Natyam ad

అనిల్… షిప్ట్…

నెల్లూరు ముచ్చట్లు:


మాజీ మంత్రి అనిల్ కుమార్ దృష్టి శ్రీ బాలాజీ జిల్లాలోని వెంకటగిరి వైపు మళ్లిందని వైసీపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. అయినా అనిల్ అక్కడికి వెళితే గెలిచే ఛాన్స్ లేదురా నాయనా అనుకుంటున్నారు ఆ పార్టీ నేతలు.ఇప్పటికే వెంకటగిరిలో కొమ్ములు తిరిగిన నేతలు ఖాళీగా ఉన్నారు. మాజీ సీఎం తనయుడు నేదురుమల్లి రాంకుమారెడ్డి.. వెంకటగిరి రాజాలు లాంటి ఉద్దండులు వెంకటగిరిలో ఉండగా..అనిల్ కు అక్కడ ఆదరణ లభించడం కష్టమనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అనిల్ మంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలను పరుష పదాలతో దూషించడానికి కొంత సమయం.. నెల్లూరు జిల్లాలో సొంత పార్టీ నేతలను ఇబ్బంది పెట్టేందుకు మిగిలిన సమయం వృథా చేశాని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మంత్రి పదవి పోయే నాటికి అనిల్ కొండంత చెడ్డ పేరు మూట కట్టుకున్నారంటున్నారు. ఈ క్రమంలో నెల్లూరు నగర ప్రజలకు, వైసీపీ కార్యకర్తలకు కూడా ఆయన దూరం అయ్యారనేది వాస్తవం అని చెబుతున్నారు.నెల్లూరు నగరంలో ఆనం ఫ్యామిలీ అండతో కార్పొరేటర్ అయి.. వారి పుణ్యంతోనే అనిల్ ఎమ్మెల్యే టిక్కెట్టు సంపాదించుకున్నారు. అయితే వైసీపీ పంచన చేరిన తరువాత ఆనం ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నంలో జిల్లా వాసులకు అనిల్ దూరం కాక తప్పలేదంటున్నారు మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు పెద్దారెడ్లకు కొద్దిగా కూడా అయినా మర్యాద.

 

 

 

ఇవ్వకుండా అనిల్ వ్యవహరించారట. దీన్ని మనసులో ఉంచుకున్న నెల్లూరు పెద్దారెడ్లు సమయం కోసం ఎదురు చూశారంటారు. ఆ సమయం ఇప్పుడు రానే వచ్చింది. మంత్రి పదవి పోయాక ఆ పదవి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కాకాణి గోవర్ధన్ రెడ్డికి దక్కడంతో నేతలంతా జోరీగలు తగులుకున్నట్టు అనిల్ ను తగులుకున్నారు.తాజాగా.. నెల్లూరులో ఆనం ఫ్యామిలీ ఫ్లెక్సీలతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త ఫ్లెక్సీలు కూడా చించేయడంతో అనిల్ ఖేల్ ఖతమైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అనిల్ కుమార్ కు మళ్లీ నెల్లూరు నగరం నుంచి పోటీ చేసేందుకు టికెట్ ఇస్తే.. రెడ్లు వైఎస్సార్సీపీకి దూరం అవుతారని జగన్ చెవిలో వేశారట వేమిరెడ్డి. అంతేకాదు అనిల్ ప్రవర్తన పార్టీకి నష్టం కలిగించేలా ఉందని చెప్పారట.  దీంతో ఈ సారి అనిల్ కు టికెట్ ఇవ్వకుండా పక్కన పెడదామని జగన్ చెప్పడంతో వేమిరెడ్డి, నెల్లూరు నేతలు శాంతించినట్లు తెలుస్తోంది. ఈ సారి ఆనం రామనారాయణరెడ్డి వెంకటగిరిలో పోటీచేసే అవకాశాలు చాలా తక్కువ. అక్కడ యాదవ సామాజికవర్గం ఓట్లు ఉండడంతో అక్కడికి వెళ్ళేందుకు అనిల్ ప్రయత్నాలు సాగించారు.

 

 

 

ఇది తెలిసిన వెంకటగిరి నేతలు స్థానికేతరుడైన అనిల్ తమ నియోజకవర్గంలో పోటీ చేస్తే ఓడిస్తామని ఇప్పటికే హెచ్చరికలు చేశారని సమాచారం. దీంతో అనిల్ పని అయిపోయింది. నెక్స్ట్ ఏంటి..? పార్టీలో ఉంటారా..? లేదంటే అనిల్ నే పార్టీ పూర్తిగా పక్కన పెట్టేస్తుందా..? అని టాక్ జిల్లాలో తెగ చక్కర్లు కొడుతోంది.ఎనభై సంవత్సరాలుగా రాజకీయంగా చక్రం తిప్పిన ఆనం ఫ్యామిలీ నెల్లూరు పంటరెడ్ల జోలికి వెళ్ల లేదు. అలాంటిది కన్నూ మిన్నూ తెలియకుండా ఆనం వారితో పాటు నెల్లూరు పంటరెడ్లను అవమానకరంగా చూసిన అనిల్ కు భవిష్యత్తు ప్రశ్నార్థకం కావచ్చని అనుకుంటున్నారు. జగన్ అండ, మంత్రి పదవి శాశ్వతం అనుకున్న అనిల్ ఇప్పుడు ఒంటరైపోయి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందో..! ముందు ముందు ఇంకెన్ని పరిణామాలు జరుగుతాయో చూడాలి.. జగన్ ఫ్యాన్ గాలిలో గెలిచిన నేతలు సొంత గాలి ఉండేలా పనిచేయకపోతే.. ప్రతిసారీ.. గాలి ఉండదు కదబ్బా అంటున్నారు కొందరు.

 

Tags:Anil… shift…