అంగన్వాడీల నిరసన…

విశాఖపట్నం ముచ్చట్లు:

అంగన్వాడీల సమస్యలు పరిష్కరిం చాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ అంగన్వా డీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూని యన్ విశాఖ జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేశాయి. గర్భిణీ, బాలింతల భోజనం మెనూ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా అంగన్వాడీల యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జూలై ఒకటో తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలకు వైయస్ఆర్ సంపూర్ణ పోషన, సంపూర్ణ పోషణ ప్లస్ క్రింద మధ్యాహ్న భోజనం పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. అయితే ఈ భోజనం అమలు చేయడానికి అంగన్వాడి, టీచర్, ఆయాలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించడానికి తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. వంట చేయడానికి సరిపడా వంటపాత్రలు ఇవ్వాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలన్నారు. అలాగే అంగన్వాడీలకు ఒక నెల ఖర్చు ముందుగా అడ్వాన్స్ ఇవ్వాలని కోరారు. అంగన్వాడీలకు నాణ్యమైన సెల్ ఫోన్లు, అవసరమైన యాప్ వర్క్ తగ్గించాలని కోరారు.

 

Tags: Anganwadi protest …

Leave A Reply

Your email address will not be published.