Natyam ad

అంగన్వాటీల సంబరాలు

విశాఖపట్నం ముచ్చట్లు:

ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలమైన నేపథ్యంలో అంగన్వాడీల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.ఈ మేరకూ విశాఖలో అంగన్వాడీలు సంబరాలు చేసుకున్నారు.కేక్ కట్చేసి స్వీట్లు పంచుకున్నారు. అంగన్వాడీల న్యాయపరమైన డిమాండ్లన్నిటినీ పరిష్కరించేందుకు ప్రభుత్వం ఒప్పుకోవడం హర్షణీయమన్నారు. ముఖ్యంగా అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం, జీవిత బీమా గ్రాట్యూటీ సౌకర్యం కల్పించడం, మినీలను రెగ్యులర్ చేస్తామని హామీ ఇవ్వడం గొప్ప పరిణామమన్నారు.అంగన్వాడీల వేతనాలు పెంపు అంశంపై మరో రెండు, మూడు రోజుల్లోనే స్పష్టమైన హామీతోపాటు, అధికారక ప్రకటన కూడా వెల్లడిస్తామంటూ ప్రభుత్వం ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు.

 

Tags: Anganwatis celebrations

Post Midle
Post Midle