రాష్ట్రంలో అంకుర వాణిజ్య వ్యవస్థాపనకు సెర్ఫ్ సన్నాహాలు 

  సామాజిక శిక్షణా శిబిరాల ఏర్పాటు
Date:20/03/2018
విజయవాడ  ముచ్చట్లు:
ఇప్పటి వరకు ప్రభుత్వ పధకాలకు కేవలం లబ్దిదారులుగా వున్న గ్రామీణ వర్గాలను ఇక ముందు అంకుర వాణిజ్య వ్యవస్థాపకులుగా చూడబోతున్నాము. కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేసే నేషనల్ లైవ్లీహుడ్ మిషన్ ఈ మేరకు ఇప్పటికే రాష్ట్రాలకు ఇందుకు అవసరమైన మార్గదర్శకాలు పంపింది. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో దీని అమలుకు పేదరిక నిర్మూలనా సంస్థ (‘సెర్ఫ్’) కార్యాచరణ ప్రారంభించింది. గ్రామ స్థాయిలో విస్తృతమైన స్వయం సహాయ సంఘాల సమైఖ్య సహకారం (నెట్ వర్క్) దీనికి ఉండడంతో కొంతకాలంగా రాష్ట్రంలో అమలవుతున్న సూక్ష్మస్థాయి నిర్వహణ అవసరమైన పధకాలైన – పెన్షన్లు, కార్మిక బీమా వంటివి ‘సెర్ఫ్’ అమలు చేయడం తెలిసిందే. అయితే  గ్రామీణ నిరుద్యోగితను తగ్గించడం లక్ష్యంగా అమలు చేయబోతున్న ఈ పధకం గ్రామీణ అభివృద్దిలో మరొక ముందడుగు అవుతుంది. ఈ నూతన చొరవతో అంకుర వాణిజ్య వ్యవస్థాపన కేవలం విదేశీ సాంకేతిక విద్యానేపధ్యం వున్న నగర యువతకు మాత్రమే అన్న అభిప్రాయం నుంచి మనల్ని బయటకు తేనుంది.నేషనల్ సాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ 2011 నివేదిక ప్రకారం ప్రస్తుతం గ్రామీణ యువతలో సగం మంది స్వయం ఉపాధి రంగంలో వున్నారు. సరాసరి 15-59 ఏళ్ల మధ్య వయసున్నవీరిలో 53% మంది పురుషులు 55.8% స్త్రీలు. అయితే ఇప్పటికీ  58% మంది వ్యవసాయం ప్రధాన జీవనోపాధిగా వున్నారు. అయితే ఇందులో వుండే ఎగుడుదిగుళ్ళు మనకు తెలిసిందే, ఇక భూవసతి లేని వారికీ ఎటువంటి భరోసా లేని పరిస్థితి. పని ఏదయినా వీరిలో 90 శాతం మంది అసంఘటిత రంగంలోనే వున్నారు. ఈ పరిస్థితుల్లో ఒక కుటుంబంలో వున్నవారు 3-4 విధాలుగా జీవనోపాధులను ఎంచుకోవలసి వుంటుంది. అయితే వాటిలో వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి వెతుకుంటున్న వారికీ ఆయా రంగాలకు సంబంధించిన వ్యాపార మెళకువలు, మార్కెట్ గురించిన అవగాహన, ఎంచుకున్న రంగం గురించి లోతైన జ్ఞానం, జమాఖర్చులు, అవసరమైన ఆర్ధిక ఆసరా లేక వారు నిలదొక్కుకోవడం కష్టమవుతున్నది. ఈ నేపధ్యం లో గ్రామీణ  అంకుర వాణిజ్య వ్యవస్థాపన అనే సరికొత్త ఆలోచనకు ప్రభుత్వం పూనుకోంది. ఇందుకోసం ‘సెర్ఫ్’ ఇప్పటికే తనకున్న గ్రామ, మండల, జిల్లా స్థాయి సంఘ సమాఖ్య నిర్మాణాల ద్వార ముందుగ శిక్షణా తరగతుల నిర్వహణకు కార్యాచరణ ఆరంభించింది. ఇందు కోసం మండలాల్లో బిజినెస్ మేనేజర్ లను నియమిస్తున్నారు. ఈ కార్యాచరణ ఇలావుందబోతున్నది – స్వయం సహాయ సంఘ సభ్యులతో గ్రామీణ అంకుర వాణిజ్య వ్యవస్థాపన కోసం నియమించిన సామాజిక శిక్షణా ట్రెయినర్ ప్రతి రోజు తమకు కేటాయించిన గ్రామైఖ్య సంఘాలను సందర్శించి వారితో కనీసం రోజులో సగం సేపు గ్రామీణ అర్ధికత వృద్ది – నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించవలసిన ఆవశ్యకత గురించి సమగ్ర అవగాహన కలిగిస్తారు.  సామాజిక శిక్షణా ట్రెయినర్ ప్రతి గ్రామ సంఘంలోనూ ఒక రోజు – గ్రామీణ అంకుర వాణిజ్య కార్యక్రమం గురించి అవగాహన కలిగించాలి గ్రామైఖ్య సంఘాలు – సబ్ కమిటీలు కోసం: గ్రామీణ అంకుర వాణిజ్య వ్యవస్థాపన. అందుకు గ్రామ సంఘాలకు సామాజిక శిక్షణ శిబిరాలు నిర్వహస్తారు.   గ్రామీణ అంకుర వాణిజ్య వ్యవస్థాపన కోసం నియమించిన సామాజిక శిక్షణా ట్రెయినర్ ప్రతి గ్రామ సంఘంలోనూ ఒక రోజు గ్రామీణ అంకుర వాణిజ్య కార్యక్రమం గురించి అవగాహన కలిగిస్తారు. ఆసక్తి వ్యక్తీకరించిన స్వయం సహాయ సంఘ మహిళలకు, వాణిజ్య వ్యవస్థాపన చేయాలనుకునే వ్యక్తులకు, ఎంటర్ ప్రెన్యూర్ కావాలనుకునే వారికి ఉండవలసిన లక్షణాలు, వారి క్రియాశీలత ఎలా వుండాలి అనే అంశం మీద ఒక సమావేశం నిర్వహిస్తారు. ఇందులో స్వయం సహాయ సంఘ మహిళల్లో అంకుర వాణిజ్య వ్యవస్థాపన కొరకు అనువైన వారిని గుర్తిస్తారు.
బ్లాక్ రిసోర్స్ సెంటర్ – సబ్ కమిటీ ట్రెయినింగ్ లో ఒక బ్లాక్ లో వున్న అన్ని మండల సమాఖ్యల ఆఫీస్ బేరర్లు వుంటారు. వీరికి ఈ ప్రోగ్రాం ప్రధాన గురువు (మెంటార్) బ్లాక్ ప్రాజెక్ట్ మేనేజర్ రెండు రోజులు పాటు బ్లాక్ రిసోర్స్ సెంటర్ లో శిక్షణ ఇస్తారు.అంకుర వాణిజ్య వ్యవస్థాపన కొరకు సాధారణ అవగాహన సదస్సు. ఒక వాణిజ్య వ్యవస్థాపన చేయాలనుకునే వ్యక్తులకు ఎంటర్ ప్రెన్యూర్ కావాలనుకునే వారికి, అందుకు అవసరమైన ప్రతిభా పాటవాలను ఏ విధంగా సంతరించుకోవాలో ఒక రోజు శిక్షణా కార్యక్రమాన్ని వారి వారి గ్రామాల్లోనే నిర్వహిస్తారు.సాఫ్ట్ స్కిల్స్ లో శిక్షణా కార్యక్రమం. ఒక వాణిజ్య వ్యవస్థాపన చేసి ఎంటర్ ప్రెన్యూర్ కావాలనుకునే వారు ఇతరులను కలిసినప్పుడు వారితో మన సంభాషణ ఎలా వుండాలి, మన దేహ బాష, శైలి, విషయ స్పష్టత, మర్యాద, చెప్పాలనుకునే విషయంలో క్లుప్తత, ఇటువంటి మృదు నైపుణ్యాలను మెరుగుపర్చు కోవడంలో బ్లాక్ రిసోర్స్ సెంటర్ లో శిక్షణ ఇస్తారువాణిజ్య వ్యవస్థాపన ఆలోచన – ఆచరణ మధ్య వాస్తవికత అంచనా. అంకుర వాణిజ్య వ్యవస్థాపన కొరకు  సభ్యురాలి వాణిజ్య వ్యవస్థాపన ఆలోచనను క్షేత్ర స్థాయి వాస్తవికతతో సరి చూసి ఆచరణలో వున్న సాధ్యా సాద్యాలను అంచనా వేయడానికిగాను వారి కార్య క్షేత్రాన్ని ఒక రోజు సందర్శిస్తారు. ప్రతిపాదిత ఆలోచనఎంతవరకు సాధ్యమో చూస్తారు. ఇందుకు ఒక్కొక్క అభ్యర్ధికి ఒక రోజు చొప్పున కేటాయిస్తారు.వాణిజ్య ప్రణాళిక తయారుచేయుట. అభ్యర్ధి వాణిజ్య వ్యవస్థాపన ప్రతిపాదన కోసం వ్యాపార ప్రణాళిక సిద్దం చేయాలి ఔత్సహిక అంకుర వాణిజ్య వేత్తలకు చేయూత. వారికి  వాణిజ్య వ్యవస్థాపన కొరకు అవసరమైన సహకారాన్ని సామాజిక శిక్షణా ట్రెయినర్ అందిస్తారు. వారికి రుణం మంజూరు, పంచాయతి లేదా ఇతర ప్రభుత్వ కార్యాలయాలు నుంచి అవసరమైన అనుమతులు, రిజిస్ట్రేషన్ కొరకు అవసరమైన సర్టిఫికెట్లు ఇటువంటి ప్రాధమిక దశ పనులన్నిటిలో చేయూత ఇస్తారు.
వ్యాపార నిర్వహణ లో శిక్షణ. ఔత్సహిక అంకుర వాణిజ్య వేత్తలకు వారి వాణిజ్య వ్యవస్థాపన కొరకు అవసరమైన వ్యాపార నిర్వహణ సంబధమైన శిక్షణను రెండు రోజులు పాటు వారి గ్రామంలోనే సామాజిక శిక్షణా ట్రెయినర్ అందిస్తారు. అందులో రికార్డుల నిర్వహణ, మార్కెటింగ్, ప్రచారం వంటి అంశాలు వుంతాయి. మార్కెటింగ్ కొరకు గొలుసు సంబంధాలు సామాజిక శిక్షణా ట్రెయినర్ అంకుర వాణిజ్య వేత్త వ్యాపార నిర్వహణ కొరకు అవసరమైన మార్కెట్ గొలుసు సంబంధాలు ఏర్పడే విధంగా చూడాలి.
గ్రామ సంఘానికి నెల నెలా – 48 నెలల పాటు వివరణ:   ఆ గ్రామంలో వున్న ఔత్సహిక అంకుర వాణిజ్య వేత్తల వ్యవస్థాపక పురోగతి ఏ విధంగా ఉన్నదీ ఇందు కోసం అక్కడ పని చేస్తున్న సామాజిక శిక్షణా ట్రెయినర్, ప్రతి నెలా గ్రామ సంఘానికి తెలియచేస్తారు.  ఈ గ్రామీణ అంకుర వాణిజ్య కార్యక్రమం పురోగతి ఇలా 48 నెలల పాటు ఎప్పటికప్పుడు గ్రామ సంఘానికి తెలియచేస్తారు   బ్లాక్ రిసోర్స్ సెంటర్ కు నెల నెలా – 48 నెలల పాటు వివరణ. ఆ బ్లాక్ లో వున్న ఔత్సహిక అంకుర వాణిజ్య వేత్తల వ్యవస్థాపక పురోగతి ఏ విధంగా ఉన్నదీ ఇందు కోసం అక్కడ పని చేస్తున్న సామాజిక శిక్షణా ట్రెయినర్, ప్రతి నెలా బ్లాక్ రిసోర్స్ సెంటర్ కు తెలియచేయాలి.  ఈ గ్రామీణ అంకుర వాణిజ్య కార్యక్రమం పురోగతి ఇలా 48 నెలల పాటు ఎప్పటికప్పుడు సంబంధిత బ్లాక్ రిసోర్స్ సెంటర్ కు తెలియచేయాల్సి టుంది.  నిరంతర నిఘాతో చేయూత. అంకుర వాణిజ్య వేత్తల వాణిజ్య-వ్యాపార యూనిట్లను సామాజిక శిక్షణా ట్రెయినర్ ప్రతి నెలా విధిగా సందర్శించి అవసరమైన సూచనలు/సలహాలు అందచేస్తారు. మారుతున్న మార్కెట్ ధోరణులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వారు లాభసాటిగా తమ వ్యాపార సంస్థలను ర్వహించుకోవడం ఎలాగో చెబుతూ వారి నైపుణ్యాలను బలోపేతం చేస్తారు.కాలానుగుణంగా ప్రణాళికా వ్యూహం. అంకుర వాణిజ్య వేత్తలు తమ వాణిజ్య-వ్యాపార యూనిట్లను,  వాటి ప్రణాళికల్ని కాల క్రమంలో మారుతున్న అవసరాన్ని బట్టి ఎలా సవరించి/మార్చి కొనసాగించ వచ్చునో సామాజిక శిక్షణా ట్రెయినర్ అవసరమైన సూచనలు/సలహాలు అందచేస్తారు. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనకు కొరకు చేసిన కృషిని ఈ కార్యక్రమం ద్వారా తదుపరి  దశకు చేర్చినట్లు అవుతుందని గత వారం డిల్లీ లో ఇందుకు సంబంధించిన సమావేశంలో పాల్గొని వచ్చిన సంస్థ సి.ఇ.ఒ. డా. పి. కృష్ణ మోహన్ తెలిపారు.
Tags:Cerf preparations for the formation of semi-commercial in the state

 రాష్ట్ర వైద్య  ఆరోగ్య మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ ఛైర్మన్

Date:20/03/2018
 అమరావతి ముచ్చట్లు:
ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ సర్వీసెస్, మౌలిక సదుపాయాల  అబివృద్ది సంస్థ చైర్మన్ పదవికి బీజేపీ నేత ఆర్ లక్ష్మి పతి రాజీనామా చేసారు. మంగళవారంనాడు అయన అసెంబ్లీ లో సీఎం ని కలసి రాజీనామా లేఖ ను అందించారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ ఎన్డీయే నుండి టీడీపీ వైదొలగటం తో  నేను కూడా చైర్మన్ పదవికి రాజీనామా చేశానని అన్నారు. బీజేపీ నుండి టీడీపీ వైదొలిగినపుడు  నేను బీజేపీ కి చెందిన వ్యక్తి గా  పదవిలో ఉండటం భావ్యం కాదు. కేంద్రం ఎపి కి ఎమీ ఇచ్చిందో ప్రజల్లో కి వెళ్లి వివరిస్తాం. పవన్ జగన్ బిజెపి వెనుక ఉన్నారు అనేది అవాస్తమని అన్నారు.
Tags:Chairman of the state medical health infrastructure chairman

సినీ పరిశ్రమ కదలిరావాలి : ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్

.Date:20/03/2018
అమరావతి ముచ్చట్లు:
ఏపీకి హోదాకు తెలంగాణ సీఎం కుటుంబం కూడా మద్దతు పలికిందని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అన్నారు. మంగళవారం నాడు  ఆయన మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమల నటులు, పెద్దలపై తీవ్ర విమర్శలు చేశారు. అవార్డులు ఇవ్వకపోతే లొల్లి చేసే కళాకారులు ఏపీ ప్రజల ఆకాంక్ష ప్రత్యేక హోదాపై ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. ఒక్క సినీ పరిశ్రమ తప్ప కేంద్రం చేస్తున్న అన్యాయం పై రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఆందోళనలు, ఉద్యమంలో పాల్గొంటున్నారు. యాక్టర్లు ఎందుకు ఆందోళనలో పాల్గొనడం లేదని ప్రశ్నించారు. తమిళనాడులో జల్లికట్టు అంశంలో ముందుండి నడిపించింది అక్కడి సినీ పరిశ్రమ. కానీ మన పరిశ్రమ కు ఏమైంది….పోరాడే చావ చచ్చిపోయిందా అని ప్రశ్నించారు. సోదర రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం మన పోరాటానికి మద్దతునిచ్చింది….సినీ పరిశ్రమ బానిస బతుకులు బ్రతుకుతుంది. అవార్డులు రాకపోతే నానాయగి చేసే వారు ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు. ఇప్పటికైనా ఆంధ్రుల హక్కుల కోసం పోరాడండి.లేకపోతే బహిష్కరిస్తామన్నారు. రాష్ట్రం వచ్చి నాలుగేళ్లవుతున్న ఒక్క హీరో ఒక్కరోజు అమరావతిలో ఉండలేదు.  హాలీవుడ్ హీరోల స్థాయికాదు.ఎక్కడోఉంది నటిస్తే చూసే ఆగత్యంలేదు. తమిళ దర్శకులు సామాజిక స్పృహ తో గళమెత్తుతుంటే,,,మనవాళ్ళు  హీరోయిన్ ల అందాలను  వర్ణించడమే తప్ప పోరాడేదిలేదని విమర్శించారు.
Tags:The film industry should move on: MLC Rajendra Prasad

పల్లకీపై మోహినీ అవతారంలో శ్రీ కోదండరాముడు

Date:20/03/2018
తిరుపతి  ముచ్చట్లు:
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు మంగళవారం ఉదయం మోహినీ అవతారంలో శ్రీరామచంద్రుడు పల్లకీలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. భజనలు, కోలాటాల నడుమ స్వామివారు నాలుగు మాడవీధుల్లో విహరించారు. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు అందించారు.  మోహినీ అవతార వృత్తాంతం భాగవతంలో రమణీయంగా వర్ణింపబడింది. సురాసురులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథిస్తారు. చివరికి వారు కోరుకున్న అమృతం లభిస్తుంది. దానిని పంచుకోవడంలో కలహం తప్పదు. ఆ కలహాన్ని నివారించి, అసురులను వంచించి, సురులకు అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహినీ రూపంతో సాక్షాత్కరిస్తాడు.
రుడ సేవకు టీటీడీ భారీ ఏర్పాట్లు
నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ ముఖ్యమైనది. గరుత్మంతుడే శ్రీమహావిష్ణువుకు నిత్యవాహనం. దాసుడుగా, సఖుడుగా, విసనకఱ్ఱగా, చాందినిగా, ఆసనంగా, ఆవాసంగా, వాహనంగా ధ్వజంగా అనేక విధాల సేవలందిస్తున్న నిత్యసూరులలో అగ్రగణ్యుడైన వైనతేయుడు కోదండరామస్వామిని వహించి కదిలే తీరు సందర్శనీయమైనది. 108 దివ్య దేశాలలోనూ గరుడ సేవ విశిష్టమైనది.
Tags:Sri Kodandaramu in the Mohini avatar of Pallikai

ఆంధ్రప్రదేశ్ అధికార వ్యవస్థలో భారీ మార్పులు?

 Date:20/03/2018
అమరావతి ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ కు చెందిన అధికార వ్యవస్థలో భారీ మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులపై సీబీఐ కేసులు నమోదు చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికీ సీబీఐ పక్కా సమాచారం సేకరించింది. ఈ ఐదుగురిలో ముగ్గురు కీలక అధికార కేంద్రంలో ఉండగా…మరో ఇద్దరు అత్యంత  ముఖ్యమైన శాఖల్లో ఉండటం విశేషం. అవినీతి ఆరోపణల కారణంగానే ఈ కేసులు నమోదు చేయనున్నట్లు చెబుతున్నారు. ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ కొద్ది రోజుల క్రితమే కేంద్రంలోని ఎన్డీయేతో తెగతెంపులు చేసుకుంది. ఎన్డీయేలో ప్రధాన భాగస్వామిగా ఉన్న బిజెపి నేతలు  ఏపీలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని ఆరోపిస్తోంది. దీనికి తోడు కొత్తగా జనసేన అధినేత పవన్  కళ్యాణ్ గత కొన్ని రోజులుగా చంద్రబాబు సర్కారు అవినీతిపై వరస పెట్టి విమర్శలు చేస్తున్నారు.నేరుగా రాజకీయ నేతలపై కేసులు వంటివి పెడితే అది రాజకీయ కక్ష సాధింపు కిందకు వస్తుందనే ఉద్దేశంతో తొలి దశలో ఐఏఎస్ లను టార్గెట్ చేసినట్లు సమాచారం. అందులో కూడా ప్రభుత్వానికి అడ్డగోలుగా సహకరించి..భారీ అవినీతికి కారణమైన వారిని ఎంపిక చేశారని…దీనికి సంబంధించి పక్కా ఆధారాలు ఇఫ్పటికే సీబీఐ సేకరించిందని సమాచారం. అయితే సీబీఐ పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడిన తర్వాత రంగంలోకి దిగుతుందా?. లేక ఏప్రిల్ మొదటి వారంలో ‘ఆపరేషన్ స్టార్ట్’ చేస్తుందా? అన్నది మాత్రం తేలాల్సి ఉంది. ఏకంగా ఒకేసారి ఐదుగురు సీనియర్ ఐఏఎస్ లపై అవినీతి ఆరోపణలపై కేసులు నమోదు చేస్తే అది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించటం ఖాయమని డిల్లి వర్గాలు  పేర్కొంటున్నాయి.
Tags:Major changes in Andhra Pradesh power system?

 బీజేపీకి 19యుగాల శాపం : మంత్రి అదినారాయణరెడ్డి

Date:20/03/2018
అమరావతి ముచ్చట్లు:
ఏపీ అసెంబ్లీలో టీడీపీ, బీజేపీ సభ్యుల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. వెనుకబడిన జిల్లాల నిధులను కేంద్రం వెనక్కి తీసుకోవడంపై ఈ చర్చ జరిగింది. నిధులు ఎందుకు వెనక్కి తీసుకున్నారంటూ పలువురు టీడీపీ సభ్యులు గట్టిగా అడిగారు. అయితే, దీనిపై బీజేఎల్పీ నేత విష్ణుకుమార్రాజు మాట్లాడుతూ… సాంకేతికపరమైన అంశమే కానీ కేంద్రం కావాలని చేయలేదని పేర్కొన్నారు.  అలాగే పీఎంవో అనుమతి లేదని చెప్పి నిధులు వెనక్కి తీసుకున్నారని ఆయన అనడంతో పీఎంవో అనుమతి ఉంటేనే నిధులు ఇస్తారా  అంటూ టీడీపీ సభ్యుడు కూన రవికుమార్ నిలదీశారు. ఇక మరో శాసన సభ్యురాలు కిమిడి మృణాళిని మాట్లాడుతూ  వెనుకబడిన జిల్లాల అభివృద్ధిపై శ్రద్ధలేదని అన్నారు. బుందేల్ఖండ్ ప్యాకేజీ అని చెప్పి ఏడాదికి 50 కోట్లు ఇస్తారా అంటూ ప్రశ్నించారు.
మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ బీజేపీ 19 పొరపాట్లు చేసిందని, ఆ పార్టీకి 19 యుగాలపాటు శాపం తగులుతుందని అన్నారు. వెనుకబడిన జిల్లాల నిధులను కేంద్రం వెనక్కి తీసుకోవడంపై మంగళవారం అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. ఈ చర్చలో పాల్గొన్న మంత్రి ఆదినారాయణరెడ్డి బీజేపీనుద్దేశించి  వ్యాఖ్యానించారు.  మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వం మొత్తం పీఎంవో చుట్టూ తిరుగుతోందని, వెనుకబడిన జిల్లాలకు రూ.24,300 కోట్లు విడుదల చేయాల్సిందేనని, అంతేగాక వెనుకబడిన జిల్లాల జాబితాలో ప్రకాశం జిల్లాను చేర్చాలని ఆయన కోరారు. విభజన చట్టం అమలుచేయకుంటే అవసరమైతే కోర్టుకు వెళ్లేందుకు వెనకాడబోమని యనమల హెచ్చరించారు. ఇదిలా ఉండగా చర్చలో పాల్గొన్న బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ  వెనుకబడిన జిల్లాలకు రూ.350 కోట్లు తీసుకొస్తామని మేం చెప్పినట్టు  తన మాటలు వక్రీకరిస్తున్నారని అన్నారు.
Tags:The BJP has a 19-year curse: Minister Aananayana Reddy

పెట్టుబడులకు పెద్ద పీట 

Date:20/03/2018
అమరావతి ముచ్చట్లు:
పారిశ్రామిక రంగానికి సింగిల్ విండో సిస్టమ్ విధానంతో మూడు వారాల్లో 22 అనుమతులు ఇచ్చేలా ప్రభుత్వం  చర్యలు తీసుకోవడంతో ఇతర రాష్ట్రాల కంటే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి అనేక జాతీయ ,అంతర్జాతీయ స్థాయి కంపెనీలు ఏపీ కి వస్తున్నాయని ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. మంగళవారం నాడు అయన అసెంబ్లీలో నేడు ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ పెట్టుబడులు పెట్టేందుకు అనువైన రాష్ట్రాల్లో ఏపీ 3 వ స్థానంలో ఉండటం ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మంత్రి అమరనాథరెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన  చిత్తూరు జిల్లాలోని మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో ని తంబాలపల్లి, పీలేరు, కుప్పం, పలమనేరు, మదనపల్లి ప్రాంతాల్లో  పెట్టుబడులు పెట్టేందుకు ఎన్ని కోట్లతో  ఎన్ని కంపెనీలు ప్రభుత్వం తో ఎం ఓ యూ కుదుర్చుకున్నాయి? ఎంత మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి? మదనపల్లి ప్రాతంలో ఆటో నగర్, విడిబాగాల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం ఏదైనా చర్యలు చేెపడుతోందా? అదే విధంగా మదనపల్లి తో పాటు అనంతపురం జిల్లాలోని 112 మండలాల్లో టమోటా ఎక్కువుగా పండిస్తున్నారు.ఈ ప్రాంతంలో టమోటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందా? అని పల్లె రఘునాథ్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
దీనికి పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథరెడ్డి మాట్లాడుతూ, మదనపల్లి రెవిన్యూ డివిజన్ పరిధిలో రూ.448 కోట్ల పెట్టుబడులతో 4800 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వివిధ పరిశ్రమల నుంచి ప్రభుత్వం ఏం ఓ యూ కుదర్చుకున్నట్లు తెలిపారు. రూ.130 కోట్ల తో 1283 మందికి ఎం ఎస్ ఈ ఎం ద్వారా ఎం ఓ యూ కుదర్చుకున్నట్లు వెల్లడించారు. కుర్లాన్, వైష్ణావి ఫుడ్, ఎస్ ఆర్ కె ఫుడ్ ,బ్రిటానియా, అరబిందో కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయన్నారు. అలాగే మదనపల్లి ప్రాంతంలో టమోటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కదిరి నియోజకవర్గంలో ఎమ్ ఎస్ ఎం ఎల్ పార్క్ ఏర్పాటు కు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో ని అన్ని నియోజకవర్గాల్లో ఎం ఎస్ ఎం ఎల్ పార్క్ లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి హామీ ఇచ్చారు.
Tags: Big investment for investments

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యేలు

Date:20/03/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
మంగళవారం రోజు ముగ్గురు ఎమ్మెల్యేలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి అసెంబ్లీకి వచ్చారు.  శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కేపీ వివేకానంద్, మాధవరం క్రిష్ణారావులు  బస్సులో  ప్రయాణించారు. ఉదయం బాచుపల్లిలో వివేకానంద్, వివేకానందనగర్లో అరికెపూడి గాంధీ, కూకట్పల్లి బస్టాప్లో మాధవరం క్రిష్టారావులు ఆర్టీసీ బస్సు ఎక్కి అసెంబ్లీకి వచ్చారు.  బస్సుల్లో ప్రయాణించే వారి ఇబ్బందులు, ట్రాఫిక్ కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకే తాము సాధారణ ప్రయాణికుల మాదిరిగా బస్సుల్లో ప్రయాణిస్తున్నామని ఈ సందర్బంగా ఎమ్మెల్యేలు తెలిపారు. ముగ్గురు ఎమ్మెల్యేలు బస్సుల్లో సౌకర్యాలు, సమస్యలు గురించి ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న ఆల్ ఇండియా రేడియో బస్టాప్ వద్ద దిగి కాలినడకన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకున్నారు.
Tags: MLAs traveling to the RTC bus