Natyam ad

మత్తు ఇంజెక్షన్ కలకలం

మునుగోడు ముచ్చట్లు:


అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం లో మత్తు ఇంజెక్షన్ కలకలం రేపింది. హరినాయక్ తాండా గ్రామంలో బస్టాండ్ లో నిల్చోని ఉన్న శ్రీకాంత్ (22) అనే యువకుడికి గుర్తు తెలియని ఇంజెక్షన్ పొడిచిని గుర్తుతెలియని వ్యక్తి పరారయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తి బైక్ పై వచ్చి ఇంజెక్షన్ పొడిచి వెళ్లిపోయాడు. బాధితుడు ఇంజెక్షన్ ప్రభావంతో తీవ్ర అస్వస్థతకు గురైయాడు. అచేతనంగా పడి ఉన్న యువకుడిని చూసి స్థానికులు 108 కు సమాచారమిచ్చారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించిన 108 సిబ్బంది, అతడిని రిమ్స్ కు తరలించారు.  రిమ్స్ లో యువకుడు కోలుకుంటున్నాడు.

 

Tags: Anesthetic injection confusion

Post Midle
Post Midle