పోలవరంపై బ్లేమ్ గేమ్ నడుస్తోంది : మాజీ ఎంపీ ఉండవల్లి

Date:21/03/2018
రాజమండ్రి  ముచ్చట్లు:
పోలవరం  పై   కలకన్నారా   అంటూ  పవన్  కళ్యాణ్ పై  సి.ఎం.  చంద్రబాబు చేసిన   వ్యాఖ్యలు   సరికాదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. పవ న్  ఫ్యాక్ట్   ఫైండింగ్   కమిటీలో  పోలవరం పై  కూడా   చర్చించామని అన్నారు. బుధవారం నాడు అయనమీడియాతో మాట్లాడారు. పోలవరం  విషయంలో   ఏం  జరుగుతుందో   ఎవరికీ  అర్థం   కావడం  లేదు.పోలవరం నిర్మాణం, చెల్లింపులపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మధ్య ఇప్పటి వరకూ ఒప్పందమే జరగలేదని అయనఅన్నారు. ఆర్ అండ్ ఆర్ తొలివిడత ప్యాకేజ్ కోసం నిధులు సిద్ధం చేసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించాల్సిన అఘత్యం ఎందుకు ఏర్పడిందని అయన ప్రశ్నించారు. మౌఖిక ఆదేశాల ద్వారా అధికారులను  ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలవరంపై ఏడు సమావేశాలు జరిగితే ఒక్క మినిట్స్ లో కూడా ముఖ్యమంత్రి ప్రస్తావన లేకపోవడానికి కారణం ఏంటని అడిగారు. పరిహారం చెల్లింపుల్లో అక్రమాలు జరుగుతున్నాయ్. తాడువాయి, చెల్లవారి గూడెంల్లో 1300ఎకరాల పోరంబోకు భూములకు పరిహారం చెల్లించారని ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. విభజన మండలాల్లో పరిహారం పేరుతో జరుగుతున్న అక్రమాలపై స్థానికులు నుంచి సమాచారం వస్తోంది.  త్వరలోనే అన్ని వివరాలు బయటపెడతానని అన్నారు. అవిశ్వాసతీర్మానంపై రాజకీయపార్టీలను సమన్వయం చేయాల్సిన బాధ్యత చంద్రబాబుదే. అవిశ్వాసంపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు చిత్తశుద్ధిలేదు.  సినీనటులు ప్రత్యేక ఉద్యమంలోకి వస్తే  మంచిదే.  అందుకు మురళీమోహన్ లాంటి వారు చొరవతీసుకోవాలని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో చంద్రబాబుకు వున్నది శత్రుత్వమో  మిత్రుత్వమో బయటపెట్టాలని అన్నారు.  ప్రజలను కన్ఫ్యూజన్లో వుంచడం సరైనది కాదని అన్నారు. .పోలవరంలో  వేలు  పెడితే   కాలిపోతారంటున్న  చంద్రబాబు, మరి కేంద్రం బాధ్యతను  తాను  ఎందుకు  భుజాన  వేసుకున్నారని ప్రశ్నించారు. పునరావాసం  కోసం  33 వేల  కోట్ల  రూపాయల  ఎక్కడ  నుంచి  తెస్తారని  రాష్ట్రాన్ని   కేంద్రం  ప్రశ్నించడం దారుణం. పోలవరం పై   కేంద్ర,  రాష్ట్రాల  మధ్య   బ్లేమ్   గేమ్ జరుగుతోందని ఆరో్పించారు.
Tags:Running out of the game Game Running: Former MP

వెంకన్న సన్నిధిలో చంద్రబాబు

 Date:21/03/2018
తిరుమల  ముచ్చట్లు:
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమలలో శ్రీ వారిని దర్శించుకున్నారు. సాంప్రదాయం ప్రకారం వైకుంఠం నుండి ఆలయ ప్రవేశం చేసారు. చంద్రబాబుకు మహా ద్వారం వద్ద ఇస్థికాపాల్ తో టిటిడి అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి హోదాలో మహా ద్వార ప్రవేశం ఉన్నప్పటికీ అయన  భార్య భువనేశ్వరి, కొడుకు లోకేష్, కోడలు బ్రహ్మణీ, మనవడు దేవాంశ్ , బావ మరిది భాలకృష్ణ కుటుంబంతో కలిసి వైకుఠం నుండి ఆలయంలోపలికి వచ్చారు. బుధవారం తన మనవడు దేవాంశ్ పుట్టినరోజు కావడం వల్లనే స్వామి ఆశ్సీస్సులకోసం చంద్రబాబు తిరుమల కు వచ్చారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం శ్రీ వెంగమాంబ అన్న ప్రసాదం హాల్ కు అయన వచ్చారు.  అన్న ప్రసాదం సేవకులు ముఖ్యమంత్రికి,  కుటుంబ సభ్యులకు టిటిడి సేవా స్కార్ఫ్ ను గౌరవంగా వేశారు. తరువాత వారంతా అన్న ప్రసాదం హాల్లో భక్తులకు అన్న ప్రసాదాలను భక్తిపూర్వకంగా వడ్డించి, భక్తులతో కలిసి అన్న ప్రసాదం సేవించారు.  అన్న ప్రసాదం స్వీకరించిన అనంతరం, మనుమడు నారా దేవాన్ష్ తరఫున 26 లక్షల రూపాయల విరాళాన్ని డిడి రూపంలో  శ్రీవారి అన్న ప్రసాదం సేవకోసం టిటిడి ఈఓ, తిరుమల జేఈఓ లకు చంద్రబాబు అందించారు. తరువాత అయన మీడియాతో మాట్లాడారు. విభజన చట్టంలోని హామీలను  కేంద్రం అమలు చేయాలని అన్నారు. రాష్ట్ర విభజన ,సమయంలో ఎంతో బాధపడ్డా. ఎపికి ప్రత్యేక హోదా సాధించే ధైర్యం ఇవ్వమని స్వామివారిని ప్రార్థించానని అన్నారు. కేంద్రంపైన పోరాటం కొనసాగుతూనే ఉంది. జపాన్ తరహాలో ఆందోళన, అభివృద్ధి రెండూ కొనసాగుతోంది. మా ఇంటి కులదైవం – నేను ఆరాధించే దేవుడు వేంకటేశ్వరస్వామి. నా మనవడు దేవాన్ష్ కు మూడేళ్ళు పూర్తి కావడంతో శ్రీవారిని దర్సించుకున్నామని అయన అన్నారు. తిరుమలలో రాజకీయాలను మాట్లాడనంటూనే ఐదు నిమిషాల పాటు ఎపిలో నెలకొన్న పరిస్థితులు, టిడిపి కేంద్రంపై చేస్తున్న పోరాటాన్ని మీడియాకు సీఎం వివరించారు.

Chandrababu in Venkanna Sannidhi
Chandrababu in Venkanna Sannidhi
Tags:Chandrababu in Venkanna Sannidhi

కర్ణాటకలో తెరపైకి లింగాయత్ లు

Date:21/03/2018
బెంగళూర్  ముచ్చట్లు:
కర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచేందుకు కాంగ్రెస్ అన్ని విధాలా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే క‌న్నడ భావ‌న‌ను రెచ్చగొట్టడానికి శతవిధాలా యత్నిస్తున్న కాంగ్రెస్ ‘లింగాయత్’ల అంశంతో బీజేపీని ఇరుకున పెట్టింది. లింగాయత్‌ను ప్రత్యేక మతంగా గుర్తించడానికి కర్ణాటక కేబినెట్  అంగీకారం తెలిపింది. ఈ మేరకు ఓ నివేదిక రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఆరెస్సెస్ ఇప్పటికే ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది హిందూ మతాన్ని చీల్చే చర్య అవుతుందని మండిపడింది.లింగాయత్‌లకు ప్రత్యేక మతం హోదా ఇచ్చే అంశంపై నిర్ణయం వెలువరించాల్సిన బాధ్యత ఇప్పుడు కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంది. ఈ అంశాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తు్న్నామని, త్వరలోనే నిర్ణయం వెలువుస్తామని కేంద్ర హోంశాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. అయితే.. బీజేపీ ప్రభుత్వం ఈ అంశంపై సానుకూలంగా నిర్ణయం తీసుకున్నా, వ్యతిరేకించినా కాంగ్రెస్ పార్టీకే లాభం చేకూరనుంది. ఆవిధంగా పక్కా వ్యూహం రచించడంలో కర్ణాటక కాంగ్రెస్ విజయవంతమైంది.లింగాయత్‌లకు మతం హోదా కల్పించే తమ ప్రతిపాదనకు కేంద్రం నుంచి ఆమోదం లభిస్తే.. అది తమ విజయంగా చెప్పుకొని ఎన్నికల్లో కాంగ్రెస్ లబ్ధి పొందాలని చూస్తోంది. ఒకవేళ కేంద్రం ఆ నిర్ణయాన్ని తిరస్కరిస్తే.. తాము అంగీకరించినా బీజేపీ అడ్డుపడిందని ప్రచారం చేయడం ద్వారా మరింత లాభం పొందడానికి కాంగ్రెస్ నేతలు స్కెచ్ వేశారు. నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వర్గాలతో కాంగ్రెస్ పార్టీకి జరిగే నష్టంతో పోలిస్తే లాభమే ఎక్కువ.మొత్తంమీద ఎన్నికల ముందు కర్ణాటకలో లింగాయత్‌ల ఓట్లను కొల్లగొట్టే దిశగా కాంగ్రెస్ పటిష్టమైన వ్యూహాన్నే అనుసరించింది. ఆ రాష్ట్ర జనాభాలో సుమారు 15 శాతం వరకూ ఉన్న లింగాయత్‌ల తీర్పు ఎన్నికల్లో కీలకం కానుంది. గెలుపోటములపై ఆ వర్గం తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ నేపథ్యంలో వారిని మచ్చిక చేసుకోవడంలో కాంగ్రెస్ విజయవంతమైంది. దేశంలో ఒక్కో రాష్ట్రాన్ని తమ ఖాతాలో వేసుకుంటూ జైత్రయాత్ర సాగిస్తు్న్న బీజేపీని కర్ణాటకలో ఎలాగైనా అడ్డుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఉంది.కర్ణాటక ఎన్నికల్లో అధికార, విపక్ష పార్టీలు రెండూ అధికారం కోసం అన్ని దారులూ వెతుకుతున్నాయి. వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని రెండు పార్టీలూ వదులుకోవడం లేదు. ఈ ఏడాదిలోనే కర్ణాటక విధాన సభకు ఎన్నికలు జరగుతుండటంతో అప్పుడే ఎన్నికల వాతావరణం రాష్ట్రంలో అలుముకుంది. కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి బీజేపీని దక్షిణాదిన లేకుండా చేయాలని అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. బీజేపీని ఇబ్బందిపెట్టేందుకు వరుసగా నిర్ణయాలు తీసుకుంటూ బీజేపీకి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. ఇందులో భాగంగా కర్ణాటకలో బలమైన సామాజిక వర్గం లింగాయత్ లను ప్రత్యేక మతంగా గుర్తించేందుకు ప్రభుత్వం సిద్దమయింది. వారికి మతపరమైన మైనారిటీ హోదాను కూడా కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అయిపోయింది. ఈ మేరకు దీనిపై అధ్యయనం చేసిన రిటైర్డ్ జస్టిస్ నాగమోహన్ దాస్ కమిటీ సిఫార్సులను సిద్ధరామయ్య సర్కార్ ఆమోదించింది.ఈ సిఫార్సులను కేంద్రానికి పంపడం ద్వారా బంతిని కేంద్రంలోకి నెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో సిద్ధరామయ్య ఆ పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. అయితే దీనిని వీర శైవులు వ్యతిరేకిస్తున్నారు. అయినా కర్ణాటకలో బలమైన సామాజిక వర్గం లింగాయత్ లు కావడంతో వారి ప్రాపకం పొందేందుకు సిద్ధరామయ్య సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే బీజేపీ మాత్రం రాజకీయ అవసరాల కోసమే సిద్ధరామయ్య ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శలు చేస్తోంది. ప్రజలను విభజించి అధికారంలోకి రావడానికి సిద్ధరామయ్య ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. యడ్యూరప్ప కూడా లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో కాంగ్రెస్ నిర్ణయం బీజేపీకి ఇబ్బందిగా మారింది.కర్ణాటకలో లింగాయత్ లు 17 శాతం మంది ఉన్నారు. వీరిని మచ్చిక చేసుకునేందుకు రెండు పార్టీలూ గత కొంతకాలంగా హామీలు గుప్పిస్తున్నాయి. కొన్నేళ్లుగా లింగాయత్ లు తమను ప్రత్యేక మతంగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. మతపరమైన మైనారిటీ హోదా ఇవ్వాలన్నది కూడా వారి ప్రధాన డిమాండ్. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వారి డిమాండ్ మరింత ఊపందుకుంది. నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే సిద్ధరామయ్య ప్రభుత్వం నాగ మోహన దాస్ నేతృత్వంలో కమిటీని నియమించింది. ఆ కమిటీ అధ్యయనం చేసి నివేదిక అందించిన తర్వాత కమిటీ సిఫార్సులను కర్ణాటక ప్రభుత్వం ఆమోదించింది. లింగాయత్ లు వంద నియెజకవర్గాల్లో గెలుపోటములను నిర్ణయించగలగడంతో ప్రభుత్వం వారి డిమాండ్ కు సానుకూలంగా స్పందించింది. మరి ఎన్నికల సమయంలో వీరు ఎవరికి అండగా నిలుస్తారన్నది ఇప్పుడే చెప్పలేం.
Tags: Lyngatayas on the screen in Karnataka

అధికార పార్టీకి పవన్ టెన్షన్

Date:21/03/2018
విజయవాడ  ముచ్చట్లు:
ప్రశ్నిస్తా.. అంటూ పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ నాలుగేళ్లపాటు ట్విట్టర్‌కే పరిమితం అయ్యారు. అడపాదటపా ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేసినా.. 2014 ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషిచేసిన పవన్‌పై అధికార టీడీపీ సానుకూలంగానే స్పందించింది. రాజధాని భూములు, ఉద్దానం విషయంలో పవన్ సలహాలను తీసుకున్నారు. కొన్ని సందర్భాల్లో పవన్ తెలుగుదేశం నాయకులపై విమర్శలు గుప్పించినా.. సైలెంట్‌గా ఉండాలంటూ చంద్రబాబు పలుమార్లు హెచ్చరికలు జారీ చేయడంతో జనసేన- టీడీపీ మైత్రి మొన్నటి వరకూ బాగానే సాగింది. అయితే దీనివల్ల ఎక్కువ లాభపడింది టీడీపీనే అయినప్పటికీ జనసేన పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చంద్రబాబు కనుసన్నల్లోనే పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని.. ఆయన డైరెక్షన్‌లోనే జనసేన నడుస్తోందంటూ విపరీతమైన ప్రచారం జరిగింది. దీనికి తగ్గట్లే.. పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడా ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. మొన్న తెలంగాణలో పవన్ చేపట్టిన యాత్ర కూడా బాబు డైరెక్షనే అంటూ ప్రచారం జరిగింది. ఇక వీళ్ల మైత్రీబంధం గురించి ప్రతిపక్ష వైసీపీ సందర్భం వచ్చినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తూనే ఉంది. వీటిని తప్పికొట్టే ప్రయత్నం కూడా పవన్ చేయకపోవడంతో పవన్ కళ్యాణ్ టీడీపీతో ఏదో రహస్య ఒప్పందం కుదర్చుకున్నారని.. పవన్ కళ్యాణ్‌ని ప్యాకేజ్‌ కళ్యాణ్, పావలా కళ్యాణ్ అంటూ విమర్శల దాడి చేశారు వ్యతిరేక వర్గం. అయితే నిజంగా పవన్ కళ్యాణ్ అమ్ముడు పోయే వ్యక్తా? ప్యాకేజీలకు లొంగే నైజం జనసైకుడిలో ఉందా? అనే ప్రశ్నలకు ఆన్సర్ దొరకలేదు. అయితే ప్రజల్లో ఉన్న ఈ సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేశారు టాలీవుడ్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. పవన్ కళ్యాణ్‌ను తాను చాలా దగ్గర నుండి చూశానని ఆయన వ్యక్తిత్వం ఏంటో.. ఎలా ఉంటారో మీడియాకి వివరించారు తమ్మారెడ్డి.పవన్ కళ్యాణ్ అమ్ముడు పోవడం.. ప్యాకేజీలకు లొంగేవాడా అన్న ప్రశ్నకు సమధానంగా.. ‘చచ్చినా ఉండదు. సమస్యే లేదు. అతను ఓ మూడీ మనిషి. ఏ మూడ్ వస్తే అది చేస్తాడు. అది మంచా చెడా అని చూడడు. అతని లోకంలో అతను ఉంటాడు. అతని లోకం అప్పుడు పడింది (టీడీపీతో). ఇప్పుడు పడటం లేదు అన్నారు.అయితే తాజాగా మోడీ పవన్ కళ్యాణ్ మూడ్‌ని మార్చరా అన్న ప్రశ్నకు సమాధానంగా.. ‘ఏంటి రహస్యంగా పిలిచేది? నాలుగు సంవత్సరాల పాటు పవన్‌తో టీడీపీ దోస్తీ చేసింది.. అప్పుడు పవన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడితే సంయమనం పాటించాలని చంద్రబాబు అసెంబ్లీలో సైతం అన్నారన్నారు. ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే పవన్ అదీ ఇదీ అంటూ మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన అవసరం ఏంటి? ఇది అసెంబ్లీలో మాట్లాడే విషయమా? ఎందుకు పవన్ గురించి అసెంబ్లీలో మాట్లాడుతున్నారన్నారు. అసెంబ్లీ అనేది పబ్లిక్ కోసం, ప్రజలకు సంబంధించిన విషయాలను చర్చించేందుకు… అంతేకాని వీళ్ల పర్సనల్ విషయాల కోసం కాదు, నలభైఏళ్ల జీవిత చరిత్రను చెప్పుకునేందుకు కాదు. ప్రతి నిమిషం ప్రజల కోసం వెచ్చించాలన్నారు. ఒకవేళ పవన్ గురించి ప్రజలకు చెప్పాల్సి వస్తే పబ్లిక్ మీటింగ్ పెట్టి చెప్పాలంటూ హితవు పలికారు తమ్మారెడ్డి భరద్వాజ.
Tags: Pawan tension to the ruling party

బీజేపీకి మరో యూపీ టెస్ట్

Date:21/03/2018
లక్నో  ముచ్చట్లు:
 గొరఖ్ పూర్, ఫూల్ పూర్ ఉప ఎన్నికల ఫలితాలతో కంగుతిన్న కమలనాధులకు మరో అగ్ని పరీక్ష ఎదురు కానుంది. త్వరలో మరోసారి యోగీ ఇలాకాలో ఉప ఎన్నికలను కమలం పార్టీ ఎదుర్కొనేందుకు సన్నద్థమవుతోంది. సిట్టింగ్ సభ్యుల మృతి కారణంగా కైరానా లోక్ సభ స్థానం, నూర్ పుర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. వీటికి సంబంధించి ఎన్నికల కమిషన్ త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మరోపక్క కమలనాధులను కట్టడి చేసేందుకు ఒకప్పటి ఆగర్భ శత్రువులైన సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ సమాయత్తమవుతున్నాయి. నిజానికి గొరఖ్ పూర్, ఫూల్ పూర్ కన్నా కైరానా, నూర్ పూర్ ఉప ఎన్నికల్లో కమలం పార్టీ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోనుంది. ఇవేమీ కమలం పార్టీ కంచుకోటలు కావు. మొన్నటి ఎన్నికల్లో మోడీ గాలిలో గెలిచినవే తప్ప మొదటి నుంచి పట్టున్న స్థానాలు కావు. అందువల్ల మారిన పరిస్థితుల్లో ఈ ఉప ఎన్నికలు రాష్ట్రంలో, కేంద్రంలో చక్రంతిప్పుతున్న భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా కీలకమైనవే. ఏ మాత్రం తేడా వచ్చినా కమలం పార్టీ పని అయిపోయిందని ప్రచారం చేయడానికి, ఆ పార్టీకి తాటాకులు కట్టడానికి విపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. అందువల్ల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్, ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమైనవి.కైరాన్ నియోజకవర్గ చరిత్రలో 1998లో బీజేపీ ఇక్కడ విజయాన్ని నమోదు చేసింది. మళ్లీ ఆ తర్వాత 2014 ఎన్నికల్లో మోడీ గాలిలో మాత్రమే గెలిచింది. నాటి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి హుకుంసింగ్ 2,36,628 ఓట్ల మెజారిటీతో భారీ విజయాన్ని సాధించారు. ఆయనకు 5,65,909 ఓట్లు రాగా, సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థికి 3,29,081 ఓట్లు రాగా, బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థికి 1,60,414 ఓట్లు లభించాయి. ఈ ఓట్ల వివరాలను చూస్తే కమలనాధులను కట్టడి చేయడం అంతకష్టం ఏమీ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎస్పీ, బీఎస్పీలు కలిస్తే గెలుపు అసాధ్యమేమీ కాదు. 2014 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు కలిపి దగ్గదగ్గరగా అయిదు లక్షల ఓట్లు వచ్చాయి. ప్రభుత్వ వ్యతిరేకతను ఉపయోగించుకుని, విపక్ష ఓట్లు చీలకుండా చూసుకుంటే విజయానికి చేరువ అయినట్లే. షమ్లీ జిల్లాలోని ఈ నియోజకవర్గంలో జాట్, ముస్లిం, యాదవ్ ఓటు బ్యాంకు ఎక్కువ. మొదటి నుంచి ఇక్కడ కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలకు బలం ఎక్కువ. అజిత్ సింగ్ సారథ్యంలోని రాష్ట్రీయ లోక్ దళ్ గతంలో ఇక్కడ గెలిచింది. జాట్ సామాజిక వర్గం ఈ పార్టీకి అండగా ఉంది. చౌదరి చరణ్ సింగ్ కుమారుడైన అజిత్ సింగ్ ఈ సామాజిక వర్గం మద్దతుతోనే మనుగడ సాగిస్తున్నారు. కైరానా, నకుర్, షమి, ధాన, భవన్, గంగోష్ అసెంబ్లీ స్థానాలు ఈ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. హుకుం సింగ్ ఆకస్మిక మరణంతో ఏర్పడిన సానుభూతిని సొమ్ము చేసుకుని విజయతీరాలకు చేరాలని బీజేపీ భావిస్తుంది. ఇందుకోసం ఆయన కూతురు మృంగన్ సింగ్ ను బరిలోకి దించాలని ఆలోచిస్తోంది. గోరఖ్ పూర్, ఫూల్ పూర్ చేదు అనుభవాల నేపథ్యంలో పకడ్బందీగా వ్యవహరించాలని అధినాయకత్వం శ్రేణులను ఆదేశించింది. 1998లో బీజేపీ, 1999, 2004ల్లో రాష్ట్రీయ లోక్ దళ్, 2009లో బీఎస్పీ, 2014లో బీజేపీ ఇక్కడ విజయకేతనం ఎగురవేశాయి. దీనిని బట్టి చూస్తే కైరానా కమలనాధులకు కంచుకోట కాదన్న విషయం స్పష్టమవుతోంది. ఇదే వారికి గుబులు కలిగిస్తోంది.బిజ్నూర్ జిల్లాలోని నూర్ పూర్ అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా బీజేపీ శ్రేణుల్లో భయం కల్గిస్తోంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి లోకేంద్రసింగ్ 79,172 ఓట్లు సాధించి విజయకేతనం ఎగురవేశారు. సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి గోషర్ ఇక్బాల్ 66,463 ఓట్లు సాధించారు. ఫిబ్రవరి 21న లక్నోలో జరుగుతున్న పెట్టుబడి దారుల సదస్సుకు హాజరయ్యేందుకు వెళుతున్న లోకేంద్ర సింగ్ కారు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. 2012, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ వేర్వేరుగా పోటీ చేసి ఓడిపోయాయి. ఈ దఫా ఉమ్మడిగా పోటీ చేస్తే బీజేపీని నిలువరించడం పెద్ద కష్టమేమీ కాదన్నది నాటి భావన. పంజాబ్ లోని గురుదాస్ పూర్, రాజస్థాన్ లోని అజ్మీర్, ఆల్వార్, తాజాగా యూపీలోని గొరఖ్ పూర్, ఫూల్ పూర్ లోక్ సభ ఉప ఎన్నికల ఫలితాలతో డీలా పడిన బీజేపీ తాజా ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఏ చిన్న అవకాశాన్నీ జారవిడుచుకోవడం లేదు. అయినా ఫలితం ఎలా ఉంటుందోనన్న భయం వారికి లేకపోలేదు.
Tags: Another UP Test for BJP

మాటలు కాదు…చేతల్లో కావాలి

Date:21/03/2018
హైదరాబాద్‌ ముచ్చట్లు:
 ఒకటి రెండు నెలల్లోనే భారత రాజకీయాలు కొన్ని మలుపులు తిరుగుతున్నాయి. మూడు నాలుగు సంవత్సరాలుగా రాజకీయాలు సాంస్కృతిక రంగానికి పరిమితమై ప్రజలను మత లేదా కల్చరల్  సమస్యల చుట్టూ సమీకరించే దిశగా సాగుతున్నాయి. కల్చర్ మానవ జీవితంలో ప్రధానైవెునదే కానీ, దానికి రాజకీయ, ఆర్థిక మూలాలుంటాయి. ఈ మధ్యకాలంలో గోరఖ్‌పూర్ లాంటి బలైమెన మతతత్వ ప్రభావముండి మఠాధిపతులు రెండున్నర దశాబ్దాల నుంచి తిరుగులేకుండా గెలిచే ప్రాంతాల్లో స్వయాన యోగి ఆదిత్యనాథ్, అదీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత బీజేపీ అభ్యర్థి ఓడిపోయాడు. దానికి తోడు ఫూల్‌పూర్ నియోజకవర్గంలో కూడా బీజేపీ అభ్యర్థి ఓడిపోయాడు. అయి తే, గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో బీజేపీకి వ్యతిరేకంగా గాలులు వీస్తున్న వాతావరణం కనిపించినా గోరఖ్‌పూర్‌లో ఓటమి రాజకీయాలను ఒక మలుపు తిప్పే ప్రాధాన్యత కలిగుంది. యోగి ఆదిత్యనాథ్‌ను రాష్ట్రీయస్వయం సేవక్ సంఘ్ దాదాపు మోదీకి ప్రత్యామ్నాయంగా లేదా ఆయన వారసుడిగా భావించి ఆయనను దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి ఉపయోగిస్తోంది. తన సొంత నియోజకవర్గంలో తన సొంత అభ్యర్థిని గెలిపించలేని వ్యక్తి ఇతర ప్రాం తాలలో ఎన్నికల ప్రచారం చేయడానికి కావలసిన అర్హత కోల్పోయాడు. ‘ఇంట గెలిచి రచ్చ గెలవాలనే’ నానుడి మనదేశంలో విస్తృతంగా ప్రజల నాలుకలమీద ఆడుతుంది. ఇది యోగికే కాక బీజేపీకి, ఆర్‌ఎస్‌ఎస్‌కి కొంతకాలం కోలుకోలేని దెబ్బ.బీజేపీకిగానీ, ఆ మాటకొస్తే ఏ పార్టీైకెనా ఎన్నిక లలో ఎదురుదెబ్బ తగలడానికి లేదా గాలి ఎదురు తిరగడానికి కారణాలు కొంత లోతుగానే ఉంటాయి. అవి అంత సులభంగా తేలవు. టీవీ చానెల్‌లో జరిగే చర్చలలో లేవదీసే అంశాలకంటే ఈ కారణాలు చాలా నిక్షిప్తంగా ఉంటాయి. గోరఖ్‌పూర్, ఫూల్‌పూర్‌లో ఓడిపోవడానికి ఎస్‌పీ, బీఎస్‌పీ పార్టీల పరస్పర సహకారం అంటున్నారు, అది కొంతవరకు నిజైమెనా గత పార్లమెంటరీ ఎన్నికలలో యోగికి 53 శాతం ఓట్లు వచ్చాయి. ఈ లెక్కన ఈ రెండు పార్టీల సహకారమే కాక వేరే కారణాలు కూడా ఉన్నాయి. యోగి ఆదిత్యనాథ్ గెలిచినప్పటి నుంచి చేపట్టిన సమస్యల లో కల్చరల్ సమస్యలే ఎక్కువ. శాంతిభద్రతల పేర చాలామంది క్రిమినల్స్ అని ఆరోపించి ఎన్‌కౌంటర్ చేశారు. దీనికి కనీసం మావోయిస్టుల ఎన్‌‌ కౌంటర్‌లో చేసే కట్టుకథలు కూడా లేవు. నేరస్తులను సరాసరి చంపవచ్చునా, అది చట్టబద్ధపాలనా పరిధిలో ఇముడుతుందా అనే ప్రమాణం కాక ‘ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగేయుగే’ అనే ధర్మసూత్రం ఉపయోగిస్తే దాని పర్యవసానాలు ఉంటాయని, భార త్ ప్రజలకు కొంతైనా రాజ్యాంగం, రాజ్యాంగపర హక్కులు, చట్టబద్ధ పాలనమీద ఈ ఏడు దశాబ్దాలలో కొంతైనా అవగాహన ఏర్పడిందనేది ఒక వాస్తవం. ఇది ఉన్నతైమెన చైతన్యస్థాయి అని నేనడం లేదు, కానీ కొంత చైతన్యమైనా పెరిగిందనేది నా భావన. భవిష్యత్తులో బీజేపీ రాజకీయాలు అణచివేయండి, అణగదొక్కండి అనే అవగాహన మీద సాధ్యమవుతుందా అనేది వాళ్లు తేల్చుకోవలసిన అంశం. రాజకీయాలు కల్చరల్ పరిధి నుంచి క్రమక్రమం గా ఆర్థిక రాజకీయ సమస్యల వైపు మళ్లడం మనం కొంత స్పష్టంగా చూడవచ్చు. నిజానికి కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికలలో ఎందుకంత చిత్తుగా ఓడిపోయిందనే ప్రశ్నకు చాలామంది అవినీతి అని, స్కాం లని విశ్లేషిస్తూ వచ్చారు. పెద్దపెద్ద టూజీ  స్కాం లాంటి ప్రభావం గ్రామీణ ప్రాంత ప్రజలపై ప్రత్యక్షంగా ఉండదు. ప్రత్యక్షంగా ఉండాలి అంటే రాజ్యం సంక్షేమ రాజ్యమై ఉండాలి. అలాంటప్పుడు 2జీ స్కాం వలన రాజ్యం దాదాపు లక్షా 73 వేల కోట్లు కోల్పోయింది అని అంచనా వేస్తే ఆ ఆదాయం నికరంగా ప్రభుత్వ ఖజానాకు వస్తే అది పేదల సంక్షేమం కొరకు, వైద్యం కొరకు, విద్య కొరకు ఖర్చు పెట్టే విధానాలుంటే ప్రజల జీవనం మీద దాని ప్రభావం ఉంటుంది. దేశంలో వంద కార్పొరేట్ల దగ్గర 49 లక్షల కోట్ల సంపద కేంద్రీకృతైవెునపుడు 2జీ స్కాం వలన అది యాబై లక్షల కోట్లకు చేరుకోలేదనేది వాస్తవం. పేదలను దోచి పెద్దలకు చేరవేసే బాధ్యత రాజ్యం తనమీద వేసుకున్నపుడు స్కాంలు పెద్దల సమస్యేగానీ పేదల సమస్య కాదు. గ్రామీణ ప్రాం తంలో వ్యవసాయక సంపదను కొల్లగొట్టి కేవలం ఒక్కశాతం మంది దేశ ఆదాయంలో 73 శాతం సంపద అనుభవిస్తున్నారని ఆక్స్‌ఫాం ఈ మధ్యే తన అధ్యయనంలో పేర్కొంది. గత నాలుగు అయిదు దశాబ్దాలుగా మొత్తం జాతి ఆదాయంలో వ్యయసాయం తన వాటాను ప్రతి సంవత్సరం కోల్పోతూ ఇపుడు గ్రామీణ ప్రాంతాల వాటా అంటే 60 శాతం ప్రజల వాటా కేవలం 11 శాతానికి పరిమితైమెంది. ఈ ఆర్థిక అభివృద్ధి నమూనా పుణ్యమా అని గత రెండు దశాబ్దాలలో మూడున్నర లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ పెరిగిన అంతరాల వలన నిర్వీర్యమౌతున్న రైతాంగం 2014లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఒక ప్రధాన కారణ మని ఇంతవరకు విశ్లేషకులు కాని, కాంగ్రెస్ పార్టీ కాని అంగీకరించడం లేదు. దీనిని అంగీకరించకున్నా నిన్న మొన్న జరిగిన ఎ.ఐ.సి.సి. ప్లీనరీలో రాహుల్‌గాంధీ రైతాంగాన్ని, వాళ్ల సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ సమస్యను పరిష్కారం చేస్తా మని మొత్తం రుణమాఫీ చేస్తామని, వ్యవసాయ పంటలకు మద్దతుధర ఇస్తామని, రైతు చేసే అన్ని ఖర్చులని,  పరి గణనలోకి తీసుకుని కనీసధర నిర్ణయిస్తామని అన్నా రు. అని ఒకవైపు అంటూనే వ్యవసాయ వ్యతిరేక విధానానికి ప్రధాన సంధానకర్తలైన మన్‌మోహన్ సింగ్, చిదంబరంల సేవలను ప్రత్యేకంగా ప్రస్తావిం చారు. వాళ్ళిద్దరు కూడా ప్రపంచీకరణకు, అంతర్జా తీయ పెట్టుబడికి చేసిన సేవలు అంతా ఇంతా కాదు. ఇద్దరికీ ప్రజలతో ఎలాంటి ప్రత్యేక సంబంధాలు లేవు. ఇద్దరు 2014 ఎన్నికలలో పోటీ చేయలేదు ప్రచారం కూడా చేయలేదు. కాంగ్రెస్ పార్టీ వ్యవ సాయాన్ని అంతర్జాతీయ వాణిజ్య సంస్థలో చేర్చకూడ దని దేశంలో ఒత్తిడి ఉన్నా దానిని విస్మరించి మనం అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందంలో భాగమైపోయాము. ఈ అంగీకారం ప్రకారం రాజ్యం లేదా ప్రభుత్వం వ్యవసాయానికి 10శాతం కంటే ఎక్కువ సబ్సిడీ ఇవ్వడానికి వీలులేదు. అవసర మున్నా లేకున్నా విదేశీ ధాన్యాలను దిగుమతి చేసు కోవాలి. నిజానికి ఈ ఒప్పందం భారతదేశంలోని చిన్న సన్న రైతుల పాలిటి శాపంలాంటిది. పూర్తి రుణ మాఫీ అంటే అంతర్జాతీయ ఒప్పందాన్ని ఉల్లంఘిం చడమే. కాంగ్రెస్ పార్టీకి అంత ధైర్యం, చొరవ ఉందా అన్నది కీలకమైన ప్రశ్న. కాంగ్రెస్ లాగే ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ ముఖ్యమంత్రులు రైతులకు రాయితీలు ఇస్తామని ప్రకటించి ఉన్నారు. కానీ వీళ్ళు ప్రపంచీకరణ, సామ్రాజ్యవాద ప్రభావాన్ని ఎదిరించగలరా, ఆ సత్తా వాళ్ళకుందా అన్నది కీలక ప్రశ్న.రైతాంగ సమస్య రాయితీలకు, రుణమాఫీలకు చెందిన అంశమే కాదు. అవి కేవలం ఒక తీవ్ర సమస్య బహిర్గత రూపాలు  మాత్రమే. రైతాంగ సమస్య మొత్తం సామ్రాజ్యవాద ప్రేరేపిత అభివృద్ధి నమూనాలో భాగం. పెట్టుబడి నిజమైన సంపదగా కాక ద్రవ్యపెట్టుబడిగా మారింది. ద్రవ్య పెట్టుబడి కి విపరీత చలన ముంటుంది. అది ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళి పోవచ్చు. అది పరిశ్రమలలా కాదు. రాజ్యం దానిని ఏమాత్రం ముట్టినా అది భగ్గుమంటుంది. దానికి ఎన్ని లాభాలు వచ్చినా అంతం, ఆది ఉండదు. విదేశీ పెట్టుబడి రావాలంటే, వాళ్ళ లాభాలు విపరీతంగా పెరగాలంటే, వృద్ధిరేటు రెండంకెలు చేరుకోవాలంటే వ్యవసాయ రంగాన్ని పిప్పిపిప్పి చేస్తే కాని సాధ్యం కాదు. మొత్తం నమూనా మూలాలను మార్చవలసి ఉంటుంది. ఇది పాలకులు తమంతగా తాము చేస్తారని మనం భావించడం కేవలం భ్రమే అవుతుంది. రాజకీయాలు ప్రజల సమస్యలను పరిష్క రించడంలో విఫలమైనప్పుడు, చరిత్రలో ప్రజలే ప్రత్యక్షంగా ప్రవేశిస్తారు. దేనిని ఎవ్వరికి వదలరు. గత రెండు దశాబ్దాలుగా తీవ్ర నష్టాల్ని ఎదుర్కొని, ప్రాణాలని సైతం పోగొట్టుకున్న రైతులు ఇప్పుడు సమీకరణ అవుతున్న సంకేతాలు స్పష్టంగా మహారాష్ట్ర నుంచి వచ్చాయి. ముప్పై నలైబై వేలమంది రైతులు మార్చి ఏడు నుంచి మార్చి 12 వరకు అంటే ఐదు రోజులు నాసిక్ నుంచి బయలుదేరి కాలినడకన చాలా క్రమశిక్షణతో బాంబే చేరుకున్నారు. వాళ్ళ డిమాండ్స్ చాలా స్పష్టంగా, నిర్దిష్టంగా ఉన్నవి. అవి తమ జీవిత అనుభవం నుంచి తాము భాగమైన వ్యవసాయ సంక్షోభం నుంచి వచ్చినవి. పోయిన యు.పి. ఎన్నికలలో బీజేపీ రుణమాఫీ ప్రకటించి 34 వేల కోట్లు ఇస్తామని వాగ్దానం చేసినా, భిన్న సాంకేతిక పాలనాపర అభ్యంతరాల వలన అది అమలు కాలేదు. అందుకే ఈ పర్యాయం ఏ అడ్డంకులు, ఆంక్షలు లేకుండా మొత్తం రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిటీ చేసిన సిఫారసులను అమలు చేయాలని అకాలపు వర్షానికి నష్టపోయిన వారికి ఎకరాకు నలబైవేలు ఇవ్వాలని సూటిగా స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వం చేసిన వాగ్దానాల మేరకు తాత్కాలికంగా ఉద్యమాన్ని విరమించి, ఏమాత్రం తాత్సారం చేసినా మళ్ళీ ఉద్యమిస్తామని హెచ్చరిక చేసి తిరిగి వెళ్ళారు. మహారాష్ట్ర రైతాంగ ఉద్యమంలో ఉండే సమస్యలే దేశవ్యాప్తంగా ఉన్నవి. ఉప ఎన్నికలలో బీజేపీ ఓడి పోవడానికి ఈ బలమైన కారణం అంతర్లీనంగా ఉన్న విషయాన్ని మనం గమనించాలి. ఎన్నికలు వచ్చినా, ఒక పార్టీ ఓడి మరొక పార్టీ గెలిచినా అన్ని పార్టీలు  ఒక అభివృద్ధి నమూనాలో చిక్కుకున్నాయి. పాలకులకు ప్రజలకు ముఖ్యంగా రైతాంగానికి మధ్య ఒక అగాథమేర్పడింది. నిజమే ఒకదేశం పారిశ్రామీ కరణ చెందుతున్నప్పుడు వ్యవసాయ ప్రాధాన్యత కొంత తగ్గుతుంది. కాని గ్రామీణ ప్రాంతంలో రైతులతో సహా భూమిలేని నిరుపేదలు ఎక్కడికి పోతారు ఏమౌతారు అనేది ప్రధాన ప్రశ్న. అందుకే గుజరాత్‌లో ‘ఉనా’ సంఘటన తర్వాత దళిత ఉద్యమం ఒక గణనీయమైన మార్పుకు గురైంది. ఇంతకుముందు మధ్యతరగతి దళిత ఉద్యమ డిమాండ్లలా కాక ‘‘ఆవుతోక మీకు ఐదు ఎకరాలు మాకు’’ అనే ఒక బలమైన అర్థవంతమైన డిమాండ్ ముందుకు వచ్చింది. గ్రామీణ ప్రాంతంలో భూసంస్కరణతో బాటు, వ్యవసాయేతర పరిశ్రమ లను వికేంద్రీకరించి ఉత్పత్తి శక్తులను పెంచాలి. దానికి ఉత్పత్తి సంబంధాలు కూడా మారాలి.
Tags: Do not say …

తెలుగువారంతా రగిలిపోతున్నారు

-టిడిపి ఎంపీలతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్
Date:21/03/2018
తిరుపతి ముచ్చట్లు:
బుధవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ ఎంపీలతో టెలికాన్షరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, అసెంబ్లీ వ్యూహ కమిటి ప్రతినిధులు పాల్గోన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ  ప్రజలకోసం పోరాడుతున్నాం.న్యాయం కోసం పోరాడుతున్నాం.మన హక్కుల కోసం పోరాడుతున్నామని అన్నారు. చివరి రోజు వరకు ఇదే స్ఫూర్తితో పోరాడాలి,కలిసికట్టుగా పనిచేయాలి,సంఘటితంగా ఉండాలి. ఆగస్ట్ సంక్షోభంలో 161మంది ఎమ్మెల్యేలు ఒకేతాటిపై చివరిదాకా నిలిచారు,ఘన విజయం సాధించారు. అదే స్ఫూర్తి ఇప్పుడు ఎంపిలు అందరిలో కనిపించాలి,రాష్ట్రానికి న్యాయం జరిగేవరకు పోరాడాలని పిలుపునిచ్చారు. మనకు ఎవరిమీదా  కోపంలేదు, ఎవరిమీదా ద్వేషం లేదు. కేంద్ర పెద్దలు చెప్పినమాట నిలబెట్టుకోలేదు,పైపెచ్చు అన్యాయం చేశారనే భావన ప్రజల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యలు జాతీయ స్థాయి అంశంగా మారాయి. బిజెపి మినహా అన్ని పార్టీలు ఏపి పట్ల సానుభూతిగా ఉన్నాయి,మద్దతు ఇస్తున్నాయని అయన అన్నారు.  ఇది స్ఫూర్తిదాయక సమయం. ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. వైసీపిది లాలూచి అవిశ్వాసం,టిడిపిది 5కోట్ల ప్రజల అవిశ్వాసం,ఈ రెండింటికీ చాలా తేడా ఉందని అన్నారు. కొంతకాలంగా టిడిపిపై బిజెపి అనుమానం పెంచుకుంది. జాతీయ రాజకీయాల పట్ల నాకు ఆసక్తి లేదన్నా వాళ్లు నమ్మడంలేదని అన్నారు. అందుకే రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి అవసరం లేకున్నా వైసీపి మద్దతు తీసుకుంది. నాలుగేళ్లు ఎదురుచూశాం.ఆఖరి బడ్జెట్ లో కూడా మనకు న్యాయం జరగలేదని అయన అవేదన వ్యక్తం చేసారు. దీనితో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వచ్చింది,ప్రజల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబుకింది. అరుణ్ జైట్లీ ప్రెస్ మీట్ ప్రజల్లోకి బలంగా వెళ్లింది. దేశరక్షణ, సైన్యం నిధులు అడిగామనడం ప్రజల్లో ఆవేశం పెంచింది. అనేక అవకాశాలు ఇచ్చినా బిజెపి వినియోగించుకోలేదు. అవిశ్వాసం పెట్టినవాళ్లకు పీఎంవోలో పనేంటని అయన వైసీపిని సూటిగా ప్రశ్నించారు. విజయసాయి రెడ్డిని ఫొటో తీస్తే పీఎంవో వాళ్లు మీడియాను గదమాయించడ ఏమిటి..?ఒకవైపు అవిశ్వాసం నోటీసు ఇస్తారు,మరోవైపు పీఎంవోలో ఉంటారు.అక్కడే వైసీపి చిత్తశుద్ధి తెలిసిపోతోంది. విభజనతో రాష్ట్రం 20ఏళ్లు వెనక్కిపోయింది.మనం ఎంతచేసినా అది కొంతే.20ఏళ్ల అంతరం పూడాలంటే కేంద్రం ఎంత తోడ్పాటు అందించాలని అన్నారు. సామరస్యంగా అడిగినప్పుడు చేయలేదు. మంత్రులు రాజీనామా చేసినా స్పందించలేదు.ఎన్డీఏ నుంచి వైదొలిగినా కదలిక లేదు. అవిశ్వాసం పెట్టినా చేయడం లేదు.కేంద్రం మొండిగా వ్యవహరించడం వెనుక వ్యూహం ఏమిటి..? ఏ భరోసాతో కేంద్రం ఏపీ పట్ల ఇంత కఠినంగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు,అర్ధం చేసుకుంటున్నారు. మనం న్యాయం అడుగుతున్నాం,మన వద్ద సత్యం ఉంది. ఏపికి జరిగిన అన్యాయంపై అన్ని ప్రాంతాల తెలుగువారంతా ఆవేశంతో రగిలిపోతున్నారని అయన వివరించారు. దేశవిదేశాల్లోని తెలుగువారిలో తీవ్ర అసంతృప్తి ఉందని అయన అన్నారు.
Tags: They are all smiling

పాతబస్తీలో కార్డన్ అండ్ సెర్చ్

Date:21/03/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
హైద్రబాద్ పాతబస్తి లొని చార్మినార్, హుసేనిఆలం, బహదూర్ పురా పోలీసు పరిధుల్లొ 250 మంది సిబ్బందితో బుధవారం తెల్లవారుజామున  కార్డన్ అండ్  సెర్చ్ నిర్వహించారు. ఉదయం 5 గంటలకు ప్రారంభించిన  కార్డన్ సెర్చ్ లొ 66 మంది అనుమానితులను అదుపులొకి తీసుకున్నారు.  వీరిలొ మహరాష్ట్ర నాందేడుకు చెందిన 17 మంది కాగా, 32 మంది వైట్నర్ పీల్చేవాళ్లు,  ఆరుగురు రౌడీషీటర్లు, 11 మంది యాచకులను అదుపులొకి తీసుకున్నారు. సరైన ధృవపత్రాలు లేని 22 ద్విచక్ర వాహనాల,  258 లిక్కర్ బాటిల్స్ ను పొలిసులు స్వాధినం చేసుకున్నారు. వైట్నర్ తాగేవాళ్లు,   యాచకులు హంగామా సృష్టిస్తున్నారన్న స్థానికుల ఫిర్యాదు మెరకు కార్డన్ సెర్చ్ నిర్వహించామని సౌత్ జోన్ డిసిపి వి.సత్యనారాయణ తెలిపారు.
Tags: Cordon and search in Old Basti