Natyam ad

అంగ‌న్‌వాడీ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాలి…

ఐసిడిఎస్ కార్యాలయం ముందు నిరసన తెలిపిన అంగన్వాడీలు

పత్తికొండ ముచ్చట్లు:

 

అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని వామ‌ప‌క్షాల ఆధ్వ‌ర్యంలో సోమ‌వారం సిడిపిఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వ‌హించారు.కార్యక్రమానుద్దేశించి సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు రెడ్డి, అధ్యక్షులు కార్యదర్శులు గోపాల్  కాశీ విశ్వనాథ అంగనవాడి యూనియన్ నాయకురాళ్లు కాంతమ్మ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాచుటీ ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలకు పెంచాలని, పెన్షన్స్ సౌకర్యం చివరి జీతంలో 50 శాతం ఇవ్వాలని, రాజకీయ జోక్యాన్ని అరికట్టాలన్నారు.

 

Post Midle

సూపర్వైజర్ ప్రమోషన్‌కు 50 సంవత్సరాలు పెంచాలని, సర్వీసులో చనిపోయిన అంగన్వాడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని, వేతనంతో కూడిన లీవ్ సౌకర్యం కల్పించాలని, మెనూ ఛార్జీలను పెంచాలని, గ్యాస్ ప్రభుత్వమే సర‌ష‌రా చేయాలని, పెండింగ్లో ఉన్న సెంటర్ అద్దెలు, టిఏ బిల్లులు ఇవ్వాలని, ఫేస్ యాప్‌ల‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు జగన్ అంగన్‌వాడీల‌కు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని కోరారు.  ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు  నాయ‌కులు పాల్గొన్నారు.

 

Tags: Anganwadi problems should be solved…

Post Midle