అగ్నిపథ్‌’పై ఆగ్రహం

రణరంగంలా సికింద్రాబాద్‌ ప్రాంగణం
పోలీసుల కాల్పుల్లో పలువురు ఆందోళనకారులకు గాయాలు

హైదరాబాద్ ముచ్చట్లు:

కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన కొత్త సర్వీస్ అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఆందోళన సెగ ఇవాళ హైదరాబాద్‌ను తాకింది. అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో యువకులు ఆందోళన చేపట్టారు. మరోవైపు అగ్నిపథ్ పథకంపై స్పందిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కేంద్ర సర్కార్‌ అప్పుడేమో రైతులను ఇబ్బంది పెట్టి ఇప్పుడు సైనికులను గందరగోళానికి గురిచేస్తోందని మండిపడ్డారు.కేంద్రం తీసుకొచ్చిన కొత్త సర్వీస్ అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ ఇప్పుడు హైదరాబాద్‌లోనూ నిరసనకారులు గళమెత్తారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ఆందోళనకారులు రైలుకు నిప్పుపెట్టి నిరసన తెలిపారు. సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరే ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఒక్కసారిగా యువకులు ఆందోళనకు దిగడంతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.అంతకముందు రైలు పట్టాలపై పార్సిల్ సామాన్లను కాల్చివేసి నిరసన తెలిపారు. ఒక్కసారిగా రైలు పట్టాలపై చేరి కేంద్రసర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. అగ్నిపథ్‌ను రద్దు చేసి యథావిధిగా నియామక ప్రక్రియ కొనసాగించాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. నిరసనకారుల నినాదాలతో రైల్వేస్టేషన్‌ ప్రాంగణం హోరెత్తింది.

 

Tags: Anger over the fire

Leave A Reply

Your email address will not be published.