ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ధర్నా
విశాఖపట్నం ముచ్చట్లు:
దీర్ఘకాలికంగా నెలకొని ఉన్న అపరిష్కృత సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ధర్నా నిర్వహించింది.విశాఖ నగరంలో ని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పటాన్ శ్రీనివాస్ మాట్లాడుతూ 11 డిమాండ్ల సాధన కోసం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ 100 రోజుల ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన నేపథ్యంలో నగరంలో ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుందన్నారు. రాజస్థాన్, చత్తీస్గడ్ రాష్ట్రాలు సి పీ ఎస్ విధానాన్ని రద్దు చేసిన మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో కూడా రద్దు చేయాలని కోరారు. పాఠశాలలు హైస్కూల్లో విలీనాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. జీవో 117 రద్దు చేయాలని, మున్సిపల్ పాఠశాలలు విద్యాశాఖలో విలీనాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.
Tags: Andhra Pradesh Teachers Dharna

