తిరుమలలో అన్నమాచార్యుల 515 వర్ధంతి సందర్భంగా ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండవీటి జ్యోతిర్మయి , మచిలిపట్నంకు చెందిన కిరణ్‌మ్మయి బృందం అన్నమాచార్యుల కీర్తనలను ఆలపించారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు అధికారులు వారిని శ్యాలువతో సత్కరించారు.

Date:14/03/2018

Tags: Celebrations were held on the occasion of Annamacharya 515 in Tirumala.

సీఎం చంద్రబాబును కలిసిన బ్రాహ్మణ సంఘ నేతలు శ్రీకాంత్‌, సతీష్‌, ప్రశాంత్‌, ప్రయాగక్రిష్ణ,

Date:14/03/2018

అమరావతి ముచ్చట్లు:

ఏపిబిఎస్‌ఎస్‌ఎస్‌ అధ్యక్షులు శ్రీకాంత్‌, ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌ల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబును అమరావతిలో కలిశారు. అలాగే మంత్రులు లోకేష్‌, యనమల రామక్రిష్ణుడు, అమరనాథరెడ్డి, నారాయణతో పాటు ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌ను కలిశారు. ఈ సందర్భంగా బ్రాహ్మణులకు మరిన్ని నిధులు కేటాయించాలని కోరారు. అలాగే బ్రాహ్మణ కార్పోరేషన్‌ చైర్మన్‌ ఆనందసూర్య ఏకపక్ష నిర్ణయాలపై ఫిర్యాదు చేశారు. తెలంగాణకు చెందిన వ్యక్తిని చైర్మన్‌గా నియమించడంతో ఆయన తన ఇష్టారాజ్యంగా కార్యక్రమాలు చేస్తున్నారని, బ్రాహ్మణులను ఆదుకోవడం లేదని, ఇలా జరిగితే తెలుగుదేశం పార్టీకి బ్రాహ్మణులు దూరమౌతారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ నేతలు కోసూరుసతీష్‌శర్మ, శ్రీనివాస్‌, సోమశేఖర్‌, ప్రయాగక్రిష్ణ ఉన్నారు.

Tags: Brahmin leaders of Sri Chandrababu meet Srikanth, Satish, Prashant, Prayagrishna,

పుంగనూరు శ్రీసుగుటూరు గంగమ్మ జాతర సందర్భంగా మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ దంపతులు కలసి అమ్మవారికి గెరిగెలు తీసుకెళ్లి వెహోక్కులు చెల్లించి, పూజలు నిర్వహించారు.

Date:14/03/2018

 

Tags: On the occasion of Punganuru Srikugathur Gangamma jatha, municipal commissioner KL Varma couple took the guerges to the grandmothers and paid the vanoks and worshiped.

కర్నూల్‌లో పాత తుపాకులను రోలర్‌తో తొక్కించిన పోలీసులు

Date:14/03/2018

కర్నూల్‌ ముచ్చట్లు:

కర్నూల్‌ జిల్లాలో వివిధ కేసుల్లో సీజ్‌ చేసిన 1532 తుపాకులను కర్నూల్‌ పోలీసులు రోలర్‌తో తొక్కించి , ధ్వంసం చేశారు. కర్నూల్‌ డిటిసి మైదానంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. 1976 నుంచి 2009 వరకు వినియోగించిన పురాతన ఆయుధాలను ధ్వంసం చేశారు.

Tags: In Kurnool, the police have been carrying the old guns roller

ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలపై కేంద్రం చిన్నచూపు!

Date:14/03/2018
అమరావతి ముచ్చట్లు:
ప్రత్యేక హోదా పొందుతున్న ఈశాన్య రాష్ట్రాలతో సమానంగా అన్నీ ఇస్తామంటూనే ఆంధ్రప్రదేశ్‌పై మాత్రం వివక్షతో వ్యవహరిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో సమానంగా ప్రయోజనం కలిగే నిధులు ప్రత్యేక ప్యాకేజీ కింద ఇస్తామని కేంద్రం ప్రకటించింది. అయితే హోదా ఉన్న రాష్ట్రాలకు ఇచ్చినట్లుగా విదేశీ రుణాలతో చేపట్టే ప్రాజెక్టుల రుణాల్లో 90% గ్రాంట్‌, పన్ను రాయితీలు మాత్రం ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 90% నిధులు మాత్రమే ఇస్తామని కేంద్రం చెప్తోంది. హోదా ఉన్న రాష్ట్రాలకు ఈఏపీ రుణాల్లో 90% కేంద్రమే భరిస్తున్నట్లు సాక్షాత్తు పార్లమెంటు ముందు ఎన్డీయే సర్కార్ అంగీకరించింది. అయితే అది హోదా కిందికి రాదని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం వివిధ పన్ను రాయితీల కింద 8 ఈశాన్య రాష్ట్రాలకు చేయూతనిస్తోంది. 2000 ఏప్రిల్‌ 1నుంచి 2017 మార్చి 31 వరకు రూ.3,847 కోట్ల విలువైన రాయితీలు కల్పించినట్లు గణాంకాలు ఉన్నాయి. అంటే  17 ఏళ్లకాలంలో ఒక్కో రాష్ట్రానికి సగటున రూ.480 కోట్ల ప్రయోజనం కలిగిందన్న మాట.జీఎస్టీ రిఫండ్‌ కింద 2018-19 మూడు హిమాలయ, 8 ఈశాన్య రాష్ట్రాలకు కలిపి రూ.1,500 కోట్ల బడ్జెట్‌ ప్రతిపాదించింది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్‌కు ఇవే పన్ను రాయితీలు కల్పించినా ఏటా రూ.500 కోట్లకు మించి ఉపయోగించుకొనే పరిస్థితి ఉండేది కాదని నిపుణుల విశ్లేషణ. ఈ స్వల్ప సాయం చేయడానికి కూడా కేంద్రం వెనుకాడింది. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు తీసిపోకుండా ఆంధ్రప్రదేశ్ కూ నిధులు ఇస్తామన్న కేంద్రం మాట నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. రాష్ట్రానికి నిధులు ఇవ్వండని వేడుకునే కొద్దీ మోడీ నాయకత్వం మొండికేస్తున్న పరిస్థితి. నవ్యాంధ్రే గనుక ఉత్తర భారత్ లో ఉంటే నిధులు భారీగానే లభించి ఉండేవని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇబ్బడిముబ్బడిగా నిధులు అందించి ఉండేదని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ దక్షిణాదిన ఉండడంతో షరా మామూలుగానే నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు..
Tags: Look at the Center for the benefits of Andhra Pradesh

పీయూష్ గోయల్ పై బాబు ఫైర్

Date:14/03/2018
విజయవాడ ముచ్చట్లు:
టీడీపీ ఎంపీలకు కేంద్రమంత్రి పీయూష్‌ గోయెల్ అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడంపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. మిత్రపక్షాలకు చెందిన వారికి అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా వైకాపా ఎంపీకి ఇవ్వడం ఏంటని ప్రశ్నించిన బాబు, ఎవరిని అవమానిస్తున్నారంటూ బీజేపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి మిత్రపక్షం వైకాపానా? టీడీపానా? అనే సందేహం ప్రజల్లో కలుగుతోందని, లాలూచీ పడేవాళ్లు ప్రజల దృష్టిలో దోషులుగా మిగిలిపోతారని చురకలంటిచారు. తమకు హైకమాండ్ ప్రజలేనని, వారి ఆకాంక్షలే మనకు ముఖ్యమని నేతలకు సూచించారు. బుధవారం టీడీపీ ఎంపీలతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించిన చంద్రబాబు.. ఏపీ పునర్వవస్థీకరణ చట్టంతోపాటు పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీల అమలు తీరును సమీక్షించాలని సీఎం పేర్కొన్నారు. ఏపీ సమస్యలపై కేంద్రం స్పందించకపోవడం అన్యాయమని, కేంద్రం వైఖరి రాష్ట్ర ప్రజలను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోందన్నారు. దశలవారీగా పోరాటాన్ని ఉధృతం చేయాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.రాష్ట్రానికి న్యాయం జరిగేవరకు వదిలిపెట్టేది లేదని ఇక్కడ శాసనసభ, శాసన మండలితోపాటు అక్కడ లోక్‌సభ, రాజ్యసభల్లోనూ ఆంధ్రప్రదేశ్‌ సమస్యలే ప్రతిధ్వనించాలని ఉద్ఘాటించారు. పార్లమెంటు జరిగేటప్పుడు ఢిల్లీ వేదికగా పోరాటం చేయాలని తర్వాత రాష్ట్రం, జిల్లా స్థాయిలో దీన్ని కొనసాగించాలని సూచించారు. ఆర్ధిక బిల్లులను హడావుడిగా పూర్తిచేసి పార్లమెంటు నిరవధిక వాయిదా వేయొచ్చని.. ఈ బిల్లులపై చర్చలో ఏపీకి ప్రత్యేక హోదా, ఆర్ధికలోటుపై నిలదీయాలని అన్నారు. సమావేశాలకు అందరూ హాజరుకావాలని, సభల్లో ప్రజల గొంతు ప్రతిధ్వనించాలని నేతలకు మార్గనిర్దేశం చేశారు. ప్రజా సమస్యలు చర్చించేందుకే శాసనసభ, మండలి, పార్లమెంటు ఉందని పేర్కొన్నారు.తాము పనిచేసేది ప్రజల కోసం తప్ప, ప్రతిపక్షం కోసం కాదన్న విషయం గుర్తుపెట్టుకోవాలని నేతలకు చంద్రబాబు తెలిపారు. ప్రతిపక్షం లేకపోయినా సభ నిరాఘాటంగా జరిగిందని ప్రజలు భావించాలన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని ప్రజలు మరిచిపోయేలా చేయాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం చంద్రబాబు అన్నారు. సభకు గైర్హాజరై ప్రతిపక్షం చారిత్రాత్మక తప్పిదం చేసిందని, దీనిపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరగాలన్నారు. శాసనసభలో, మండలిలో ప్రతినిమిషం ప్రజా సమస్యల పరిష్కారానికే వినియోగపడాలని చంద్రబాబు పునరుద్ఘాటించారు.
Tags: Babu fire on Piyush Goyal

ఇవాళ్టి నుంచి తెలుగు రాష్ట్రాల్లో టెన్త్ పరీక్షలు

Date:14/03/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
ఈ విద్యా సంవత్సరం పదవ తరగతి పరీక్షలు 2018 మార్చి 15 నుంచి 29వ తేదీ వరకు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ మొదటి అంతస్తులోని తన చాంబర్ లో మంత్రి గురువారం ఉదయం ఎస్ఎస్ సీ పరీక్షల టైంటేబుల్ విడుదల చేశారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12.15 వరకు ఉంటాయని, కంపోజిట్ కోర్సులకు మరో అర్ధగంట అదనంగా ఉంటుందని 12.45 వరకు జరుగుతాయని తెలిపారు.2016లో 6,17,030 మంది విద్యార్థులు, 2017లో 6,09,502 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యారని, 2018లో 6,36,831 మంది హాజరుకానున్నట్లు వివరించారు. మార్చి 31 నుంచి ఏప్రిల్ 18 వరకు స్పాట్ వాల్యూషన్ జరుగుతుందని, మే మొదటి వారంలో ఫలితాలు వెల్లడిచాలని అనుకుంటున్నట్లు తెలిపారు.పరీక్షల సందర్భంగా విద్యార్థులు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కింద కూర్చొని పరీక్షలు రాయవలసిన అవసరంలేదని, 100 శాతం ఫర్నీచర్ సమకూరుస్తామని, లేని చోట అద్దెకు తీసుకోమని కూడా సంబంధిత అధికారులకు చెప్పినట్లు తెలిపారు. అలాగే పరీక్షా కేంద్రాల్లో త్రాగునీటి సౌకర్యం, ఫస్ట్ ఎయిడ్ అందుబాటులో ఉంచుతామని, ప్రత్యేక బస్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లను మూసివేస్తారని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారని, సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడామని, మళ్లీ ఒకసారి మాట్లాడి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు కూడా చివరి నిమిషంలో కంగారు కంగారుగా రాకుండా ఒక అర్థగంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని మంత్రి సూచించారు.మార్చి 15న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1 (గ్రూప్-ఏ), 15న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1 కాంపోజిట్ కోర్స్, 16న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్- II (గ్రూప్-ఏ), ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్- II కాంపోజిట్ కోర్స్, ఓఎస్ఎస్ సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1 (సంస్కృతం, అరబిక్, పర్షియన్), 17న సెకండ్ లాంగ్వేజ్, 19న ఇంగ్లీష్ పేపర్-1, 20న ఇంగ్లీష్ పేపర్-II, 21న మ్యాథ్స్ పేపర్-1, 22న మ్యాథ్స్ పేపర్-II, 23న జనరల్ సైన్స్ పేపర్-1, 24న జనరల్ సైన్స్ పేపర్-II, 26న సోషల్ స్టడీస్ పేపర్-1, 27న సోషల్ స్టడీస్ పేపర్-II, 28న ఓఎస్ఎస్ సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్- II (సంస్కృతం, అరబిక్, పర్షియన్), 29న ఎస్ఎస్ సి ఒకేషనల్ కోర్స్ (థియరీ) పరీక్షలు జరుగుతాయని మంత్రి వివరించారు.
తెలంగాణలో…
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ జీ కిషన్ తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని, ఉదయం 8.45 గంటలకే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్ష ప్రారంభం అయ్యాక మరో ఐదు నిమిషాల వరకే గ్రేస్ పీరియడ్ ఉంటుందని, ఆ లోపు మాత్రమే లోపలికి అనుమతిస్తామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కిషన్ స్పష్టంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 11,103 పాఠశాలల నుంచి 5,38,867 మంది(బాలురు 2,76,388, బాలికలు 2,62,479) పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 5,03,117 మంది, ప్రైవేటు విద్యార్థులు 35,750 మంది ఉన్నట్టు చెప్పారు. ఒకేషనల్ అభ్యర్థులు 20,838 మంది హాజరవుతున్నారని పేర్కొన్నారు.పరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 2,542 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశామని, హాల్‌టికెట్లు అందని విద్యార్థులు www.bse.telangana.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. వీటిపై ప్రధానోపాధ్యాయుల సంతకం, స్టాంపు వేయించుకొని పరీక్షలకు హాజరుకావాలని తెలిపారు. పరీక్షలను సజావుగా నిర్వహించడం కోసం 148 ఫ్లయింగ్‌స్క్వాడ్‌లను ఏర్పాటుచేశామని తెలిపారు. పరీక్షలపై సందేహాల నివృత్తి కోసం డీఈవో, ఎంఈవోలను నియమించామని, ప్రభుత్వ పరీక్షల విభాగంలో టోల్‌ఫ్రీ నంబర్ (18004257462), కంట్రోల్‌రూం ఏర్పాటుచేశామని వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జవాబు పత్రాలను బయటకు తీసుకెళ్లవద్దని, ఆన్సర్‌షీట్‌పై పేర్లు, సంతకాలు, చిహ్నాలు, నినాదాలు రాయవద్దని, హాల్‌టికెట్ తప్ప ఇతర కాగితాలను పరీక్ష కేంద్రాల్లోకి తేవొద్దని సూచించారు. చూచిరాతకు పాల్పడితే విద్యార్థులపై చట్టపరమైన చర్యలు తీసుకొని డిబార్ చేస్తామని హెచ్చరించారు. ఇన్విజిలేటర్లపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ఈ మేరకు పరీక్ష ప్రారంభానికి ముందే హామీపత్రాలపై సంతకాలు చేయాల్సి ఉంటుందని చెప్పారు.
Tags: Tent tests in Telugu states

గ్రామీణ బ్యాంకులు.. ప్రైవేటీకరణ

Date:14/03/2018
ముంబై ముచ్చట్లు:
బ్యాంకుల ప్రైవేటీకరణకు ప్ర‌భుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ ప్రక్రియను ముందుగా గ్రామీణ బ్యాంకులతో మొదలుపెట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా గ్రామీణ బ్యాంకుల్లో 49 శాతం వరకూ వాటాలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. అంతేకాకుండా 3-4 నెలల్లో ప్రారంభ పబ్లిక్‌ ఆఫర్‌(ఐపీఓ) ద్వారా స్టాక్‌ మార్కెట్ల నుంచి నిధులను సమీకరించనున్నామని.. దీనికి సిద్ధంగా ఉండాలని గ్రామీణ బ్యాంకులకు నాబార్డ్‌ ఉత్తర్వులను కూడా జారీచేయడం గమనార్హం. అయితే, ఈ ప్రైవేటీకరణపై ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వ చర్యలతో గ్రామీణ బ్యాంకుల ఏర్పాటు ఉద్దేశం, లక్ష్యం నీరుగారడం ఖాయమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.చిన్న, సన్నకారు రైతులు, చేతివృత్తులు, దారిద్ర రేఖకు దిగువనున్న ప్రజలకు బ్యాంక్‌ సేవలు అందించడమే లక్ష్యంగా గ్రామీణ బ్యాంక్‌లు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ (ఏపీజీవీబీ), తెలంగాణ (టీజీబీ), ఆంధ్ర ప్రగతి (ఏపీజీబీ), చైతన్య గోదావరి (సీజీజీబీ), సప్తగిరి (ఎస్‌జీబీ) గ్రామీణ బ్యాంక్‌లున్నాయి. వీటికి 2,160 బ్రాంచీలున్నాయి. ఇందులో తెలంగాణలో 960 శాఖలు, మిగిలినవి ఏపీలో ఉంటాయి. ఏపీజీవీబీ, టీజీబీలకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), ఏపీజీబీకి సిండికేట్‌ బ్యాంక్, సీజీజీబీకి ఆంధ్రా బ్యాంక్, ఎస్‌జీబీకి ఇండియన్‌ బ్యాంక్‌లు స్పాన్సర్‌ బ్యాంక్‌లుగా వ్యవహరిస్తున్నాయి. గ్రామీణ బ్యాంక్‌ల్లో కేంద్రం 50 శాతం, స్పాన్సర్‌ బ్యాంక్‌లు 35 శాతం, ఆయా రాష్ట్ర ప్రభుత్వం 15 శాతం వాటాలు కలిగి ఉంటాయి.
దారిద్ర్య రేఖకు దిగువనున్న వారికి కూడా బ్యాంకింగ్‌ సేవలందాలన్న లక్ష్యాన్ని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ పేరిట నీరుగారుస్తుందని తెలంగాణ రీజినల్‌ రూరల్‌ బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ (ఏపీఆర్‌ఆర్‌బీఈఏ) జనరల్‌ సెక్రటరీ ఎస్‌.వెంకటేశ్వర్‌ రెడ్డి తెలిపారు. 49 శాతం వరకు వాటాను ప్రైవేట్‌ వ్యక్తులు లేదా సంస్థలు కొనుగోలు చేసే వీలు కల్పిస్తూ చట్ట సవరణ కూడా చేశారు. పైగా వాటా విక్రయం తర్వాత కేంద్రం, స్పాన్సర్‌ బ్యాంక్‌ల వాటా 51 శాతానికి తగ్గకూడదనే నిబంధనను పెట్టారు. అంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పుడున్న 15 శాతం వాటా చేజారుతుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉండే ఏకైక వాణిజ్య బ్యాంక్‌లు గ్రామీణ బ్యాంక్‌లే. కానీ, ఈ ప్రైవేటీకరణతో రాష్ట్రాలకు ప్రాతినిథ్యం లేకుండా పోతుందని బ్యాంకింగ్‌ వర్గాలు హెచ్చరిస్తున్నారు.ఏపీ, తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ల్లో 8,600 మంది ఉద్యోగులున్నారు. వీళ్లే కాకుండా 2,400 దినసరి కూలీలు పనిచేస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ బ్యాంక్‌ల్లో 1.1 కోట్ల మంది ఖాతాదారులుంటారు. దేశంలోని ఏ ఇతర రాష్ట్రాలతో పోల్చినా గ్రామీణ బ్యాంక్‌ల రుణ, పొదుపు నిష్పత్తి దక్షిణాది రాష్ట్రాల్లో సరిసమానంగా, ఉత్తరాదిలో 40–45 శాతం వరకుంటుందని వెంకటేశ్వర్‌ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో డిపాజిట్లు, రుణం రెండూ సమానంగానే ఉంటాయి. ఏపీ, తెలంగాణల్లో రూ.33 వేల కోట్ల డిపాజిట్లుంటే రుణాలు రూ.33–34 వేల కోట్లుగా ఉన్నట్లు ఆయన వివరించారు.
Tags: Rural banks .. privatization