నిర్దేశిత గ‌డువులోగా మిష‌న్ భ‌గీర‌థ ప‌నులు పూర్తి చేయాలి

-ప్ర‌భుత్వ ల‌క్ష్యాల‌ను సాధించాలి
-ల‌క్ష్యాల సాధ‌న‌కు అధికారుల‌కు దిశానిర్దేశం
-మంత్రులు జోగు రామ‌న్న‌, అల్లోల‌ ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి
Date:21/03/2018
హైద‌రాబాద్‌ ముచ్చట్లు:
నిర్దేశిత గ‌డువులోగా మిష‌న్ భ‌గీర‌థ ప‌నుల‌ను పూర్తి చేయాల‌ని మంత్ర‌లు జోగు రామ‌న్న‌, అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. మంగ‌ళ‌వారం అర‌ణ్య భ‌వ‌న్‌లో ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా మిష‌న్ భ‌గీర‌థ ప‌నుల పురోగ‌తిపై మంత్రులు  స‌మీక్ష నిర్వ‌హించారు. మిష‌న్ భ‌గీర‌థ ప‌నుల విష‌యంలో ఎలాంటి నిర్లిప్త వైఖ‌రిని స‌హించేది లేద‌ని స్ప‌ష్టం చేశారు.  ప్ర‌భుత్వ ల‌క్ష్యం మేర‌కు ప‌నుల‌ను స‌కాలంలో పూర్తి చేయాల‌ని వారు ఆదేశించారు. అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ప‌నుల పురోగ‌తిపై కూలంక‌షంగా చ‌ర్చించారు. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ప‌నుల పూర్తికి తాజా గ‌డువును నిర్దేశించారు. ముఖ్యంగా మంచిర్యాల‌, బెల్లంప‌ల్లి, మందమ‌ర్రి మున్సిపాలిటీల‌తోపాటు నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న తీవ్ర మంచినీటి ఎద్ద‌టి ఈ సంద‌ర్భంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఈ ప్రాంత ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న మంచినీటి స‌మ‌స్య‌ల‌పై మంత్రులు తీవ్రంగా స్పందించారు.  యుద్ధ ప్రాతిప‌దిక‌న పైప్‌లైన్ ప‌నుల‌ను పూర్తి చేసి మంచినీటి స‌మ‌స్య లేకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంత్రులు అధికారుల‌కు సూచించారు. ఓవ‌ర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం, పైప్‌లైన్‌ల ఏర్పాటు, మోట‌ర్ పంపుల‌ బిగింపు,  ఇంట్రా విలేజీ ప‌నులతోపాటు ప‌లు అంశాల‌పై లోతుగా మంత్రులు స‌మీక్షించారు. మిష‌న్ భ‌గీర‌థ ప‌నుల వేగ‌వంతం కోసం అవ‌స‌రాన్ని బ‌ట్టి ప్ర‌త్యేక బృందాల‌ను ఏర్పాటు చేసుకుని, త్వ‌రిత‌గ‌తిన ప‌నుల పూర్తి చేయాల‌ని మంత్రులు జోగు రామ‌న్, అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు. ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంలోని 26 వేల ఇళ్ళ‌కు మిష‌న్ భ‌గీర‌థ కింద మంచినీటి క‌నెక్ష‌న్లు ఇవ్వాల్సిందేన‌ని మంత్రి జోగు రామ‌న్న అధికారుల‌కు సూచించారు. ఈ సమీక్షా స‌మావేశంలో ప్ర‌భుత్వ విప్ న‌ల్లాల ఓదేలు, ఎమ్మెల్సీ పురాణం స‌తీష్ కుమార్‌, ఎమ్మెల్యేలు దివాక‌ర్‌రావు, కోనేరు కోన‌ప్ప‌, బాపురావు రాథోడ్‌, దుర్గం చిన్న‌య్య‌, గ‌డ్డం విఠ‌ల్‌రెడ్డి, కోవా లక్ష్మీ, రేఖా నాయ‌క్‌, మిష‌న్ భ‌గీర‌థ ఈఎన్‌సీ సురేంద‌ర్‌రెడ్డి, సీఈ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి, ప‌బ్లిక్ వ‌ర్క్స్ ఈఎన్‌సీ ద‌న్‌సింగ్‌, జిల్లాలోని మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, ప‌లువురు ఇంజనీర్లు, త‌దిత‌రులు పాల్గొన్నారు.
Tags: In the prescribed time, the mission of the mission is to complete the task

బతుకమ్మ చీరలకు ఏర్పాట్లు షురూ

Date:21/03/2018
కరీంనగర్ ముచ్చట్లు:
‘బతుకమ్మ చీరెలు- 2018’ ఉత్పత్తి ప్రణాళికను జారీ చేశారు. బతుకమ్మ చీరలు-2018లకు అవసరమ్యే మొత్తం వస్త్రాన్ని తెలంగాణలోని నేత కార్మికుల నుండి కొనుగోలు చేయడానికి నిర్ణయించారు. దీని వల్ల సిరిసిల్లలోని ఆసాములకు, కార్మికులకు, అనుబంధ కార్మికులకు ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు గిట్టుబాటు కూలీతో, నిరంతరాయంగా ఉపాధి లభిస్తుందన్నారు. ఈ చీరెల ఆర్డర్‌ను సిరిసిల్లలోని మరమగ్గాల మ్యాక్స్ సంఘాలు, చిన్న తరహా పరిశ్రమలకు ఉత్పత్తి ప్రణాళిక జారీకై ప్రభుత్వం ఆదేశించినట్టు తెలిపారు. వస్త్ర ఉత్పిత్తి క్యాలెండర్ ప్రకారంగా ఇప్పటికే మార్చి-2018లోనే రాజీవ్ విద్యా మిషన్ 2018, సంక్షేమ శాఖలకు చెందిన వస్త్రాన్ని సిరిసిల్లలో ఉత్పత్తి చేసి టెస్కో హైదరాబాద్‌కు అందించినట్టు తెలిపారు. దీనితో ఈ సంవత్సరం పాఠశాలలు తెరిచే రోజున విద్యార్థులకు ఏకరూప దుస్తులే అందించే అవకాశం ఏర్పడిందన్నారు. దీని వలన మొత్త 120 లక్షల మీటర్ల, రూ.55 కోట్ల విలువ గల వస్త్ర ఉత్పత్తితో 15 వేల మరమగ్గాలకు, 10 వేల మంది కార్మికులకు ఉపాధి లభించిందన్నారు. అలాగే సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్కులోని చిన్న తరహా పరిశ్రమలకు 1022 లక్షల సాంఘీక శాఖ ఉత్పత్తి ఆర్డర్స్, రూ.25 లక్షల మీటర్ల రంజాన్ గిఫ్ట్ ఆర్డర్స్ జారీ చేశారన్నారు. దీని ద్వారా 1500 మంది కార్మికులకు నిరంతరాయంగా ఉపాధి లభిస్తుందన్నారు. అదే విధంగా బతుకమ్మ చీరెలతో సిరిసిల్లలో 25వేల మరమగ్గాలకు, 10 వేల మంది కార్మికులకు నేరుగా, మరో 10 వేల మంది అనుబంధ కార్మికులకు ఆరు నెలల పాటు ఉపాధి లభిస్తుందని జిల్లా చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకుడు అశోక్‌రావు వెల్లడించారు.
Tags: 21 rupees for each pregnancy

ఒక్కో గర్భణీ కోసం 21 రూపాయిలు

Date:21/03/2018
పాలమూరు ముచ్చట్లు:
తల్లీబిడ్డల సంక్షేమం కోసం చేపడుతున్న ఆరోగ్య లక్ష్మి పథకం మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు పౌష్ఠికాహారం అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. కేంద్రం ఒక్కో గర్భిణి, బాలింత ఆహారానికి రూ. 3.50 కేటాయిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం వాటికి ఐదు రెట్లు (రూ. 17.50) కలిపి రూ. 21 ఖర్చు చేయనున్నది.జిల్లా మహిళాశిశుసంక్షేమ శాఖ ద్వారా జైనూ ర్, వాంకిడి, తిర్యాణి, ఆసిఫాబాద్, సిర్పూర్-టి, కాగజ్‌నగర్ సీడీపీవో ప్రాజెక్టుల పరిధిలో 921 అంగన్‌వాడీ కేంద్రాలు, 185 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. 10 వేల 253 మంది బాలింతలు, గర్భిణులు ఉన్నారు. వీరిలో 4536 మంది గర్భిణులు, 5717 మంది బాలింతలు ఉన్నారు. ఆరోగ్య లక్ష్మి ప థకంద్వారా కేంద్రం నుంచి ఒక్కో గర్భిణి, బాలింత ఆహారానికి రూ. 3.50 కేటాయిస్తుంటే, రాష్ట్ర ప్రభు త్వం దేనికి ఐదు రేట్లు (రూ. 17.50) కలిపి రూ. 21 ఖర్చు చేస్తామని రాష్ట్ర బడ్జెట్‌లో పౌరసరఫరాలు, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. దీంతో ఒక్కొక్కరికీ రూ. 21తో రుచికరమైన భోజనాన్ని పెట్టనున్నారు. రోజుకు 150 గ్రాముల బి య్యం, 30 గ్రామలు పప్పు, 16 గ్రాముల మంచినూనె, కోడిగుడ్డు, 200 మిల్లీ లీటర్ల పాలు, 50 గ్రా ముల కూరగాయలు ఒక్కొక్కరికీ అందించనున్నారు.గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణులు, బాలింతలకు పౌష్ఠికాహారం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా మాతా శిశు సంరక్షణ కార్యక్రమాలను చేపడుతున్నది. ఇందులో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా ఆహారం అందిస్తున్నది. గర్భిణులు, బాలింతలకు అవసరమైన పౌష్ఠికాహారాన్ని అందించేందుకు ప్రత్యేక కార్యచరణతో అమలు చేస్తున్నది. కేంద్రాల్లో పెడుతున్న భోజనం సరిగా లేకపోవడంతో గర్భిణలు, బాలింతలు అంగన్‌వాడీ కేంద్రాలకు రావడానికి విముఖత చూపుతున్నారనీ, కొంత మంది వచ్చినప్పటికీ కోడిగుడ్లు తీసుకొని వెళ్తున్నారనే విషయం గుర్తించిన సర్కారు నాణ్యమైన భోజనం పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులకంటే రాష్ట్ర ప్రభుత్వం ఐదు రేట్లు ఎక్కువగా నిధులను ఖర్చు చేస్తుండగా, మున్ముందు సత్ఫలితాలు వచ్చే అవకాశమున్నది.
Tags: 21 rupees for each pregnancy

పక్కదారి పడుతున్న కిరోసిన్

Date:21/03/2018
మెదక్ ముచ్చట్లు:
కిరోసిన్ పథకం పక్కదారి పడుతోంది. పౌరసరఫరాల శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా నామినేటెడ్ రిటైలర్ కిరోసిన్  డీలర్లు లబ్దిదారులకు నెలనెలా కిరోసిన్‌ను అందజేయకుండా నల్లబజారుకు తరలిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నెలనెలా రికార్డుల్లో లక్షకు పైగా లీటర్ల కిరోసిన్ డీలర్లకు సరఫరా అవుతున్నట్లు రికార్డులు చూపుతున్నప్పటికీ లబ్దిదారులకు పంపిణీ చేయడం లేదని తెలుస్తోంది. ప్రైవేటు ఎన్‌ఆర్ షాపుల ముందు బోర్డులు లేకుండా గల్లీల్లో దుకాణాలు ఏర్పాటు చేసుకుని కిరోసిన్‌ను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు విమర్శలున్నాయి. కుత్బుల్లాపూర్, గాజులారామారం సర్కిళ్ల పరిధిలో 104నామినేటెడ్ రిటైలర్ కిరోసిన్ దుకాణాలు ఉండగా, చౌకధరల దుకాణాలకు అనుబంధంగా 108 కిరోసిన్ దుకాణాలు ఉన్నాయి. వీటికి ప్రతినెలా లక్షా 40వేల 816 లీటర్ల కిరోసిన్ కోటాను కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. ప్రస్తుతం 82,196 లీటర్ల కిరోసిన్‌ను సంబంధిత షాపులకు కేటాయించిన 25శాతం కిరోసిన్ కూడా లబ్దిదారులకు సంబంధిత డీలర్లు అందించడం లేదు. 104నామినేటెడ్ రిటైలర్ దుకాణాల డీలర్లలో పదిశాతం కూడా వారికి కేటాయించిన కిరోసిన్‌ను లబ్దిదారులకు పంపిణీ చేయడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రైవేటు ఎన్‌ఆర్ కిరోసిన్ దుకాణాల ముందు సూచిక బోర్డులను ఏర్పాటు చేసుకోవాలి. కానీ ఎక్కడో గల్లీలో దుకాణాలను ఏర్పాటు చేసుకుంటారు. ఈదుకాణాలు లబ్దిదారులకు తెలియకపోవడంతో ఒక వేళ తెలిసినా రేపు రా, మాపు రా అంటూ తిప్పుతున్నారని లబ్దిదారులు వాపోయారు. నిబంధనల ప్రకారం వంటగ్యాస్ కనెక్షన్ లేని లబ్దిదారులకు నాలుగు లీటర్లు, గ్యాస్ కనెక్షన్ ఉన్న లబ్దిదారులకు ఒక లీటర్ కిరోసిన్‌ను సబ్సిడీ ధర రూ.25కు అందజేయాలి. చౌకధరల రేషన్ దుకాణాలను ఈ-పాస్ యంత్రాలను అనుసంధానం చేయడంతో కిరోసిన్ తీసుకున్న లబ్దిదారుల వివరాలు నమోదు కావడంతో పాటు ఆ నెల కేటాయించిన కిరోసిన్ కోటాలో మిగిలిన కిరోసిన్ ఎంత అనేది స్పష్టంగా తెలుస్తుంది. కానీ ప్రైవేటు 104 ఎన్‌ఆర్ దుకాణాలకు కేటాయించిన కిరోసిన్ మొత్తం లబ్దిదారులకు పంపిణీ చేసినట్లుగా పౌరసరఫరాల శాఖ అధికారులకు రికార్డులను సమర్పిస్తున్నారు. కానీ కొంతమందికి మాత్రమే కిరోసిన్ పంపిణీ చేసి మిగిలిన దానిని లీటర్‌కు రూ. 50 చొప్పున బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికీ పదిశాతం మంది లబ్దిదారులకు కూడా ఆయా కిరోసిన్ ఎన్‌ఆర్ దుకాణాలు ఎక్కడున్నాయో తెలియదు. ఇప్పటికైనా సంబంధిత పౌరసరఫరాల శాఖ అధికారులు వెంటనే స్పందించి అక్రమాలకు పాల్పడుతున్న డీలర్లపై చర్యలు తీసుకోవాలని లబ్దిదారులు కోరుతున్నారు.
Tags: Kerosene that is misleading

మూడొందల కోట్ల లక్ష్యంగా హెచ్ఎండీఏ ప్లాట్ల అమ్మకం

Date:21/03/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న లే అవుట్స్‌లో ప్లాట్లు, భూములకు సంబంధించిన ఈ-టెండర్, ఈ-వేలం పాటకు చెందిన డాక్యుమెంట్ ను  విడుదల చేశారు.  ఈ-వేలం, ఈ-టెండర్ ప్లాట్ల వేలానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ-వేలం, ఈ-టెండర్ ద్వారా వేలం వేయనున్న 229 ప్లాట్ల ద్వారా రూ. 300కోట్లు సేకరించాలనే లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నామని చెప్పారు. ఉప్పల్ భగాయత్ లే అవుట్‌లోని ప్లాట్లను కూడా త్వరలో వేలం ద్వారా అమ్మనున్నామని, రానున్న ఆరు నెలల్లో పలు వేలం పాటల ద్వారా రూ.1000కోట్లు సేకరించి పలు అభివృద్ధి పనులకు ఈ నిధులను వెచ్చించనున్నామని తెలిపారు. ఈ టెండర్, ఈ-వేలంలో 1,16,046 చదరపు గజాల విస్తీర్ణంలోని 229 ప్లాట్లను వేలం వేయనున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. 88 గిఫ్ట్‌డీడ్ ద్వారా వచ్చిన ప్లాట్లు, 141 గతంలో హెచ్‌ఎండీఏ చేసిన లే అవుట్లలోని ప్లాట్లు ఉన్నాయని తెలిపారు. పారదర్శకంగా ఉండేందుకు అన్నీ చర్యలు తీసుకున్నామన్నారు. వచ్చే నెల 9వ తేదీ నుంచి మూడు రోజుల పాటు  ఈ టెండర్, ఈ- వేటం పాట ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించిన  డాక్యుమెంట్ ను మంగళవారం నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు పొందవచ్చారు. ఈ దస్తావేజు హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్ WWW.HMDA.GOV.INలో పొందవచ్చన్నారు. ఈ -వేలం, ఈ -టెండర్ ద్వారా వేలం వేయనున్న 229 ప్లాట్లు ప్రముఖ ప్రాంతాల్లోనే ఉన్నాయని కమిషనర్ చిరంజీవులు చెప్పారు. దాదాపు 12 సంవత్సరాల కిందట సంస్థ చేసిన లే అవుట్లు, ప్రైవేట్ రియల్ సంస్థలు చేసిన లే అవుట్లలోని గిఫ్ట్‌డీడ్ ద్వారా సంస్థ పొందిన స్థలాలను వేలం వేస్తున్నామని తెలిపారు. పోచారం, అంతారం, దూలసల్లి, మంకల్, మామిడిపల్లి, భువనగిరి, బాచుపల్లి, జల్‌పల్లి, శంకర్‌పల్లి, ఘట్‌కేసర్, అమీన్‌పూర్ గ్రామాల్లో గిఫ్ట్‌డీడ్ స్ధలాల వేలం ఉంటుందన్నారు. గోపన్‌పల్లి, నల్లగండ్ల, చందానగర్, సరూర్‌నగర్, నెక్నాంపూర్, నందగిరి హిల్స్(జూబ్లీహిల్స్), అత్తాపూర్, షేక్‌పేట, వనస్థలిపురం, ముస్కామహల్, మైలార్‌దేవ్‌పల్లి మధుబన్ రెసిడెన్షియల్ కాలనీ, తెల్లాపూర్, మియాపూర్, మాదాపూర్ సెక్టార్-1, మాదాపూర్ సెక్టార్-3లలో హెచ్‌ఎండీఏకు చెందిన లే అవుట్లలోని ప్లాట్లు వేలం వేసే వాటిలో ఉన్నాయన్నారు. ఈ సారి వేలం దారులకు ఉపయోగంగా ఉండాలని నిర్ణయించి వేలం వేయబోయే ప్లాట్లను గూగుల్ మ్యాపింగ్‌తో క్రోడికరించామని, ప్రతి ప్లాటును గూగుల్ కో ఆర్డినేట్స్‌తో వెబ్‌సైట్‌లో పెట్టామని చెప్పారు. వేలం వేయబోయే ప్లాట్లకు ఎలాంటి కోర్టు వివాదాలు లేవని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో హెచ్‌ఎండీఏ కార్యదర్శి అరుణ కుమారి, మెంబర్ ఎస్టేట్ లత, ఎస్టేట్ అధికారి గంగాధర్, సిఐఓ సుబ్రమణ్యం, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. ఈ -వేలం, ఈ- టెండర్‌లో పాల్గొనదలిచిన వారు ముందుగా రూ. 10వేలు చెల్లించి తన పేరు నమోదు (రిజిస్ట్రేషన్) చేసుకోవాలి. ఆ తర్వాత తాము ఏ ప్లాటు కొనదలుచుకున్నారో ఆ స్థలాలకు సంబంధించిన ఈఎండీ మొత్తాన్ని చెల్లించాలి.వేలం పాట సమయంలో ఆన్‌లైన్ ద్వారా హెచ్‌ఎండీఏ పేర్కొన్న ఆప్షనల్ విలువ కన్నా కనీసం 100 రూపాయలు ఎక్కువ పాడాల్సి ఉంటుంది.వేలం పాటలో ఇష్టం లేకపోతే ఈ- టెండర్ విధానంలో కూడా వారు కొనదలుచుకున్న ప్లాట్ ధరను పేర్కొనవచ్చు.హెచ్‌ఎండీఏ తాను అమ్మకానికి పెట్టిన ప్లాట్ల రిజిస్ట్రేషన్ ధరకు ఒకటిన్నర రేట్ల ధర నుంచి మూడున్నర రేట్ల ధరను ఆప్షనల్ ధరగా పేర్కొన్నదని, ఆది మార్కెట్ రేటు కన్నా తక్కువగానే ఉంటుందని అధికారులు చెప్పారు.వేలంలో ఒకే బిడ్డర్ పాల్గొంటే హెచ్‌ఎండీఏ ఆ వేలాన్ని రద్దు చేసి తిరిగి వేలం పాట రెండోసారి నిర్వహిస్తుంది.ఏ దశలో నైనా వేలం పాట రద్దు చేసే అధికారం హెచ్‌ఎండీఏకు ఉంటుంది.ఈ -వేలం పాట, ఈ -టెండర్ వచ్చే నెల 10, 11, 12వ తేదీల్లో ఉదయం 9 -12 గంటల వరకు, మధ్యాహ్నం 1-4గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్వహిస్తారు.ప్రతి రోజూ ఉదయం 36, మధ్యాహ్నం 36 కలిపి మొత్తం 72 ప్లాట్లు వేలం నిర్వహిస్తారు. వేలం ప్రక్రియ కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎంఎస్‌టీసీ లిమిటెడ్ సంస్థ (థర్డ్ పార్టీ) ద్వారా నిర్వహిస్తారు. ఏ ప్లాటుకు ఎవరు? ఎంత పాడుతున్నారు? ఎంతకు అమ్ముడుపోతాయన్న వివరాలు హెచ్‌ఎండీఏకు కూడా తెలియకుండా పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వేలంలో ఎక్కువ ధరకు ప్లాట్లు పొందిన వారికి వాయిదాల పద్ధతిలో కూడా ప్లాటు ధరను చెల్లించుకోవచ్చు. కొనుగోలుదారుడు వారం రోజుల లోపు ప్లాటు ధరలో 25శాతం చెల్లించాల్సి ఉంటుందిఈఎండీ ధర 10శాతం పోను, మిగతా 65 శాతం ధరను 60 రోజుల లోపు చెల్లించాల్సి ఉంటుంది.ఒకవేళ వాయిదాల ద్వారా చెల్లించాలనుకున్నా 60 రోజుల అనంతరం నిర్థారిత వడ్డీతో ఏడాదిలో చెల్లించుకునే వీలును కల్పించారు.బ్యాంకు రుణం పొందేందుకు కొనుగోలుదారులకు హెచ్‌ఎండీఏ అవసరమైన ప్రమాణ పత్రాన్ని జారీ చేస్తామని అధికారులు తెలిపారు.
Tags: The three-year target is to sell the Honda Plot

ప్రశ్నార్ధకంగా మారుతున్న జలవనరులు

Date:21/03/2018
నిజామాబాద్ ముచ్చట్లు:
జనాభాకు అనుగుణంగా తాగునీటి వనరులు లేకపోవడం ..ఏళ్ల నుంచి వనరుల పెంపునకు చర్యలు లేకపోవడం సమస్యను జఠిలం చేస్తోంది. ప్రస్తుతం ఉన్న జలవనరుల పరిస్థితి ప్రశ్నార్థకమైంది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో తాగునీరందించే జలాశయాల్లో నీటి మట్టం క్రమంగా అడుగంటుతోంది. వేసవి ఎండలు ముదిరితే నీటి మట్టం మరింత తగ్గనుంది. నిజామాబాద్‌ నగరపాలక సంస్థతో పాటు కామారెడ్డి, బోదన్‌, ఆర్మూర్‌ పట్టణాల్లో నీటివసతి మెరుగుపడడం లేదు. వేసవి ఆరంభమై 20 రోజులు గడిచినా ఇప్పటి వరకు పకడ్బందీ కార్యాచరణ కొరవడింది. ఉభయ జిల్లాల్లో నగర, పట్టణ ప్రాంతాల్లో 36250 కుళాయిలున్నాయి. ప్రతిమనిషికి నిబంధనల మేరకు నిత్యం 150 లీటర్ల నీటిని సరఫరా చేయాలి. నీటి వనరుల కొరత కారణంగా ఆశించిన మేర సరఫరా జరగడం లేదు. అయితే ప్రస్తుత సరఫరాలో సగంశాతం మేరనీరు సద్వినియోగం కావడం లేదు. వివిధ రూపాల్లో వృథా అవుతోంది. దీనికితోడు మంచి నీటిపైపులైన్లు సక్రమంగా లేకపోవడం, ఏళ్లనాటి వసతులు సరిపోకపోవడం సమస్యను మరింత జఠిలం చేస్తున్నాయి.ఇళ్లలో నీటివినియోగం అవసరాన్ని మించి జరుగుతోంది. కుళాయిలను అలాగే వదిలేయడం, బోరు నీరు ట్యాంకుల్లో పొంగి పొర్లడం నీటి వనరుల దుర్వినియోగానికి నిదర్శనం ఇక బోర్ల నుంచి ప్రధాన ట్యాంకుల్లోకి నీరు ఎక్కించే సమయంలో సిబ్బంది మరిచిపోతున్నారు. గంటల తరబడి ట్యాంకులు నిండి నీరంతా వృథాగా పోతుండే దృశ్యాలు సర్వసాధారణం. ఒక ట్యాంకు పూర్తిగా నిండాక ఒక గంటపాటు బోరును అలాగే వదిలేస్తే 2లక్షల లీటర్ల నీరు వృథాగా పోతుంది. ఉభయ జిల్లాల్లో నగరపాలకసంస్థ, మిగతా 3 బల్దియాల్లో 24వేల బిరడాలు అవసరం. తద్వారా నీటి వృథాను అరికట్టవచ్చు.నీటినిల్వ పద్ధతులను అవలంభించడంలో నిర్లక్ష్యం ఆవరించింది. నగర, పట్టణ ప్రాంతాల్లో ఇంకుడు గుంతల ఏర్పాటు అమలు కావడం లేదు. భూగర్భజలాల పెంపునకు చర్యలు చేపట్టడంలో అధికార యంత్రాంగం, జనం నిర్లక్ష్యం వహిస్తున్నారు. నిజామాబాద్‌, కామారెడ్డి, బోధన్‌, ఆర్మూర్‌లో దాదాపు 78000 నివాసాలున్నాయి. 5లక్షల జనాభా నివసిస్తోంది. ఇటీవల నూతన నిర్మాణాలు వెలిశాయి. పట్టణాల్లో ఎక్కడికక్కడ సీసీరోడ్ల నిర్మాణం ద్వారా వర్షపునీరు భూమిలోకి ఇంకడం లేదు.  భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. నీటి పొదుపుపై నిర్లక్ష్యం ఆవరించింది.  వృథాగా నీటిని వదిలేయడం, ఎక్కువగా వాడడం వంటి చర్యలతో పెను ముప్పు పొంచి ఉంది. ఇకనైనా మేల్కోకుంటే భావితరాలకు జల జాడలు కనిపించకుండా పోవడం ఖాయంగా కనిపిస్తోంది.  శుద్ధి నీటి వ్యాపారం జోరుగా కొనసాగుతోంది. నిజామాబాద్‌ నగరంలో పాతిక వరకు శుద్ధినీటి ప్లాంట్లు ఉన్నాయి. నిత్యం 25000 మినరల్‌ డబ్బాలు విక్రయిస్తున్నారు. ఒక్కో డబ్బా రూ.15 పలుకుతోంది. ఈలెక్కన ప్రతినెలా రూ. రూ. కోటి వ్యాపారం సాగుతోంది.  కామారెడ్డిలో 18 వరకు నీటిప్లాంట్లు ఉన్నాయి. 12000 డబ్బాలు అమ్ముడవుతున్నాయి. నెలకు రూ. 30లక్షల వ్యాపారం సాగుతోంది. బోధన్‌లో 14 నీటి ప్లాంట్లు ఉన్నాయి. ఇక్కడ 10వేల డబ్బాలు అమ్ముడవుతాయి. ఆర్మూర్‌ పట్టణ ప్రాంతంలో 12 ప్లాంట్లు ఉన్నాయి. ఇక్కడ 8వేల డబ్బాలను విక్రయిస్తున్నారు. ఈ లెక్కన ప్రతినెలా రూ.అరకోటి వ్యాపారం జరుగుతున్నట్టు అంచనా. ః  ఉభయ జిల్లాల్లో ఒక కార్పొరేషన్‌తోపాటు మూడు పురపాలక సంఘాల పరిధిలో రూ.2 కోట్ల దాకా శుద్ధి నీళ్లకు జనం ఖర్చు చేస్తున్నారు. సర్కారు జనానికి కనీసం తాగునీరు సక్రమంగా సరఫరా చేసే విషయంలో శ్రద్ధ చూపకపోవడంతో శుద్ధినీటి భారం మోయాల్సిన దుస్థితి నెలకొంది.
Tags: Waterlogging changing questionable

కాగితాలకే పరిమితమవుతున్న భద్రాద్రి డెవలప్ మెంట్

Date:21/03/2018
ఖమ్మం ముచ్చట్లు:
భద్రాచలం పుణ్యక్షేత్రం పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా మరింత శోభిల్లాలంటే.. నిధులు రాల్చాలి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు ఇస్తున్నట్లు బడ్జెట్‌లో పేర్కొన్నారు. కేంద్రం కూడా దేశంలోని ఆరు రాష్ట్రాల్లో 11 ప్రాంతాలను రామాయణ వలయంగా చేయాలని భావించినప్పటికీ పైసా విదల్చకపోవడంతో ఇరు ప్రభుత్వాల వైపు గంపెడాశతో ఎదురు చూస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా జగత్కల్యాణం ఈనెల 26న జరగనుంది. ఇది విళంబి నామ సంవత్సరం. ఎంతో విశిష్టమైనది. 60 ఏళ్లకు ఒకసారి వస్తుంది. 1958 తర్వాత మళ్లీ ఇప్పుడే వచ్చింది. ఇలాంటి వేళ నిధులు వస్తే ఆలయం అభివృద్ధి జరుగుతుండేదని భక్తులు అంటున్నారు.సీతారామచంద్రస్వామి నడయాడిన ప్రతీ చోటు పుణ్యధామమే. వనవాసం సమయంలో వీరు నడిచిన పదకొండు ప్రాంతాలను రామాయణ వలయంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టుంది. ఆధ్యాత్మికంగా ఈ క్షేత్రాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు రూ.300 కోట్లు వెచ్చించనున్నారు. ఆరు రాష్ట్రాల్లో ఇవి ఉన్నాయి. ఇందులో భద్రాచలం రామాలయానికి విశేష ఆదరణ ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య, నందిగ్రామ్‌, శృంగవర్‌పూర్‌, చిత్రకూట్‌ ప్రాంతాలను కలపనున్నారు. బిహార్‌లోని సీతామర్హి, బక్సర్‌, దర్బంగ ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌ నుంచి జగదల్‌పూర్‌, కర్ణాటక నుంచి హంపి, తమిళనాడు నుంచి రామేశ్వరం, తెలంగాణ నుంచి భద్రాచలం రామాయణ వలయంలో చోటు సంపాదించాయి. ఇంకొన్ని ప్రాంతాలను ఇందులో కలిపితే వీటిలో మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌, మహారాష్ట్రలోని నాసిక్‌, ఒడిశాలోని మహేంద్రగిరి ప్రాంతాలు ఉండొచ్చని అనుకుంటున్నారు. ఇవన్నీ ఎంతో విశిష్టమైనవి. రామ జన్మభూమి తర్వాత రాముడు కొలువైన భద్రాచలానికి ఈ జాబితాలో ప్రాధాన్యం కల్పించారు. భద్రాచలం నుంచి పర్ణశాల వరకు ఆధ్యాత్మిక కారిడార్‌ ఏర్పడితే ఈ ప్రాంతానికి మేలు జరుగుతుందని భక్తులు కోరుతున్నారు. మాటలు బాగానే ఉన్నా పనులు జరిగితేనే కదా అనుకున్నది సాధ్యపడేది.తెలంగాణ ప్రభుత్వం యాదాద్రికి మొత్తంగా రూ.1000 కోట్లకు పైగా వెచ్చించనున్నందున ఇప్పటికే కొంత మొత్తంలో కేటాయింపులు జరిగాయి. ఈ బడ్జెట్‌లో రూ.250 కోట్లను కేటాయించారు. వేములవాడకు రూ.100 కోటు, బాసరకు రూ.50 కోట్లు, ధర్మపురికి రూ.50 కోట్లను కేటాయించిగా ఎప్పటి నుంచో ఊరిస్తున్న భద్రాచలం అభివృద్ధికి రూ.100 కోట్లను ప్రకటించడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. తొలిసారి ముఖ్యమంత్రి భద్రాచలం వచ్చినప్పుడు ఎలాంటి ప్రకటన చేయలేదు. రెండోసారి రూ.100 కోట్లను ఇక్కడి అభివృద్ధికి కేటాయిస్తామని వెల్లడించారు. గతేడాది శ్రీరామనవమి ఉత్సవాలకు సీఎం అసలు రానేలేదు. అప్పటి నుంచి రకరకాల ప్రచారం సాగుతునే ఉన్నప్పటికీ గందరగోళం వీడలేదు. వాస్తవంగా రూ.100 కోట్లు ఇంతకు ముందే కేటాయించినట్లు ప్రచారం సాగినప్పటికీ బడ్జెట్‌లో ఇప్పుడు పొందుపర్చారు. వీటితో టెండర్లను పిలిచి ఎలాంటి కార్యాచరణ పాటిస్తారో వెల్లడి కావాల్సి ఉంది. 26న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను తీసుకుని రానున్నారు. ఆ తర్వాత రోజు చినజీయర్‌స్వామి సమక్షంలో ఈ పనులకు శంకుస్థాపన జరుగుతుందని భావిస్తున్నారు. ఆలయం చుట్టూ విశాలమైన వాతావరణం కనిపించాలన్నది వైదిక పెద్దల భావన. ప్రధాన కోవెల నుంచి రెండు ప్రాకారాలతోపాటు మాడవీధిని ఏర్పాటు చేయనున్నారు. వీటికి అనుసంధానంగా మరో దారిని ఏర్పాటు చేయాలి. ఆలయం చుట్టూ 150 నుంచి 160 అడుగుల మేర అభివృద్ధి జరిగే వీలుందని తెలిసింది. యాదాద్రిలో కొన్ని పనులపై అభ్యంతరాలు వ్యక్తమైనందున ఇక్కడ ఆలయ శిల్పి ఆనందసాయి సూచనలతో పాటు ఇంజినీరింగ్‌ అధికారుల ఆలోచనలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. ఆలయం వెలుపల అభివృద్ధి చేయాలంటే ఇప్పుడు ప్రకటించిన నిధులు చాలవు. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల ఇళ్లకు ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటున్నారు. కల్యాణ మండపం ప్రాంగణాన్ని సువిశాలంగా చేసి 1000 కాళ్ల మండపాన్ని విస్తరించాలని ప్రణాళికలు తయారు చేస్తున్నందున ఎప్పటికైనా కొన్ని ప్రైవేటు భవనాలకు ముప్పు తప్పదు.
Tags: BADDRAIR DEVELOPMENT BASED ON PATIENTS

పార్టీకి తలనొప్పిగా మారిన పావని వ్యవహారం

Date:21/03/2018
కరీంనగర్ ముచ్చట్లు:
సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని కమీషన్ల వ్యవహారంపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేవడం, ఆమె తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ ఉదంతం అనేక మలుపులు తిరుగుతున్నది. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు అనేక కోణాలను ఆవిష్కరిస్తూంగా, అధికార పార్టీలోని లోగుట్టు వ్యవహారం రచ్చ కెక్కి తీవ్ర సంచనాలకు వేదికగా మారింది. అయితే రాజీనామా చేసిన పావనిని బలి పశువును చేశారని, మహిళను, అందునా బీసీ మహిళను ఇలా చేయడమేమిటని విపక్షాలు ప్రశ్నల పర్వం సందిస్తున్న నేపథ్యంలో పావనికి పరోక్షంగా సర్వత్రా సానుభూతి, మద్దతు పెరుగుతుంగా, మంత్రి కేటీఆర్ లక్ష్యంగా రాజకీయ దుమారం కొనసాగుతున్నది. పట్టణ ప్రజల్లోనూ పావనిపై సానుభూతి పెరగడంతో దీనిపై అప్పటి కపుడే, రాత్రికి రాత్రే ఆమెను రాజీనామా చేయించిన తెరాస అధిష్టానం పునరాలోచనలో పడినట్టుగా సంకేతాలు వినిపిస్తున్నాయి. పావని రాజీనామా చేసిన వెంటనే మున్సిపల్ పాలనకు భవిష్యత్ కార్యాచరణపై అనేక కోణాలు వెలుగు చూశాయి. తిరిగి ఈ పదవిపై ఆశలు పెట్టుకున్న ఇద్దరు, ముగ్గురు సభ్యుల ప్రయత్నాలు ఆ దిశగా సాగుతుండగా, మరో కొత్త చైర్మన్‌ను ఎన్నుకోబోరని, ప్రస్తుతం పదవీ కాలం ఏడాది పాటే ఉండడంతో వైస్ చైర్మన్‌తోనే మమ అనిపిస్తూ పాలన సాగిస్తారని ప్రచారం సాగింది. కాగా కొత్త చైర్‌పర్సన్‌ను ఒక వేళ నియమిస్తే ఆ పదవికి మున్సిపల్ కౌన్సిలర్లు దార్నం అరుణ, బత్తుల వనజ, అన్నారం లావణ్యల పేర్లు వినిపిస్తుండగా అందులో ముందు వరుసలో ఆరుణ పేరు ప్రధానంగా వినిపిస్తున్నది. పావని రాజీనామా వ్యవహారంపై ఆమెను బలి పశువు చేసి ఆడిస్తున్నారని, మున్సిపల్‌లో జరుగుతున్న కమీషన్ల పర్వంను, వారు ఎదుర్కుంటున్న సమస్యలను కాకతాళీయంగా బహిర్గం చేసిన వ్యాఖ్యలపై పావని నిజం చెప్పారని విపక్షాలు నుండి మద్దతు లభిస్తున్నది. మరో వైపు దీనిపై మంత్రి కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ ఆయన మంత్రి పదవి నుండి వైదొలగాలని కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సీపీఐ తదితర పార్టీలు డిమాండ్లు చేస్తున్నాయి. ఇంటిలో స్విచ్ వేస్తే ఎక్కడో లైటు వెలిగిన చందంగా ఈ పరిణామం అధికార పార్టీకి తల నొప్పిగా పరిణమించింది. దీని నుండి బయట పడడానికి యోచనలు చేస్తున్నది. నష్ట నివారణలో భాగంగా ఆదివారం ఉగాది పండుగ రోజు పార్టీ నేతలు టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, నాయకుడు చీటి నర్సింగరావులు పార్టీ కౌన్సిలర్లతో అంతర్గత సమావేశం నిర్వహించి, పరిస్థితిపై సమీక్షించారు. అయితే రోజుకో తరహాలో పావని రాజీనామా ఉదంతం మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత లొల్లి, రాద్దాంతాన్ని సద్దుమణించడానికి పావని రాజీనామాను ఆమోదించకుండా, తిరిగి ఆమెనే చైర్‌పర్సన్‌గా కొనసాగించడం శ్రేయస్కరమని పార్టీ అధిష్టాన వర్గం యోచిస్తున్నట్టు తెలుస్తున్నది.
Tags: Pavani affair is the head of the party