని నిర్ణయించారు.

 రాయితీ గ్యాస్ దందా 

Tags: Farmers who want to keep the old system in the market committee dharna

 రాయితీ గ్యాస్ దందా 

Date:22/07/2019

కరీంనగర్ ముచ్చట్లు:

 

రాయితీ గ్యాస్‌ పక్కదారి పడుతోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం.. క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యం అక్రమార్కులకు వరంగా మారింది. రాయితీ గ్యాస్‌ పక్కదారి పట్టిస్తూ సొమ్ము చేసుకుంటున్న వారు కొందరైతే, నిబంధనలకు విరుద్ధంగా మినీ సిలిండర్లలో నింపుతూ సొమ్ము చేసుకుంటున్నవారు మరికొందరు.. ప్రస్తుతం రాయితీ సిలిండర్‌కు రూ.709 కాగా కమర్షియల్‌ సిలిండర్‌కు రూ.1400 ఉండగా బ్లాక్‌లో కొనుగోలు చేస్తున్న కొందరు మినీ సిలిండర్ల వ్యాపారంతో సొమ్ము చేసుకుంటున్నారు. నాలుగు కిలోలున్న చిన్న సిలిండర్లలో గ్యాస్‌ నింపి అదనంగా రూ.వెయ్యి వరకు సంపాదిస్తుండగా ప్రభుత్వ ఖజానాకు తీరని నష్టం వాటిల్లుతోంది.

 

 

 

దీనికితోడు రాయితీ గ్యాస్‌ సిలిండర్లను వినియోగదారుకు సంబంధం లేకుండా బుక్‌ చేసి వాటిని పక్కదారి పట్టిస్తున్న పలువురు ఏజెన్సీ నిర్వాహకులకు కొదువ లేదు. రాయితీ సిలిండర్లను కమర్షియల్‌ సిలిండర్లలో తక్కువగా నింపి అక్రమ ఆదాయానికి రుచిమరిగారు. కాగా ప్రభుత్వ అనుమతి లేకున్నా జిల్లా కేంద్రంలోని పలు హోంనీడ్స్‌ దుకాణాల్లో దందా కొనసాగుతోంది. బహిరంగంగా దందా సాగుతున్నప్పటికి పౌరసరఫరాల అధికారులు కిమ్మనకపోవడం విమర్శలకు తావిస్తోంది. నిర్వాహకులు మామూళ్లతో కట్టిపడేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

 

 

 

జిల్లాలో రాయితీ గ్యాస్‌తో పాటు మినీ గ్యాస్‌ సిలిండర్ల రీఫిల్లింగ్‌ అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. నాలుగేళ్లుగా కేసుల ఊసే లేకపోవడంతో పరోక్షంగా అక్రమానికి సక్రమార్గం చూపినట్లయింది. రాయితీ గ్యాస్‌ను హోటళ్లు, వాహనాలతో యథేచ్చగా వినియోగిస్తుంటే నియంత్రించాల్సిన విభాగం ఏం చేస్తుందన్నది శేష ప్రశ్న.. ప్రభుత్వ నిబంధనలను విస్మరిస్తూ పలు హోంనీడ్స్‌ దుకాణాల నిర్వాహకులు మినీ సిలిండర్లలో గ్యాస్‌ నింపి  విక్రయాలు సాగిస్తున్నారు. రాయితీ, వాణిజ్య సిలిండర్లను బ్లాక్‌లో కొనుగోలు చేసి ఈ దందా సాగిస్తున్నారు.

 

 

 

 

మినీ సిలిండర్‌ సైజును బట్టి డబ్బులు గుంజుతున్న నిర్వాహకుల ఆగడాలకు కళ్లెం వేసేవారే కరవయ్యారు. జిల్లాకేంద్రంలోని రాంనగర్‌, మంకమ్మతోట, గణేశ్‌నగర్‌, కోతిరాంపూర్‌, పెద్దపల్లి రోడ్‌, కోర్టుచౌరస్తా ఇలా చాలా చోట్ల వందల సంఖ్యలో దుకాణాలున్నాయి. హుజూరాబాద్‌, జమ్మికుంట, తిమ్మాపూర్‌, మానకొండూరు, గంగాధర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. నెెలవారీగా నిర్వాహకుల నుంచి ముడుపులు తీసుకుని తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఒకవేళ ఎవరైనా ఫిర్యాదు చేస్తే నామమాత్రంగా కేసులు పెడుతూ తర్వాత యథావిధిగా దందా నడిచేలా పరోక్షంగా సహకరిస్తున్నట్లు ప్రచారం. అధికారుల సహకారంతో అక్రమార్కులు ఏటా కోట్లలో వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం.

 

 

జిల్లాకేంద్రంలోని పలు హోంనీడ్స్‌ దుకాణాలు అక్రమ గ్యాస్‌ సిలిండర్ల వ్యాపారానికి అడ్డాగా మారాయి. హైదరాబాద్‌ నుంచి చిన్న సిలిండర్లు కొనుగోలు చేసి ఇక్కడకు తెచ్చి వ్యాపారం చేస్తున్నారు. రోజుకు వందల సంఖ్యలో మినీ సిలిండర్లు విక్రయిస్తూ లక్షల రూపాయలు వెనకేసుకుంటున్నారు. రాయితీ గ్యాస్‌ ధర రూ.709 కాగా వాణిజ్య గ్యాస్‌ ధర రూ.1400 సదరు సిలిండర్లను బ్లాక్‌లో కొనుగోలు చేస్తున్న నిర్వాహకులు రహస్య ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్న గోదాంలకు తరలిస్తున్నట్లు సమాచారం.

 

 

 

 

మరికొందరు దుకాణాల్లోనే వెనుక వైపు రీఫిల్లింగ్‌ చేయడం విక్రయించడం చేస్తున్నారు. మధ్య తరగతి ప్రజలు, చిరువ్యాపారులు, యువకులు, ఉన్నత చదువుల కోసం వివిధ గ్రామాల నుంచి జిల్లా కేంద్రానికి వస్తున్న విద్యార్థులు మినీ సిలిండర్లను ఎక్కువగా వినియోగిస్తుంటారు. వీరి అవసరాలను అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. రాయితీ గ్యాస్‌ను రూ.వెయ్యికి కొనుగోలు చేస్తున్న నిర్వాహకులు 3 లేదా 4 సిలిండర్లలో నింపుతూ రూ.వెయ్యి అదనంగా వసూలు చేస్తున్నారు. హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లలో షరా మామూలే..!

 

 

జనావాసాల మధ్య అక్రమ దందా నిర్వహిస్తున్నా శాశ్వత చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిలిండర్ల రీఫిల్లింగ్‌ ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. నిర్వాహకులు అక్రమంగా ఏర్పాటు చేసుకున్న గోదాంలతో గ్యాస్‌ నింపే సమయంలో ఏదైనా అనుకోని ప్రమాదం సంభవిస్తే భారీ మూల్యం చెల్లించాల్సిందే. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో కార్లకు గ్యాస్‌ వినియోగం పెరుగుతోంది. పలు ఏజెన్సీల నిర్వాహకులు వీటికి సంపూర్ణ సహకారాలు అందిస్తున్నారు. ఫోన్‌ చేస్తే చాలు రాయితీ గ్యాస్‌ను వక్రమార్గంలో అందజేస్తున్నారు.

కల్యాణ లక్ష్మి కరుణించదా..? 

Tags: Subsidized gas donation

కల్యాణ లక్ష్మి కరుణించదా..? 

Date:22/07/2019

ఆదిలాబాద్ ముచ్చట్లు:

 

ప్రభుత్వ నిర్లక్ష్యం వేలాది మందిని అప్పుల్లోకి నెట్టింది. ప్రభుత్వ సహాయం అందుతుందన్న భరోసాతో అప్పు చేసి ఆడకూతుళ్ల పెళ్లి చేసిన కుటుంబాలకు నెలలుగా నిరీక్షణ తప్పడం లేదు. మొన్నటివరకు ఎన్నికల కోడ్‌ సాకు చెబుతూ వచ్చిన అధికార యంత్రాంగానికి ఇప్పుడు ఏం చెప్పాలో తెలియని అయోమయం వెంటాడుతోంది. రేపో, మాపో చెక్కులు ఇస్తామని చెబుతున్నారో తప్ప ఎప్పుడు ఇస్తారో తెలియక బాధిత కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.

 

 

జిల్లాలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 1372 కుటుంబాలు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వం పేద కుటుంబాల అండగా నిలబడాలనే సంకల్పంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను అమలుచేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కల్యాణ లక్ష్మి, మైనార్టీలకు షాదీముబారక్‌ పేరిట ఆయా వర్గాల ఆడపిల్లల పెళ్లిళ్లకు రూ.1,00116 ఆర్థిక సహాయం చేస్తోంది. తొలుత ఈ పథకం కింద రూ.51వేలు ఇచ్చేవారు. రాను రాను ఆ సహాయాన్ని పెంచుతూ వస్తున్నారు. ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థిక సహాయం పేద కుటుంబాలకు ఎంతో ఆసరాగా నిలుస్తోంది. నిరుపేద కుటుంబాల వారు పెళ్లికి అప్పులు చేయాల్సిన పరిస్థితి లేకుండా చేశాయి ఈ పథకాలు.

 

 

 

 

పథకాల అమలుతో బాల్య వివాహాలు తగ్గాయి. పథకం కోసం పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్లు తప్పనిసరి చేయడంతో వాటికి చట్టబద్ధత చేకూరుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ పథకాల అమలుకు నిధుల కొరత ఆయా కుటుంబాలకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. పలు సందర్భాల్లో పెళ్లి రోజున చెక్కులు అందజేసిన రోజులు ఉండగా.. మరికొందరికి పెళ్లయిన నెలరోజుల్లోగా నగదు చేతికందని సందర్భాలు ఉన్నాయి. అయితే ఈసీజన్‌లో పెళ్లిళ్లు చేసుకున్న వారికి ప్రభుత్వ సహాయం అందడంలో తీవ్ర జాప్యమవుతోంది.
నవంబరు నుంచి జూన్‌ 10వ తేదీ వరకు ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో ఆ సమయంలో పెళ్లిళ్లు చేసుకున్న వారికి సహాయం అందకుండా పోయింది.

 

 

 

 

జూన్‌ మాసంలో కోడ్‌ ఎత్తివేసినా రెవెన్యూ యంత్రాంగం వేరే పనుల్లో నిమగ్నం కావడంతో దరఖాస్తుల పరిశీలన, క్షేత్రస్థాయి విచారణ ఆలస్యమైంది. తీరా అన్ని ముగిసాక ఇపుడు నిధులు కొరత ఆయా కుటుంబాలకు శాపంగా మారింది. ఇటీవల అధికారులు చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమాలను చేపడుతున్నా మెజార్టీ కుటుంబాల వారికి చెక్కులు పెండింగ్‌లో ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

 

 

 

జిల్లా వ్యాప్తంగా 14,792 కుటుంబాలు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ పథకాల కింద ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోగా.. అందులో 13,420 మందికి ఆర్థిక సహాయం అందించినట్లుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎస్టీ, బీసీ వర్గాలకు సరిపడా నిధులు లేక తహసీల్దార్‌, ఆర్డీవో కార్యాలయాల్లో దరఖాస్తుల ఆమోదం పెండింగ్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆన్‌లైన్‌లో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుంటే..

 

 

 

 

ఆ దరఖాస్తుకు తొలుత తహసీల్దారు, ఆతర్వాత ఆర్డీవో ఆమోదం తెలిపాక ఎమ్మెల్యే సైతం తన అంగీకారం తెలపాల్సి ఉంటుంది. విచారణ పేరిట తహసీల్దార్‌ కార్యాలయాల్లో అత్యధికంగా.. ఆ తర్వాత ఆర్డీవోల వద్ధ. మరికొన్ని ఎమ్మెల్యే వద్ద ఆమోదం తీసుకోవడంలోనూ లబ్ధిదారులకు సరైన సమయంలో ఆర్థిక సహాయం అందడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

 

 

 

 

కొందరు ఎమ్మెల్యేలు ఉదారంగా వ్యవహరిస్తూ తహసీల్దారులను స్థానిక నేతలతో కలిసి చెక్కులు ఇచ్చుకోవాలని పురమాయిస్తుంటే.. మరికొందరు మాత్రం తామే ఇస్తామంటూ పట్టుబడుతుండటం కూడా చెక్కుల పంపిణీలో ఆలస్యమవుతోందని ఆయావర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతమైతే అందుబాటులో ఉన్న నిధుల మేరకు చెక్కుల పంపిణీ జరుగుతున్నా.. నిధుల లేమితో చాలామంది సర్కారు సాయం కోసం ఎదురుచూడక తప్పని పరిస్థితి నెలకొంది.

రొయ్యకు రూల్స్ లేవ్. 

Tags: Can Kalyana Lakshmi be kind?

రొయ్యకు రూల్స్ లేవ్. 

Date:22/07/2019

శ్రీకాకుళం ముచ్చట్లు:

 

జిల్లాలో విచ్చలవిడిగా రొయ్యల చెరువుల సాగు పేరుతో జరుగుతున్న ఆక్రమణలు, నిబంధనల అతిక్రమణలు వ్యవస్థనే దిశానిర్దేశం చేసే స్థాయిని దాటుతున్నాయి. రొయ్యల మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేసే పరిస్థితిని మానుకుని చోద్యం చూసే పరిస్థితికి అధికార యంత్రాంగం వచ్చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తీరం వెంబడి వేలాది ఎకరాల్లో సాగుతున్న ప్రకృతి ధ్వంసంపై ప్రశ్నించే గొంతుకే కరవవుతుందన్న విశ్లేషకుల ఆవేదన సముద్ర ఘోషలో కలిసి పోతోంది. జిల్లాలో కవిటి, సోంపేట, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, పోలాకి, గార, ఎచ్చెర్ల మండలాల్లో రొయ్యల చెరువుల సాగు జరుగుతోంది. ప్రతి ఏటా రొయ్యల చెరువుల సాగు పెరుగుతూ వస్తోంది. విచ్చలవిడిగా పెరుగుతున్న రొయ్యల సాగుతో ఆదాయం సమకూరే మాట అటుంచితే ప్రకృతికి, పర్యవసానంగా వ్యవసాయానికి తీరని నష్టం వాటిల్లుతోంది.

 

 

అనుమతుల్లేకుండా పంటపొలాల్లో రొయ్యల చెరువులు నిర్మించడం అతిక్రమణ అయితే, ప్రభుత్వ భూముల్లో ప్రకృతిని ధ్వంసం చేసి రొయ్యల చెరువులు  నిర్మించి సాగు చేయడం ఆక్రమణ. ఇలా రెండు వైపులా సాగుతున్న దందాతో అంతర్లీనంగా వ్యవసాయ రంగానికి పరోక్ష నష్టం జరుగుతోంది.జిల్లాలోని సముద్ర తీరానికి అనుకుని ఉన్న తంపర భూములు, చిత్తడి నేలలు ఆక్రమణలు చేసి వేలాది ఎకరాల్లో రొయ్యల చెరువుల నిర్మాణాలు జరిగాయి. దీంతో సముద్ర క్రీక్‌లు మూసుకుపోతున్నాయి. సంతబొమ్మాళి మండలంలోని భావనపాడు క్రీక్‌లు, జగన్నాథపురం క్రీక్‌లు దాదాపుగా మూసుకుపోయాయి. ఏడు మండలాల నుంచి వివిధ గెడ్డల ద్వారా సముద్రంలో కలవాల్సిన వరదనీరంతా స్వేచ్ఛగా వెళ్లే పరిస్థితి కోల్పోయింది. రొయ్యల చెరువుల అడ్డుతో పంట పొలాలు ఏటా ముంపు బారిన పడుతున్నాయి. వారాలకొలదీ ముంపులోనే ఉండిపోతున్నాయి.

 

 

 

 

మరో వైపు చిత్తడి నేలలన్నీ రొయ్యల చెరువులుగా మారిపోతుండడంతో ఆయా ప్రాంతాల్లో జీవనం సాగించే వివిధ రకాల జాతులు కనుమరుగయిపోతున్నాయి. దీంతో జీవవైవిధ్యం దెబ్బతింటోంది.వ్యవసాయ భూముల్లో రొయ్యల, చేపల చెరువులు తవ్వాలంటే ఆ భూములకు సంబంధించిన రైతులు అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. ఆ భూములను రెవెన్యూ, వ్యవసాయ, నీటిపారుదల, మత్స్యశాఖల అధికారులు బృందంగా పరిశీలించాలి. అవి సాగుకు పనికిరావని, నిస్సారవంతమైనవిగా ధ్రువీకరించాలి.

 

 

 

 

రొయ్యల చెరువులుగా తవ్వుకోవడానికి చుట్టుపక్కల రైతుల నుంచి ఎటువంటి అభ్యంతరాలు లేవని మండల కమిటీ జిల్లాస్థాయి కమిటీకి సిఫార్సు చేయాలి. జిల్లాస్థాయి కమిటీ పరిశీలించి వాటికి సంబంధించి ఎటువంటి అభ్యంతరాలు లేవని ధ్రువీకరించిన తరువాతే చెరువుల తవ్వకాలకు అనుమతులు జారీ చేస్తారు. అయితే జిల్లా స్థాయి కమిటీ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండానే భారీగా యంత్రాలతో తవ్వేస్తున్నారు. ఇప్పటికే సంతబొమ్మాళి మండలంలో నౌపడ, మర్రిపాడు, ఆకాశ లఖవరం, మూలపేట, జగన్నాథపురం, సున్నాపల్లి, తదితర ప్రాంతాల్లో వ్యవసాయ సాగు భూములన్నీ రొయ్యల చెరువులుగా మారిపోయాయి. వీటిల్లో చాలా వరకు ఎటువంటి అనుమతులు లేవని తెలుస్తోంది.

 

 

 

రొయ్యల చెరువుల దందాలో వారు వీరంటూ ఎవరికీ మినహాయింపు లేనట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి. అవకాశమున్నచోట ఎవరికి దొరికింది వారి జేబులు నింపుకొంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఇందులో అధికార, ప్రతిపక్షమన్న బేధం లేదు. ఉద్యోగి, అధికారి అన్న వ్యత్యాసం లేదు. అందరికీ అందులో భాగస్వామ్య ముందన్న ఆరోపణలకు సమాధానమే యేటికాయేడు పెరుగుతున్న రొయ్యల చెరువుల విస్తరణ.

 

 

 

 

ప్రభుత్వ భూమిని కళ్లెదుటే ఆక్రమించి రొయ్యల చెరువులుగా మార్చేస్తుంటే అధికారులు ఆక్రమణదారుడు నష్టపోకుండా మానవతా దృక్పథంతో కొంతకాలం చేసుకోవడానికి సమయమిచ్చామంటూ చెబుతున్న వివరణలు లోగుట్టును తేటతెల్లం చేస్తున్నాయి. తాజాగా మారిన పరిస్థితుల్లో ఎకరాకు రూ.30 వేలు నుంచి రూ.లక్ష వరకు ఏడాదికి వసూళ్ల రూపంలో వెళ్లిపోతుందన్న బహిరంగ రహస్యాలు అందరినీ విస్తుపోయేలా చేస్తున్నాయి.

గ్రేటర్లో ఉన్న 457 పురాతన శిథిల భవనాలపై చర్యలు – దానకిషోర్

Tags: Rules Leave to Shrimp.

గ్రేటర్లో ఉన్న 457 పురాతన శిథిల భవనాలపై చర్యలు – దానకిషోర్

Date:22/07/2019

హైదరాబాద్ ముచ్చట్లు:

“జీహెచ్ఎంసీ పరిధిలో ఇంకా 457 పురాతన శిథిల భవనాలు ఉన్నాయి. వీటిని కూల్చివేయడానికి వీలుగా మరోసారి నోటీసులు సంబంధిత యజమానులకు నోటీసులు జారీచేయాలి. లేదా ఆ భవనాలలో నివాసితులను ఖాళీ చేయించి సీల్ చేయాలి. ప్రమాదానికి తావులేకుండా మరమ్మతులు చేయించాలి.”  అని జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ టౌన్ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో జోనల్, డిప్యూటి కమిషనర్లతో వివిధ అంశాలపై వీడియో కాన్ఫ్రెన్స్ నిర్వహించారు.

 

 

 

 

జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్లు అమ్రపాలి కాట, అద్వైత్ కుమార్ సింగ్, సిక్తాపట్నాయక్, కెనడి, కృష్ణ, చీఫ్ ఇంజనీర్లు సురేష్, జియాఉద్దీన్, టౌన్ప్లానింగ్ ఉన్నతాధికారులు దేవేందర్రెడ్డి, శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ దానకిషోర్ మాట్లాడుతూ సికింద్రాబాద్ సర్కిల్లో ఆదివారం జరిగిన శిథిల భవనం కూలిన సంఘటనలో 13ఏళ్ల బాలుడు మరణించడం తీవ్ర విచారకరమని, ఇంకా నగరంలో ఉన్న 457 శిథిల భవనాలను కూల్చివేయడం, సీజ్ చేయడం వెంటనే చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ శిథిల భవనాల తొలగింపు, సీజ్ చేయడం, మరమ్మతులు నిర్వహించడం తదితర అంశాలపై దీర్ఘకాలికంగా సమీక్షిస్తున్నప్పటికీ ఈ విషయంలో అలసత్వం వహిస్తున్న టౌన్ప్లానింగ్ అధికారులకు చార్జ్ మెమోలు జారీచేయాలని కమిషనర్ ఆదేశించారు.

 

 

 

 

2016లో 485, 2017లో 294, 2018లో 402 శిథిల భవాలను జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కూల్చివేయగా ఈ సంవత్సరం 765 శిథిల భవాలను గుర్తించగా వీటిలో ఇప్పటి వరకు 176 భవనాలను కూల్చివేయడం జరిగిందని, మరో 132 శిథిల భవనాలను సీజ్ చేయడం, లేదా మరమ్మతులు చేయించడం జరిగిందని దానకిషోర్ తెలిపారు. ఇంకా మిగిలి ఉన్న 457 శిథిల భవనాల పై వెంటనే తగు చర్యలు చేపట్టాలని టౌన్ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ఖైరతాబాద్ జోన్లో అత్యధికంగా 197 శిథిల భవనాలు, చార్మినార్ జోన్లో 122, సికింద్రాబాద్ జోన్లో 104, ఎల్బీనగర్ జోన్లో 19, శేరిలింగంపల్లి జోన్లో 8, కూకట్పల్లి జోన్లో 7 శిథిల భవనాలు ఉన్నాయని కమిషనర్ వివరించారు.

 

 

 

 

వీటిలో అత్యధికంగా గోషామహల్ సర్కిల్లో 99 శిథిల భవనాలు ఉండగా బేగంపేట్ సర్కిల్లో 64, చార్మినార్ సర్కిల్లో 55, ఖైరతాబాద్ సర్కిల్లో 41 శిథిల భవనాలు ఉన్నాయని తెలిపారు. బోనాలు జరిగే ఆలయాల వద్ద హరితహారం మొక్కల పంపిణీ
జీహెచ్ఎంసీ పరిధిలో బోనాలు జరిగే ఆలయాల వద్ద భక్తులకు ఉచితంగా మొక్కలు పంపిణీ చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. హరితహారం పై సమీక్షిస్తూ నగరంలో హరితహారానికి కోటి మొక్కలు సిద్దంగా ఉన్నాయని, వీటిని నాటడంతో పాటు ఆగష్టు మాసాంతం వరకు ఉచిత పంపిణీని పూర్తిచేయాలని స్పష్టం చేశారు.

 

 

 

 

 

 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 47 థీమ్ పార్కులను కొత్తగా నిర్మించాలని నిర్ణయించామని, ఈ పార్కుల్లో కనీసం రెండు నుండి మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వాటిని గుర్తించి ప్రతి జోన్లో రెండు స్వచ్ఛ భారత్ అంశాలు ప్రతిభింబించేలా స్వచ్ఛ థీమ్ పార్కులను నిర్మించాలని, జోన్కు ఒక వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్కును నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు. నగరంలోని జంక్షన్లు, పార్కులను ఏవిధంగా వినూత్న పద్దతిలో నిర్మించాలి, నిర్వహణ, డిజైనింగ్ తదితర అంశాలపై త్వరలోనే ఈ రంగంలో నిపుణులతో వర్క్ షాప్ నిర్వహించనున్నట్టు దానకిషోర్ తెలిపారు. నగరంలో ఉన్న ఎస్.టి.పిల నుండి వచ్చే నీటిని అన్ని పార్కులకు ఉపయోగించేందుకు ఎస్.టి.పిల నుండి ప్రత్యేక పైప్లైన్లను నిర్మించాలని సూచించారు.

 

 

 

 

57-64 మధ్య వృద్దులను గుర్తించేందుకు 175 బృందాలుహైదరాబాద్ జిల్లాలో 57 ఏళ్ల నుండి 64 ఏళ్ల మధ్య వయస్కులను గుర్తించేందుకు సర్కిళ్ల వారిగా 175 బృందాలు నియమించడం జరిగిందని కమిషనర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వృద్దాప్య పించన్ల
మంజూరు వయస్సును 57 సంవత్సరాలకు నిర్థారించినందున, ఈ వయస్సు గల వారి ముసాయిదా జాబితాను జూలై 25వ తేదీలోపు పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ఇందుకుగాను రోజువారి లక్ష్యాలను నిర్థారించుకోవాలని సూచించారు.

శాసనమండలి నుండి టీడీపీ వాకౌట్

Tags: Actions on 457 Ancient Ruins in Greater – Danakishore

శాసనమండలి నుండి టీడీపీ వాకౌట్

Date:22/07/2019

అమరావతి ముచ్చట్లు:

కరువు , అనావృష్టి పై సోమవారం శాసనమండలిలో  చర్చ జరిగింది. మంత్రి బోత్సచ సత్యనారాయణ మాట్లాడుతతూ కరువు పై అన్ని జిల్లాల నుండి  సమగ్ర  నివేదికను తెప్పిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో అతి తక్కువ వర్షపాతం నమోదు అయింది.  ఆత్మహత్యలు ఎవరు చేసుకున్నా, ఎటువంటి పరిస్థితుల్లో చేసుకున్నారు అనే  దాని నివేదిక తయారు చేస్తున్నామని అయన అన్నారు. ఐదు  సంవత్సరాల్లో గత  ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించింది. చర్చ జరుగుతున్న సమయంలో సభ నుండీ మంత్రి వెళ్ళిపోయారు. ముఖ్యమైన అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో మంత్రి వెళ్లిపోవడం పై టీడీపీ శాసనమండలి సభ్యులు నిరసన వ్యక్తం చేసారు. చర్చ పై  సరైన సమాధానం రాకపోవడం, మంత్రి మండలి నుండి వెళ్లిపోవడంతో మండలి నుండి టీడీసీ సభ్యులు వాకౌట్ చేసారు.

కాల్ మనీ పై ఎంపీ కేశీనేని నాని ట్వీట్

Tags: TDP walkout from legislature

కాల్ మనీ పై ఎంపీ కేశీనేని నాని ట్వీట్

Date:22/07/2019

విజయవాడ  ముచ్చట్లు:

కాల్ మనీ మాఫీయా వల్ల ప్రజలు పడే ఇబ్బందులు ఈ రాష్ట్రంలో అందరి కంటే ఎక్కువ డీజీపీ గౌతమ్ సవాంగ్కే తెలుసని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని అన్నారు. కాల్ మనీ మాఫియా బారిన ప్రజలు పడకుండా కాపాడాలని ఆయన కోరారు. ఈమేరక ఆయన ఇవాళ ట్వీట్ చేశారు. కాల్ మనీ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులకు సంబంధించి పత్రికల్లో వచ్చిన కథనాన్ని ట్వీట్కు అటాచ్ చేశారు కేశినేని నాని.

 

 

 

 

ఓ టీడీపీ నాయకుడిని టార్గెట్ చేసుకుని ట్వీట్లతో సోషల్ మీడియాలో తీవ్ర దుమారం లేపుతున్న నాని కాల్మనీ వ్యవహారానికి సంబంధించిన సమస్యను డీజేపీ దృష్టికి తీసుకెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. సదరు టీడీపీ నేత గతంలో కాల్మనీ కేసుల్లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఆయణ్ని టార్గెట్ చేసుకునే ఈ ట్వీట్ చేసినట్టు భావిస్తున్నారు.

హెచ్.సి.యు లో ఓ విద్యార్థిని అనుమానాస్పదస్థితిలో బాత్రూంలో మృతి

Tags: Nani tweeted MP Keshineni on Call Money

హెచ్.సి.యు లో ఓ విద్యార్థిని అనుమానాస్పదస్థితిలో బాత్రూంలో మృతి

Date:22/07/2019

హైదరాబాద్ ముచ్చట్లు:

అనుమానాస్పద స్థితిలో ఓ విద్యార్థిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో హాస్టల్ లో ని  బాత్రూం లో మృతి చెందిన సంఘటన సోమవారం ఉదయం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖరగ్పూర్ నగరానికి చెందిన   దీపికా మహాపాత్ర (29) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ చదువుతోంది. ఈ విద్యార్థిని సోమవారం నాడు ఉదయం  8 గంటల ప్రాంతంలో బాత్రూంలో  అనుమానాస్పద స్థితిలో పడిపోయి ఉంది.

 

 

 

 

తోటి విద్యార్థులు  చూసి వెంటనే కాలేజీ యాజమాన్యానికి సమాచారం అందించారు. కాలేజీ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించడంతో సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ఆ విద్యార్థిని స్థానిక ఓ ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. అప్పటికే ఆమె చనిపోయిందని హాస్పిటల్ వర్గాలు నిర్ధారించారు.

 

 

 

 

 

 

అయితే పోలీసులు అప్పటికే ఆమె మెడికల్ రికార్డులు, తోటి స్నేహితులు బంధువులను పరిశీలించి ఆమెకి మెదడుకు సంబంధించిన కొన్ని వ్యాధులు ఉన్నట్లు  పేర్కొన్నారు. ఆ వ్యాధుల వలన ఆమె కళ్ళు తిరిగి పోయి బాత్రూంలో మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.  ఈ మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చంద్రయాన్ 2 సక్సెస్

Tags: One student in HCU dies in suspicious bathroom