Natyam ad

ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన అంగన్వాడీలు

డా. పూనూరు గౌతమ్ రెడ్డి ఆధ్వర్యంలో సజ్జలకు ఘన సన్మానం చేసిన అంగన్వాడీ టీచర్లు

తాడేపల్లి ముచ్చట్లు:

Post Midle

సుధీర్ఘ పోరాటాల తర్వాత ప్రభుత్వం అంగన్వాడీ యూనియన్ ల చర్చలల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు సమ్మెను విరమించిన అంగన్వాడీ టీచర్లు శుక్రవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణా రెడ్డి కార్యాలయంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి అంగన్వాడీ టీచర్లు వై ఎస్ ఆర్ టీ యూ సీ రాష్ట్ర అధ్యక్షులు డా. పూనూరు గౌతమ్ రెడ్డి, ఆధ్వర్యంలో సజ్జల రామకృష్ణారెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించి పుష్ప గుచ్చం ఇచ్చి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్బంగా ఏ పి అంగన్వాడీ వర్కర్స్ & వర్కర్స్ అసోసియేషన్ యూనియన్ నాయకులు ప్రేమ, హెల్డాలు మాట్లాడుతూ మా సమస్యలను సానుకూలంగా స్పందించినందుకు ధన్యవాదాలు తెలియచేస్తు అలాగే వేసవి సెలవులకు టి హెచ్ ఆర్ ఇచ్చి బెనిపైషరీస్ కు ఇబ్బంది కలగకుండా సెలవులు ప్రకటించాలని, మెడికల్ సెలవులతో కూడిన వేతనం ఇవ్వాలని కోరారు. గ్రాట్యూటీ వర్కర్స్ కు లక్ష ఇరవై వేలు, హెల్పర్కు 50వేలు చెల్లించేందుకు అంగీకారం, అంగన్వాడీ లను వేదిస్తున్న యాప్ ల స్థానంలో ఒకే యాప్ ద్వారా వివరాలు సేకరణ కు అంగీకరించడం, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్ని సంక్షేమ పథకాలు మాకు వర్తింప చేయడం సంతోషమన్నారు. రిటైర్డ్ మెంట్ వయస్సు అంగన్వాడీ లకు 62 ఏళ్లకు పెంచడం పై హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమం లో వై ఎస్ ఆర్ టి యు సీ జోనల్ ఇంచార్జి ఎన్. రాజారెడ్డి, ప్రదీప్, నరహరి శెట్టి శ్రీహరి అంగన్వాడీ యూనియన్ నాయకులు కే. చిన్నమ్మ, జే. హెల్డా, జే. గంగవతి, ఎల్. శాంతి, కే. అనురాధ, బి. విజయకుమారి, క్రిస్టినా మామ, దుర్గా తదితరులు పాల్గొన్నారు.

Tags: Anganwadis thanked the Govt

Post Midle