పవన్ కోసం నేను రెడీ

Date:20/03/2018
హైద్రాబాద్ ముచ్చట్లు :
చిన్నప్పటి నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ప్రేమ. ఆయన వ్యక్తిత్వం అంటే నాకు చాలా ఇష్టం అందుకే ఆయన స్థాపించిన జనసేన పార్టీకి నా ఫుల్ సపోర్ట్.. అందుకు దేనికైనా సిద్ధం అని ప్రకటించింది హీరోయిన్ మాధవి లత. ‘నచ్చావులే’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తరువాత మూడు నాలుగు సినిమాల్లో నటించింది. అయితే కెరీర్ పరంగా పెద్దగా సక్సెస్ దక్కకపోవడంతో ఈ అమ్మడికి అవకాశాలు తగ్గాయి. దీంతో తెలుగు సినిమా పరిశ్రమలో అవకాశాలపేరుతో హీరోయిన్స్ వాడుకోవటం తదితర అంశాలపై హాట్ కామెంట్స్ చేస్తూ వార్తల్లోకెక్కింది. తాజాగా పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్ చేస్తూ ఫేస్ బుక్‌లో ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్‌ను షేర్ చేశారు. ‘ఆయన సినిమాల చూసి పవన్‌ని ఇష్టపడలేదు.. ఆయన సర్వీస్‌ను చూసే చిన్నప్పటినుండీ ఇష్టపడ్డా అన్నారు. గడిచిన పది సంవత్సరాలుగా ప్రతి ఇంటర్వ్యూలలో చెప్తూనే ఉన్నా.. నాకు పవన్ కళ్యాణ్ అంటే ప్రేమ.. నాకు సోషల్ సర్వీస్ చేయడం అంటే చాలా ఇష్టం. అందుకే ‘నక్షత్ర ఫౌండేషన్’ ప్రారభించాను. కాని సరైన సపోర్ట్, ఫండింగ్ లేక సర్వీస్‌కి బ్రేక్ ఇచ్చా. కాని సర్వీస్ చేయాలనే ఆశ మాత్రం చావలేదు. బాగా ఆలోచించి.. వ్యక్తిగతంగా పవన్ అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు ఆయన స్థాపించిన జనసేన పార్టీకి ఎందుకు సపోర్ట్ చేయకూడదు. ‘పవన్ కళ్యాణ్ కోసం నేను దేనికైనా రెడీ’ అంటూ పవన్‌పై ఉన్న ప్రేమను ఫేస్‌బుక్ ద్వారా బహిర్గతం చేసింది ‘నచ్చవులే’ బ్యూటీ మాధవి.
Tags: For Pawan I will

నాన్నమ్మ వాస్తును నమ్ముకున్న రాహుల్

Date:20/03/2018
హైద్రాబాద్ ముచ్చట్లు :
కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా అధ్యక్షుడు రాహుల్ దూకుడు పెంచారు. అసెంబ్లీ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రచారంతో పాటూ సెంటిమెంట్‌ను రాహుల్ నమ్ముకుంటున్నారు. నాయనమ్మ ఇందిరా గాంధీ బాటలోనే నడుస్తున్నారు. ఆయన ప్రచారం కోసం మంగళూరు వచ్చారు. అక్కడి నెహ్రూ మైదనాంలో సభలో రాహుల్ ప్రసంగం కోసం ప్రత్యేకంగా వేదికను సిద్ధం చేశారు. కాంగ్రెస్ నేతల సలహా మేరకు… వాస్తుల్లో కొన్ని మార్పులు చేశారట. 1977 లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరమ్మ ప్రసంగించిన చోటే… వేదిక ఏర్పాటయ్యింది. ప్రధానంగా కాంగ్రెస్ నేతలు సెంటిమెంట్, వాస్తుల్ని ప్రస్తావిస్తున్నారు. రాహుల్ ఉత్తరంవైపుగా తిరిగి ప్రసంగం చేస్తే అది ఎన్నికల్లో తమకు కలిసొస్తుందని నేతలు బలంగా నమ్ముతున్నారట. వాస్తవానికి వేదికను పశ్చిమం దిక్కున ఏర్పాటు చేస్తుంటారు. హిందువుల సంప్రదాయం, నమ్మకం ప్రకారం పశ్చిమ దిక్కు అంత మంచిది కాదట… అందుకే సెంటిమెంట్ దృష్టిలో పెట్టుకొని ఉత్తరంవైపు వేదికను సిద్ధం చేశారు. ఇలా చేస్తే ఎన్నికల్లో విజయంతో పాటూ పార్టీ కూడా కర్ణాటకలో పుంజుకుంటుందని నమ్మకంతో ఉన్నారు. మరి వాస్తు సెంటిమెంట్‌లు కాంగ్రెస్‌కు ఏమాత్రం కలిసొస్తాయో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కాని చెప్పలేం.
Tags: Rahul, who believes in my grandmother’s style

.జనసేనకు రక్షణ కావాలంట…

Date:20/03/2018
అనంతపురం ముచ్చట్లు :
నిన్నటి వరకూ మిత్రపక్షాలుగా ఉన్న టీడీపీ-జనసేన పార్టీలు.. జనసేన ఆవిర్భావ సభ తరువాత ఉప్పునిప్పుగా మారాయి. ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు, దూషణలతో ఏపీ పాలిటిక్స్ రంజుగా మారాయి. ఒకవైపు ప్రత్యేక హోదా ఉద్యమం ఢిల్లీ స్థాయిలో హీట్ పెంచేస్తుంటే… ఇక్కడ మాత్రం ఒకరి బొక్కలు ఒకరు బయటపెట్టే పనిలో బిజీ అయ్యారు మన లీడర్లు. పవన్ కళ్యాణ్ ఎవరూ ఊహించని విధంగా యూటర్స్ తీసుకుని ప్రభుత్వంపై విమర్శల దాడి చేయడంతో వాటిని తిప్పికొట్టేందుకు షిప్ట్‌ల వారిగా ఏపీ మంత్రులు ఫైర్ అవుతున్నారు. నిన్న గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు, నారాయణ, జవహర్, ఉప ముఖ్యమంత్రి కేఈ క్రిష్ణమూర్తిలు పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పించారు. తాజాగా లోకేష్ సైతం తనపై వచ్చిన అవినీతి ఆరోపణల నుండి బయటపడే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారు. అయితే అధికార టీడీపీ పార్టీ నాయకులు తమ కార్యకర్తలపై దౌర్జన్యం చేస్తూ.. బలవంతంగా టీడీపీలో జాయిన్ కావాలంటూ ఒత్తిడి చేస్తున్నారంటూ జనసేన ప్రెస్ నోట్‌ రిలీజ్ చేయడం ఆసక్తిగా మారింది. అనంతపురం జిల్లాలో జనసేన కార్యకర్తలపై దౌర్జన్యం చేస్తున్నారని దీనిపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతూ.. జనసేన ఉపాధ్యక్షడు బి. మహేందర్ రెడ్డి ప్రెస్‌నోట్‌ను రిలీజ్ చేశారు.
అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో నలభైమంది జనసేన కార్యకర్తల్ని అన్యాయంగా లాకప్‌లో ఉంచారని.. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ప్రోద్భలంతో వారిపై అక్రమంగా కేసు నమోదుచేశారంటూ జనసేన ఆరోపిస్తుంది. అలాగే తెలుగుదేశం పార్టీలో చేరేందుకు నిరాకరించిన సుబ్రహ్మణ్యం అనే జనసేన కార్యకర్తపై స్థానిక జెడ్పీటీసీ సభ్యులు దాడి చేయడాన్ని ఖండించింది జనసేన. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, జనసేన కార్యకర్తలకు రక్షణ కల్పించాలని కోరుతూ జనసేన ప్రెస్‌ నోట్‌ విడుదల చేశారు.
Tags: To protect the economy.

బిగ్ బాస్ 2 కు అంతా రెడీ

Date:20/03/2018
హైద్రాబాద్ ముచ్చట్లు :
విజేతకు రెమ్యూనరేషన్ మాటేమిటో కానీ.. హోస్టుకు మాత్రం భారీ పారితోషకమే దక్కనుందట.. ‘బిగ్‌బాస్ -2’ విషయంలో ఈ ప్రచారం గట్టిగా జరుగుతోంది. ఫస్ట్ సీజన్ లో ఎన్టీఆర్ బిగ్‌బాస్ హోస్టుగా మెరిసిన సంగతి తెలిసిందే. సెకెండ్ పార్టు విషయంలో మాత్రం ఈ అంశంపై ఇంకా సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి. ఈ సంప్రదింపుల్లో భాగంగా భారీ రెమ్యూనరేషన్ ఫిగర్ తో హీరోలను ఊరిస్తున్నారట బిగ్ బాస్ నిర్వాహకులు.ఈ సారి 14 వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో సెలబ్రిటీలను ఉంచనున్నారట. బిగ్ బాస్ ఫస్ట్ ఎడిషన్ ను పది వారాల పాటు నిర్వహించారు. రెండో ఎడిషన్ మాత్రం 14 వారాల పాటు సాగుతుందట. దీంతో హోస్టు కూడా ఎక్కువ కాల్షీట్లు కేటాయించాల్సి ఉంటుంది. అందుకే పారితోషకం మొత్తాన్ని కూడా భారీగా పెంచారట. ఈ పెంపుతో రెమ్యూనరేషన్ ఐదు కోట్ల రూపాయలకు చేరిందని సమాచారం.విశేషం ఏమిటంటే… తెలుగు బిగ్ బాస్ విజేతకు దక్కే మొత్తంతో పోలిస్తే.. హోస్టుకు పది రెట్లు ఎక్కువ పారితోషకాన్ని ఇస్తూ ఉండటం. ఇంతకీ హోస్టు ఎవరనే అంశం మాత్రం ఇంకా మిస్టరీనే. ఫస్ట్ ఎడిషన్ కు ఎన్టీఆర్ హోస్టుగా వీరవిహారం చేసిన సంగతి తెలిసిందే. రెండో సీజన్ కు మాత్రం హోస్టు పాత్రలో ఎన్టీఆర్ పేరుతో సహా మరి కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. నాని, దగ్గుబాటి రాణా వంటి వాళ్లతో కూడా హోస్టు రోల్ కోసం సంప్రదింపులు జరుగుతున్నట్టు సమాచారం.
Tags: Big boss 2 is all ready

ఆనందసూర్య స్వామిజిలను విమర్శిస్తే మనుగడ లేదు

– ఏపిబిఎస్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శికోనూరు సతీష్‌శర్మ

Date:20/03/2018

గుంటూరు ముచ్చట్లు

బ్రాహ్మణ కార్పోరేషన్‌ చైర్మన్‌ ఆనందసూర్య ఇష్టంవచ్చినట్లు ప్రవర్తిస్తూ విశాఖ శారదాపీఠాధిపతి శ్రీశ్రీ స్వరూపానందేంద్రస్వామిజిని విమర్శించడం బాధకరమని , హద్దులు దాటితే ఆనందసూర్యకు మనుగడ లేదని ఏపిబిఎస్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శికోనూరు సతీష్‌శర్మ హెచ్చరించారు. ఆయన గుంటూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ స్వామిజిలకు పార్టీ రంగులు అంటగట్టడం, స్వామిజిలతో ఎవరు మాట్లాడిస్తున్నారో తెలుసు అంటు పరోక్ష హెచ్చరికలు చేయడం ఆనందసూర్య స్థాయికి తగదన్నారు. విజయవాడలో ఆనందసూర్య అర్ధనగ్న ప్రదర్శనలో మాట్లాడుతూ ప్రభుత్వానికి గడ్డుకాలమని అన్న విషయం మరచిపోయి నేడు గురువిందసామితల ఆనందసూర్య మెప్పుకోసం స్వామిజిలను విమర్శిస్తే సహించేది లేదన్నారు. ఆనందసూర్య కార్పోరేషన్‌ చైర్మన్‌గా విఫలమైయ్యారని, బ్రాహ్మణులను ఏకతాటిపై నడిపించి, కుటుంభాలను ఆదుకోవాల్సిన చైర్మన్‌ గ్రూపులను ఏర్పాటు చేసి, విభజించి పాలిస్తున్నారని , ఈ విషయాలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, మంత్రి లోకేష్‌కు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. బ్రాహ్మణుల అభివృద్ధి కోసం పోరాటం చే యాల్సిన చైర్మన్‌ బ్రాహ్మణ పీఠాధిపతులను విమర్శించడం , ఆయన దిగజారుడు స్థనానికి నిదర్శనమన్నారు. ఇకనైనా ఆనందసూర్య హద్దులు దాటకుండ ఉండాలని, లేకపోతే తగిన గుణపాఠం నేర్పుతామని హెచ్చరించారు.

 

Tags: Anandasurya Swamiji did not survive

15 రోజుల పాటు పెరోల్

Date:20/03/2018
బెంగళూర్ ముచ్చట్లు:
అన్నాడీఎంకే నేత, దివంగత జయలలిత నెచ్చెలి శశికళ భర్త నటరాజన్ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయనకు రెండు రోజుల కిందట తీవ్రమైన గుండెపోటు రావడంతో, వైద్యం కోసం చెన్నైలోని గ్లెనిజెస్ గ్లోబల్ హాస్పిటల్‌లో చేర్పించారు. ఆయనను కాపాడటానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో జయలలిత అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళకు 15 రోజుల పెరోల్‌ను అధికారులు మంజూరు చేశారు. పెరోల్ రావడంతో ఆమె బెంగళూరు నుంచి చెన్నైకు బయల్దేరారు. శశికళ అభ్యర్థన మేరకు న్యాయస్థానం అమెకు పెరోల్‌ మంజూరు చేసింది. వాస్తవానికి సోమవారమే ఆమె పెరోల్ కోసం దరఖాస్తు చేశారు. తన భర్త అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారని, అందుకు పెరోల్ మంజూరు చేయాలని ఆమె అభ్యర్థించారు. పెరోల్ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం అనుమతించే లోపే నటరాజన్ మరణించడంతో శశికళ విషాదంలో మునిగిపోయారు. నటరాజన్ అంత్యక్రియలను బుధవారం జరగనున్నాయి. గతేడాది అక్టోబరులో నటరాజన్‌కు కాలేయమార్పిడి చికిత్స నిర్వహించారు. ఆ సమయంలోనూ శశికళకు వారం రోజులు పెరోల్ మంజూరు చేశారు.
Tags: 15 days parole

శశికళ  భర్త నటరాజన్ మృతి

Date:20/03/2018
బెంగళూర్ ముచ్చట్లు:
ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తున్న అన్నాడీఎంకే నాయకురాలు వీకే శశికళ భర్త ఎం.నటరాజన్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని గ్లెనీగ్లెస్ గ్లోబల్ హెల్త్ సిటీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తరవాత 1.30 గంటలకు నటరాజన్ మరణించినట్లు హాస్పిటల్ ఒక ప్రకటనను విడుదల చేసింది. నటరాజన్ ప్రాణాలను కాపాడటానికి సాయశక్తులా ప్రయత్నించామని, అయినా ఫలితం లేకపోయిందని హాస్పిటల్ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం నటరాజన్ వయసు 74 సంవత్సరాలు.నటరాజన్ కిందటేడాది అక్టోబర్‌లో కిడ్నీల మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. అయితే మార్చి 16న మరోసారి ఆయన అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు గ్లోబల్ హాస్పిటల్‌లో చేర్చారు. చాతిలో ఇన్ఫెక్షన్ ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు. అప్పటి నుంచి ఆయణ్ని ఐసీయూలో ఉంచారు. వెంటిలేటర్‌పైనే ఉంచి చికిత్స అందించారు. అయితే నటరాజన్ వాయు నాళం మూసుకుపోయిందని, పరిస్థితి అత్యంత విషమంగా ఉందని సోమవారం డాక్టర్లు వెల్లడించారు. అర్ధరాత్రి దాటిన తరవాత నటరాజన్ కన్నుమూశారు.నటరాజన్ మృతదేహాన్ని చెన్నై బీసెంట్‌నగర్‌లోని నివాసానికి తరలించారు. ఈ సాయంత్రానికి స్వస్థలం తంజావూరు తరలించనున్నారు. రేపు అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. మరోవైపు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్తను చూసేందుకు శశికళ సోమవారం పెరోల్‌ కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన తుదిశ్వాస విడవడంతో నేడు శశికళకు పెరోల్ దొరికే అవకాశముంది. కాగా, గతంలో ప్రజా సంబంధాల అధికారిగా పనిచేసిన నటరాజన్‌.. 1975లో శశికళను వివాహం చేసుకున్నారు. విద్యార్థి దశలో హిందీ వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు. డీఎంకేలో చురుకైన పాత్ర పోషించారు. జయలలితకు కొన్నాళ్ల పాటు రాజకీయ సలహాదారుగానూ వ్యవహరించారు.
Tags: Sasakala’s husband Natarajan Murthy

మరో వివాదంలో పవన్ కళ్యాణ్

Date:20/03/2018
గుంటూరు  ముచ్చట్లు:
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండెకరాల స్థలాన్ని కొనుగోలు చేసిన వ్యవహారంపై వివాదం చెలరేగింది. ముఖ్యంగా జనసేనానిని టార్గెట్ చేసుకుని ఎకరం ఇరవై లక్షలకు అమరావతి సమీపంలో ఎలా కొనుగోలు చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధానికి సమీపంలో ఖాజా వద్ద పవన్ కల్యాణ్ రెండు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల పవన్ అందుకు భూమి పూజ కూడా చేశారు.అయితే అమరావతికి సమీపంలో ఎకరం భూమి కోట్ల రూపాయలు విలువ చేస్తుండగా పవన్ కల్యాణ్ కు ఇరవై లక్షలకు ఎలా వచ్చిందన్న ప్రశ్నలను టీడీపీతో పాటు పలువురు ఇటీవల కాలంలో సంధిస్తున్నారు. అయితే దీనికి జనసేన పార్టీ ట్విట్టర్ ద్వారా సమాధానం ఇచ్చింది. పవన్ ఇంటికి సంబంధించి కొనుగోలు చేసిన డాక్యుమెంట్లతో సహా ట్విట్టర్లో ఆ పార్టీ ఉంచింది. తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ విలువ ప్రకారమే పవన్ కల్యాణ్ ఆ భూమిని కొనుగోలు చేశారని పార్టీ పేర్కొంది. ఆ భూమికి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా ట్విట్టర్లో ఉంచింది. రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి తీసుకున్న డాక్యుమెంట్లను కూడా బహిరంగంగా పెట్టింది. అనవసరమైన విమర్శలు చేయడం మాని, రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టాలని జనసేన పార్టీ కోరింది. మొత్తం రెండు ఎకరాల 07 సెంట్ల భూమిని తాము 41 లక్షల 40 వేల రూపాయలకు కొనుగోలు చేసినట్లు పేర్కొంది. ఎవరికైనా అనుమానాలు ఉంటే తమ వద్దకు వస్తే నివృత్తి చేస్తామని పేర్కొంది.
Tags: Pawan Kalyan in another controversy