Anil is angry with Mala too

 మాలలోనూ అనిల్ ఆగ్రహం

Date:30/11/2020

విజయవాడ ముచ్చట్లు

ఏపీలో తుపాను పంట నష్టంపై శాసనమండలిలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. అసలు వ్యవసాయమే దండగని చంద్రబాబు అన్నారని మంత్రి బొత్ససత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై సభలో గందరగోళం నెలకొంది. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ అయ్యప్ప దీక్షలో ఉన్న విషయం మరిచిపోయారో ఏమో.. శాసనమండలిలో కోపంతో ఊగిపోయారు. చంద్రబాబు రాసుకున్న మనసులో మాట అన్న దిక్కుమాలిన పుస్తకం తమ వద్ద లేదని, టీడీపీ నేతల వద్ద ఆ దిక్కుమాలిన పుస్తకం ఉంటే, వాళ్ల నాయకుడు రాసుకున్న గ్రంథం ఉంటే.. తీసుకువచ్చి చూపించాలన్నారు. దీంతో మంత్రి వ్యాఖ్యాలపై టీడీపీ నేతలు మండిపడ్దారు. ఆ పుస్తకం తాము రాసుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఒక మంత్రిగా ఉండి.. అయ్యప్ప దీక్షలో ఉన్న వ్యక్తి శాసన మండలిలో అన్ పార్లమెంటరీ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు.

 

అసెంబ్లీలో  20 రోజులపై  చర్చలు

Tags:Anil is angry with Mala too

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *