వర్షకాలం నాటికి రోడ్లు

Date:21/03/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
వర్షాకాలానికి మరెంతో సమయం లేదు.. నాలుగు నెలల్లో వానలు మొదలవుతాయి.. ఆలోపు అంటే జూన్‌ నాటికి రహదారులను పునరుద్ధరిస్తామని జీహెచ్‌ఎంసీ జనవరిలో లక్ష్యం నిర్దేశించుకుంది. ఫిబ్రవరిలో అందుకు సంబంధించి రూ.721 కోట్లతో 120 రోడ్లను అభివృద్ధి చేసే ప్రణాళికను ప్రకటించింది. నిబంధనలు కఠినంగా ఉండటంతో ఇప్పటి వరకు గుత్తేదారులు పూర్తిస్థాయిలో ఆసక్తి చూపలేదని, చర్చల ద్వారా 50 శాతం పనులకు టెండర్లు వేయించామని ఇంజినీరింగ్‌ విభాగం చెబుతోంది. ఆయా పనుల్ని యుద్ధప్రాతిపదికన చేపట్టి జూన్‌కి పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది.హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) పరిధిలోని రహదారులు వర్షాకాలం విశ్వరూపం చూపిస్తాయి. ప్రస్తుతానికి గత రెండేళ్లతో పోలిస్తే  కాస్త మెరుగ్గా ఉన్నాయనే చెప్పాలి. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో నగరంలోని రహదారులను రూ.721.86 కోట్లతో పటిష్టంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్‌ఎంసీ ప్రణాళిక రచించింది. తారు రోడ్ల జీవిత కాలం పెంచడం అందులో ప్రధానమైంది. సంప్రదాయ తారుకు బదులు పాలిమర్‌ మాడిఫైడ్‌ బిటుమిన్‌ను రోడ్డు నిర్మాణంలో ఉపయోగించనున్నట్లు బల్దియా ముఖ్య ఇంజినీరు జియాఉద్దీన్‌ తెలిపారు. దాంతోపాటు రోడ్లు గడువుకన్నా ముందు మరమ్మతుకు గురైతే రెండేళ్లలోపు వాటిని బాగు చేయాల్సిన బాధ్యత గుత్తేదారుపైనే ఉంటుంది. ఆ బాధ్యతను సదరు గుత్తేదారు తప్పక నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. బిల్లుల చెల్లింపులో గందరగోళం ఏర్పడకుండా గ్రేటర్‌ వ్యాప్తంగా అన్ని సర్కిళ్లకు తారు రోడ్డు నిర్మాణ ధరల్ని సమంగా చేశామన్నారు. అన్నిచోట్లా ఒకే తరహా ధర నిర్ణయించామన్నారు. కొత్తగా పిలిచే టెండర్ల నిబంధనలు ఇలాంటి మార్పులతో రూపుదిద్దుకున్నాయన్నారు.టెండర్లలో 53 తారు, 51 సీసీ రోడ్లను వేయాలని అధికారులు నిర్ణయించారు. అవసరమున్న ప్రాంతాల్లో వైట్‌ టాపింగ్‌ రోడ్లు, ఇతరత్రా నూతన సాంకేతికలతో  తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఆయా రహదారుల్లో జీహెచ్‌ఎంసీకి చెందిన 9 వేల కిలోమీటర్ల రోడ్లతోపాటు హెచ్‌ఆర్‌డీసీఎల్‌కు ఇటీవల బల్దియా అప్పగించిన 319 రోడ్లూ ఉన్నాయి. వర్షాలొస్తే నగరవాసుల్ని అత్యధికంగా ఇబ్బందిపెట్టే రోడ్లు హెచ్‌ఆర్‌డీసీఎల్‌కు చెందినవే అని, వాటిపై సదరు ఇంజినీర్లు పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని పౌరులు కోరుతున్నారు.
Tags: Roads by the rainy season

కాలుష్య రహితంగా తిరుమల

Date:21/03/2018
తిరుమల ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎప్పుడూ పర్యావరణం గురించి మాట్లాడుతూ ఉంటారు… అందరిలా మాటల్లో కాదు, చేతల్లో కూడా చేసి చూపిస్తున్నారు… ఇప్పటికే అమరావతిలో ప్రణాళికలు రచిస్తూ ఉండగా, తిరుమలలో మాత్రం ఆచరణలోకి తెచ్చేసారు… కాలుష్య రహిత తిరుమలకు తొలి అడుగు పడనుంది… తిరుమలకు వచ్చే ఆర్టీసీ బస్సులన్నీ విడతల వారీగా బ్యాటరీ బస్సులు కానున్నాయి… తిరుమలతో పాటు రాష్ట్రంలోని కీలకమైన రెండు నగరాలకు నడపాలని భావించింది. అయితే ముందుగా తిరుమలలో ఇవి ట్రయిల్ రన్ చేస్తున్నారు… శనివారం నుంచి ఈ బస్సులు ప్రారంభం అయ్యాయి.. ఇవి సక్సెస్ అయితే, ఏప్రిల్ నుంచి పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్నారు.మొదట 31 సీట్లు కెపాసిటీతో రూపొందించిన ఎలక్ట్రిక్ బస్సును నెలపాటు ఎలాంటి చార్జీ లేకుండా నడపనున్నారు… తరువాత డిమాండ్ ను బట్టి, 40 సీట్లతో రూపొందించిన బస్సులును పూర్తి స్థాయిలో నడపుతారు.. ఈ బస్సుల్లో సెన్సార్లే కీలకం.. డ్రైవర్ తో పాటు 32 మంది కూర్చునే ఈ బస్సు ప్రయాణం ఎంతో సురక్షితం. డ్రైవర్ సీటుతో పాటు ప్రయాణికులు కూర్చునేందుకు మెత్తని అనువైన సీట్లు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అలారం వలన ముందుగానే ప్రమాదాన్ని సెన్సార్లు హెచ్చరిస్తాయి, ఎయిర్ బెలూన్లు, వైఫై, ఎల్ఈడీ లైట్లతో పాటు ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఎల్ఈడీ టీవి, ఫైర్ సేఫ్టీ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. వీటన్నంటిని సీసీ కెమెరాల ద్వారా బస్ లోపల పరిస్థితిని డ్రైవర్ పర్యవేక్షిస్తుంటాడు. ఇన్నీ అత్యాధునిక సౌకర్యాలు ఉన్నప్పటికీ వీటిలో ఏ ఒక్క పరికరం పనిచేయకపోయినా బస్సు ముందుకు కదలదు. అందుకుగల కారణాలను కంప్యూటర్ సెన్సార్ల ద్వారా డ్రైవర్ను ఆలెర్ట్ చేస్తుంది. హైదరాబాద్ కేంద్రంగా గోల్డ్ స్టోన్ కంపెనీ అతి తక్కువ ఖర్చుతో, ఎక్కువ మైలేజీ ఇచ్చేలా ఎలక్ట్రికల్ బస్సులు తయారు చేశారు. ఇప్పటికే ఇలాంటి తరహా బస్సులను హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో నడుపుతున్నారు. దక్షిణ భారత దేశంలో మన రాష్ట్రంలో ఇదే మొదటిసారి కావడం విశేషం.ఎలక్ట్రికల్ బస్సు ప్రత్యేకత… కేవలం మూడు గంటల పాటు విద్యుత తో చార్జ్ చేస్తే 300 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. బరువైన ఇంజన్లు ఉండవు. గేర్ బాక్స్ ఉండదు. కేవలం వెనుక చక్రాలకు సెన్సార్లతో రూపొందించిన మోటారు అమర్చి ఉంటుంది. ఇక డ్రైవర్ సీటుకు ముందు మూడు బటన్లు ఉంటాయి… ‘బి’ బటన్ ను ప్రెస్ చేస్తే బస్సు ముందుకు కదులుతుంది.. “ఎన్”ను ప్రెస్ చేస్తే న్యూట్రల్ కు చేరుకుంటుది. ‘ఆర్’ను ప్రెస్ చేస్తే బస్సు వెనక్కి కదు లుతుంది. ఈ మూడు బటన్లను కంట్రోల్ చేసేందుకు బ్రేక్, క్లచ్లు పనిచేస్తాయి. ఈ బస్సుల వాడకంతో కాలుష్య తీవ్రత తగ్గుతుంది. తిరుపతి ఆర్టీసీ డిపో ఆవరణలో ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించిన రీచార్జ్ స్టేషన్ ఏర్పాటు చేసారు.
Tags: Tirumala is not polluted

23న హీరో కంపెనీ పనులు ప్రారంభం

Date:21/03/2018
తిరుపతి ముచ్చట్లు:
ఏపీకి మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు రానుంది 67 ఏళ్ళ వయసులో, తన కుటుంబాన్ని వదిలి, 5 కోట్ల మంది ఆంధ్రుల కోసం, రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్న చంద్రబాబు గారి సత్తా… అందుకే ఆయన్ను రీల్ హీరో కాదు, నిజమైన హీరో అంటుంది… ఈ నిజమైన హీరోని చూసి, ఆటోమొబైల్ దిగ్గజం హీరో కంపెనీ మన రాష్ట్రానికి వస్తుంది…ఎన్నో అడ్డంకులు దాటుకుని, మార్చి 23న ప్లాంట్ కు శంకుస్థాపన చెయ్యనున్నారు… హీరో కంపెనీ తమ ప్లాంటును దక్షిణభారతదేశంలో పెట్టడానికి సిద్ధమవగానే ఆంధ్రాతోపాటు తెలంగాణ, కర్నాటక, తమిళనాడు ప్రభుత్వాలు ఆ కంపెనీకి రెడ్ కార్పెట్ పరిచాయి. ఈ ప్రాజెక్టును పట్టుబట్టి సిఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు తెచ్చారు. సత్యవేడు మండలం శ్రీసిటీకి సమీపంలోని మాదన్నపాలెం వద్ద 636 ఎకరాల విస్తీర్ణంలో ద్విచక్ర వాహనాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ఆ సంస్థ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.హీరో మోటార్స్‌ దశలవారీగా రూ.3200 కోట్ల పెట్టుబడి పెడుతుంది. 2019 చివర నాటికి సంవత్సరానికి 5 లక్షల మోటారు సైకిళ్లను తయారు చేసే సామర్థ్యం గల ప్లాంటును నిర్మిస్తారు. 2020నాటికి రెండో ప్లాంటును నిర్మిస్తారు. రెండు దశల్లో కలిపి రూ.1600 కోట్ల పెట్టుబడి పెడతారు. రెండు దశల నిర్మాణాలు పూర్తయితే ఏటా 10లక్షల వాహనాలు తయారవుతాయి. 2025కల్లా ఏటా 18లక్షల మోటారు సైకిళ్లను ఉత్పత్తి చేసే దిశగా అభివృద్ధి చేస్తారు. విడిభాగాల తయారీ యూనిట్‌ రూ.1600 కోట్లతో ఏర్పాటు చేస్తారు. మొత్తంగా 15వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇక్కడ ఏర్పాటు చేయబోయే యూనిట్‌ ఆ సంస్థకు ఎనిమిదోది కానుంది.
Tags: On the 23rd hero of the company will begin the works

ముందుకు సాగని కుటుంబ నియంత్రణ

Date:21/03/2018
గుంటూరు ముచ్చట్లు:
జనాభాతో అందుబాటులో ఉన్న వనరుల వినియోగం అధికమవుతూ కొరత సమస్య వెంటాడటం అనేది సాధారణమే. ఈ పరిస్థితి అదుపునకై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుటుంబ నియంత్రణ అంటూ ఊదరగొట్టడమే తప్పా క్షేత్రస్థాయిలో పరిస్థితులకు తగ్గట్లుగా ఏర్పాట్లు కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1995 నుంచి ఇరువురి సంతానం మించినట్లైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే హక్కు కోల్పోయేలా ఆదేశాలను అమలు చేస్తుండటం తెలిసిందే. ఆడ, మగ అనే భావన లేకుండా సగటు ప్రజానీకంలో స్వతహాగానే ఒకరైతే ముద్దు-ఇద్దరైతే హద్దు అనే భావన అలుముకుంది. అలాంటప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కుటుంబ నియంత్రణ శస్తచ్రికిత్సల సంఖ్య ఆశాజనకంగా పుంజుకోవడం అంతంత మాత్రంగానే ఉండటం విమర్శలకు తావిస్తోన్న పరిణామం. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వాధినేతలు ప్రగల్భాలు పలికిన రీతిలో శస్తచ్రికిత్సల నిర్వహణ అంశాన్ని పురోగతి పట్టించడంలో శ్రద్ధ చూపడం లేదనే చెప్పాలి. నియోజకవర్గ కేంద్రమైన ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ శస్తచ్రికిత్స కోసమై ఎవరైనా వెళ్తే రిక్తహస్తమే ఎదురుకావడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. గతంలో 30 పడకల ఆసుపత్రిగా కొనసాగుతూ వంద పడకల స్థాయికి పెరిగినా ఇంకా పాత గణాంకాల ప్రకారమే బడ్జెట్ కేటాయింపులు జరుగుతున్నట్లు వైద్యాధికారులు వాపోతున్నారు. ఇదే ఆసుపత్రిని జిల్లాస్థాయికి పెంపుదల చేయనున్నట్లు పదేపదే పాలక ప్రకటనలు వస్తున్నాయి. ఇలాంటప్పుడు కుటుంబ నియంత్రణ శస్తచ్రికిత్సల వంటి అంశాల్లోనూ గందరగోళం నెలకొనడం బాధాకరమైన పరిణామం. పురుషుల కోసమై నిర్వహించే వేసెక్టమీలో అధునాతన ఎన్‌ఎస్‌వి  స్థానికంగా ఊసేలేదు. ఇక మహిళలకు చేపట్టే ట్యూబెక్టమీ నిర్వహణపైనా ఆత్మకూరు ఆసుపత్రిలో స్పష్టత కరవు. ఇళ్ల వద్ద మంత్రసాని, కాన్పుల శైలి కాలం కనుమరుగైంది. గర్భవతులంతా ఆసుపత్రుల్లోనే బాలింతలవుతున్నారు. సాధారణ కాన్పుల ప్రక్రియను మారుమూల గ్రామాల్లో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ నిర్వహిస్తున్నారు. అయితే అదే సందర్భంలో ఇకపై పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లపరంగా అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఆత్మకూరు ప్రాంత పరిధిలో మహిమలూరు, అనంతసాగరం, మర్రిపాడు, అనుమసముద్రంపేట, తదితర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఆయా కేంద్రాల నుంచి తరలివచ్చే మహిళలకు ఆత్మకూరు ఆసుపత్రిలో కు.ని శస్తచ్రికిత్సలు చేయడం లేదు. మరోవైపు కు.ని లక్ష్యసాధనలో తలమునకలు కావాల్సిన పారా మెడికల్ యంత్రాంగం ఇబ్బందుల్లో పడుతున్నారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే ఆశావాలంటీర్లతో కలగలసి కు.ని శస్తచ్రికిత్స నిమిత్తమై మహిళలు, వారి సంబంధీకులు వింజమూరు, ఉదయగిరి, తదితర ప్రాంతాలకు వెళ్లి వస్తున్నారు. ఆశావాలంటీర్ నేతృత్వంలో ఓ కు.ని శస్తచ్రికిత్స నిర్వహిస్తే 150 రూపాయల వరకు పారితోషికం ప్రభుత్వం తరపున ముడుతోంది. అందులో ప్రయాణ భారాన్ని భరించేందుకు ఆశావాలంటీర్లకు మనస్కరించడం లేదు. ఈక్రమంలో అలా తీసుకెళ్లి రావాలంటే ప్రయాణ వ్యయభారం శస్తచ్రికిత్సలు చేయించుకునే కుటుంబాలపైనే పడుతోంది. ప్రధానంగా నిరుపేద గిరిజన మహిళలు అవగాహన లోపంతో అంత వ్యయభారాన్ని ఎదుర్కొనలేకున్నారు. ఇలా ఆయా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి వచ్చేందుకు 108 అంబులెన్స్‌ల్లోనూ సాధ్యపడటం లేదు. ఈ అంబులెన్స్‌లను అత్యవసర సర్వీసుగా మాత్రమే నడపాలనే నిబంధనలున్నాయి. ఇదిలాఉంటే అందుబాటులో ఉండే ప్రైవేట్ ఆసుపత్రుల్లో కుటుంబ నియంత్రణ శస్తచ్రికిత్సలు చేయించుకుందామన్నా జాస్తి ఖర్చులే.
Tags: Uncontrolled family control

నాలుగు వేల హెక్టార్లలో తగ్గిన వర్జీనీయా సాగు

Date:21/03/2018
రాజమండ్రి ముచ్చట్లు:
గోదావరి జిల్లాల్లో వర్జీనియా పొగాకు సాగు ఏటికేడాది తగ్గిపోతోంది. అధిక శాతం రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్ళుతున్నారు. పొగాకు గిట్టుబాటు కావడం లేదని మొక్కజొన్న, శనగ వంటి పంటల వైపు రైతులు దృష్టిసారిస్తున్నారు. గోదావరి నదీ ప్రాంతాల్లో వర్జీనియా సాగుచేసే పొలాల్లో అధిక శాతం ఇపుడు తీపి జొన్న, తెల్లజొన్న, మొక్కజొన్న, శనగ పంటలు సాగుచేస్తున్నారు. గోదావరి జిల్లాల్లో మొక్క జొన్న దాదాపు రెండు లక్షల ఎకరాల్లో, శనగ గత ఏడాది 40 వేల ఎకరాల వరకు సాగు చేస్తే ఈ ఏడాది అంతకు మించి సుమారు 60 వేల ఎకరాల్లో సాగుచేస్తున్నారు. కేవలం తేమపైనే ఆధారపడి సాగు చేసే అవకాశం వుండటంతో సీతానగరం, కోరుకొండ, గోకవరం, పోలవరం, దేవీపట్నం తదితర మండలాల్లో అత్యధికంగా శనగ పంటను సాగు చేస్తున్నారు. దీంతో శనగ సాగు గోదావరి నదీ పరీవాహ మండలాల్లో విస్తరిస్తోంది. అదే విధంగా గత ఏడాది పొగాకు పండించే లంక భూముల్లో కూడా మొక్కజొన్న, తీపి జొన్న, తెల్లజొన్న తదితర పంటలను సాగుచేస్తున్నారు. తేలికపాటి నల్లరేగడి నేలల్లో సంప్రదాయంగా అనాదిగా వర్జినియా పండించే పొలాల్లో క్రమేణా శనగ, మొక్కజొన్న పండిస్తున్నారు. వర్జీనియా పొగాకు సాగుకు అనుమతి తీసుకుని మరీ ఇతర పంటల వైపు మళ్ళిన పరిస్థితి వుంది. గత ఏడాది కంటే దాదాపు 50 వేల ఎకరాల్లో వర్జీనియా విస్తీర్ణం తగ్గిపోయింది. పొగాకు విస్తీర్ణం క్రమేణా తగ్గిపోవడానికి ప్రధాన కారణం పొగాకుకు గిట్టుబాటు ధర అంతగా లభించకపోవడంతో పాటు తక్కువ శ్రమ ఎక్కువ లాభం వస్తున్న మొక్కజొన్న, శెనగ రైతులను ఆకర్షిస్తున్నాయి. గోదావరి జిల్లాల్లో రైతులు స్వచ్ఛందంగా వర్జీనియా సాగు నుంచి తప్పుకోవడం కీలక పరిణామంగానే పరిగణించాల్సివుంది. దీనికితోడు జాతీ య మార్కెట్ ఒడిదొడుకులు, జీఎస్టీ కారణంగా కూడా పొగాకు విస్తీర్ణం తగ్గిపోతోందని తెలుస్తోంది. 2017-18 సంవత్సరానికి తూర్పు గోదావరి జిల్లాలోని తొర్రేడు ప్రాంతీయ పొగాకు వేలం కేంద్రాన్ని పరిశీలిస్తే 1754 హెక్టార్లలో పొగాకు సాగుకు అనుమతివ్వగా 1339 హెక్టార్లలో మాత్రమే సాగు చేపట్టారు. దాదాపు నాలుగు వేల హెక్టార్ల విస్తీర్ణంలో వర్జీనియా సాగు తగ్గిపోయింది. అంటే తొర్రేడు పొగాకు బోర్డు పరిధిలో సుమారు 40 లక్షల కిలోల పొగాకు ఉత్పత్తికి అనుమతివ్వగా 26 లక్షల కిలోల ఉత్పత్తివచ్చేలా మాత్రమే రైతులు పండించారు. మొత్తం మీద ఏటికేడాది గోదావరి జిల్లాల్లో వర్జీనియా సాగు తగ్గుముఖం పడుతోంది. పొగాకు స్థానే ఇతర వాణిజ్య పంటలకు రైతులు అనివార్యంగా మొగ్గు చూపుతున్నారు.
Tags: Cultivated virginia cultivated in four thousand hectares

ఆక్వా రంగంపై ప్రభుత్వం చిన్న చూపు

Date:21/03/2018
ఏలూరు ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఆక్వా రంగానికి ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులపై రైతులు, ఆక్వారంగ ప్రతినిధులు పెదవి విరుస్తున్నారు. గత ఏడాది కంటే కేవలం మరో రూ.100 కోట్లు అదనంగా కేటాయించి ప్రభుత్వం చేతులు దులుపుకుందనే వాదన వినిపిస్తోంది. గత బడ్జెట్‌లోఈ రంగానికి రూ.286 కోట్లు కేటాయించగా ఈసారి మరో వంద కోట్ల రూపాయలను అదనంగా అంటే రూ.386 కోట్లు కేటాయించారు. అయితే ఆక్వారంగానికి ఉన్న విస్తృత అవసరాల దృష్ట్యా ఈ మొత్తం ఏ మూలకు సరిపోతుందనే వాదన వినిపిస్తోంది. ఆక్వా రంగం ద్వారా ఏపీ నుండి ఏటా సుమారు రూ.17వేల కోట్ల విదేశీ మారకద్రవ్యం లభిస్తోంది. ఇంత కీలకమైన రంగంపట్ల ప్రభుత్వం కనపర్చాల్సినంత శ్రద్ధచూపడంలేదనేది రైతుల వాదన. ఆక్వా రంగంలోని ప్రధానంగా రొయ్యలదే ఆగ్రస్థానం. ఆ తర్వాత స్థానం చేపలది. అయితే రొయ్య విషయంలో ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో అంత శ్రద్ద చూపించినట్లు కనిపించడంలేదు. రొయ్యల సాగులో అతిమఖ్యమైనది సీడ్. విదేశాల నుంచి రొయ్యల పిల్లలను తెచ్చుకోవడం చాలా ఖర్చుతో కూడిన పని. ఇందుకోసం ప్రభుత్వం ముందుకు వచ్చి ఎంపెడాతో చర్చించి ప్రభుత్వ హ్యాచరీలు ఏర్పాటుచేసి రైతులకు కావాల్సిన సంఖ్యలో సీడ్‌ను అందించాలి. ఇక చెరువులో వేసిన తర్వాత రొయ్యల పెరుగుదలకు అవసరమైన నాణ్యమైన ఫీడ్‌ను అందించాలి. ఇందుకోసం ఫీడ్ మిల్లులను ఏర్పాటుచేసి, వ్యవసాయ రైతులకు ఇచ్చిన మాదిరిగా సబ్సీడీతో ఫీడ్‌ను అందించాలని రైతులు ఏనాటి నుంచో కోరుతున్నారు. అదేవిధంగా నిత్యం అప్రమత్తంగా ఉంటూ వైరస్‌ల బారి నుండి కాపాడుకోవడానికి అవసరమైన ల్యాబ్‌లు ఏర్పాటుచేయాల్సివుంది. చెరువుల్లో ఏర్పాటుకు అవసరమైన ఏరియేటర్ల సరఫరాతో పాటు పట్టిన రొయ్యను తరలించడానికి అవసరమైన నాణ్యమైన ఐస్ అందించడానికి ప్లాంట్లు నిర్మించాలి. అనంతరం కీలకమైన ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటుచెయ్యాలి. ఇందుకు వందల కోట్ల రూపాయలు సరిపోవు. ఇక చేపల, పీతలు తదితరాల సాగుకు అవసరమైన అన్నిరకాల సౌకర్యాలు కల్పించాలి. అయితే ఎన్నడూలేని విధంగా ఈసారి బడ్జెట్‌లో ఆక్వా రైతులకు చాలా అత్యవసరమైన శీతల గిడ్డంగులను ఏర్పాటుచేయాలని నిర్ణయించడం కాస్త ఊరట కలిగిస్తున్న అంశమని చెప్పవచ్చు. రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో రూ.65 కోట్లతో శీతల గిడ్డంగులను నిర్మించాలని నిర్ణయించడం రైతులకు ఎంతగానో ఉపకరించనుంది. అలాగే మత్స్యకార్మికుల సంక్షేమానికి నిధులుకేటాయించడం, 50 ఏళ్లు దాటిన మత్య్సకారులకు పింఛను ప్రకటన విశేషంగా చెప్పుకోవాలి.
Tags: The Government will have a small look on the Aqua sector

రబీ సాగుకు పురుషోత్తమపట్నం నీళ్లు

Date:21/03/2018
రాజమండ్రి ముచ్చట్లు:
ఖండ గోదావరి ఎడమ గట్టుపై సీతానగరం మండలం పురుషోత్తపట్నం గ్రామం వద్ద పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్మాణం చివరి అంకానికి చేరుకుంది. తాజా బడ్జెట్‌లో రూ.400 కోట్లు కేటాయించడంతో పనులు మరింత ఊపందుకున్నాయి. రూ.1638 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం చేపట్టిన ఈ పథకం వాస్తవానికి గత ఏడాది నవంబర్ నాటికి పూర్తికావాల్సివుంది. పథకం పూర్తి కాకుండానే గత ఏడాది ఆగస్టు 15న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జాతికి అంకితంచేశారు. ప్రస్తుత బడ్జెట్ కేటాయింపు నిధులతో మొత్తం పథకం పూర్తయ్యేందుకు మార్గం సుగమం అయింది. చిన్న చిన్న పనులు మినహా అన్ని పనులు పూర్తయ్యాయి. మోటార్లు, పంపులు పూర్తి స్థాయిలో బిగించారు. విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తయింది. రెండు స్టేజ్‌ల పంపు హౌస్‌ల నిర్మాణం పూర్తయింది. పురుషోత్తపట్నం ప్రధాన కాల్వ దారిలో వున్న ఏలేరు ప్రాజెక్టు ఆయకట్టు స్థిరీకరణ, విశాఖ కార్పొరేషన్‌కు తాగునీరు అందించడం ఈ పధకం ప్రధాన లక్ష్యం. గత ఏడాది అక్టోబర్ నాటికి తొలి దశ పనులు పూర్తిచేసి పుష్కర కాల్వ ద్వారా ఏలేరు జలాశయంలోకి 1.5 టిఎంసీల నీటిని విడుదలచేశారు. ఈ నెలాఖరుకు పథకాన్ని పూర్తిచేసి గోదావరి వరదల సమయంలో ఏలేరుకు నీరు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. సీతానగరం మండలం పురుషోత్తపట్నం వద్ద నిర్మిస్తున్న పంపుహౌస్ పనులు కూడా తుదిదశకు చేరుకున్నాయి. పురుషోత్తపట్నం గ్రామం వద్ద నిర్మించిన స్టేజ్ 1 పంపుహౌస్‌లో 10 మోటార్లు, 10 పంపులు బిగించారు. ఈ పథకానికి సంబంధించి 50.5 కిలో మీటర్ల మేర ఐదు వరుసల్లో పైపులైన్లు ఏర్పాటుచేయాల్సివుండగా ఇప్పటి వరకు 48.5 కిలో మీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం తొర్రిగడ్డ ఎత్తిపోతల పథకం నుంచి రబీకి సాగునీరు విడుదలవుతుండటంతో రెండు కిలోమీటర్ల పైపులైన్ పనులు కాస్తంత మెల్లగా జరుగుతున్నాయి. ఈ నెలాఖరుకు తొర్రిగడ్డ నుంచి నీటిని నిలిపివేసిన తర్వాత పనులు పూర్తి చేయనున్నారు. ఇందుకు సంబంధించి జల వనరుల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ పథకానికి గత ఏడాది జనవరి 5వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిఠాపురంలో శంకుస్థాపన చేశారు. భూసేకరణ ప్రక్రియలో కాస్తంత ఇబ్బందులు ఎదురుకావడంతో పనుల్లో మొదట్లో కాస్తంత జడత్వం చోటు చేసుకుంది. కేవలం రెండు మోటార్ల ద్వారా నీటిని ఏలేరుకు పంపే ప్రయత్నంచేశారు. పోలవరం ఎడమ ప్రధాన కాల్వ ద్వారా నీటిని ఏలేరు జలాశయానికి పంపించాల్సి వుంది. కానీ పుష్కర ఎత్తిపోతల పథకం ప్రధాన కాల్వ ద్వారా నీటిని పంపిణీ చేస్తున్నారు. మార్గమధ్యలో మూడు చోట్ల రహదారుల క్రాసింగ్ పనులు పూర్తి కావాల్సివుంది. ప్రస్తుతం రెండు చోట్ల 16వ నెంబర్ జాతీయ రహదారిపై వంతెనల నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్నాయి. ఇక్కడ ట్రాఫిక్ మళ్లించారు. మరో రెండు చోట్ల రాష్ట్ర జాతీయ రహదారులపై వంతెనల నిర్మాణం పూర్తి కావాల్సివుంది. పోలవరం ఎడమ కాలువపై వంతెన పనులు పూర్తికాకపోవడంతో పుష్కర కాల్వ ద్వారా నీటిని మళ్లించారు. ప్రస్తుతం పనులు తుది దశకు చేరుకోవడంతో ఈ నెలాఖరుకు మొత్తం పనులు పూర్తయ్యే పరిస్థితి వుంది. ఏప్రిల్ మొదటి వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంగుళూరు వద్ద పోలవరం పవర్ హౌస్ కాంక్రీటు పనులను ప్రారంభించడానికి వచ్చే అవకాశం వుందని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పురుషోత్తపట్నం పూర్తయిన తర్వాత గోదావరి వరదల సమయంలో 10 పంపుల ద్వారా రోజుకు 3,500 క్యూసెక్కుల నీటిని తోడి ఏలేరు జలాశయానికి సరఫరాచేస్తారు. జలాశయంలో నిత్యం 24 టీఎంసీల నీరు నిల్వచేస్తారు. ఈ నీరు ఇటు రబీ అవసరాలకు, అటు విశాఖ తాగునీటి అవసరాలకు, పారిశ్రామిక అవసరాలకు స్టాండ్‌బైగా వినియోగించుకోవడానికి కూడా అవకాశంవుంది. ఏలేరు జలాశయం పరిధిలోని 67వేల ఎకరాల ఆయకట్టుతోపాటు మరో 50వేల ఎకరాలకు ఖరీఫ్‌లో సాగునీరు అందించనున్నారు. రబీ కాలంలో అపరాల సాగుకు నీరందిస్తారు.
Tags: Purushottampatam water for Rabi cultivation

టార్గెట్ ఏపీ!

Date:20/03/2018
కృష్ణా‌ ముచ్చట్లు :
దేశవ్యాప్తంగా బీజేపీ హవా సాగుతోంది. దక్షిణాది మినహా దాదాపు ప్రతీ రాష్ట్రంలోనూ కమలం వికసిస్తోంది. అందుకే 20 పైబడి రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారంలో ఉంది. పశ్చిమ-ఉత్తర-ఈశాన్య భారతంలో పైచేయి సాధించిన కాషాయదళం దక్షిణాదినా అదే రిజల్ట్ కోసం తెగ ట్రై చేస్తోంది. అయితే ఈ ప్రాంతం ఆ పార్టీకి కొరకరాని కొయ్యగానే మారింది. స్థానికంగా ప్రాంతీయ పార్టీలదే హవా కావడంతో జాతీయ పార్టీలకు పెద్దగా ఆదరణ లభించడంలేదు. ఈ పరిస్థితిని అధిగమించి వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలన్నది బీజేపీ ప్లాన్ గా తెలుస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగానే ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ ను టార్గెట్ చేసుకుందని.. వైసీపీ, జనసేనలను పరోక్షంగా ప్రోత్సహిస్తూ రాష్ట్రంపై పట్టు సాధించేందుకు కృషి చేస్తోందని విశ్లేషకులు అంటున్నారు. దీని కోసం కేంద్రం ప్రత్యేక మిషన్ నే నడిపిస్తోందని చెప్తున్నారు. ఈ ప్రోగ్రామ్ లో భాగంగానే వైసీపీ, జనసేనలు కేంద్రాన్ని వదిలేసి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఏపీలో పట్టు సాధించేందుకు బీజేపీ ఆపరేష్ గరుడను ప్లాన్ చేసిందని టాక్. దక్షిణాదిలో బీజేపీ ప్రవేశించడం అంత ఆశామాషీ కాదన్నది విశ్లేషకుల అభిప్రాయం. దక్షిణ భారతదేశం చరిత్ర వేరు. సంస్కృతీ వేరు. ఇక్కడి ప్రజల ఆకాంక్షలు ఆసక్తులు వేరు. ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి మధ్య స్పష్టమైన వైవిధ్యం ఉంది. దక్షిణాదిలో తొలి నుంచీ ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర. ఇది బీజేపీకి కూడా తెలుసు. అయినా దక్షిణాదిలో అడుగుపెట్టాలనే లక్ష్యంతో ముందుకు వెళుతోంది. ఈ ప్రాంతంపై పట్టు సాధించేందుకు భారీ ప్రణాళికలు అమలుచేస్తోందని చెప్తున్నారు. దక్షిణాదిలోని తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఏపీ, తెలంగాణలో బీజేపీకి చెప్పుకోదగ్గ మెజారిటీ లేదు. ఎన్ని గొడవలున్నా ప్రాంతీయ పార్టీలకే మినహా జాతీయ పార్టీలకు అధికారం దక్కే ఛాన్స్ తక్కువ. అందుకే బీజేపీ ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రయోగించిన స్ట్రాటజీలనూ ఇక్కడా వాడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ పార్టీ మిత్రపక్షాల ప్రయోజనాలను దెబ్బతీసేందుకూ వెనకాడ్డంలేదని దీనికి టీడీపీయే మంచి ఉదాహరణ అని వ్యాఖ్యానిస్తున్నారు.
Tags:Target AP!