చంద్రయాన్ 2 సక్సెస్

-అంతరిక్ష చరిత్రలో భారత్ రికార్డ్

Date:22/07/2019

నెల్లూరు ముచ్చట్లు:

ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ఉపగ్రహ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. 20 గంటల కౌంట్‌డౌన్ అనంతరం సోమవారం మధ్యాహ్నం సరిగ్గా 2.43 గంటలకు జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్ఎ‌ల్వీ రాకెట్ 3.8 టన్నుల బరువుగల చంద్రయాన్‌-2 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ప్రయోగ వేదిక నుంచి రాకెట్ బయలుదేరిన 16.13 నిమిషాల తర్వాత చంద్రయాన్-2 నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశించింది.

 

 

 

అనంతరం రాకెట్ నుంచి చంద్రయాన్‌-2 ఉపగ్రహం విడిపోయింది. చంద్రయాన్‌-2ను చంద్రుడి ఉపరితలంలోని దక్షిణ ధ్రువంలోకి ప్రవేశ పెట్టడమనేది అత్యంత క్లిష్టమైన అంశం. ఇస్రో అంతరిక్ష ప్రయోగాల్లో సంపూర్ణ నైపుణ్యం సాధించాలని కోరుకుంటున్న ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞానమిది. చంద్రుడిపై క్లిష్టమైన సాఫ్ట్‌ ల్యాండింగ్‌ కోసం ఇస్రో చేస్తున్న మొదటి ప్రయత్నం ఇది. ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌, రోవర్‌ విడిపోయిన తరువాత 15 నిమిషాలు అత్యంత కీలకమైందని ఇస్రో శాస్త్రవేత్తలు అంటున్నారు. చంద్రయాన్-2 చంద్రుడిపై దిగిన తర్వాత అందులోని రోవర్‌ సెకనుకు సెంటీమీటరు వేగంతో 14 రోజుల పాటు పయనించనుంది.

 

 

 

 

చంద్రుడి ఉపరితలంపై ఉన్న పదార్థాలను విశ్లేషించి సమాచారాన్ని, చిత్రాలను పంపనుంది. చంద్రుడిపై జల, ఖనిజాలు, రాతి నిర్మాణాల గురించి ఇది పరిశోధనలు చేయనుంది. వాస్తవానికి ఈ ప్రయోగాన్ని జులై 15న తెల్లవారుజామున చేపట్టాల్సి ఉండగా ప్రయోగానికి 56 నిమిషాల ముందు క్రయోజెనిక్‌ ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తిన విషయం గుర్తించి వాయిదా వేశారు. ఈ సమస్యను పరిష్కరించిన శాస్త్రవేత్తలు ప్రయోగం సోమవారం నిర్వహించారు. చంద్రయాన్‌-2 ప్రయోగానికి అనువైన లాంచ్ విండో ఒక నిమిషమే కావడం విశేషం.

 

 

 

ఈ స్వల్ప సమయంలోనే ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేశారు. ఇస్రో చైర్మ‌న్ శివ‌న్‌తో పాటు ఇత‌ర శాస్త్ర‌వేత్త‌లు మిష‌న్ కంట్రోల్ రూమ్ నుంచి చంద్ర‌యాన్‌-2 ప్ర‌యోగాన్ని వీక్షించారు. వీవీఐపీలు కూడా ఎక్కువ మందే ఈ ఈవెంట్‌ను ప్ర‌త్య‌క్షంగా చూశారు. అత్యంత శ‌క్తివంత‌మైన ఈ రాకెట్ సుమారు 43.5 మీట‌ర్ల ఎత్తు ఉన్న‌ది. చంద్ర‌యాన్‌లో విక్ర‌మ్ ల్యాండ‌ర్‌, ప్ర‌జ్ఞ రోవ‌ర్ ఉన్నాయి. రోవ‌ర్ అక్క‌డ ఉప‌రిత‌లంపై ప‌లు అన్వేష‌ణ‌లు చేయ‌నున్న‌ది.

 

 

 

 

జాబిలిపై నీట జాడ క‌నుకొనేందుకు ఇదో పెద్ద ప్ర‌యోగంగా భావిస్తున్నారు. ఇస్రో వ్య‌వ‌స్థాప‌కుడు విక్ర‌మ్ సారాభాయ్ పేరుతో చంద్ర‌యాన్ ల్యాండ‌ర్‌కు విక్ర‌మ్ పేరు పెట్టారు. ఇప్ప‌టివ‌ర‌కు అమెరికా, ర‌ష్యా, చైనాలు మాత్ర‌మే .. చంద్రుడిపై రోవ‌ర్‌ను దింపాయి. ఈ ప్ర‌యోగంతో జాబిలిపై రోవ‌ర్‌ను దింపిన నాలుగ‌వ దేశంగా భార‌త్ చ‌రిత్ర సృష్టించ‌నున్న‌ది. మార్క్ త్రీ రాకెట్‌.. చంద్ర‌యాన్‌ను అనుకున్న‌ట్లే విజ‌య‌వంతంగా భూక‌క్ష్య‌లోకి ప్ర‌వేశ‌పెట్టింది.

 

 

 

 

చంద్రుడి ద‌క్షిణ ద్రువంపై చంద్ర‌యాన్‌2 దిగ‌నున్న‌ది.సెప్టెంబర్ 7న చంద్రుడిపై ల్యాండింగ్చంద్రయాన్ 2లో ఉన్న ల్యాండ‌ర్ విక్ర‌మ్‌, రోవ‌ర్ ప్ర‌జ్ఞ‌.. ఇస్రో శాస్త్ర‌వేత్తల అంచ‌నాల ప్ర‌కారం ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 7వ తేదీన చంద్రుడి ఉప‌రిత‌లంపై దిగ‌నున్నాయి. ముందుగా అనుకున్న షెడ్యూల్ క‌న్నా ఒక రోజు ఆల‌స్యంగా ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నున్న‌ది.

 

 

 

 

 

వాస్త‌వానికి జూలై 15వ తేదీన ఎగ‌రాల్సిన చంద్ర‌యాన్‌2.. సాంకేతిక లోపంతో నిలిచిపోయిన విష‌యం తెలిసిందే. అయితే ప్ర‌యోగం వారం రోజుల ఆల‌స్యం అయినా.. ల్యాండింగ్‌లో మాత్రం ఒక రోజు తేడా వ‌స్తున్న‌ది. పాత ప్లాన్ ప్ర‌కారం.. 54 రోజుల జ‌ర్నీ త‌ర్వాత చంద్ర‌యాన్‌2 .. చంద్రుడిపై దిగాల్సి ఉంది. కానీ అనుకున్న తేదీ ఆల‌స్యం కావ‌డంతో.. ఇస్రో ఇంజినీర్లు కొత్త ప్లాన్ వేశారు. అత్యంత ఖ‌రీదైన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స‌మ‌యం కోల్పోవ‌డంతో.. ఇస్రో ఇంజినీర్లు కోల్పోయిన స‌మయాన్ని తిరిగి పొందేందుకు చంద్ర‌యాన్ మిష‌న్‌లో కొన్ని మార్ప‌లు చేశారు. ఇవాళ మ‌ధ్యాహ్నం 2.43 నిమిషాల‌కు షార్ కేంద్రం నుంచి చంద్ర‌యాన్2 ఎగ‌రింది. పాత ప్లాన్ ప్ర‌కారం ప్ర‌యోగం జ‌రిగిన 22వ రోజు..

 

 

 

చంద్ర‌యాన్ చంద్రుడి క‌క్ష్య‌లోకి వెళ్లేది. కానీ ఇప్పుడు ప్లాన్ మార‌డంతో.. చంద్రుడి క‌క్ష్య‌లోకి చంద్ర‌యాన్ వెళ్లేందుకు 30 రోజులు ప‌ట్ట‌నున్న‌ది. ప్ర‌యోగం జ‌రిగిన 43వ రోజున ల్యాండ‌ర్‌, ఆర్బిట‌ర్‌ను వేరు చేసే ప్ర‌క్రియ జ‌రుగుతుంది. 44వ రోజున డిబూస్టింగ్ చేప‌ట్ట‌నున్నారు. ఇక 48వ రోజున ల్యాండ‌ర్‌, రోవ‌ర్ .. వేరుప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. చంద్రుడి ఉప‌రిత‌లంపై ఉన్న మాంజిన‌ల్ సీ, సింపేలియ‌న్ ఎన్ ప్రాంతంలో ల్యాండ‌ర్ దిగే ఛాన్సుంది.

జోరుగా టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు

Tags: Chandrayaan 2 Success

జోరుగా టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు

Date:22/07/2019

మందమర్రి ముచ్చట్లు:

మందమర్రి పట్టణ మున్సిపాలిటి పరిదిలో చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆదేశాల మేరకు 24వ వార్డులో టిఆర్ఎస్ పార్టీ సభ్యవత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మందమర్రి మండల జెడ్పిటిసి వేల్పుల రవి, పట్టణ టిఆర్ఎస్ పార్టీ సమన్వయ కర్త తోట సురేందర్  హాజరై సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 24వ వార్డు అధ్యక్షులు ఎదుల రాయమల్లు,కంది తిరుపతి,మహిళ నాయకురాలు మైసక్క,పెద్ది రాజాం,అవునూరి పాశం,అల్లంల పవయ్య,ఎండి. ఇబ్రహీం,పట్టణ టిఆర్ఎస్ పార్టీ నాయకులు బొరిగం వెంకటేష్, తుమ్మ శ్రీశైలం, రామక్రిష్ణ, శేఖర్, కె.తిరుపతి, టిఆర్ఎస్వి. టిఆర్ఎస్వై.నాయకులు. అరుణ్,వికాస్,సాయి తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి వృత్తి శిక్షణ కేంద్రం ఎన్.వి.టి.సి లో మెగా రక్తదాన శిబిరం

Tags: TRS party membership registration

సింగరేణి వృత్తి శిక్షణ కేంద్రం ఎన్.వి.టి.సి లో మెగా రక్తదాన శిబిరం

Date:22/07/2019

మందమర్రి   ముచ్చట్లు:

మందమర్రి సింగరేణ ఏరియా లోని  వృత్తి శిక్షణా కేంద్రం ఎం.వి.టి.సి లో శనివారం మెగా రక్తదాన శిబిరన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ రమేష్ రావు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణ పొందుతున్న నూతన కార్మికులు స్వచ్చందంగా రక్తదానం చెయ్యడానికి ముందుకు రావడం రక్తదానం చెయ్యడం అభినదనియం అన్నారు. ఆపదలో అనారోగ్యంతో ఉన్న వారిని కాపాడడానికి రక్తదానం చేసి ప్రాణ దాతలుగా చిరకలము నిలుస్తారని అన్నారు. సింగరేణిలో కారుణ్య నియామకాల వాళ్ళు నవ యువకులతో సంస్థ కలకలడుతుంది.

 

 

 

 

మందమర్రి ఏరియా తరుపున  మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి   తలసిమియా సికిల్ సెల్  పిల్లల ప్రాణాలు కాపాడుతామని భరోసా ఇచ్చారు అలాగే మంచిర్యాల ప్రభుత్వ హాస్పిటల్లో రక్తహీనత వ్యాధి గ్రస్థులకు గర్భిణీ స్త్రీలకు ఎవరికైతే రక్తము అవసరం ఉంటుందో వారందరికీ రక్తము ఉచితంగా అందించడం ఏ ఒక్క ప్రాణి కూడా రక్తం దొరకక మృత్యువు కాకూడదని ప్రతి ఒక్క ఆరోగ్యవంతుడు రక్తదానం చేయాలని యువత పేడ మార్గములో పయనించ కుండా సమాజ సేవ లో ముందుండలని తెలిపారు.

 

 

 

 

సింగరేణి సంస్ధ ఉత్పత్తి తో పాట్టు  అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాదని అన్నారు. రక్తదానం ప్రాణదానం రక్తదానం చేయడం వలన ఆపదలో ఉన్న రోడ్ ఆక్సిడెంట్ కి గురైన వారిని గర్భిణి స్త్రీ లను తలసేమియా పిల్లలను అపాయం లో ఉన్న తోటి ప్రాణాలను కపడవచ్చని జీవితంలో అంతకు మించిన తృప్తి ఉండదని రక్తదానం చేయడం వలన కలిగే తృప్తికి అంతు ఉండదని అన్నారు.  అలాగే రక్తదానం చేసిన వ్యక్తికి దీర్ఘకాలికంగా వచ్చే వ్యాధులు బీపీ సుగర్,గుండె గుండె జబ్బులు పాలిసైతిమయా లాంటి కాన్సర్ వ్యాధులు రాకుండా కొంతకాలము పొడిగించవచ్చు అన్ని అన్నారు.

 

 

 

 

రక్తదానం పై ప్రతిఒక్కరికి అవగాహనా కలిగివుండలి ప్రతి వెయ్యి మందిలో 5 గురు మాత్రమే రక్తదానం చేయడానికి ముందుకువస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్క రక్తదాతకు ప్రశంసా పత్రం అందజేస్తూ అభినందించారు. ఈ కార్యక్రమంలో డి వై పి ఎం మురళీధర్ రావు ఆఫీసర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జక్కరెడ్డి సింగరేణి రామకృష్ణాపుర్ ఏరియా హాస్పిటల్ డి వై. సి ఎం ఓ. ప్రసన్న కుమార్, కేకే1 డిస్పెన్సరీ సూపరిండెంట్ శౌరి, హెల్త్ ఆఫీసర్ లోకేనాథ్ రెడ్డి,ఎన్.వి.టి.సి మేనేజర్ కిష్ణారావు, డి వై.ఎస్.

 

 

 

ఈ.అశోక్ కుమార్, ఎన్ డి టి సి హెడ్ ఒర్మెన్స్ లక్మినారాయన, రాజేశం, టి.బి.జి.కె.స్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ మెడిపెళ్లి సంపత్, ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ స్లలేంద్ర సత్యనారాయణ, మంచిర్యాల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్ చందూరి మహేందర్, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నాగేశ్వరరావు, తలసేమియా వెల్ఫేర్ సొసైటీ  రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కాసర్ల. శ్రీనివాస్, సంయుక్త  కార్యదర్శి కాసర్ల రంజిత్ కుమార్, తలసేమియా వెల్ఫేర్ సొసైటీ సభ్యులు తొగరి లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.

 

ఈనెల 25న చలో సెక్రటేరియట్ 

Tags: Singareni Vocational Training Center is a mega blood donation camp in NVTC

ఈనెల 25న చలో సెక్రటేరియట్ 

–  వివేక్ వెంకటస్వామి

Date:22/07/2019

హైదరాబాద్ ముచ్చట్లు:

హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో జీ. వెంకటస్వామి ఫౌండేషన్ నేతృత్వంలో ప్రజాస్వామిక తెలంగాణ వేదిక ఆధ్వర్యంలో ‘సెక్రటేరియట్ కూల్చివేత – కొత్త అసెంబ్లీ నిర్మాణం’పై నాయకులు మీడియా సమావేశం ఏర్పాటుచేశారు.  మాజీ ఎంపీ వివేక్ వెకటస్వామి, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, టీడీపీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి, టీజేఎస్ ఉపాధ్యక్షుడు పీఎల్ విశ్వేశ్వర్ రావు, ఇతరులు వెంకటస్వామి డిమాండ్ చేశారు. కొత్తవి కట్టడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్నారు.

 

 

 

 

ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవాలని గవర్నర్ కు లెటర్ ఇచ్చామన్నారు. సెక్రటేరియట్ కూల్చవద్దని కోర్ట్ లోకూడా చాలా మంది పిటిషన్లు వేస్తున్నారనీ.. ప్రభుత్వం నిర్ణయం మార్చుకునే వరకు తమ నిరసన కొనసాగుతుందన్నారు. ఈనెల 25వ తేదీన చలో సెక్రటేరియట్ నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తున్నామన్నారు. చలో సెక్రటేరియట్ లో నిరసన కార్యక్రమంలో అన్ని పార్టీలు,కుల సంఘాలు, యువత పాల్గొనాలని వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు.

 

 

 

 

ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసమే చలో సెక్రటేరియట్ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు వివేక్ వెంకటస్వామి. రాష్ట్రంలోనే కాదు.. దేశంలోని ప్రధాన నగరాల్లో ఎక్కడకు పోయినా సెక్రటేరియట్ కూల్చివేత మీదనే చర్చ జరుగుతోందన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడినపుడు సెక్రటేరియట్ కట్టుకోవచ్చు కానీ.. బాగా నడుస్తున్న సెక్రటేరియట్ బిల్డింగులను కూల్చి మళ్ళీ కొత్తవి కట్టడం ఎందుకని ప్రశ్నించారు.

 

 

 

తెలంగాణపై రూ.లక్ష 65వేల కోట్ల అప్పు ఉందని పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కూడా చెప్పారన్నారు వివేక్ వెంకటస్వామి. అప్పు చేసి కొత్తవి కట్టడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. అప్పులపై వైట్ పేపర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

మాస్‌మ‌హ‌రాజ్ “డిస్కోరాజా” అగ‌ష్టు మెద‌టివారం డిల్లి లో షూట్‌

Tags: Chalo Secretariat on the 25th of this month

మాస్‌మ‌హ‌రాజ్ “డిస్కోరాజా” అగ‌ష్టు మెద‌టివారం డిల్లి లో షూట్‌

Date:22/07/2019

విజయవాడ ముచ్చట్లు:

మాస్ మహారాజా రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం “డిస్కోరాజాష‌.  ఈ సినిమా షూటింగ్ నిర్విరామంగా హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రుగుతుంది. ప్ర‌స్తుతం అన్న‌పూర్ణా ఏడెక‌రాల‌లో కొటి 20 ల‌క్ష‌ల రూపాయిల సెట్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ సినిమాకి ఈ సెట్ చాలా కీల‌క‌పాత్ర పోషిస్తుంది.

 

 

 

ఈ షెడ్యూల్ లో ర‌వితేజ‌, వెన్నెల కిషోర్‌, శశిర్ ష‌ర‌మ్‌, టోనిహొప్ లపై సినిమాలో అతి కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ఈ సెట్ ని డైర‌క్ట్ గా దియెట‌ర్ లో చూస్తే ప్రేక్ష‌కులు ఫీలింగ్ కొత్త గా వుంటుంద‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఆలోచ‌న.  ఆర్ ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్, నన్ను దోచుకుందువటే ఫేమ్ నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నేల టిక్కెట్ తర్వాత ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ అధినేత రామ్ తాళ్ళూరి… రవితేజ తో నిర్మిస్తున్న రెండో చిత్రమిది. రామ్ తాళ్ళూరి ఈ చిత్రాన్ని భారీగా నిర్మించనున్నారు.

 

 

 

 

త్వ‌ర‌లో ఢిల్లి లో ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రామ్ తాళ్ళూరి మాట్లాడుతూ… నేల టిక్కెట్ తర్వాత మాస్ మహారాజా రవితేజ గారితో మేం నిర్మిస్తున్న రెండో చిత్రం డిస్కోరాజా. ఈ చిత్రం షూటింగ్ శ‌ర‌వేగంగా హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రుగుతుంది. ప్ర‌స్తుతం అన్న‌పూర్ణ స్టూడియోస్ లో వేసిన సెట్ లో రవితేజ గారు, వెన్నెల కిషోర్ ల మ‌ద్య జ‌రిగే కొన్ని స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నాము.

 

 

 

 

ఈ షెడ్యూల్ ఈ నెల 26 లో ఈ షెడ్యూల్ పూర్తిచేసుకుంటాము.. అగ‌ష్టు మెద‌టివారం  నుండి ఢిల్లి లో షూటింగ్ జ‌రుపుకుంటాము. ఈ షెడ్యూల్ లో న‌భా న‌టేష్ జాయిన్ అవుతారు. ద‌ర్శ‌కుడు వి ఐ ఆనంద్ చాలా గొప్ప విజ‌న్ వున్న వ్య‌క్తి. ఈ చిత్రం పూర్తి వినోదాత్మ‌కంగా విడుద‌ల‌వుతున్న ఈ చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని విప‌రీతం గా ఆక‌ట్ట‌కుంటుంది. అని న‌మ్ముతున్నాము.. అని అన్నారు.న‌టీన‌టులు  ర‌వితేజ‌, ‌పాయ‌ల్ రాజ‌పుత్, నభా నటేష్, బాబీ‌సింహా, వెన్నెల‌ కిషోర్, స‌త్య‌ త‌దిత‌రులు

బాబుతో ఉండేదీ… ఆ నలుగురేనా 

Tags: Massachusetts “Discoraza” shoot in Delhi on Sunday

బాబుతో ఉండేదీ… ఆ నలుగురేనా 

Date:22/07/2019

విజయవాడ ముచ్చట్లు:

ఏపీ ఎన్నికల తర్వాత అసెంబ్లీలో టీడీపీ బలం 23కు పడిపోయింది. కానీ వీరిలో చాలా మంది బీజేపీ వైపు చూస్తున్నారని వార్తలొస్తున్నాయి. నేతలంతా ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. కానీ ప్రస్తుతం జరుగుతోన్న అసెంబ్లీ సమావేశాలను పరిశీలిస్తే.. ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. టీడీపీ తరఫున గళం విప్పి, అధికార పక్షానికి ధీటుగా సమాధానం ఇస్తోంది కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలే. చంద్రబాబు కాకుండా అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, రామానాయుడు మాత్రమే మాట్లాడుతున్నారు.

 

 

 

పయ్యావులకేశవ్, కరణం బలరాం, వెలగపూడి రామకృష్ణబాబు, గద్దెరామ్మోహన్, వల్లభనేని వంశీ లాంటి నేతలు ఉన్నప్పటికీ వారెవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. అధికారపక్షం తరఫున అనేకమంది మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే.. టీడీపీ తరఫున అచ్చెన్నాయుడు, గోరంట్ల, రామానాయుడు తప్పమిగిలిన వారెవరూ పట్టించుకోవడం లేదు. వైఎస్ఆర్సీపీ నేతలు చంద్రబాబుపై వ్యక్తిగతంగా విమర్శలు చేసినా కూడా పెద్దగా స్పందించడం లేదు.

 

 

 

గతంలో అసెంబ్లీలో ఉన్న సమయంలో కరణం బలరామ్, పయ్యావుల కేశవ్‌లు టీడీపీ మీద ఈగ వాలనిచ్చేవారు కాదు. వారి వాగ్ధాటికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఇబ్బందిపడే వారు. అలాంటిది ఇప్పుడు వారి గొంతు అసెంబ్లీలో అసలు వినిపించడం లేదు. టీడీపీ సమావేశంలో చంద్రబాబు స్వయంగా తమ నేతలను ఉద్దేశించి ఇదే విషయాన్ని మాట్లాడారని సమాచారం. మీరెందుకు నోరు విప్పడంలేదని నేతల్ని ప్రశ్నించారట. కేవలం అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, రామానాయుడు మాత్రమే మాట్లాడుతున్నారు.

 

 

 

ఉన్నదే 23 మంది ఎమ్మెల్యేలం కదా.. మిగతా నేతలు కూడా నోరు విప్పాలని ఒకింత అసహనం వ్యక్తం చేశారట. రోజుకు ఒకరు చొప్పున మాట్లాడితే బాగుంటుందనే మాట్లాడటం లేదని ఒకరు, మీ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాం అని ఇంకొకరు.. ఇలా రకరకాలుగా సమాధానం చెప్పారట. బాబు సూచనల పట్ల రాజమండ్రి నుంచి గెలిచిన ఆదిరెడ్డి భవానీ స్పందిస్తూ.. నేను మాట్లాడతా, కానీ అసెంబ్లీకి వచ్చిందే కొత్త కదా.. సీనియర్లని కాదని నేను మాట్లాడితే వారు నొచ్చుకుంటారనే భావనతో ముందుకు రావడం లేదని చెప్పారట.

 

 

 

 

 

ఎమ్మెల్యేలెవరూ అసెంబ్లీలో నోరు విప్పక పోవడానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. అధికార పక్షానికి టార్గెట్ అవుతామనే భయం కొంతమందిలో ఉందని టీడీపీ నేతలే అంటున్నారు. అచ్చెన్నాయుడు లాంటి వారు గట్టిగా మాట్లాడితే ఆయన ఆకారం గురించి ఇష్టమొచ్చినట్టు వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడటం, వారందరికీ ఆయన టార్గెట్ కావడంతో తమ పరిస్థితి కూడా అలాగే అవుతుందని భయపడుతున్నారట. ప్రభుత్వం తమను టార్గెట్ చేసి తమ వ్యాపారాలు, పాత కేసులపై దృష్టి పెడుతుందనే ఆందోళన వారిలో ఉందట.

 

 

 

అందుకనే అసెంబ్లీ జరిగిన నాలుగు రోజులు కళ్లు మూసుకుంటే తర్వాత అంతా ప్రశాంతం అనుకుంటున్నారట. వైఎస్ఆర్సీపీకి టార్గెట్ అవుతామనే భయం సంగతి పక్కనబెడితే… టీడీపీ నుంచి పది మందికి పైగా ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. బీజేపీ నేతలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఎలాగూ పార్టీ మారిపోతాం కదా.. ఇప్పుడెందుకు అసెంబ్లీలో చొక్కాలు చించుకోవడం అని మిగిలిన వాళ్లు సైలెంట్ అవుతున్నారట. కరణం బలరాం, వల్లభనేని వంశీ, పయ్యావుల కేశవ్ బీజేపీలో చేరతారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది.

 

 

 

 

అందుకే ఈ ముగ్గురూ నోరు విప్పడం లేదట. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నుంచి అసలు స్పందనే లేదు. బీజేపీలో చేరే వారిలో తొలి వ్యక్తి గంటానే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. సీనియర్లు గొట్టిపాటి రవి, గద్దెరామ్మోహన్, వెలగపూడి రామకృష్ణ బాబు ఎందుకు నోరెత్తడం లేదనేది మరో ప్రశ్న. సాధారణంగా గొట్టిపాటి రవి అసెంబ్లీలో మితంగా మాట్లాడతారు.

 

 

 

గతంలో కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు, తర్వాత వైఎస్‌ఆర్సీపీలో ఉన్నప్పుడు కూడా ఆయన పెద్దగా మాట్లాడలేదు. మంచి వాగ్ధాటి ఉన్న గద్దె రామ్మోహన్ కూడా ఈసారి అస్సలు మాట్లాడటం లేదు. బాబు గురించి అవహేళనగా మాట్లాడుతున్నప్పుడు కూడా గద్దె రామ్మోహన్ స్పందించడంలేదు. వెలగపూడి రామకృష్ణబాబుది కూడా ఇదే తీరు. దీంతో వీరి పట్ల పార్టీ అధినేతలో కొంత అసహనం కనిపిస్తోంది.

 

రాజు గారి మౌనం ఎందుకో

Tags: Babu was with … that four

రాజు గారి మౌనం ఎందుకో

Date:22/07/2019

విజయనగరం ముచ్చట్లు:

విజయనగరానికి చెందిన రాజకీయ దిగ్గజం పూసపాటి వంశీకుడు, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు గత కొన్నాళ్ళుగా మౌనంగా ఉంటూ వస్తున్నారు. తాజా ఎన్నికల ఫలితాలు అశోక్ జీవితంలో ఓ విధంగా కీలకమైనవి. గౌరవంగా తప్పుకుందా మనుకున్న ఆయనకు తీరని అవమానాన్ని మిగిల్చాయి. ఎంపీ సీటుకు పోటీ పడిన వైసీపీ నేత బెల్లాల చంద్రశేఖర్ చేతిలో దారుణంగా పరాజయం పాలు అయ్యారు. ఆ తరువాత ఆయన ఎక్కడా కనిపించడంలేదు, వినిపించడంలేదు.

 

 

 

ఆ మధ్యన చంద్రబాబు పార్టీ మీటింగు పెడితే వెళ్లారు. ఆ మీటింగులో బాబు వైఖరిని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పేశారు. పార్టీని సరిగ్గా పట్టించుకోవడం వల్లనే ఓడిపోయామని ఘాటైన నిజాన్ని వినిపించారు. ఇక ఓ విధంగా అశోక్ రాజకీయ జీవితం ముగిసిందా అన్న చర్చ కూడా ఓ వైపు సాగుతోంది.ఇదిలా ఉండగా అశోక్ గజపతి రాజుకు విజయనగరం జిల్లా రాజకీయాల్లో ఎంతో విలువ, గౌరవం ఉన్నాయి. ఆయన ఓడిపోయినా ఆ కుటుంబం అంటే ఇప్పటికీ జనంలో ఆదరణ ఉంది.దాంతో ఆయన్ని తమవైపు తిప్పుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. పూసపాటి కుటుంబం బ్రాండ్ ఇమేజ్ ని రాజకీయాలకు అనుకూలంగా వాడుకోవాలను కుంటోందంటున్నారు.

 

 

 

 

ఇక మరో విషయమేంటంటే కేంద్ర మంత్రిగా ఉన్న అశోక్ గజపతి రాజు ప్రధాని మోడీకి బాగా ఇష్టుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన్ని అప్పట్లో మోడీ ప్రశంసించిన సందర్బాలు కూడా అనేకం ఉన్నాయి. ఓ విధంగా అప్పట్లోనే రాజు గారు బీజేపీలోకి వెళ్తారని టాక్ నడించింది. అయితే చివరికి తాను టీడీపీలోనే ఉంటానని ఆయన చెప్పడంతో ఆ ప్రచారం ఆగింది.

 

 

 

 

ఇక ఇపుడు ఎటూ టీడీపీ ఓడిపోయింది, అశోక్ గజపతి రాజు సైతం ఆ పార్టీకి అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. ఈ సమయంలో ఆయన్ని పార్టీలోకి తీసుకువస్తే ఎలా ఉంటుందన్న చర్చ బీజేపీలో సాగుతుందని తెలుస్తోంది. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా ఆయన కుమార్తెను పార్టీలోకి తీసుకున్నా జిల్లాలో కమలానికి ఒక ఊతం దొరుకుతుందని అంచనాలు వేసుకుంటున్నారు. ఇక అశోక్ గజపతి రాజు బీజేపీలో చేరితే ఆయన్ని గవర్నర్ ని చేస్తారని, రాజ్యసభ సభ్యత్వం ఇస్తారని ఇలా రకరకాలుగా ప్రచారం అప్పట్లో సాగింది. ఇపుడు కూడా బీజేపీ అశోక్ గజపతి రాజు మీద ఆశలు వదులుకోవడంలేదు. మరి రాజు గారి మౌనం ఏ రకమైన సంచనలను నమోదు చేస్తుందో చూడాలి.

టీ కాంగ్రెస్ కు దారేదీ 

Tags: Why the king is silent

టీ కాంగ్రెస్ కు దారేదీ 

-అధ్యక్షుడి కోసం వెయిటింగ్

Date:22/07/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

తెలంగాణలో వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నిలదొక్కుకోవడం కష్టంగానే మారింది. వరస ఓటములతో కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో పడింది. నేతలందరూ పార్టీని వీడుతుండటంతో క్యాడర్ కూడా నిస్తేజంలోకి వెళ్లిపోయింది. అసెంబ్లీ, పార్లమెంటు, జిల్లా పరిషత్ ఎన్నికల్లో దారుణ ఓటమిని చవిచూసిన కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లోనైనా నిలదొక్కుకుంటుందా? అన్న చర్చ పార్టీలోనే జరుగుతోంది. మరోవైపు నేతల మధ్య సయోధ్య లేకపోవడం, నాయకత్వ లోపం కాంగ్రెస్ కు తెలంగాణలో శాపంగా మారాయి.

 

 

 

కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువంటారు. అలాగే జిల్లాకో ముఖ్యమంత్రి స్థాయి నేతలు కూడా ఈ పార్టీలోనే కనిిపిస్తారు. అసెంబ్లీ ఎన్నికలలో దారుణ ఓటమిని చవిచూసిన తర్వాత కాంగ్రెస్ ముఖ్యనేతలు మౌనం పాటిస్తుండటంతో క్యాడర్ లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయి. ఎన్నికల సమయంలో బీఫారం కోసం పోటీ పడే నాయకులు ఎన్నికల అనంతరం కనిపించకుండా పోయారు. పేరుకు జాతీయ స్థాయి నాయకులున్నప్పటికీ పార్టీ కష్టాల్లో ఉన్న ప్పుడు మాత్రం వారు సైలెంట్ గా ఉండటం విశేషం.కాంగ్రెస్ పార్టీకి నాయకుల కొదవలేదు. అలాగని క్యాడర్ కూడా తక్కువేమీ కాదు. సీనియర్ నేతలు జైపాల్ రెడ్డి, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, మధు యాష్కీ లాంటి వాళ్లు నోరుమెదపడం లేదు.

 

 

 

 

గత అసెంబ్లీ ఎన్నికల్లో 19 మంది శాసనసభ్యులు గెలిస్తే 12 మంది శానససభ్యులు టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని కూడా విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. అయినా సీనియర్ నేతలు ఎవరూ దీనిపై పెద్దగా స్పందించిన దాఖలాలు లేకపోవడం గమనార్హం.ఇక కాంగ్రెస్ పార్టీకి ఏడుగురు శాసనసభ్యులే ఉన్నారు. అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంటుకు ఎన్నిక కావడంతో తన శాసనసభ్యాత్వానికి రాజీనామా చేయడంతో ఆరుగురు సభ్యులు మాత్రమే మిగిలారు. వీరిలో కూడా ఎవరి దారి వారిదే.

 

 

 

కోమటి రాజగోపాల్ రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఇక జగ్గారెడ్డి సయితం తన నియోజకవర్గ ప్రయోజనాల కోసం పార్టీ కార్యక్రమాలను పట్టించుకోవడం లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కోలుకోలేని పరిస్థితిలో ఉంది. మరి సరైన నాయకుడు వస్తేనే తిరిగి పుంజుకునే అవకాశాలున్నాయి.

మున్సిపల్ ఎన్నికలకు కమలం నజర్

Tags: Tea Congress