ఎవ్వరికి పట్టని అంగన్ వాడీలు

Date:18/09/2018
మంచిర్యాల ముచ్చట్లు:
అంగన్‌వాడీలు  అక్షరంముక్కరాని ఆయాల పర్యవేక్షణలో చిన్నారులకు అక్షరాభ్యాసం కరువై సమర్థ నిర్వాహణ లేక అధ్వానంగా మారిన పరిస్థితి మండలంలో నెలకొంది.మండల పరిధిలోని కూచూరు గ్రామంలోని అంగన్‌వాడీలను పరిశీలించగా ఆసక్తికర విషయాలు వెలుగులోకొచ్చాయి.
గ్రామంలోని ఒక అంగన్‌వాడీ కేంద్రంలో డబ్బులకు కక్కుర్తి పడి కుళ్లిన కూరగాయలతోవంటలు చేస్తూ భోజనాలు వడ్డిస్తూ చిన్నారుల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నదయనీయ పరిస్థితి ఏర్పడగా, మరో అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వాహ కురాలు అందుబాటులో ఉండకపోవడంతో అక్షరంముక్కరాని ఆయా చేసెదేమి లేక చిన్నారులతో అపరిశుభ్ర పరిసరాలలో ఖాళీగా కూర్చుండిపోయిన పరిస్థితి ఏర్పడింది.
మండల పరిధిలోని కారుకొండ,కొండాపూర్,హజిలాపూర్,తీగల్‌పల్లి గ్రామాల్లోని అంగన్‌వాడీలలో కూడా ఇలాంటి పరిస్థితే దర్షనమిస్తుంది.సంబందిత వి షయంపై ఐసీడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ ను మన తెలంగాణ ఫోన్‌లో వివర ణ కు ప్రయత్నించగా ఆమె అందుబా టులో రాకపోవడంతో సూపర్‌వైజర్ బీ పాషాను వివరణ అడగ్గా ఆమె స్పం ది స్తూ అంగన్‌వాడీ నిర్వహణలో నిర్ల క్షం వహిస్తే ఉపేక్షించేది లేదని పై సెంటర్లలో విచారణ జరిపి చర్యలు తీ సుకుంటామన్నారు.
ఏది ఏమైనా ప్రభు త్వం అంగన్‌వాడీ నిర్వాహకుల పరిస్థి తులను అర్థం చేసుకొని జీతాలను పెంచినా వారి ప్రవర్తనలో మార్పు రాక పోవడం విచారకరం. కేవలం ఏడు మంది విద్యార్థులు ఉన్నా వారికి నాణ్యమైన ఆహారం ఇ వ్వకుండా,కుళ్లిపోయిన గుడ్లు, ముక్కి పోయిన బియ్యంతో వండిన అన్నం పెడుతున్నారని, అన్నం లో పురుగులు కనబడుతున్నా.
సిబ్బంది పట్టించుకోవడం లేదని గ్రామంలో కేవలం ఇద్దరు బాలింతలు, ఇద్దరు గర్భిణీలు,21 మంది కిషోర బాలికలు ఉన్నారని , బాలింతలు, గర్బీణీలకు గుడ్లు ఇవ్వడం లేదని గ్రామస్థులు, అంగన్‌వాడీ టీచర్ స్వాతి పని తీరు పట్ల తీవ్ర విమర్శలు చేశారు.పాఠశాలలో కనీసం ఒక గంట కూడా ఉండరని, ఆలస్యంగా వచ్చి వెంటనే వెళ్లపోతారని విమర్శించారు.
Tags; Angan wards for anyone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *